"మాటకి ముందు దానికి ఉపన్యాసం ఇస్తావుగాని, పరాయి మగాడి వెంట దాన్ని ఒక్కదాన్ని ఎలా పంపిస్తావురా? మీరిద్దరు కలిసి వెడితే బాగుంటుందిగాని" అంది యశోదమ్మ.
"పరాయివాడేమిటమ్మ? నాక్లోజ్ ఫ్రెండ్ ఫారిన్ నుండి నాఫ్రెండు ఒకతడు వచ్చాడు.
అతడిని నేను అర్జంటుగా కలవాలి. ఇప్పుడు త్రిపురని పంపించకపోతే సుందర్ ఏమ్తెన అనుకోగలడు!"
"మగాడిపంచ కొంగు పట్టుకు తిరగాలనుకొంటావు!" అని రోష పెట్టాడు కాబట్టి త్రిపుర ఒక్కతే వెళ్ళడానికి బింకంతో తయర్తెంది!
"చీకటిపడకముందే తీసుకురానాయనా" అని చెప్పింది యశోదమ్మ. కారు దగ్గరకి సాగనంపడానికి వచ్చి.
"అలాగేనండి! మీ కోడలిని పువ్వులో పెట్టితిసుకువచ్చి, మీ కప్పు చెపుతాను! మీరేం గాబరా పడకండి" సుందర్ నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు.
* * *
వీళ్ళకోసమే ఎదురుచూస్తుంది సుందర్ తల్లి మీనాక్షి.
త్రిపుర కారు దిగుతూనే ఆవిడ మందహసవదనంతో చెయ్యిపట్టి తీసుకుపోయింది ఇంట్లోకి
శ్రీ మంతులు కాబట్టి ఇల్లు, ఉంట్లోని వస్తువులు చాలా ఖరీదుగా, కళాత్మకంగా ఉన్నాయి.
ఆవిడ హల్లో కూర్చోబెట్టకుండా, హాలు దాటించి వీణ ఉన్న గది లోకి తీసికెళ్ళి వీణముందు కూర్చోబెట్టింది.
"ముందు పాడాలి! పాడాకే మన మాటలు"
వస్తూంటే కారులోనే చప్పాడు సుందర్. "మీకొచ్చిన పాటలన్నీ పాడేసేయ్యాలి ఇవాళ మా ఇంట్లో! మీరు బాగా పాడారని చెప్పినప్పట్నుండి మిమ్మల్ని తీసుకురమ్మని ఒకటేపోరు పెడుతుంది మా అమ్మ!
ఆవిడకు సంగీతమంటే అంత ప్రాణం!నేను కొడుకున్తేతే సంగీతం ఆవిడకు కూతురు"
"మీక్కూడా సంగీతంలో ప్రావీణ్యం ఉందని మీ అబ్బాయి చెప్పాడు!- నాకొచ్చిన కీర్తనలు ఓ ఏబ్తే కంటే ఎక్కువుండవు. అవేమరిచిపోకుండా సాధన చేసుకుంటూ ఉంటాను. అక్కడ మా నాన్నగారు చెప్పేవారు. మా అమ్మగారికి కూడా సంగీతం వచ్చు. అక్కడే ఉంటే నేనుకూడా కీర్తనలు నేర్చుకోనేదాన్ని"
"ఇక్కడ సంగీతం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారే"
"మా వారికి సంగీతమంటే ఆసక్తిలేదు" త్రిపుర మ్లానవదనంతో చెప్పింది. "రాకెన్ రోల్ పాటలంటే ఆయనకిష్టం సినిమాపాటలంటే ఇష్టం! నేను అచ్చుదోరసానిన్తే పోయి, అచ్చం ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఆయన తాపత్రయం. చూస్తూండండి ఎప్పుడో నాజుట్టు కత్తిరించి క్రాప్ పెట్టిస్తాడు"
"ఇంట్లో ఉన్న మణిని గుర్తించలేనివాడన్నమాట నీ కట్టూ బొట్టూ చూస్తూంటే నా కడుపు నిండిపోతూంది. కాటుకమోటు! కుంకుమమోటు!జడ పూర్తిగా అల్లుకోవడం మోటు! ఒఅమ్తినిఅమ్దక జాకెట్ తోడుక్కోవడం మోటు! ఇలాంటి రూపం చూడడం ఎంత అరుదుగానో సంభావిస్తూంది. మా సుందర్ ఊరించి చెప్పిన దానికంటే అందంగా ఉన్నావు. నేను కోడల్ని తెచ్చుకొంటే నీలాంటి అమ్మాయినే వెతికి తెచ్చుకొంటాను"
"తన అందంగురించి ఊరించి చెప్పారా సుందార్?" త్రిపురచెంపలు ఆప్రయత్నంగా ఎర్రబడి పోయాయి!
"మీ కభ్యంతరం లేకపోతే నేనిక్కడే కూర్చొని మీ పాటలు వింటాను!" అభ్యర్ధనగా అన్నాడు సుందర్.
"నాకొచ్చింది చాలా కొంచే మీకు సంగీతం వచ్చని విన్నాను. మీ ముందు పాడాలంటే నాకు భయం వేస్తుంది. తప్పలు దోర్లిపోతాయేమోనని!"
"మరి అంత పండితురాలిని ఏం కాదు. భయపడకుండా సాడు"
కీర్తన వెనుక కీర్తన అయిఇదు కీర్తనలు పాడింది త్రిపుర.
శ్రోతల హృదయాలు పరవశంతో నిండిపోయాయి.
"నీ గళంలో గొప్ప సుధా ఉంది. అమ్మాయ్! ఆదరణలభిస్తే నువ్వింకా ఎంత బాగారాణిస్తావో! మల్లిక్ మా ఇంటికి వచ్చినప్పుడు చెబుతాను. నీకు సంగీతం చెప్పడానికి మేష్టారిని పెట్టమని"
"నాచేత ఇన్ని పాటలు పాడించారు. మీరు పాడరా, పిన్నిగారూ?"
"ఎందుకు పాడనమ్మ? కానీ, నువ్వు మరోసారి రావాలి మా ఇంటికి అప్పుడు తప్పకుండా పాడతాను. ఇవాళంతా నీ గానమాదుర్యాన్ని మా హృదయాలలో ముద్రించుకోని!" ఆవిడ చిరునవ్వుతో అంది.
"మీకు సితారా వచ్చునని అన్నారు ఆ రోజు!ఒకసారి పాడరా?" సుందర్ కేసి తిరిగి అడిగింది త్రిపుర.
"మీ అత్తగారు చికటిపడక ముందే దిగాబెట్టమన్నారు. మీరు అనుమతి ఇచ్చేట్టయితే, మరోసారి తీసుకువస్తాను ఇక్కడికి మిమ్మల్ని! అప్పుడు నా సితారా!"
అతడి మాటలుమృదువుగా, చూపులు ఆరాధిస్తున్నట్టుగా ఉంటాయి. ఒక మృదు హృదయుడు, కళాకారుడు ఎంత కోమలంగా, అందంగా ఉంటుంది అతడి రూపం. పురుషత్వం కంటే కొమలత్వమే అధికపాలు అతడిలో! మల్లిక్ కి, అతడికి హస్తిమ శాంతకం తేడా ఉంటుంది రూపంలో. గుణంలో!
మల్లిక్ ధృడంగా పురుషత్వం మూర్తిభవించి కనిపిస్తాడు. అతడి గుబురుమీసాలు అతడి పురుషత్వనీకి నిండుదనం తీస్తుంటాయి. మాట కరుకు!మనసు కరుకు!
సుందర్ సన్నగా, పొడుగ్గా ఉంటాడు! మనిషిని చూడగానే మృదు స్వభావి అని తెలిసిపోతుంది. కొంచెం పరిచయం చేసుకొని చూస్తే ఆ సంగతి నిజమని తెలిసిపోతుంది.
మీనాక్షి ఫలహారం తీసుకురావడానికి లోపలికి వెళ్ళింది.
"అయిదేళ్ళక్రితం చూశాను మిమ్మల్ని. అందరూ చిన్నపిల్ల అని నోరు చప్పరిస్తూంటే, నేను మాత్రం మిమ్మల్ని పదహారేళ్ళ యువతిగా ఊహించుకొని, కట్టెదుట నిలబడిన రూపానికి ముగ్గుణ్ణియ్యాను. ఆనాడు నేను ఊహించుకొన్న రూపానికంటే సుందరత్వాన్ని పంతరించుకొన్నారు"
"భగవంతుడి విచిత్రం చూడండి! సరిగ్గా సహచరిలు ఏ రూపం ఏ గుణాలు ఉండాలని ఆశల మేడలు కట్టుకోన్నానో, అవి మిలో ఉన్నాయి! ఆ రూపంపట్ల, గుణాలపట్ల ఎలాంటి ఆసక్తి లేనివాడికి మిమ్మల్ని భార్యని చేసి మిమ్మల్నో దురదృష్ట వంతురాలిని చేస్తే, కావలసినవాడికి మిమ్మిల్ని ఇన్నాక నన్నో దురదృష్టవంతుడిని చేశాడు! మిమ్మల్ని అభిమానించే వాడి దగ్గర కదా, మీ సంగీతం రాణించేది! మీ సౌందర్యంవన్నె పెంచుకోనేది?"
త్రిపుర తలకోద్ది గా పైకెత్తి, మీ మాటలు నిజమే కావచ్చు! కానీ, మీ స్నేహితుడి భార్యదగ్గర ఇటువంటి ప్రసంగం చేయడం భావ్యమా మీకు?" అనడిగింది, కొంచెం చురుకుగా.
సుందర్ తొణకలేదు. "కపటం అంటే గిట్టని మనిషిని నేను! మనసులో ఏమి దాచుకోలేను కూడా. నా మనసు విప్పి, బరువు దించుకోడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదేమో! నా మనసులో మాట చెప్పనేగాని, అనుచితంగా మీ నుండి ఏమ్తేనా కోరానా?"
మీనాక్షి ట్రేలో ఫలహారం, మంచినీళ్ళు తీసుకువచ్చింది.
మర్యాదలన్నీ ముగిశాక "నేనిక వస్తానంది!" అంది త్రిపుర.
మీనాక్షి స్టిల్ ట్రేలో చిరా రవికా, బొట్టూ, పూలూ పళ్ళు తీసుకు వచ్చింది.
"ఇవన్నీ ఎందుకండి?"
"మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు! మాఇంటికి వచ్చిన లక్ష్మిని ఊరికే పంపిస్తామా? పసుపు కుంకుమల క్రింద ఎదిచ్చినా కాదనకూడదు!తీసుకో త్రిపురా!"
ఆవిడ అంత మృదువుగా చెబుతుంటే ఎలా కాదనలో తెలియలేదు? ట్రే అందుకొంది.
మల్లిక్ మోటారు స్తెకిల్ దిగాడు. "వెళ్లిపోయారే మో అనుకొన్నాను!"
"రెండు నిమిషాల్తెతే వెళ్ళిపోయేవాళ్ళమేరా, కూర్చో!"
"ఇక వెళ్ళిపోతాం!"