Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 6

    "నా విషయమలాగుంచు. నీవిషయంచెప్పు. నువ్వామెనువలలో వేసుకోగలవా? అన్నాడు చంచల్రావు.
    "ఘ్యార్ కానీ...." అని ఒక్క క్షణం ఆగాడు సాగర్- "నీకు నా మీద చాలా అనుమానంగా ఉంది అందుకే నీకూనాకూ తేడా చూపిస్తాను నీకు ముందుగా నెలరోజులు టైమిస్తాను. నెలరోజుల్లో ఆమెను నువ్వువశపరచుకోవాలి. అదినీవల్ల కాదని నాకుతెలుసు. అప్పుడుసరిగా రెండేరెండు వారాల్లో నేనామెను వశంచేసుకుంటాను....."
    చంచల్రావీ సవాలుకు వెంటనే ఒప్పుకోలేదు
    "వనజాక్షి పిలిస్తే వెళ్ళడంకాదు. నువ్వుపిలిస్తే పంకజాక్షి నీ వెనుక రావాలి...." అన్నాడు సాగర్.
    "కారణమేదైనా వనజాక్షి నావశమయింది. నువ్వూ ఆమెను వశంచేసుకోగాలవా?" అన్నాడు చంచల్రావు ఎదురు సవాలు చేస్తూ.
    "నీ సవాలు నాకు నచ్చలేదు...."అన్నాడు సాగర్.
    "ఏం?"
    అప్పుడు  సాగర్ తన డ్రాయర్ సొరుగులోంచి ఓ పోటో  తీశాడు. చంచల్రావుకి చూపించిప "పిల్ల ఎలాగుంది?" అన్నాడు.
    ఫోటోలో అమ్మాయిని చూసి చంచల్రావు తెల్లబోయాడు ఆమె దేవకన్యలా వుండి
    "ఎక్కడిది నీకి ఫోటో?"
    "అది తర్వాత చెబుతాను. ఈ ఫోటో చూశాక నీకు మళ్ళి వనజాక్షినీ చూడాలనిపిస్తోందా?"
    చంచల్రావు వెంటనే- నీ సవాలుకు నేనంగికరిస్తున్నాను. ఈమె వివరాలు చెప్పు...."అన్నాడు.
    "ఈమెను నువ్వింకా గుర్తుపట్టలేదా?" అన్నాడు సాగర్.
    "లేదు అసలేక్కడా చూసిన గుర్తులేదు నాకు..."
    "రామారావుగారు?"
    "మాణిక్యాంబ మొగుడు....."
    బంధువర్గంలో రామారావుగారికి మాణిక్యాంబ ముగుడిగా పేరుంది. చంచల్రావుకి వెంటనే అర్ధమై- "ఆ ఈమె నిర్మల కదూ...." అన్నాడు.
    "అవును...." అన్నాడు సాగర్.
    "ఎంత అందంగా వుంది?" అన్నాడు చంచల్రావు.
    "ఎంత అందంగా ఉన్నప్పటికి ఈమె ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. సవతితల్లి ఆమెను పెట్టె ఆరడి ఇంతాఅంతాకాదు. ఆ యింటిలోంచి, ఆ నరకంలోంచి  బయటపడ్డంకోసం ఆమె ఎంతగానో ఎదురుచూస్తూంటుంది. మన  వంటి వాళ్ళకు  ఇదే  అపూర్వావకాశం ! మోసపోయినా  సవతితల్లి ఆమెనేతప్ప పడుతుంది మనజోలికెవ్వరూ రారు తెలిసిందా?" అన్నాడు సాగర్.
    "థాంక్యూ బ్రదర్! ఈ సవాల్లో నేను గెలుస్తాను. వనజాక్షి పేరుచెప్పి నాకు ఆడవాళ్ళంటే  కాస్త బెదురుకూడా తగ్గింది-"అన్నాడు చంచల్రావు.   
                                                                                     3
    బయట్నించి బదులురాలేదు.
    నిర్మల మళ్ళి "ఎవరూ?" అంది. వచ్చింది తల్లితండ్రులైతే తాను వెంటనే బట్టలు మార్చుకునికానీ తలుపులు తీయకూడదు. ఆలస్యమైనా ఫరవాలేదు. అందుకు లభించే తిట్లకంటే-ఈబట్టలు కట్టుకున్నందుకు లభించే శిక్ష చాలా పెద్దది.
    వచ్చింది తల్లిదండ్రులు కారని నిర్మల ఆశ ఆ ఆశక్కారణం ఆమె కింకా కట్టుకున్న బట్టలు మార్చుకోవాలని లేదు.
    "నేను ...."అంది బయటినుంచి ఓ గొంతు.
    నిర్మల ఆగోంతు వినగానే బ్రహ్మానందపడింది. ఆగోంతేవరిదోఆమెకు తెలియదు. కానీ ఎవరిదికాదో ఆమెకు తెలుసు.
    ఆమె సందేహించకుండా వెళ్ళి తలుపు తీసింది.
    "నా పేరు చంచల్రావు" అన్నాడతడు.
    ఆమె అతడిగురించి వినిఉంది. ఒకటిరెండు సార్లు చూసిన గుర్తుకూడా  ఉంది. "అమ్మా, నాన్నా  ఇంటిలో లేరు" అందామె.
    "నాకు తెలుసు- "అంటూ లోపలకు వచ్చాడతడు.
    నిర్మల కంగారు పడలేదు నెమ్మదిగా "మికేద్తేనా చెప్పవలసినదుంటే కాగితంమీద రాసివ్వండి" అంది ఆమె అలాఅనడానిక్కారణముంది. ఆమె ఏంచెప్పినా సరిగ్గా చెప్పలేదని తల్లి తిసుతుంది కాగితం ఇస్తే ఎగోడవాలేదు.
    "నేను నీతోనే మాట్లాడాలి" అన్నాడు చంచాల్రావు.
    అప్పుడు నిర్మల కంగారుపడింది- "నాకు చాలా పనులున్నాయి-"
    "నువ్వు పనులు చేసుకుంటూండు నేను నీతో మాట్లాడతాను-"
    పనులంటే అంట్లుతోమడం, ఇల్లూడ్వడం, బట్టలుతకడం ఈపనులతడితో మాట్లాడుతూ ఎలా చేస్తుంది? అతడేమో చొరవగా మాట్లాడుతున్నాడు కానీ ఆమెకతడితో పరిచయం లేదు.
    "అలావద్దు ఏంచెబుతారో త్వరగా చెప్పేయండి...."
    "నువ్వు కట్టుకున్న బట్టలు నికేంతో నప్పాయి. నువ్వే సెలక్ట్ చేసుకున్నావా- మీ అమ్మ సెలక్ట్ చేసిందా?"
    "అమ్మ-" అంది నిర్మల ఇబ్బందిగా.
    "అయితే మీ అమ్మను మెచ్చుకోవాలి...."
    "వద్దు-" అంది నిర్మల భయంగా.
    కళ్ళలోని భయం- నిర్మలకో కొత్త సోయగాన్నిచ్చింది. ఆ సోయగాన్నే చూస్తూ- "ఏం?" అన్నాడు చంచల్రావు.
    ఆ బట్టలు  తనవికావని అతడికి చెప్పడం- ఆమెకిష్టంలేదు అందుకని- "ఇంకా ఏం చెబుతారు?" అంది.
    "నేను  నిన్ను ప్రేమిస్తున్నాను...." అన్నాడు చంచల్రావు.
    నిర్మల ఉలిక్కిపడి- "ఆ విషయం మా అమ్మకు చెప్పండి-" అంది.
    "అది మా నాన్నకు  చెప్పండి...."
    "చెప్పేముందు మనం ఒకరినొకరు బాగా అర్ధంచేసుకోవాలి...."
    నిర్మల తల కిందకు దించేసింది.
    చంచల్రావు తిరగి ప్రారంభించాడు- "ఈ సమయంకోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను. నీఅందంనన్నాకర్షించింది. నువ్వునాకావాలి."

 Previous Page Next Page