సాహు పని చేయించుకుని తిండి పెట్టి యింట్లో వుంచుకునేవాడుగా . నీవూ అలాగే వుంచుకో. ' అన్నాడు పాత్రో అదో పెద్ద విషయం కాదన్నట్టు.
"నా దగ్గరా .... నాకెందుకు బాబూ, నాకు పెళ్ళాం వుంది ... ఏదిగిన పిల్లలున్నారు సాయానికి. యింక యిదేందుకు .' అన్నాడు సదానంద్.
'చచ్చాం . మరెలా ? .... ఎక్కడుంటుంది ?" నిరంజన్ సాలోచనగా అన్నాడు.
"మాకెందుకు దాని గొడవ, దాన్నే అడుగు " అన్నాడు విసుగ్గా మిశ్రా.
'అలాగంటే ఎలా బాబూ అదేం చెపుతుంది చిన్నగుంట. ఆ సాహుగాడు మీ వల్లె గదా వెళ్ళిపోయాడు . మీరనవసరంగా కల్పించుకోకపోతే అదోపూట , క్రొత్తలో గోలేట్టినా ఆడితో సర్దుకు బ్రతికేది , సిన్నతనంగా, మొదటిసారి క్రొత్త గదా అని గోలెట్టింది. ఆ పాటి దానికి మీరు ఆడిని సీతకబాదినారు యిప్పుడు యింక డానికి దిక్కెవరు డానికి మీరుగాక " అన్నాడు దాని భవిష్యత్తు కి వాళ్ళే జవాబుదారీ అన్నట్టు.
అందరూ మొహాలు చూసుకున్నారు. యిదేక్కడి తద్దినం అన్పించింది అందరికి. "ఏమిటిరా బాబూ, యీ గొడవ , నేరకపోయి యిరుక్కున్నాం" అన్నాడు సంతోష్ ఇంగ్లీషులో. అందరూ కాసేపు కూడ బలుక్కున్నాక, సదానంద్ కి నచ్చ చెప్పారు. తామంతా సదానంద్ హోటలు కె వస్తామని ఆశ చూపించి, గురువారీని వుంచుకుని తిండి పెట్టడానికి వప్పించారు. వాళ్ళకి ఎదురుచేప్పే ధైర్యం లేక ఎదురు చెప్పి బ్రతకలేనన్న భయంతో ఆఖరికి నసుగుతూనే అంగీకరించాడు సదానంద్.
వాళ్ళందరికీ గురువారీ ఏమవుతుంది? దాని మీద యింత అభిమానం ఇంటరెస్ట్ ఎందుకు, వాళ్ళకి డానికి ఏమిటి సంబంధం అని ఎవరన్న అడిగితే ఏం లేదు అనే జవాబు చెప్పాలి! ఓ ముక్కూ మొహం తెలియని పనిపిల్ల మీద, కొండలలో పుట్టి పెరిగిన ఆ పిల్ల మీద వాళ్ళకి అభిమానం ఎందుకు అంటే, వాళ్ళ గురించి వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం గురించీ చెప్తే కొంత అర్ధం అవచ్చు.
* * * *
ఆ వూర్లో యింజనీరింగ్ కాలేజీ పెట్టాలన్న ఆలోచన వచ్చిన మహానుభావులు ఎవరో గాని, వాళ్ళని ఆ స్టూడెంట్స్ తిట్టని రోజులేదు. యింకేక్కడా చోటు లేనట్టు ఎంచి ఎంచి మా ప్రాణాల మీదకి యిక్కడే పెట్టాలా అని రోజుకో సారన్నా అందరూ ఏడ్చుకునే వారు.
ఆవూరు.ఆ వూరేమిటి అదో అఫీషల్ కాలనీ. అక్కడొక డామ్! డామ్ సిబ్బంది, ఓ యింజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజి వున్నాయి. ఆ కాలేజిలో పనిచేసే మనుషులు మాత్రం ఉంటారు. యీ మాత్రం మనుష్యులున్నారు. కనక ఓ చిన్న బజారులాంటిది తప్పదు గదా! ఆ వూరికి చాల్లే అన్నట్టు కనిపించీ వినిపించనీ రేకుల షెడ్డు సినిమాహాలు ఒకటి, నాలుగైదు పాక టీ హోటళ్ళు, ఓ నాలుగు బట్టల దుకాణాలు, మరో నాలుగు పచారి దుకాణాలు , ఓ రెండు ఫ్యాన్సీ షాపులు, ఓ బస్ స్టాండ్ - యిదీ ఆ వూరు.
అందులో ఇంజనీరింగు కాలేజీ వూరి చివార్న వుందేమో, ఎటు చూసినా వినీలాకాశం తప్ప మరోటి కనిపించక , ఎంతసేపు స్టూడెంట్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏం చెయ్యడానికి తోచనప్పుడల్లా అక్కడ కాలేజి పెట్టిన వాళ్ళని తిట్టుకునే వారు.
ఉదయం ఏడుకి లేచిం దగ్గరనించి కాలేజికి పరిగెత్తడం , క్లాసులు వగైరాలతో ఉదయం పూట అందరికి ఏదో విధంగా గడిచి పోతుంది. ఎటొచ్చి వాళ్ళ అవస్థంతా సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు! ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేయడానికి తోచక పిచ్చెత్తి పోయేవారు. అక్కడికి సాయంత్రం కాలేజి నించి వచ్చి కాస్త రెస్టు తీసుకుని స్నానాలు చేసి , ముస్తాబయి , హాస్టలు కి ఎదురుగా వుండే పాక టీ హోటళ్ళ లో రసగుల్లాలు, సింగడాలు తిని, టీ తాగి అక్కడ నించి జట్లు జట్లుగా రోడ్డున పడి బజారు దాకా వెళ్ళేవారు, రొడ్డంటే రోడ్డే తప్ప మనుష్యులు మాత్రం కనిపించరు. కనిపించిన ఏ ఆఫీసర్ల తాలూకు బంట్రోతులో! అలా షికారుకి వెళ్ళే త్రోవత్తు డామ్ ఇంజనీర్ల బంగాళాలు దాట్తూ ఏ బంగాళా నించన్నా ఏ అందమైన ఆవిడో కనిపించితే కన్నుల పండుగ అయినట్టు వీక్షిస్తూ , కామెంట్లు చేసుకుంటూ జోకులు విసురుకుంటూ, తుళ్లుకుంటూ నవ్వుకుంటూ నడిచి బాజారు చేరేవారు. అక్కడికి చేరక అమ్మయ్య యిదీ ఒక వూరే . స్మశానం కాదనిపించేది వాళ్ళకి. డానికి నిదర్శనంగా బస్సుల రోద. టాక్సీల హారన్లు రేకుల షెడ్డు సినిమా వాడు అదరగొట్టే రికార్డుల మోత, కాకా హోటళ్ళ నించి వచ్చే పకొడిలా వాసన, బజరుకి ఏదన్నా కొనుక్కోడానికి వచ్చే మనుష్యులు కళ్ళపడగానే వాళ్ళకి ప్రాణం లేచి వస్తుంది. అక్కడ నిలబడి జనాన్ని చూడడం, లేకపోతే సినిమా మారితే అదేంత చెత్త అయినా, కనిపించక పోయినా వినిపించాక్ పోయిన మూడు గంటల కాలక్షేపానికి దాన్లో దూరే వాళ్ళు. అదీ లేకపోతే ఏ హోటల్లో నో దూరి ఏదో తింటూ కబుర్లు చెప్పుకుంటూ గంటల కొద్ది గడిపేవారు. ఏ ఏడుగంటలకొ తప్పదురా భగవంతుడా అన్నట్టు కాళ్ళీ'డ్చుకుంటూ హాస్టల్ మొఖం పట్టేవారు.
అక్కడికి పదిమైళ్ళున్న టౌనుకి సినిమాకి ఆదివారం వెళ్ళడం వాళ్ళకున్న ఏకైక కాలక్షేపం! ఆ సినిమాకి వెళ్ళడానికి ఆ వూరికి టౌనుకి మధ్య తిరిగే టౌను బస్సులో టాపు మీద కూడా ఎక్కి , టిక్కెట్లు యివ్వకుండా ప్రయాణం చెయ్యడం ఏ కండక్టరన్న వాళ్ళ సంగతి తెలియని వాడు - ఏనాడన్నా టిక్కెట్టు లేదని గొడవ పెడితే వాడిని తన్నడం దాంతో బస్సు బందయిపోవడం, మళ్ళీ బస్సులు నడపడం లేదని గోలచేసి ఎటు నించీ ఏ బస్సు వెళ్ళనియకుండా కాపుకాసి అల్లరి పెట్టి మళ్ళీ సాధించడం వాళ్ళ ముఖ్యమైన ఎడ్వంచర్.
అక్కడికి నూరు మైళ్ళున్న సిటీకి కొత్త సినిమా రిలీజయిందన్నది తెలిస్తే చాలు కనీసం ఓ వందమంది బయలుదేరి యిటునించి బయలుదేరే ప్యాసింజర్ కు వెళ్ళి మొదటి అట మ్యాట్నీని చూసి తెల్లవారి వచ్చే రైలులో టిక్కట్లు లేకుండా ఫస్టు క్లాసులో ప్రయాణం చేసి, ఆ రైలు వాళ్ళుండే వూర్లో ఆగదు కనక వాళ్ళ కాలేజి దగ్గరకు రాగానే గొలుసు లాగి గెంతిపరిగెత్తి పోవడం వాళ్ళ సాహసాలలో ముఖ్యమైనది. టిక్కెట్టు వాళ్ళని అడిగే ధైర్యం , వాళ్ళతో కలపడగలిగే సహసవంతుడు ఎవరూ వుండేవారు కాదు. చూసీ చూడనట్లు వూరుకునేవారు. ఎవడన్నా ఏదన్నా అంటే ఆ రైలు నడవదని వాళ్ళకి తెలుసు! వాళ్ళకక్కడ మరీ బోర్ కొట్టి యింటి కెళ్ళి రావాలని బుద్ది పుడితే ఏదో గొడవ లేవదీసి స్త్రయిక్ చేసి కాలేజీ బంద్ అయిందనిపించుకొని ఊరి కెళ్ళిపోయేవారు. ఆ వూర్లో వుండే మెడికల్ కాలేజి యింజనీరింగ్ కాలేజి విద్యార్ధులు యిద్దరూ బద్ద శత్రువులు! ఒకరి సుపీరియారిటీ ఒకరికి నిరూపించుకోవాలన్న తాపత్రయంతో ఒకరి నొకరు ఎప్పుడూ ద్వేషించుకుంటారు. మనసులో ద్వేషం అప్పుడప్పుడు బయట పడితే కొట్టుకోవడం, వాళ్ళ ప్రొఫెసర్ల యిళ్ళ మీదకి వీళ్ళు, వీళ్ళ ప్రొఫెసర్ల యిళ్ళ మీదకు వాళ్ళు రాళ్ళు రువ్వు కోవడం, పోలీసులు గొడవ హడావుడి - యిలాంటి వన్నీ వాళ్ళకి కాలక్షేపాలు.