Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 5

    సాగర్ నవ్వి- "నేను నిజమే చెబుతున్నాను. నేను చెబుతున్నది నిజమేనన్న  విషయం బుజువుచేసే  అవకాశముంది...." అన్నాడు.
    "ఎలా?"
    "సాగర్ మళ్ళి వివరించాడు.
    వనజాక్షి కేవలం  భర్తనుకొట్టి బెదిరించగల మగాడికోసం  ఏమనాచేయడానికి సిద్దంగా వుంది. ఆ పని చంచాల్రావందుకు సమర్ధుడుకాదని ఆమె కర్దమైంది. సాగర్ ఆమేకోసం ఏమైనా చేయగలడు. అతడావిషయమామెకు చెప్పాలి.
    "నాద్వారా- నువ్వూఓ అవకాశం  సంపాదించాలనుకుంటున్నావా?"
    "నువ్వెమనుకున్నా నాకేం అభ్యంతరంలేదు కానీ ఆమెకు నీద్వారా తనభర్తను కొట్టించేఉద్దేశ్యం  లేదని  బుజువుచేయడానికి ఒక్కటేమార్గం" అని చెప్పాడు సాగర్ కచ్చితంగా.
    చంచల్రావుకి  పౌరుషంవచ్చింది "సరే- అది చూద్దం!" అన్నాడు.
    ఏదోపుస్తకం వంకపెట్టి మర్నాడతాడామే యింటివెళ్ళి సాగర్ గురించి చెప్పాడు. వనజాక్షి అతణ్ణి సాచిలెంపకాయ కొట్టి "గెటౌట్" అంది.
    చంచల్రావు సాగార్ని  కలుసుకుని జరిగింది చెప్పాడు.
     "కాదు ఆమె అభిమానంతో  నన్నాహ్వానించింది, నేనామెను వేశ్యలా చూశాను. నీ మాటవిని ఆమెతో అలా చెప్పడం నాతప్ప...."అన్నాడుచంచల్రావు.
    "ఇలా   జరుగుతుందని నాకు తెలుసు. కానీ నువ్వొట్టి తెలివితక్కువ మొద్దువు. ఆమె అలాగనగానే నీకూనాకూ ఉన్నసంబంధం గురించి  పదిమందికి చెప్పేస్తానని బెదిరించాల్సింది వెంటనే నువ్వుచెప్పినట్లువినేది...."అన్నాడు సాగర్.
    ఈ ఆలోచన తనకు తట్టనందకు చంచల్రావు బాధపడ్డాడు. వనజాక్షి పొందు- అతడికలావాటయింది. ఆమెనెలాగోలా తిరగి పొందాలని అతడి ఆరాటం. అందుకని మళ్ళి ఒకరోజు రాజమార్గాన్నే అనుసరించి వనజాక్షి ఇంటికి వెళ్ళాడు.
    "మళ్ళి ఎందుకొచ్చావ్?" అంది వనజాక్షి అతడితో కోపంగా.
    "అలవాటు-" అన్నాడు చంచల్రావు.
    "అలవాటైతే మార్చుకో!"
    "గెటౌట్ !" అంది  వనజాక్షి.
    "తాటాకు చప్పళ్ళకు కుందేళ్ళు బెదరవు. మన పరిచయం గురించి నలుగురికి చెప్పెశానంటే నీ బ్రతుకు నడిబజార్లో పడుతుంది. మర్యాదగా నా మాట విను..."
    వనజాక్షి కోపంగా-"స్టుపిడ్! ఇప్పుడు నేనరిచిగోలచేశానంటే ముందు నీ గతి ఏమవుతుందో చూసుకో-"అంది.
    చంచల్రావుకు భయం వేసింది. అతడు వెంటనే అక్కణ్ణింఛి వెళ్ళిపోయాడు. తర్వాత సాగార్ని కలుసుకుని జరిగింది చెప్పి- "నీ మూలంగా నా వరం పాడయింది. ఇప్పడేంచేయను?" అన్నాడు.
    సాగర్ అతడి భుజంతట్టి- "ఆడది చాలా ప్రమాదకరమైనది తనకు తాన్తే నిన్ను వరించిన ఆడది ఒకరోజున ఇలాగే నిన్ను విసిరికొడుతుంది. అందుకే ఆడదాన్ని  మనం తెలివిగా వశపర్చుకోవాలి. అప్పడే ఆమె మనకు అణిగిమణిగి ఉంటుంది-" అన్నాడు.
    "అదంతా నాకు తెలియదు ఆడది మగాడికి గొప్ప సుఖాన్ని స్తుంది. మళ్ళి నాకు మరోఆడది దొరుకుతుందో దొరకదో -ఇంక పెళ్ళిచేసేసుకోవాలో ఏమో!" అంటూ వాపోయాడు చంచంల్రావు.
    "వెర్రివాడా- అలా కంగారుపడిపోకు వనజాక్షితో నీకు పరిచయమయింది దాన్నిబట్టే ఆడదేంత  తేలికైనదో నీకర్ధంకావాలి కొందరు చొరవ చేస్తారు. కొందరివిషయంలో మనం చొరవచేయాలి. అంతే!" అన్నాడు సాగర్.
    చంచల్రావుకర్దమయింది ఆడదంటే గౌరవభావం మనసులోవుంటే అది తొలగించి ఆస్దానే తేలికభావం ప్రవేశపెట్టడంకోసమే- తనకు వనజాక్షి పరిచయమైంది తనకప్పడే పెళ్ళేమిటి? మరో ఆడదాని గురించి ప్రయత్నించాలి.....
    "ఇప్పుడునేనేంచేయను ? కాల్ గరల్స్ నీ చూసుకోనా?" అన్నాడతడు.
    సాగర్ ముక్కుమీద వేలేసుకుని- "ఆ పొరపాటు మాత్రం చేయకు. కాల్ గరల్స్ కి ఎందరో మగవాళ్ళతో పరిచయముంటుంది. ఆ అనుభవంతో వారు మగాడికి  గొప్ప సుఖాన్నే యిస్తారు. అయితే  ఆసుఖం మనవంటి యువకులకు  కాదు. నలబై పై  బడిన వాళ్ళకు మనకు పనికోచ్చేది- అమాయకంగా కనబడే ఫామిలి టినేజ్ గరల్స్ ! తెలిసిందా?" అన్నాడు.
    "చాలాబాగుండి-వాళ్ళెక్కడ దొరుకుతారు?" అన్నాడు చంచల్రావు.
    "ఇంటిలో కూర్చుంటే మాత్రం దొరకరు. బయటతిరుతూంటేపిలిచి ఆహ్వానించరు...." అన్నాడు  సాగర్.
    "నీకంత ఆసూయ నన్ను రాంగ్  డైరక్షన్లో నడిపించి నా వనజాక్షిని నాక్కాకుండా చేశావు...." అన్నాడు చంచల్రావు.
    "ఎంతచెప్పినా నీకర్ధంకాదు. ఆడపిల్లను తెలివిగా  వలలోవేసుకోవాలి అప్పడే నువ్వామెను డామినేట్ చేయగలవు. లేకుంటే  ఆమెనిన్ను డామినేట్ చేస్తుంది" అని ఒక్కక్షణంఆగి "వనజాక్షిలా!" అన్నాడు సాగర్.
    "కబుర్లకేం ఎన్నయినా చెప్పొచ్చు!" అన్నాడు చంచల్రావు కోపంగా అయం రియల్లీ సీరియస్!" అన్నాడు.
    "నాకనిపించడం లేదు...."
    "అయితే నేను చెప్పేది విను..."
    "ఊ"
    "నేనునీకో అమ్మాయి గురించి చెబుతాను ఆమెనీకు తెలుసు-"
    "ఎవరామె?" అన్నాడు చంచల్రావు.
    "ఆమె అందమైనది అమాయకురాలు, ఆ ప్తెన ఇంటిలో తగినస్ధానం లేని  అసహయురాలు వలలో వేసుకుందుకామేకంటే సులభమైన యువతీ లభించదు-"
    "ఎవరామె?"
    "చెబుతాను నువ్వామెను వలలో వేసుకోగలవా?" అన్నాడు సాగర్.

 Previous Page Next Page