ఆలోచిస్తే ప్రకాశం మావయ్యనీ తప్పుపట్టాటానికి వీల్లేదు. కొడుకు మొదటిసారి తాగేడని తెలిసినప్పుడు ఏదో సరదాగా స్నేహితులతో కలిసి వెళ్ళేడెమో అని ఏ తండ్రి అనుకోడు. దేవదాసులా అయిపోతాడని భయపడతాడు. చిత్రమేమిటంటే ఈ ప్రపంచంలో ప్రతిమని పక్కమనిషి సెల్ప్ కంట్రోల్ మీద నమ్మకం ఉంచుకోడు. ఆప్తు మరి!
అవతలివాడు చేస్తున్నావి, ఒకప్పుడు తను చేసిన-లేక చేస్తున్న వేదపనులే అయివున్నా ఊరుకోబుద్ది వెయ్యదు. 'తనేలాగోచెడి పోయేడు'__ అన్న ఆత్మ వంచనతో పక్కవాడ్ని హెచ్చరించటానికి ప్రయత్నిస్తాడు.
పెద్దవాళ్ళు తాము డామినేట్ చెయ్యగల చిన్నవాళ్ళ మీద తమ అభిప్రాయాలు రుద్దటం కోసం 'జనరేషన్ గేఫ్ ' అని ఆత్మవంచన చేసుకొంటారు.
8
ప్రకాశం మావయ్యతో కలిసి యింటి కొచ్చేసరికి గుమ్మానికి తాళంకప్పు వేలాడుతూంది. ప్రకాశం పక్కింటికెళ్ళి తాళంచెవి తీసు కొచ్చి తలుపులు తెరిచేడు. లోపలంతా చీకటిగా వుంది. తడుముతూ స్వచ్ వేసేడు. అ గదిలో వున్న నిశ్శబ్దం అతని మనసులోను పేరుకుంది.
"చెప్పటం మార్చిపోయెను" అన్నాడు ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా ప్రకాశం మామయ్యా. "ఈ రోజే ఆఖరి రోజాట సుబ్బుల్తో కలిసి సినిమా వేళతానంది సిత."
చొక్కా చెప్పిందిరా....రాణి....కొరడారాణియో-రౌడి రాణియో-" ప్రకాశం మాట్లాడలేదు. కాళ్ళు కడుక్కోవటానికి పెరట్లో కి వెళ్ళాడు. మొహం కడుక్కొని దండెం మీద తువాల్తో తుడుచుకుంటూ బాదంచెట్టు చప్టామీద కూర్చున్నాడు. చెట్టుమీద ఆకులచాటు నుంచి ఏదో పిట్ట ఆగి ఆగి కూసేకూత తప్పు అంతా నిశ్శబ్దంగా వుంది. శీతాకాలం అవటంవల్ల ఆరవకుండానే సంధ్య చీకట్లు కమ్మేస్తున్నాయి. బాదంచెట్టు మీదనుంచి గాలి అలలుగా విస్తూంది.
ఆకస్మాత్తుగా అతన్ని ఏదో నిస్పృహ ఆవరించింది. ఏదో ఎగోని- అస్పష్టత-సుజాత జ్ఞాపకం ,అర్ధంకానీ అసంతృప్తి.
....తను సుజాతనీ ప్రేమిస్తున్నడా?
"లేదు లేదు - అది ఆకర్షణ" అనుకున్నాడు.
"మరి సీతని?"
"దీనికి ప్రేమ అనేటంత పెద్దది- మహాన్వితమ్తెనది అయిన పదం యెందుకు? తను ఆమెను పెళ్ళి చేసుకొంటాడు. జీవితాంతం పోషిస్తాడు. అందుకు ప్రతిఫలంగా ఆమె తనతో వుంటుంది తనకి పిల్లల్ని కనిస్తుంది. ఈ చిన్న అనుబంధమేనా ప్రేమంటే-?!
అతనికి అకస్మాత్తుగా తన క్లాస్ మేట్ కుమార్ జ్ఞాపకం వచ్చేడు దాదాపు నాలుగు సంవత్సారాల క్రితం విడిపోయిన ప్రియమిత్రుని తపపుల్లో అతను మునిగిపోయాడు. ఆ చీకట్లో ఆ నిరాసంలో తన స్నేహితుని కథలో ఒక వ్యకం జ్ఞాపకం వచ్చింది అతడికి.
"__సాయంత్రం అయిదవగానే ఇలా బాల్కనీలో నిలబడి నీ కోసం యెదురు చూడటంలో యెంత ఆనందం వుందో నీకేం తెలుసు? అకస్మాత్తుగా మలుపు తిరిగి నువ్వు కనబడతావు. తల వంచుకుని, తొందర తొందరగా నడిచి వచ్చేస్తూ వుంటావ్ , ఇంతవరకూ వచ్చిన వాడివి యింటికి రావనికాదు. కానీ, నీ నడకలో ఆ వడిని, తొందరగా చేరుకోవాలనే తపనని నువ్వు వచ్చేస్తున్నావనే విషయం నాలో కలిగించె ఆనందాన్ని అనుభవించటాన్కి యుగాల్తెనా ఇలాగే నిలబడగలను, ఈ నిరీక్షణలోనే వుండే అందం నీకేం తెలుసు?"
'ఎన్నిసార్లు చదివేడు' తనీ కథని?
"కుమార్ అదృష్టవంతుడు" అనుకున్నాడు ప్రకాశం. బావుకత్వంలో కూడా ఆనందంలేదని గ్రహింగలిగే స్ధితికాదు అతనిది. అంతగా ఎదగలేదు అతను.
చాలా సేపటి వరకూ ప్రకాశం అలానే కూర్చొని వున్నాడు. అతని ఆలోచన్లు చాలా భాగం కుమార్ గురించీ సాగినయ్.
మూడు సంవత్సరాల డిగ్రికోర్సు అంతా పక్కపక్కనే కూర్చోవాటం వల్ల కుమార్ ప్రభావం ప్రకాశంమీద చాలా పడింది. మాటల్లో వివరించలేనిది అది...
పరంధామయ్య పిలుపుతో లోపలికి వెళ్ళేడు. పితలు వెస్తూ "వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. మనం భోజనం చేద్దాం" అన్నాడు. ఇష్టం లేకపోయినా కూర్చొని రెండు మెతుకులు తిని పూర్తయిందని పించాడు.
చొక్కా వేసుకొని బ్తేటికి వెళ్ళబోతూవుంటే "మళ్ళి ఎక్కడికిరా?" అని అడిగేడు పరంధామయ్య.
తలుపులు దగ్గిరగావెస్తూ "ఇప్పడే వస్తాను" అని బయట కోచ్చేడు. నిజానికి ఎక్కడికో అతనికి తెలిదు. తాపీగా నడవసాగేడు. గుడి ధ్వజస్ధంభం ఎత్తుగా, ఈ ప్రపంచంలో జరిగే పాపాలన్నీ చూడటానికా అన్నాట్టు నిలబడివుంది. లోపలికి వెళదామన్న ఆలోచనని వీరమించు కొన్నాడు. బామ్మగారితోపాటు గుడిమెట్లు దిగుతున్న తాసిల్దారు గారి అమ్మాయి కనుకోసల్లోంచి ప్రకాశాన్ని చూసిచూడనట్టు చూసి ముందుకు నడిచింది. ఆమె పెదవులమీద సన్నంగా వెలసిన చిరునవ్వుని ఆ ల్తెటు వేల్తురులో గమనించేడు. అతనికెందుకో ముచ్చటేసింది. నిజానికి ఆ భావానికి అర్ధంలేదు. దేన్నో పొందాలన్న కాంక్షలేదు. ఆ పదహారెళ్ళ అమ్మాయి అలా స్నిగ్ధంగా ప్రపంచంలో వుండే అమాయకత్వన్నంతా కనురెప్పలమాటున దాచుకొని నవ్వుతే అలా చూస్తుండి పోవటం కూడా అనుభవమే యవ్వనపు తొలిరోజులు యెంత మధుర స్మృతులు!