Previous Page Next Page 
ఋషి పేజి 5


    తన జీవితంలో మొట్ట మొదటిసారి  అమ్మాయితో అనుభవం యింత అస్తవ్యంగానూ వుండి తీరుతుంది. ఆ సంఘటన అలా ముగియ కుండా వుంటే  యెంత బావున్ను' అని  ప్రతివాడూ  తరువాత అనుకోవటము సహజం కూడా. కానీ ప్రకాశం  తాలూకు  ఏ అనుభవం యిలా ముగియలేదు. సుజాత కారు వెనక్కితిప్పి ప్రకాశం  పక్కగా తీసు కొచ్చి "ఎక్కు ప్రకాశం ! నిన్ను తీసుకొచ్చిణచోటే దింపుతాను" అంది.

    ప్రకాశం సూటిగా చూసేడు. సుజాత చిన్నగా నవ్వి "నామీద_కోపం నీ మీద చూపించుకొని ఈ మూడుమైళ్ళూ నడవటం దేనికి?" అంది. అతడు మాట్లాడలేదు. అతనికి స్ధితి దుర్భరమ్తేంది. తనేం  చెయ్యాలో... తన ప్రిన్స్ పుల్  ఏమిటో -  ఆమె కారు ఎక్కటం ద్వారా  వాటికి ఏ విధమైన భంగం కలుగుతుందో ఊహించలేకపోయేడు. చెడి పోవటం గురించీ, మనిషికున్న కట్టుబాట్ల  గురించీ మనిషి చుట్టూ వున్న వాతావరణం గురించీ ,అతనేప్పడూ ఆలోచించాలేదు.... అతను మేధావికాడు... తన గురించీ,  తన వునికినీ గురించీ,  తార్కికంగా ఆలోచించగాలిగే శక్తి అతనికి లేదు. అదే వున్న  పక్షంలో  అతనేప్పడో చెడిపోయేవాడే! ఎందుకంటే ... ఈ లోకంలో  తెలివైన వాళ్ళూ, తమని తాము అర్ధం చేసుకొన్నవాళ్ళూ దాదాపు కొద్దిగాన్తెనా సరే  వ్యసనాలన్ని రుచి చూసి, ఆ విధంగా చెడిపోయినవాళ్ళే!

    రోడ్డుమీద వెళుతున్న స్తేకిలిస్టు  ఒకడు  తమవ్తెపే విచిత్రంగా చూసుకుంటూ సాగిపోవటం  గమనించేడు ప్రకాశం.

    "ప్లీజ్!" అంది సుజాత.

    "తను కారెక్కుతాడు. వచ్చినచోట దిగిపోతాడు. అంతేగా ఇందులో తప్పేం ఉంది?"

    చిన్న ఆత్మవంచనతో ప్రకాశం కారు  ఎక్కెడు. జర్క్ తో  కారుకదిలింది.

    ....చాలా సేపటి వరకూ యిద్దరూ మాట్లాడుకోలేదు. ఆ కొద్ది సమయంలోనూ అతను బాగా రిలాక్సయ్యేడు. సుజాత మౌనంగా కారు నడపసాగింది. ప్రకాశానికి ఈ స్ధితి కూడా బాధాకరంగానే వుంది. "ఇలా ఆమె తనని తీసుకెళ్ళి తను దిగవలసినచోట దింపెయ్యటం కన్నా ఏదయినా... ఏదయినాసరే మాట్లాడితే బావుండును" అని అతనికి ఆ క్షణంలో అనిపిస్తే అందులో అతని తప్పలేదు. మామూలు మనిషికుండే మానసిక బలహీనతలకి అతను అతితుడేం కాదు.

    ....అంతలో అతని ఆశ నెరవేరింది. ఒక చేతితో స్టీరింగ్  పట్టుకుని, రెండో  చెయ్యి చేతిమీద వేసి_ "క్షమించు ప్రకాశం" అంది. ఆ కంఠంలో కనబడిన ఏదో  అస్పష్టమ్తెన గద్గదికత  అతడ్ని విచలితుడ్ని చేసింది.

    -అతను దిగవలసినచోటు రాగానే "ఇక్కడే ఆపనా " అంది. తలోపేడు రోడ్డుకి ఒక పక్కగా  అపుచేసింది. కారుదిగి ఒక క్షణం ఆమె కళ్ళలోకి చూసి "నువ్వే నన్ను క్షమించాలి సుజాత...కానీ నువ్వే  ఆలోచించి చూడు. సీతని పెళ్ళాడవలసిన బాధ్యత నా మీద వుండగా నిన్నెలా ప్రేమించగలను?" అన్నాడు.

    చాలా సేపట్నుంచి అతనిలో తన పనిని సమర్ధించుకొంటూ ఏదో చెప్పాలనే  తపన పేరుకుంటూంది. తన అన్ని భావాల్ని __ (ఆమె దృష్టలో) తన బలహీనతల్ని _ కవర్ చేసుకోవాలంటే .... దాని  రిప్ర జెంట్ చేసే ఒకే ఒక వాక్యం అదేనని అనిపించింది. ఆ విషయం చెప్పెయ్యగానే రిలీఫ్  గా  ఊపిరి పిల్చుకొన్నాడు.

    కానీ అతని సంతృప్తి ఎక్కువకాలం నిలవలేదు. సుజాత కారు  ముందుకు  పోనీచ్చేముందు "ఒకమాట" అంది_మనిద్దరి మధ్య  ప్రేమ అనేటంత పెద్దపదం ఎందుకులే ప్రకాశం?" అనేసి  వెళ్ళి పోయింది.

    ప్రకాశం చాలా సేపటివరకూ ఆ కారు వెళ్ళిపోయినవ్తెపే చూస్తూ ఉండిపోయేడు.

    ఎంత సరిపుచ్చుకుందామన్నా ఆమె నిజాయితిముందు తన ప్రవర్తన అల్పంగా తోచింది. ఎంతో ఉదాత్తంగా ప్రవర్తించేడు తను. కానీ యెక్కడో అపశృతి పలుకుతోంది. తను వద్దంటాడు. అది వేరే సంగతి కానీ-ఆమె వెళ్ళిపోకుండా యింకోంచేం బతిమాలితే బావువాణ్ణనే విక్ నెస్ ....ఏవిటి బలహీనత?

    దేముడిముందు ఏకాగ్రతతో ధ్యానంచేసి, గుడి మెట్లు దిగుతూ యెదురుగా  వచ్చే అమ్మాయిని కళ్ళార్పకుండా చూసే  మనిషి యెలా తన ప్రవర్తనని సమర్ధించుకొంటాడు? ఆత్మవిమర్శ చేసుకొంటే__ అమ్మాయిని చూడటం అన్నా మానేయాలి__ లేకపోతే గుడికి వెళ్ళటం అన్నా మానేయాలి? మానవుడు! దేనిదారిదానిదే అన్నాడే ఆత్మవంచన! ద్వంద ప్రవ్రిత్తి_ డబుల్ స్తేకాలజి.

    "సుజాత యిక కనబడినా మాట్లాడకూడదు__యిక ఆ కారు వచ్చినా యెక్కను" అని అక్కడికక్కడే నిశ్చయం చేసుకొని, రెండడుగులు ముందుకేసి స్దాణు వ్తే  నిలబడిపోయేడు. యెదురుగా మావయ్యా!

    ఎంత సేపటినుంచో తననే గమనిస్తున్నట్టు-నిలబడి వున్నాడు.

    "ఎవర్రా ఆవిడ?" అనుమానంగా అడిగేడు పరందామయ్య.

    ప్రకాశం బిక్కచచ్చిపోయి "నా స్నేహితురాలు మావయ్య! కాలేజిలో చదివే రోజుల్లో ...." అన్నాడు.

    'అంతేనా'__అన్నాట్టు చూసి_ "ఇక ఇంటికేనా?" అన్నాడు. ఇక ఇంటికేనా?...ఇక....ఇక...ఇ...క?

    ఇరవ్తే సంవత్సరాల్నుంచి అంతస్తుమీద అంతస్తు కట్టుకొంటూ వచ్చిన మంచితనాన్ని వ్యక్తిత్వాన్ని 'ఒక్క చూపుతో  'పునాదుల్తో సహా పెకలించి పారేసేడే. మంచితనానికి వున్న స్ధానం ఏమిటి?....మొట్ట మొదటిసారి ఆలోచించటం మొదలు పెట్టాడు ప్రకాశం.

    చెడిపోవటానికి , చేతకానితనానికి, అమాయకత్వానికి, వ్యక్తిత్వము లేకపోవటానికి, వేదాంతానికి మధ్యవున్న తోడాల గురించీ ఆలోచించటానికి ప్రకాశానికున్న అనుభవం చాలదు. అందువల్ల అతని  ఆలోచనలు ఆ పరిధిలోనే  ఆగిపోయేయి. ఇంకా కొంచెం పై మెట్టుకి

 Previous Page Next Page