"నేరస్థుడి వయసు నేరస్థుల రక్షణ శిక్షణ పునరావాసానికి వీలుకల్పించి, న్యాయరస్థానంపలో విచారణ జరిపించాలని నిర్దేశిస్తూంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ని ఓ సెక్షన్- దాని నంబరు చెప్పగలరా?"
నిశ్శబ్దం.
" జిల్లా సెషన్స్ జడ్డిగాని,అడిషనల్ జడ్జిగాని నేరస్థుడికి మరణ శిక్షయినా విధించొచ్చు. కాకపోతే హైకోర్టు ధ్రువపరచాలి.అదే అసిస్టెంటు సెషన్స్ జడ్జి ఏ స్థాయిదాకా శిక్ష విధించొచ్చు?"
ఈ సారి జావాబు లేదు.
"వాటె సర్కిల్ ఇన్ స్పెక్టర్స్!" ఆమె పెదవులు మృదువుగా విచ్చుకున్నాయి. " సర్స్ నేనడిగిన రెండు ప్రశ్నలకి అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్లలో గాని, సబ్ ఇన్ స్పెక్టర్లలో గానీ
ఎవరన్నా జవాబు చెప్పొచ్చు."
అరక్షణం నిశ్శబ్దం తరువాత ఓ చేయి పైకిలేచింది ముందుకు నడిచిందామె. అతను ఎస్సై మురారి.
" ప్లీజ్ ప్రొసీడ్."
"మీరు మొదట అడిగిన సెక్షన్స్ జడ్జికి మరణశిక్షగాని, యావజ్జీవ కారాగారశిక్షగాని పదేళ్ళకిమించి ఖైదువేసే అధికారం లేదు."
" దట్స్ గుడ్..." తలతిప్పి ఈసారి ఇందాకటి ఎస్సై ప్రసాదునే చూస్తూ అంది. ఓ జోక్ చెప్పగలరా?"
ఊహించని ఈ ప్రశ్నకి బిత్తరపోయాడు ఎస్సై ప్రసాద్.
"మిమ్మల్నే!"
తొలి పరిచయం లోనే ఇలా మూడు ప్రశ్నలకీ నిస్సహాయంగా నిలబడిపోవాల్సి రావడం అతన్నెంత కంగారు పరిచిందీ అంటే- శరీరం చెమటతో తడిసింపోయింది.
"కొత్తగా పెళ్ళయినా భార్యని పుట్టింటి దగ్గరే వదిలేసిన ఓ పోలీసాఫీసరుకి అతని భార్య ఉత్తరం రాసింది కోపంతో. అయితే అందులో ఒక్క అక్షరమూలేదు.' ఇదేమిటీ' అని పక్కనున్న నాలాంటి ఇంకో ఎస్సై అడిగాడట. ' మేం ఈ మధ్య మాట్లాడుకోవడంలేదూ' అంటూ జవాబు చెప్పాడు." గొల్లుమ నవ్వారందరూ.
నవ్వకుండా ఉండలేకపోయింది. మరుక్షణం సీరియస్ గా మారిపోయిన మేనక అంది ప్రసాద్ ని చూస్తూ- " మిష్టర్ ప్రసాద్, మొదటి రెండు ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోవడం ఇగ్నోరెన్స్ దాన్ని వదిలేయొచ్చు. ఓ జోక్ చెప్పలేకపోవడం మాత్రం బాధాకరం. మనసారా నవ్వలేనివాడూ. నవ్వుతూ బ్రతకలేనివాడు జీవితాన్ని ప్రేమించలేడంటారు మనోవైజ్ఢానికులు. పోసిస్ ఆఫీసర్స్ కి ఇది మర పెద్దడిస్క్వాలిపికేషన్."
ఆమె సమావేశాన్ని ముగించి నడుస్తూ సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుధాకర్ వేపు చూసింది. ఆ చూపులో లాలిత్యం లేదు. అడగనిప్రశ్నకు వెతుకున్న జవాబులా ఆమె లోతుగా చూస్తూంది.
"మల్లి నుంచీ, ఆమె తండ్రి రాజయ్య నుంచీ స్టేట్ మెంట్స్ తీసుకున్నాను మేడం. కాని రణధీర్ ని కస్టడీలోకి తీసుకోలేదు. పరారీలో ఉన్నాడు."
"వెతకండి."
ఏ.ఎస్.పి. మేనక తన ఛాంబర్ లోకి నడిచింది. ఓ అందమైన అమ్మాయిమాత్రమే కాక, ఆమె అర్థంకాని పజిల్ గా కూడా అనిపిస్తుంటే అబ్బురంగా చూస్తున్నారంతా.
మధ్యాహ్నం కావస్తూండగా ఎస్సై మురారి ఆమె దగ్గరికి వచ్చాడు అపాయింట్ మెంట్ తీసుకుని.