"సామాన్యపు ఆడదాన్ని ఆడినావల్ల ఎలాగావుతుంది?" అందివనజాక్షి.
"నేనూ సామాన్యపు మగవాణ్ణి ...." అన్నాడు చంచాల్రావు.
"నిన్ను చూసి అసామాన్యుడివనుకున్నాను వెళ్ళు..." అంది వనజాక్షి తీవ్రంగా వెంటనే.
చంచాల్రావు తెల్లబోయాడు. కానీ అంతలోనే పుంజుకుని- "కోపం వచ్చిందా?" అన్నాడు.
"నేను అసహయురాలిని నువ్వు తోడుగా వుంటే నా అసహాయతతొలగిపోతుందనుకున్నను. అలా జరగనప్పుడు నీతోడు నాకు అనవసరం. వెళ్ళు-"
చంచల్రావామెను మంచి మాటలాడబోయడు. ఫలించలేదు ఆమె అతణ్ణి తీవ్రమైన మాటలతో హింసించింది. అతడు చొరవచేయబోతే ప్రతిఘతించింది.
చంచాల్రావాశ్చర్యంగా-" నువ్వు సామన్యురాలివికాదు. నీలో సాహస ముంది. దుడుకుతనముంది తెలివుంది. నువ్వివన్ని నీ భర్త పై ఉపయోగించవచ్చుగా__" అన్నాడు.
"ఆడది ప్రియురాలిగా బలవంతురాలు భార్యగా బలహీన...."
చంచాల్రావు మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాతఅతడికి వనజాక్షినీ కలుసుకునే అవకాశం మరిరాలేదు. ఆమె అంగీకారం లేకుండా చాటుగా ఆమె యింటికి వెనుకసందుద్వారా చేరుకోవడం అసాధ్యం.
నాలుగైదురోజులు విరహవ్యదననుభావించాడు. తర్వాత చంచాల్రావుకు వనజాక్షి లేనిదే బతకలేనని అనిపించింది.
ఎం చేయాలి?
బాగా ఆలోచించి అతడు సాగర్ కలుసుకున్నాడు.
సాగర్ చంచాల్రావుకు దూరపుబంధువు ఇంచుమించు అతడి వయసు వాడే కానీ అతడిది వయసుకుమీంచిన తెలివి సాగర్ కు ఫ్యాన్సీదుకాణ మొకటి మెడికల్ షాపోకటి ఉన్నాయి. రెండింటిని చూసుకుందుకు మనుషులున్నారు. ఉదయమొక రెండుగంటలూ , సాయంత్రం రెండుగంటలూ చెరో షాపులోనూ గడుపుతాడు. అతడి నెలసరి సంపాదన అయిదంకెల్లో వుంటుంది జల్సాగా తిరగడం అతడి అలవాటు అతడికి రకరకాల స్నేహితులున్నారు.
బంధువుగాకంటే స్నేహితుడిగానే సాగర్ చంచల్రావు కెక్కువ పరిచయం.
మిత్రులతో సాగర్ ఆడవాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతాడు ప్రపంచంల ఆడవాళ్ళ గురించి తనకంటే ఎక్కువగా తెలిసినవారు లేరని అతడి నమ్మకం అతడి నమ్మకన్నతడిముందు కాదనే దైర్యంగాలవారు అతడి మిత్ర బృందంలో లేరు.
చంచల్రావంటే సాగర్ కి కాస్తలోకువ. అతడేద్తేనా అడిగితే "ఒక్క ఆడదానితోన్తెనా పరిచయంలేని నీకేంచెప్పినాఅర్ధంకాదు" అని తిసిపారేసేవాడు ఆ తర్వాత అతడికి ఆడవాళ్ళేన్నీరకాలో ఎవరెవరినేలా వశపరచుకోవాలో చెబుతూండేవారు చంచల్రావు ఆశ్చర్యంగా నోరుతెరిచి అన్నివినేవాడు.
ఇప్పుడు తన సమస్యను సాగర్ కి చెప్పుకోవాలనుకున్నాడు. తన సమస్య పరిష్కరించబడటం మాటేలాగున్న-సాగర్ కి తన గొప్పతనం తెలుస్తుంది. ఒక ఆడది తన్ను కోరివరించిన నిజం సాగర్ తెలుసుకోవాలి!
చంచల్రావు సాగర్ కలుసుకొని జరిగింది చెప్పాడు.
సాగర్ కళ్ళు పెద్దవయ్యాయి " ఇంకోసారిచేప్ప!" అన్నాడు.
ఒక ఆడది కోరినన్ను వరించిందంటే నీకు నమ్మకంలేదా?" అన్నాడు చంచల్రావు కాస్త కోపంగా.
"ఎందుకుండదూ? నువ్వంటే మనసుపడ్డ ఆడది నిన్ను పిలిచి ఆహ్వానించాలితప్పు- వేరేదారి ఉండదు అదొకపాయింటు. ఆ తర్వాత ఏ ఆడదాన్త్నేనా వశ పరచుకోవడం నీ వల్లకాదుగదా! అందువల్ల నీకో ఆడదాని పరిచయమయిందంటే ఆమెనిన్ను కోరివరించిందని అర్ధం!" అన్నాడు సాగర్.
"నువ్వు నన్నుచూసి అసూయ పడుతున్నావు...." అన్నాడు చంచల్రావు.
"అసూయ పడేవాన్నయితే నిన్నెందుకు పోగుడుతాను?" అన్నాడు సాగర్ వెంటనే.
"నువ్వు నన్నేప్పడు పోగిడావు?"
"ఆడదాని చుట్టూతిరిగి వశపర్చుకునే ప్రయత్నాలు చేయడం గొప్ప విశేషమా- ఆడదే నిన్నుకోరి పిలవడం గొప్పవిశేషమా?" అన్నాడు సాగర్.
చంచల్రావు చాతి ఉబ్బింది "నేను నిన్ను సరిగా అర్ధంచేసుకోలేక పోయాను అయం వెరి సారి! "అన్నాడు.
"సరే- ఇప్పుడు మొత్తం జరిగిందంతా ఇంకోసారిచెప్పు...."అన్నాడు సాగర్.
చంచాల్రావు ఓపికగా జరిగిందంతా చెప్పాడు.
అప్పుడు సాగర్ నవ్వి "అంతా నేననుకున్నట్లే జరిగింది-" అన్నాడు "
"అంటే?" అన్నాడు చంచల్రావు.
"సాగర్ వివరించాడు.
వనజాక్షి భర్తవల్ల హింస అనుభవిస్తోంది. అది భరించలేక ఒక రోజున ఆమె అతడితో - ఎవరితోనైనా లేచిపోతానని బెదిరించింది నిన్ను చూసి ఎవరు మొహిస్తారు అని భర్త ఆమెను సవాలు చేశాడు అప్పుడు వనజాక్షికి పౌరుషం వచ్చింది. తన ఆడతనంమీదే అనుమానం కలిగింది. తను కో అంటే కోటిమంది వస్తారని భర్తతో అంది ఇలాంటి సంభాషణలు మధ్య తరగతి భార్యభర్తలమధ్య మామూలే! వనజాక్షి మాటలు విని ఆమె భర్త- "ఆఖరికి కర్రకు చిరగాడితే ఇంతలేసికళ్ళేసుకునీచూసే ఆ చంచల్రావు కూడా నీ మొహం చూడడు-" అన్నాడు ఆ మాట వనజాక్షి మనసులో బాగా నాటుకుంది. అందులోని సత్యాన్ని తెలుసుకోవలనుకుంది. ఫలితంగా చంచల్రావు అదృష్టం పండింది.
సాగర్ వివరణ వింటూనే చంచల్రావు ముఖం చిన్నదైపోయింది-"నా గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతున్నావు నువ్వుచెప్పిందేనిజమైతే ఆమె నాద్వారా తన భర్తను సాధించాలని ఎందుకనుకుంటుంది?" అన్నాడు
"ఆమె మాటలు నిజంకాదు నిన్ను వదుల్చుకోవడానికికామే అలా చెప్పింది. నీతో పరిచయం ఆమెకు నచ్చలేదు. తను తప్పు చేస్తున్ననన్న భావన కూడా ఆమెక్కలిగి ఉండవచ్చు...." అన్నాడు సాగర్.
చంచల్రావుకు సాగర్ మాటల్లో నిజముందనిపించినా ఒప్పుకోవడం ఇష్టంలేదు- "నేను నిన్ను ఉపాయమడిగితే నువ్వు నన్ను నిరుత్సాహపరచి పంపెస్తున్నావు....." అన్నాడు.