"వేరే ఫోన్లో మాట్లాడుతున్నాను సార్! ఒక్క నిమిషం ఆగండి!" కొద్దిక్షణాల తర్వాత తిరిగి ఫోన్లో కోచ్చాడతను.
"హలో...."
"హలో_బోర్నవితా రెండూ-సాయంకాలం టంటటం__సాగర తిరం టంటటం-"
"డార్జిలింగ్ కి పూరి ఎక్స్ ప్రెస్ -నూటపాతిక రూపాయలు."
"ధాంక్యూ -సాయంకాలం-టంటటం."
"మెన్షన్ నాట్ సాగాతిరం-టంటటం."
రిసీవర్ ఫోన్ మీద పెట్టేసి చెమటలు తుడిచేసుకున్నాను.
ఈలోగా సారధి బిల్లు కట్టేసి బయట నాకోసం ఎదురు చూస్తూన్నాడు. వెంటనే ఇంటికి చేరుకొని మళ్ళి లెక్కలు కట్టే కార్యక్రమం ప్రారంభించాం! ఒక్కొక్కరికి నూటపాతికరూపాయల చొప్పన, నలుగురికి కలిపి రానూబోనూ వెయ్యిరూపాయలు సారధి వాళ్ళ చిన్నిగాడికి సగం టికెట్ తీసుకోవాలా లేదా అనేది మళ్ళి డౌట్ వచ్చేసింది.
"తీసుకుందాంలే! మళ్ళి ఆ టికెట్ కలెక్టర్లతో పేచి ఎందుకు ?" అన్నాడు సారధి.
"అవును! మన స్వామి వాళ్ళబ్బాయికి మూడేళ్ళేనని చెప్పినా వీణకుండా ఆరేళ్లనీ దబాయించి పెనాల్టి వేశారు కదా ఆరోజు" అన్నాను ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూ.
మా వూళ్ళో ఓ టికెట్ కలెక్టర్ వుండేవాడు. అతను కేవలం అయిదేళ్ళలోపు చిన్నపిల్లలను పట్టుకుని- వాళ్ళకు అరటికేట్ కొనాల్సి వుందని డబాయించి డబ్బులు గుంజి పెద్దబిల్డింగ్ కట్టాడు. దానికి 'బాల విహార్' అని పేరు పెట్టారు మా ఊళ్ళో జనమంత కలసి.
"సరే, మొత్తంమీద మూడువేల రూపాయలు చేతిలో ఉండాలి" అంటూ తేల్చాడు సారధి.
"మనం అసలు ఎంత మోత్హ్తం పోగుచేయగలం అనేది ముందు చూద్దాం! దానినిబతీ ఇంకెంత అప్ప చేయాలో తెలుస్తుంది" అన్నాను.
"ముందు మనిద్దరం సేవింగ్స్ పుస్తకాలు తీసుకుని ఎంత బాంక్ బాలెన్స్ ఉందో చూద్దాం?" అన్నాడు వాడు.
ఇద్దరం ఇంట్లోకెళ్ళి సేవింగ్స్ ఎకౌంట్ పుస్తాకాలు తీసుకొచ్చాం . ఇద్దరి పుస్తకాల్లోనూ చెరో అయిదురూపాయలూఉంది.
ఎకౌంట్ మూసేయకుండా వుండాలంటే అది కనీసమొత్తం అవటం చేత దాని జోలికి పోలేదు.
"నాట బాడ్! ఇద్దరిదగ్గరా కలిసి ఇప్పటికి పదిరూపాయలు దొరికి నట్లే" అన్నాడు సారధి.
"కాని పదిరూపాయలు ఏ మూలకి?"
"ఇలా చిన్నచిన్న నీటిబిండువులే సముద్రం అవుతుందని ఎవరో అన్నారు గుర్తులేదు?"
హఠాత్తుగా నాకో విషయం గుర్తుకొచ్చింది.
"మన సతిరత్నాలు మనకు తెలీకుండా పొదుపుచేసి దాచుకున్న మొత్తం ఎంతోకొంతం ఉండేవుంటుంది కదా! ఎంతవుందో అడిగి తెలుసుకుందాం" అన్నాడు .
ఎందుకంటే ఇలాగే మా ప్రెండ్ ఒకతను జీతం చాలక అప్పల పాలయి, ఇళ్లు అమ్మేసి, ఆఖరికి ఆత్మహత్య చేసుకోబోతుంటే, అప్పుడు వాళ్ళవిడ తను అన్నేళ్ళుగా అతనికి తెలీకుండా ఇంటి ఖర్చుల్లో పొదుపుచేసి దాచుకున్న రెండులక్షల రూపాయల అతని కిచ్చేసి రక్షించిందట.
"ఏడ్చినట్లుంది! అలా ఆడిగితే ఇస్తారా ఏమిటి? వాళ్ళకు తెలీకుండా వాళ్ల పెట్టెలు సోదా చేయడమే ఎక్తేకమార్గం" అన్నాడు సారధి.
ఇద్దరం ముందస్తుగా మా ఇంట్లోకి నడిచాము మా ఆవిడ వంటింట్లో చాలా బిజీగా ఉంది. అదే సందని వంటింటి తలుపులు గడవేసేసి మంచం కింద వుంన దాని పెట్టెను బయటకు లాగి వెతకడం ప్రారభించామూ. పెట్టంతా పెళ్ళికికొన్న సెంట్ తాలూకూ సువాసనలలో ఘుమలాడి పోతోందిగాని ఎక్కడా ఇక్కప్తేస కూడా దొరకటంలేదు. నేను పెట్టిఅడుగునున్న న్యూస్ పేపర్ కూడా లాగేయబోతూంతే నా వేలు చురుక్కమంది. కెవ్వున కేకవేసి వెనక్కు గేంతాను. సారధి అంతకంటే పెద్ద గంతువేసి బయటకు పరుగెత్తి నిలబడ్డాడు గాభరాగా వాడికేం జరిగిందో నాకు తెలిలేదు.
"ఏమిట్రా-ఏం జరిగింది?" అడిగాడు వాడు అక్కడే నిలబడి .కుని "నువ్వెందుకు పరుగేత్తావ్ మరి?"
"ఏమో! నువ్ గెంతేప్పటికి-ఏదో కొంప మునగబోతోందని నేను పరుగెత్తాను."
"ఏడ్చినట్లుంది, ముందు పెట్లో వెతుకు! ఏదో బాగా కుట్టేసింది నా వేలుని" అన్నాను చిరాకుగా.
ఇద్దరం కలిసి జాగ్రత్తగా పెట్టెలోని బట్టలన్నీ తిసి కింద పడేశము. అప్పుడు కనిపించింది ఓ తెలుపిల్ల!
పదినిముషాల భీకర సంగ్రామం జరిగింది. చెప్పలూ, హంగర్ లూ పెన్నులూ, బొండ్ పుస్తకాలూ, రూళ్ళకర్రలూ స్కేళ్ళూ యదెచ్చగా ప్రయోగించక చివరకు ఆ తెలు వీరమరణం పొందింది.
ఈలోగా నాకు నొప్పి ఎక్కువపోయింది. వాడు ఓ పూరికొస తీసుకొచ్చి నా చేతి మధ్యలో గట్టిగా బిగించి కట్టేశాడు. ఇంక చస్తే విషంపతే కేక్కదని హామీ ఇచ్చాడు.
వాడి డిపార్ట్ మెండ్ వాళ్ళు నిర్వగించిన ఫస్ట్ ఎయిడ్ క్లాసుకి వాడు హాజరయి సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు.
"ఇప్పుడు కుట్టినచోట బ్లేడుతో చిన్నగా గాటుపెట్టాలి" అన్నాడు వాడు.
"ఎందుకు?"
"రక్తంతోపాటు విషం కూడా బయటి కోచ్చేస్తుంది కనుక."
"వచ్చింది లెంది ఎలా తెలుస్తుంది?" అడిగాను నేను
వాడు ఓ క్షణం ఆలోచించాడు. "ఈ సంగతి మా ఫస్ట్ ఎయిడ్ క్లాసులో చెప్పలేదే?" అన్నాడు ఆశ్చర్యంగా.