Previous Page Next Page 
హనీమూన్ పేజి 4


    "ఎవడాడు? ఇప్పుడు 'హలో' అంటున్నవాడు కాదు గదా."

    "హలో-హలో "అకోపంగా అరిచాను నేను

    "అదిగో-చూశావా, మళ్ళి అరుస్తున్నాడు వాడు."

    "దొంగనాయాలు."

    ఫోన్ డిస్కనెక్ట్  చేశాను కోపంగా.

    హఠాత్తుగా ప్లీడరుగారు అరిచారు మళ్ళి.

    "చూడండి! ఇందులో  ఏమీ రాశాడో? "స్వాదినం  తప్పిన గుజరాత్  ఆందోళన" సెంట్  పర్సెంట్ కరెక్ట్....నేనెప్పుడో చెప్పాను."

    "అవును" ఒప్పుకున్నాడు సారధి.

    నేను వినిపించుకొనట్లు మళ్ళి ర్తేల్వే ఎంక్వయిరీస్ కి  రింగ్ చేశాను.

    "గుడ్ మానింగ్ -ర్తేల్వే ఎంక్వయిరీస్" అంది  కర్ణకఠోరం మావూలుగా.

    "గుజరాత్ ఆందోళన తగ్గాలంటే  ఏం చేయాలి?" హఠాత్తుగా  గట్టిగా అరిచారు ప్లేడరుగారు.

    "మాకేం తెలుస్సార్?" చిరాగ్గా అన్నాడు ఎంక్వయిరీక్లార్క్.

    నేను ఉలిక్కిపడ్డాను.

    "అబ్బే!మిమ్మల్ని కాదండి! మా జలగ...సారి....మా ప్లీడరు గారు మాతో  మాట్లాడుతూంటే....మీకు వినిపించింది....సారి."

    "ఫర్లేదులెండి అప్పడప్పడూ ఇలాంటి పొరపాట్లు మావూలె."

    "ధాంక్యూ వెరీమచ్."

    "మెన్షన్ నాట్"  అనేసి ఫోన్  పెట్టేశాడతను. నేనూ డిస్కనెక్ట్  చేశాకగాని గుర్తురాలేదు, అసలు సంగతలా  వదిలేయండి? టెలిఫోన్  టేపెంగ్ గురించీ ఏమిటి? ఎంత గవర్నమెంటయినా  ప్రతిపక్ష నాయకుల ఫోన్స్ టేపెంగ్ చేస్తుందా? ఎంత సిగ్గుచేటు?"

    "చాలా సిగ్గుచేటండి?"

    "ఆరోజు ప్రిప్రెస్ జర్నల్ వాడు రాసిన ఏడిటోరియల్ చూశారా?"

    "చూళ్ళేదండి?"

    "ఇప్పడే  తెస్తాను" అంటూ లోపలికెళ్ళాడయన.

    "కమాన్! పరుగెత్తు-ఆయన బయటకొచ్చేకాగానే సందు మలుపు  తిరిగేయాలి మనం! బ్రతికుంటే బలుసాకు  తినవచ్చు" అన్నాడు సారధి.

    ఇదారం నిజంగానే చాలా వేగంగా  పరుగెత్తి మెయిన్ రోడ్ మీద  కోచ్చేశాం.

    "అమ్మయ్య గోడవొదిలిపోయింది!" అన్నాడు వాడు.

    "చాలా తెలివిగా వ్యవహరించబట్టి సరిపోయింది."

    "నాకేం తెలుసు?"

    "అదేమిటి? ఎంక్వయిరీకి రింగ్ చేశావుగా?"

    "దొరక్క దొరక్క దొరికితే అ ప్లీడర్ మధ్యలో అరచి చేడ గొట్టేశాడు కదా!"

    "అఘెరించినట్లుంది" అన్నాడు విసుగ్గా.
   
    "అవును!" ఒప్పుకున్నాను.

    "టి తాగి హొటల్ నుంచి చేద్దాం పద! ఈసారి నేనే చేస్తాను! నీకు సరిగ్గా చేతకావటంలేదు" అన్నాడు వాడు.

    "సరే....నీయిష్టం!"

    ఇద్దరం ఆ పక్కనే ఉన్న హొటల్లోకి దూరాము.

    అప్పడే  సర్వర్  వేడిగా ఉల్లిపాయ గారెలు తెచ్చి గుమ్మరించాడు అల్మారాలో.

    వాటిని చూడగానే నాకు నోరూరింది.

    "సరే....నువ్వెళ్ళి ఫోన్ చేసిరా! నేనిలోగా ఓ ప్లేటు గారెలు లాగించేస్తాను" అన్నాను ఓ టేబుల్ దగ్గర సేటిలవుతూ వాడు అందుకు  సనేమిరా  పప్పుకోలేదు. ఆ వేడి గారెలు ఇద్దరం  తిన్నాకే ఫోన్ చేయవచ్చు, ఇప్పుడేం  మునిగిపోలేదన్నాడు. ఇద్దరం రెండుచెరోప్లేట్లూ తినేశాం! ఈ లోగా సర్వర్ వన్ బ్తె టూ టి తెచ్చి ఇద్దరి ముందూ ఉంచాడు.

    "మనం వాన్ బ్తె  టూ తగుతామని సర్వర్ తెలుసు" సారధి నడిగాను  ఆశ్చర్యంగా.   

    "బిల్లులో టాక్స్  వేస్తున్న దగ్గర్నుంచి ఎవ్వరూ పుల్ టి తాగటం లేద్సార్..." అన్నాడు సర్వర్ చిరునవ్వుతో.

    "ఒకవేళ ఒక్కడే  హొటల్ కొస్తే?"

    "మరో ఒంటరి కష్టమర్ వచ్చేవరకూ ఆగి- అప్పుడు ఇద్దరూ కలసి వన్-బ్తె-టూ తాగుతారండి!"

    ఇద్దరం 'టి' తాగాము. నేనే మళ్ళి కౌంటర్  మీదున్న  ఫోన్ అందుకున్నాను. అయితే  ఓ పక్క సినిమా రికార్డులు, సర్వర్ల అరుపులు మరి  గొడవగా ఉన్నాయ్.

    గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే- నేను ర్తేల్వే  ఎంక్వయిరీస్ కి రింగ్  చేస్తే- నిజంగానే  ర్తేల్వే ఎంక్వయిరీ స్ ఫ్లానోకి రావటం!

    "ర్తేల్వే ఎంక్వయిరిస్  ప్లీజ్-" అంది  ఎమాత్ర్హం  ప్లిజింగ్ గా లేని గొంతు ఒకటి.

    "హలో....ఇక్కడినుంచి....చేతిలో చెయ్యేసి చెప్పుబావా-(సినిమా పాట అడ్డుపడిపోయింది) డార్జిలింగ్  కి- ఉల్లిపాము ఆమ్లెట్ ఒకటి-(సర్వర్ కేక)

    "ఇది  ర్తేల్వే  ఎంక్వయిరిస్, హొటల్  కాదు" కోపంగా అన్నాడాక్లార్క్.

    "హలో-కోప్పడకండి బాబూ! నేను హొటల్ నుంచి సాయంకాలం- టంటటి, సాగరతిరం- టంటటి-(సినిమాపాట)-హలో-నేను హొటల్నుంచి మాట్లాడుతున్నాను! టవూటో ఊతప్పా రెండూ -అందుకని డిస్టర్బేన్స్ గా  ఉంది."

    "మీకేం కావాలి?" విసుగ్గా అడిగాడతను.

    "పూరి కుర్మా రెండూ-(సర్వర్ కేక) ఇక్కడినుంచి సాగరంతిరం- టంటంటం చెలి కౌగిట్లో-చార్జి  ఎంతో  చెప్తారా?- కాఫి  వితవుట్  ఘగర్ , ఒన్ బ్తె-టు"

    "కృష్ణా ఎక్స్ ప్రెస్  గంట లేటు- అన్నాడతను.

    "నేనడిగేది కృష్ణా ఎక్స్ ప్రెస్  గురించీ కాదయ్యా-మషాలా దోసె  ఒకటి!" గట్టిగా అరిచాను.   

 Previous Page Next Page