"అయితే బ్లేడుతో కట్ చేయడానికి వీల్లేదు" అన్నాన్నేను అనుమానంగా.
"అబ్బే....అదేం ఫర్లేదు! నొప్పేమి ఉండదు...." అన్నాడు వాడు ఒళ్ళంతా కోస్య్కుని రక్తం పోగొట్టుకోవటం నా కిష్టంలేదు" అన్నాను.
నేనల అనడానికి కారణంఉంది. మా ప్రెండ్ రామకృష్ణ అనే అతను ఓ చిన్న ఊళ్ళో అసిస్టెంటు స్టేషను మాస్టర్ గా చేస్తూండేవాడూ ఆచుట్టూ ప్రక్కల పాము కరచిన వారు వెంటనే స్టేషన్ కి పరుగెత్తుకొచ్చి కంట్రోల్ ఫోను పాడవడం చేత వాడే వచ్చినతనికి ఫస్ట్ ఎయిడ్ చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఏ ఎస్సేమ్ లందరికి ఫస్టి ఎయిడ్ చేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఏ ఎస్సేమ్ లందరికి ఫస్టే ఎయిడ సర్టిపికేట్ ఉంటుంది. పాము కరచిన చోటుకి ప్తెన తాడుతో గట్టిగా కట్టివేశాడు.
ఆ తరువాత ఓ బ్లేడ్ తెప్పించి నాలుగాయిడు చోట్ల గాట్లు పెట్టాడు అప్పటికి నొప్పి తగ్గలేదానే సరికి మరికొన్ని గాట్లు పెట్టాడు. చివరకు రక్తం అంతా పోయి పాము కరచిన వాడు ప్రమాదస్ధితిలో పడేసరికి పక్క ఊళ్ళో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఎడ్మిట్ చేశారు. వాళ్ళు బోలెడు రక్తం ఎక్కించాక గాని బ్రతకలేదు. "ఇలా ఒళ్ళంతా గాట్లు పెట్టిన ఇడియట్ ఎవరి?" అంటూ అక్కడి డాక్టర్లు కోప్పడ్డారట.
"అలా ఎందుకు చేశావ్ గురూ" అని మావాడి నడిగితే "ఫస్ట్ ఎయిడ్ కొంచెం కన్ ప్యూజింగ్ సబ్జెక్ట్ గురూ" అని ఒప్పుకున్నాడు. అది గాక విళ్ళు ఫస్ట్ ఎయిడ్ పాసవటం కోసం ఆ ఇన్ స్టక్టర్ కి తలో పది రూపాయలూ ఇచ్చారట అంచేత నాలెడ్జ్ అంతగా లేదట!
అప్పటినుంచి నేను ఫస్టు ఎయిడ్ ప్రవిణులకు చాల దూఅరంగా ఉండటం అలవాటు చేసుకున్నాను.
చివరకేలాగాయితేనేం సారధి పస్టుఎయిడ్ చేయకుండా ఉండడానికి వోప్పకున్నాక నా బాధ వెంటనే తగ్గిపోయింది.
ఇంకా ఆ తెలు తాలూకు కుటుంబ సభ్యులు ఉన్నాయేమోనని పెట్టి మొత్తం కుమ్మరించేసరికి నాలుగు వంద నోట్లు కింద పడినయ్! ఇద్దరికీ బంగారం పాతర కనిపించినంత సంబరమయింది.
"శ్రమకుతగ్గ ఫలితం దక్కింది" అన్నాన్నేను.
"మా ఆవిడక్కూడా ఈ మాత్రం జ్ఞానం ఉంటే చాలు! హాయిగా డార్జిలింగ్ వెళ్ళి వచ్చేయవచ్చు!" అన్నాడు వాడు. ఆ నోట్లు ఎక్కడి వక్కడ సర్దేసి, పెట్టి మళ్ళి మంచం కిందకు తోసి వాడింటికి వెళ్ళాడు. వాళ్ళ గది లోకి వెళ్ళి తలుపు గడ పెట్టి వాళ్ళావిడ పెట్టె వెతకడానికని మూత తెరిచాము. ప్తేనే ఓ కాగితంమీద మెరిసిపోయే స్టిక్కర్ అంటింఛి వుంది.
"దొంగతనం గా ఆడాళ్ళ పెట్టెలు వెతకడానికి కొంచేమ్తెనా సిగ్గుండాలి!" అన్న అక్షరాలున్నాయ్ స్టిక్కర్ మీద.
ఇద్దరం ఉలిక్కిపది గదంతా చూశాం, వాళ్ళావిడ ఎక్కడయినా దాక్కుని మమ్మల్ని పూల్ చేస్తోందేమోనని.
"దాని సంగతి నీకు తేలిందేముంది? కొంచెం అతి తెలివి అఘోరించింది ఎప్పటికయినా నేను దాని పెట్టె సోడా చేస్తానన్న నమ్మకంతో అలాంటి స్టిక్కర్ పెట్టి ఉంటుంది" అన్నాడు సారధి.
"సిక్త్స్ సెన్స్ అంటే అదే" అన్నాన్నేను.
ఆ స్టిక్కర్ అవతల పారేసి బట్టలన్నీ తిసి పక్కన పారేసరికి అడుగున బోలెడు రూపాయనాణాలు కనిపించేయ్ మహా అయితే అన్ని కలిపి రోండొందలుంటాయేమో.
ఎంత వెతికినా వంద నోట్లు మాత్రం కనిపించలేదు.
"అంటే మీ ఆవిడ తాలూకూ నాలుగోందలు- ఈ రేండొందలూలూ కలిపి ఆరొందలు దొరికినట్లు లెక్కా" అన్నాడు సారధి.
"అవిగాక మన రెండు బాంక్ ఎకౌంట్లు మూసివేస్తే మరో పది రూపాయలు" అన్నాన్నేను.
"అవును! ఆ విష్యం వార్చేపోయం!" అన్నాడువాడు,
"ఆ ఆరోందలూ మనవికాదు. అందులో రెండొందలు పక్కింటి వాళ్ళు దాయమని మాకిచ్చారు" అంటూ మా రాజ్యం గొంతు వినిపించింది హఠాత్తుగా ఇద్దరం బెదిరిపోయి లేచి నిలబడ్డాము.
మేము చేస్తున్న పని ఎవరికి తెలీకుండా రహస్యంగా చేస్తున్నామని మా అభిప్రాయం. మేము దిక్కులు చూడటం గమనించి సారధి వాళ్ళావిడ మాట్లాడింది. "మేము తలుపు సమ్దులొ నుంచి అంతా చూస్తూనే ఉన్నాం లెండి" అంది సారధి భార్యా.
తెలుకుట్టిన దొంగల్లా (నాకు తెలు కుట్టిందని కాదు) తలుపు తెరిచాము.
"అబ్బే డబ్బుకోసం కాదు- మీరు టూర్ కెళ్ళలంటే మీకున్న చీరలు సరిపోతాయో, లేదోనని మీ పెట్టెలు చూస్తున్నాం" అన్నాడు సారధి అబద్దమాడేస్తూ.
"అవును! కేవలం చీరాల గురించే సోదా" అన్నాన్నేను.
వాళ్ళిద్దరూ మొఖాలు చూసుకున్నారు- అపనమ్మకంగా .
"మరి 'ఆరొందలు' అంటున్నారేమిటి?"
"అదా-అది ఏవో లెక్కలు వేసుకుంటున్నాములే" అనేసి ఇద్దరం బయటకు నడిచాము.
"అంటే మన టూర్ కి మన దగ్గరున్న కాపిటల్ కేవలం- రేపు ఫస్ట్ కి మనకొచ్చే జితాలేనని తేలిపోయింది!" అన్నాను సారధితో.
"అవును!" ఒప్పుకున్నాడు వాడు.
"అయినాగాని-మరో వెయ్యి రూపాయలు అప్ప పుట్టించాల్సి ఉంటుంది."
"ఆఫ్ కోర్స్ ? తప్పదు!"
"ఎవర్ని అడుగుదాం మరి!"
"ఎవర్నేనా అడుగుదాం."
వెంటనే ఇద్దరం 'ఎవర్నేనా' దగ్గరకు బయల్దేరాం! ఎవర్నేనా అంటే మా బాషలో 'మూర్తి' అన్నమాట!