"ఐదు వేళ దాకా వుండొచ్చు...." జవాబిచ్చాడు కుమార్.
"ఒక చిన్న తప్పుకి ఐదువేలు పెనాల్టియా?"
కుమార్ మాట్లాడలేదు. మళ్ళి అతడే అన్నాడు_ "దిన్ని లేకుండా చేసే మార్గం కూడా మీరే ఆలోచించాలి."
"మార్గమా" ఆశ్చర్యంగా అడిగేడు కుమార్.
అతడు నవ్వి "మరి చార్టర్డ్ అకౌంటెంట్సుని మేం పెట్టుకొనే యిలాంటి ఆపదల్లో ఉపయోగపడతారనేగా" అన్నాడు.
కుమార్ ఒక క్షణం ఆలోచించి "దీనికో మార్గం వుంది" అన్నాడు.
అతడు ఉత్సాహంగా "ఏమిటి" అంటూ ముందుకు వంగేడు.
"ఆఫీసులో మీ ప్తేల్లో వున్న ఒక కాగితాన్ని తిసి పారేసి పడకుండా చేస్తే..."
"ఎలా? యెవరు చేయగలరి పని?"
"ఆ ప్తేల్ డిల్ చేస్తున్న క్లర్కు అతని పని చేస్తే మికి పెనల్టి పడదు. మూడోకంటికి తెలియదు కూడా"
అతడు హుషారుగా లేస్తూ- "ఆ గుమాస్తా ఎవరో కొంచెం కనుక్కొని చెప్పండి. నిమిషాలమీద సానుకూలపరుస్తాను....డబ్బుకు లొంగని వాడెవడు ఈ లోకంలో" అన్నాడు.
"ఒక్క క్షణం..." అంటూ ఫోన్ తిసి ఎవరితోనో మాట్లాడాడు కుమార్. ఫోన్ పెట్టేస్తూ మాణిక్యాలరావు వ్తేపు తిరిగి "ప్రకాశం అట" అన్నాడు.
7
"నువ్వేం ఆలోచిస్తున్నాడో నాకు తెలుసు" అంది సుజాత.
'ఎమిట' నట్టు చూసేడు ప్రకాశం.
"నా మీద జాలి ఎలా చూపించాలా! అని. ఔనా"
...తనాన్ మనన్సులో ఏర్పడిన బావాలన్నిటిని కలిపితే అదే అర్ధం వస్తుందేమో అనుకున్నాడు ప్రకాశం... మళ్ళి ఆమె అంది_ "అదే నిజమయితే ఆలిచించకు. నా మీద సానుభూతి చూపించే వాళ్ళంటే నా కసహ్యం..."
ఒక క్షణం యెవరూ మాట్లాడలేదు.
కారు ఊరి పొలిమేర్లు దాటుతూంది. సాయంత్రం అవటంవల్ల పొలాలమీంచి వచ్చే గాలి చల్లగా తగులుతుంది.
"నీకు చాలా ఆశ్చర్యంగా వుంది కదూ?"
"ఏది?"
"ఇలా నిన్ను కారులో ఎక్కించుకోవటం - ముఖ్యంగా ఏకవచనంలో సంభోదించటం..."
ప్రకాశం మాట్లాడలేదు.
"నాకిరోజు చాలా ఆనందంగా వుంది ప్రకాశం. చాలా రోజుల తర్వాత నిన్ను చూసేను. దాదాపు మన క్లాస్ మేట్స్ అందర్నీ మర్చి పోయేన్నేను. కానీ...కానీ...నిన్ను మాత్రం..." అని ఆగి_ "నాకు క్లాస్ రాకపోవటాన్కి కారణం నువ్వే తెలుసా" అంది. అతడు అర్ధం కానట్లు చూశాడు.
"ఔను ప్రకాశం. నిజం...నీకు గుర్తు ఉందా? ఎప్పడూ రెండో బెంచి చివరలో కూర్చోనేవాడిని. నువ్వు చాలా శ్రద్దగా పాఠాలు వినేవాడివి. నేనేమో నీ పేస్ నీ చూస్తూ కూర్చుండేదాన్ని....నువ్వంటే రోజు రోజుకి నాకు యిష్టం పెరగసాగింది. కానీ" అని ఆగి, "మూడు సంవత్సరాల్తెనా ఈ విషయాన్నీ నా గుండెల్లోనే దాచుకున్నాను. దాని ఎక్కువయిష్టం అవటం."
ప్రకాశం ఆశ్చర్యంగా ఆమెవ్తెపే చూడసాగేడు.
"నా అభిరుచికి తగ్గట్టు ఆయనతో పెళ్ళయింది. ఇప్పుడు నా చుట్టూ డబ్బే. కానీ అది దొరికిన తరువాత అర్ధమ్తెంది. మనిషిక్కావలసింది అదొక్కటే కాదని.... ఒకవ్తేపు ఇది ఇలా వుంటే- ఇంకోవ్తేపు నాకు సానుభూతి చూపించేవాళ్లు- నా భర్త వయసుచూసి నా దగ్గరగా వద్దామనుకొనేవాళ్ళు యెక్కువ్తేపోయేరు. నామీద సానుభూతి తనాన్ ప్రేమ ద్వారా చూపిద్దామనుకొనే మొగవాళ్ళని దూరంగా వుంచటం కోసం నేను మనసుతో చాలా పోరాడావలసి వచ్చింది. ఈ పోరాటంలో నేను చాలా అలిసిపోయెను. ఈ స్ధితిలో నువ్వు మాటి మాటికి గుర్తు వచ్చేవాడివి. ఒక్కసారి నువ్వు కనబడితే చాలని, నా మనస్సు విప్పి చెప్పకుందామని అనుకునేదాన్ని. ఒకటి మత్ర్హం నిజం. ఆ రోజుల్లోనే నేన్నికి విషయం చెప్పివుంటే ... మన పెళ్ళి జరిగివుంటే.... నేను నిన్నింతగా ప్రేమించిన వుండేదాన్ని కాదు. అప్పుడు డబ్బు విలువ తేలిసుండేది...నిన్ను పోగొట్టుకున్న తర్వాత ప్రేమ విలువ తెలిసింది" ఆగింది.
"నీకిదంతా చాలా ఆశ్చర్యంగా వుంది కదూ! నాకు మాత్రం చాలా ఆనందంగా వుంది ప్రకాశం... ఒక తప్పుచేసి నిన్ను పోగొట్టుకున్నాను. ఇంక ఈసారి ఆ పని చెయ్యను. నువ్వెప్పడ్తెనా కనబడతావని నీతో ఇందతా చెప్పాలని ఎన్నిసార్లు రిహార్సల్స్ చేసుకున్నానో తెలుసా?" అంటూ అలిసిపోయినట్టు వెనక్కి వాలింది.
"ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం?" తాపీగా అడిగేడు.
"ఇక్కడే మా తోటా, గెస్టు హౌస్ వున్నాయి. కొత్తగా కొన్నా..."
"కారాపు"
సుజాత ఉలిక్కిపడి అతనివ్తేపు చూసింది. ప్రకాశం చాలా సీరియస్ గా వున్నాడు. అప్రయత్నంగా కారు రోడ్డు ప్రక్కకి తిసి ఆపు చేసింది. క్రిందికిదిగి డోర్ బలంగా వేశాడు. ప్రకాశం "గుడ్ బ్తె సుజాత" అని వెనక్కి తిరిగి నడవసాగాడు.
ఈ సంఘటన యిలా మలుపు తిరగటానికి ప్రకాశం బలమ్తెన వ్యక్తిత్వమే కారణం అయివుండనక్కరాలేదు! ఏ అబ్బాయికయినా