Previous Page Next Page 
సూపర్ స్టార్ పేజి 44


    ఎందుకు నవ్వటం....?"

    "చెన్నారెడ్డి న్యూయార్క్ లో ఉన్నాడు- కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్నాడని ఈమెకు తెలీదు గదా? ఎందుకంటే ఈమెకు పేపర్స్  చదివే అలవాటు లేదు గదా...? రాజకీయాల్ని పట్టించుకోదు గదా....? అంతదాకా ఎందుకండి? ఆమె పనిమనిషికట్టే జనతా వస్త్రాల వెనుక రాజకీయలుంటాయి - ఆమె ఇంటిమీద మున్సిపాలిటీ రాజకీయాలుంటాయి. ఆమె తిరిగే  వెహికల్  మీసా ఆర్.టి.ఓ,  ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ రాజకీయాలుంటాయి- ఆమెవాడే పంచదార, కాఫీ, టీ, నూనెలు, పచారీ  సామాన్ల మీద రాజకీయాలు నడుస్తాయి. కేంద్రరాష్ట్రప్రభుత్వాలు గట్టిచర్యలు  తీసుకుంటే ధరలు తగ్గుతాయి-కాని ప్రభుత్వాలు చర్య తీసుకోలేవు- ఎందుకంటే పారిశ్రామిక వేత్తలకి, సంపన్న వ్యాపార వర్గాలకి ప్రభుత్వాలకి మధ్యరాజకీయాలుంటాయి- వీటన్నింటిని వదిలేసి ఏమిటి వ్రాసేది....? ప్రేమా  ఆ ప్రేమలోనూ రాజకీయాలుంటాయి. వరలేసి ఏమిటి వ్రాసేది.....? ప్రేమా ఆ ప్రేమలోనూ రాజకీయాలుంటాయి. వరకట్నం నిషేధం చేసేది ఎవరు..... తిరిగి ప్రభుత్వాలే. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమికులకు ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సాహించాలి - కొన్ని రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నారు - అది  చేసేదెవరు....? పభుత్వాలు.... ఆ  ప్రభుత్వాల్ని నడిపేదెవరు....? పొలిటీషియన్స్..... ప్రజలు పీల్చేగాలి ప్రోల్యూషన్), తినే  తిండి (ధరలు), కట్టే బట్ట  (జౌలీ విధానం) ఉండే ఇల్లు ?(అర్బన్ లాండ్ సీలింగ్), హౌసింగ్ (ప్రాబ్లమ్), చేసే  ఉద్యోగం, చేపట్టే వృత్తి, జీవన విధానం  జీవన వ్యయం, పబ్లిక్  లైఫ్, ప్రయివేట్  లైఫ్ ప్రేమలు, పెళ్ళిళ్ళు, చావులు, పండగలు, పబ్బాలు, అన్నీ..... అన్నీ  రాజకీయాల మూలంగా ప్రభావిత మవుతాయి. నాకేం తెలీదు- నాకు గిట్టవు  అంటే  మాకూ  నీ రచనలు గిట్టవు తల్లి - మమ్మల్ని హింసించకు, మా మానాన మమ్మల్ని వదిలేయ్ మంటారు పాఠకులు-" ఆవేశంగా చెప్పుకుపోయాడు బ్రహ్మనందం.

    నీ వాదన బాగానే ఉంది- ముందు ఇంటర్వ్యూ చూడు" అన్నాడు దశరధ టీవీ కేసి చూస్తూ.

    "మీ అభిమాన రైటర్స్ ఎవరండి....?"

    "ఇంకా పుట్టలేదు"

    "ఇదిగో ఇందుకే నాకు మండేది-ఇంతోటి గొప్ప రచయిత్రిని ఇంప్రెస్ చేసే రచయితలే పుట్టలేదట. మహాకవి శ్రీశ్రీ, చలం, రాచకొండ, కాళీపట్నం, ముణిమాణిక్యం, లత, కొమ్మూరి వేణుగోపాలరావు, ముళ్ళపూడి, విశ్వనాధ వారు, బలివాడ, బీనాదేవి, ఆరుద్ర, దాశరధి, రామలక్ష్మి, మాలతీ చందూర్, కొడవటిగంటి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి.... ఎవరూ... వీళ్ళెవరూ.... ఈ మహారచయిత్రికి ఆనలేదు. అంధురాలు కాకపోతే.... అహంభావం కాకపోతే ఏమిటి.....? ఈమెకు అభిమాన రైటర్ కావటం కోసం ఇకపై కూడా ఎవరూ పుట్టరు..... అసలు పై వాళ్ళంతా పాపం ఈమెకు తెలుసో లేదో.....? వాళ్లూ గిట్టరంటుందేమో..... పోనీ ఈ కాలం  వాళ్ళు- యండమూరి, మల్లాది, కొమ్మనాపల్లి లాంటి వాళ్ళన్నా తెలుసా.....?" బ్రహ్మానందం ఈసడించుకున్నాడు.

    "టీవీ చూడరాబాబు" దశరధ కుసురుకుంటూ అన్నాడు.

    "ఒక స్త్రీగా మగవాడిపై మీ అభిప్రాయం......?"

    "రమ్మంటే చాలు.... లగెత్తుకు వస్తాడు...."

    "మరే.... ఈమె ఒక క్లియోపాత్రా  అని - హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని, ఎలిజిబెత్ టేలర్  అని, మార్లిన్ మాన్రో అని లగెత్తుకు వస్తారు. పురుషుడిపై అభిప్రాయ మడిగితే రమ్మనటం- లగెత్తుకు రావటం గురించి మాట్లాడుతుందేమిటి....? స్త్రీ రమ్మనటం దాని కోసమే అయినట్లు, పురుషుడు లాగెత్తుకు వస్తే అందుకోసమే అనే ఆలోచనలెలా వచ్చాయి....? అలాంటి ఆశలేం  పెట్టుకోకు తల్లి.... అలాంటి ప్రలోభాలకు లొంగని నిఖార్సయిన మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నయం ఈ మహాతల్లి వివేకానందస్వామి బ్రతికున్న రోజుల్లో ఓణిలేసుకోలేదు. లేదంటే ఆ మహానుభావుడ్ని కూడా ప్రపంచం అపార్ధం చేసుకొనేది. అసలు రమ్మనటం ఎందుకు....?వచ్చాక లగెత్తుకొచ్చాడని అనటం ఎందుకు....? అసలేం సమాదానాలు చెబుతుందో తెలిసే చెబుతోందా...."

    నిన్ను బాగుచేయటం నావల్ల కాదు" తల బాదుకున్నాడు దశరధ.

    "బాగు చేయలేనంతగా పాడయిపోయాను ఈ టీవీ ప్రోగ్రామ్స్ చూసి మీరలాంటి ప్రయత్నాలేమీ చేయకండి..."

    "ప్రస్తుత సాహిత్యంపై మీ అభిప్రాయం...."

    "నిజమైన  సాహిత్యం పత్రికల్లోనే ఉంది - పాఠ్యపుస్తకాల్లో లేదు. అయితే పత్రికల్లో సాహిత్యం వెర్రితలలు వేస్తోంది."

    "పాఠ్య పుస్తకాల్లో పాఠ్యంశాలుంటాయి తల్లి - సాహిత్య మెలా ఉంటుంది? గొప్ప సత్యాన్ని కనిపెట్టినట్లు చెప్పింది. సాహిత్యం వెర్రితలలు వేసే పత్రికల్లో ఈమెందుకో వ్రాయటం....?మరో వెర్రితలను మొలిపించటానికా.....?"

    "నీకు సమాధానం  చెప్పటం కష్టంరా బ్రహ్మానందం-" దశరధ విసిగి వేసారిపోయి అన్నాడు.

    "అభిమాన నటి ఎవరండి?"

    "శ్రీదేవి"

    "అభిమాన నటుడు?"

    "శ్రీదేవే...."

    "హతోస్మి.... ఈ మహాతల్లి శ్రీదేవికి పెళ్ళికాకుండా చేసేలా ఉంది. శ్రీదేవిణి అభిమాన నటుడ్ని కూడా చేసేస్తే శ్రీదేవి స్త్రీత్వం మీద అనుమానమొచ్చి పెళ్ళి కాకపోతే..... చావు తెలివితేటలు..... అవన్నీ టీవీలో ప్రదర్శించకు తల్లి.... నీకు కాస్త లూజేమన్నా ఉందనుకొనే ప్రమాదం ఉంటుంది...."

    "ప్యూచర్ లో మీ ప్లాన్సేమిటి....?"

    "మంచి రచయిత్రి ననిపించుకోవాలి"

    "ఆల రడీ మంచి రచయిత్రినని తనకు తనే ఫీలవుతూ ఇంకా అనిపించుకోవటం  ఎందుకు....? ఆల్ రడీ ఒక సంచికకే సంచలనం సృష్టించి కైంకర్యం  చేసుకొని ఇంకా అనిపించుకోవటం ఎందుకు? అసలంత ధైర్యం పాఠకులకు ఉండొద్దూ? చూసారా ఎక్కడన్నా పాఠకుల గురించి ప్రస్తావించిందేమో....? ఒక్క నవలకే స్టేట్ మెంట్స్ ఇచ్చేదాకా వచ్చిందంటే- రెండో నవలకి  రెండో ప్రపంచం యుద్ధాన్ని మరిపిస్తుందేమో..... పాపం.... టీవీ  ప్రేక్షకులు... వీళ్ళను ఆ భగవంతుడే కాపాడాలి....."

    "నీలాగే తెలుగు టీవీ ప్రేక్షకులు కూడా భగవంతుడు కూడా కాపాడలేని స్థితికి చేరుకున్నారు" దశరధ సర్ క్కాస్టిగ్గా అన్నాడు.

    "మరే.... మీలాంటి వాళ్లు టీవీ సీరియల్ ప్రొడ్యూసర్ అయితే అంతే గదా....? 1985-86లో ఆమోదం పొందిన సీరియల్స్ ఇంకా రాకపోతుంటే మీలాంటి డబ్బు, హంగు, ఆర్భాటం ఉన్నవాళ్ళు ఎక్స్ టెన్షన్స్ మీద ఎక్స్ టెన్షన్స్ తెచ్చుకుంటుంటే మంచి సీరియల్స్ ఎలా వస్తాయి.....? కొత్తవాళ్ళకి అవకాశాలెలా వస్తాయి?"

    "అంతా మాలాంటివాళ్ళ తప్పేనంటావా.....?"

    "ముమ్మాటికి"

    "1985-86;ప్ ఒకేసారి 90 స్క్రిప్ట్స్ ణి ఆమోదించారు దూరదర్శన్ వాళ్ళు. ఏం.... ఒక్కసారే  అన్నెందుకు ఆమోదించాలి? మరలా  ఛాన్స్ ఎక్కడ  ఎన్ని మార్పులొచ్చే అవకాశం ఉంది....? అప్పుడు పంజాబ్ ఇష్యూ ఎన్ని మలుపులు తిరుగుతుంది....? సమకాలీన సమాజం లోని చెడు ఎంత త్వరగా వెర్రి తలలు వేస్తోంది? కొత్త దారుల్ని వెతుక్కుంటుంది. కొంప మునిగిపోయినట్లుగా- ఆబగా అన్ని స్క్రిప్ట్స్ ణి ఎందుకు ఆమోదించాలి...! తుఫానొచ్చి రచయితలు, టెలీ సీరియల్  ప్రొడ్యూసర్స్ కొట్టుకుపోతారా? ఒక్కొక్క  ప్రొడక్షన్ కంపెనీవే మూడు నాలుగు స్క్రిప్ట్స్ ఆమోదించారు. స్క్రిప్ట్స్ సబ్ మిట్ చేసిన కంపెనీకి ఆర్ధిక బలం ఉందో లేదో.....వాళ్లు పెట్టుకున్న డైరెక్టర్ కి కనీసం క్లాప్ బోర్డంటే తెలుసో లేదో.... చూడకుండా.... వాళ్ళ  అర్హతల్ని, అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా కుప్పలు తెప్పలుగా ఆమోదించారు. ఇప్పుడు చేయగలిగిందేముంది....? వాళ్ళకెంత ధైర్యం లేకపోతే చెత్త స్క్రిప్ట్స్ ని అంగీకరిస్తారు.....? అందుకే చెత్త సీరియల్స్ వస్తున్నాయి. ఒక దశలో ఒక ఎపిసోడ్ కి (ప్రసార రుసుముతో సహా) తొంబై వేల దాకా స్పాన్సరర్స్ పే చేసేవాళ్లు. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షకు పెట్టే సీరియల్స్ రావటంతో స్పాన్సరర్స్ ఇంతోటి బోడి సీరియల్స్ కి తొంభై వేలెందుకని నలభై, నలభై ఐదుతో సరిపెట్టేస్తున్నారు. మరి కొంతమంది ఇలా అయితే మనకు గిట్టదనుకొని స్క్రిప్టుని బ్లాక్ లో ఆమ్మేసుకున్నారు సినిమా టిక్కెట్లలా - మొదట్లో పాతిక వేలకు దొరికిన స్క్రిప్టు ఇప్పుడు లక్షన్నర, రెండు లక్షలకు అమ్ముకుంటున్నారు. బినామీ పేర్ల మీద నడుస్తున్న భారీ వ్యాపారం. ఆ స్క్రిప్టు మీద టీవీ వాళ్ళకు శ్రద్ధలేదు- అప్రూవ్ చేయించుకున్న వాళ్ళకు శ్రద్ధలేదు - కాని డ్రామాలా  తీసే డమ్మీ ప్రొడ్యూసర్ కి శ్రద్ధ అసలే ఉండదు.

    ఆఫ్ట్రాల్ బస్ టిక్కెట్స్ మీద, రైల్వే టిక్కెట్స్ మీదే నాట్  ట్రాన్స్ ఫరబుల్ అని వ్రాస్తారే - మరి లక్షల రూపాయలు - కోట్ల మంది ప్రేక్షకులు- ఇన్ వాల్యు అయ్యే కథని అప్రూవ్ చేయించుకున్న వాళ్ళే నిర్మించాలని నిబంధన పెట్టలేరా....? దశరధ ధుమధుమలాడిపోయాడు.

    "అందుకేగా దూరదర్శన్ వాళ్లు అందరికే లోకువయిపోయింది. ఈ మధ్యవచ్చిన కమీషన్ కార్యక్రమాలను కూడా ఆశ్రితులకు, ఆర్థికంగా ఆడుకున్న వారికే ఇచ్చారట"

    "నిజమా.....?"

    "నా దగ్గర వేషాలేయకండి - మీరొక్కరే 20 లక్షల కమీషన్ కార్యక్రమాల్ని కొట్టేశారు - నాకు తెలీదనుకోకండి. ఇదన్యాయం. ఆ; రడీ సీరియల్స్ నిర్మించిన ప్రసారం కాని నిర్మాత లేమయిపోతారో.....?"

    "ఏం....? వాళ్ళకేమయింది.....?"

    "అదే చిరాకు నాకు - పాత సీరియల్స్ పునఃపరిశీలనలో పడ్డాయట ఎందుకని....? కొత్తవి ఎప్పుడు తీసుకుంటారు....? దాదాపు బెంగుళూరు, త్రివేండ్రం, మద్రాసు కేంద్రాల్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయట. ఏది  ఏమైనా హైదరాబాద్ అంత ఘోరం మాత్రం కాదు. అంతా గందరగోళం లంచాల మయం = సాక్షాత్తు కేంద్రప్రసారశాఖాల మంత్రి ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయమని అడిగినా లంచం అడిగేంత సమర్థులున్నా రిక్కడ. ఛీ..... ఛీ...." అంటూ బ్రహ్మానందం చిరాగ్గా లేచాడు.

    "అది సర్లేకాని..... హంపి విశేషాలేమిటి.....?" దశరధ కూల్ గా అడిగాడు.

    "విశేషాలేముంది....? క్రితం రాత్రంతా షూటింగ్ చేసి పైలట్ షూటింగ్  పార్ట్ ఫినిష్ చేసారు. ఈ రోజు ఎడిటింగ్ జరుగుతోంది. డబ్బింగ్, రీరికార్డింగ్, మిక్సింగ్ పూర్తి చేసి రెండు మూడు రోజుల్లోనే దూరదర్శన్ సబ్ మిట్ చేస్తుందట . అదలా ఉంచండి - నాకో కొత్త విషయం తెలిసింది. నిజమేనా!" అనడిగాడు బ్రహ్మానందం.

    "ఏమిటి.....?"

    "నీ తమ్ముడు - ఆ జయధీర్ - దాదాగంజ్ కలిసి పెద్ద పథకాన్ని తయారుచేసారట. ఎందుకయినా మంచిది మీరైనా ఆ వెధవల వెధవ పనికి దూరంగా ఉండండి. వీళ్ళ మీద ప్రభు అనే సి.బి.సి.ఐ.డి క్రైమ్స్ డి.ఎస్.పి నిఘా వేసాడట. అతనసలే కాలంతకుడట - నిప్పులాంటి ఆఫీసర్ అని తెలిసింది. దొరికారో నడిబజార్లో తాటవలిచేస్తాడు.

 Previous Page Next Page