Previous Page Next Page 
ఒక తీయని మాట పేజి 3

    వనజాక్షి తర్కం చంచాల్రావు అనుకూలంగా వుంది. అతడేంతో ఆనందిచాడు. తనచుట్టువున్న ఆడవాళ్ళంతా ఇదే తర్కాన్నుపయోగించి తననాహ్వినిస్తే బాగుండునని అతడనుకున్నాడు. అతడు తిరిగి వనజాక్షినీ దగ్గరగా తీసుకున్నాడు. ఆమె అభ్యంతర పెట్టలేదు. అంతవరకు స్త్రి స్పర్శ నాశించడమె తప్పు అనుభూతితో ఎరుగని  చంచాల్రావుకు  వళ్ళంతా జిల్లంటోంది అయితే వనజాక్షి  మాటల తడిల వివేకాన్ని హేచ్చరిస్తున్నాయి.
    సమాజానికి ఎదురుతిరగతానంటోంది నవజాక్షి ఆ ఉద్దేశ్యం అతడికి లేదు భర్తమీద కోపంతో వనజాక్షి  తననిచేరదీసి  ఆ విషయము  నలుగురికి చెప్పిందంటే- తన పరువుపోతుంది. అందుకే నెమ్మదిగా -" సమాజం తప్పన్నదే మనం చేయాలనుకుంటే ఈ సమాజంలో బ్రతకడం కష్టమవుతుంది-" అన్నాడతను.
    "నాకు  తెలుసు నేను సమాజానికి  ఎదురుతిరగాలను కుంటున్నాను. కానీ ఈ సమాజంలోనే నేను బ్రతకాలి అందుకని నేనేతప్పచేసినా రహస్యంగా చేయాలనుకుంటున్నాను...."అంది వనజాక్షి.
    ఈ ఒక్కమాట చంచల్రావుకి కెంతో బలానిచ్చింది. అతడు వెంటనే తనకు వచ్చిన అవకాశాన్నుపయోగించుకున్నాడు అది ఒక్కసారికాదు.
    వనజాక్షి తో పరిచయం  అనుభవం చంచాల్రావుకు వరంలా  లభంచింది ఏ పురుషుడిక్తేనా  ఇది అపూర్వమైన అవకాశం.
    నెలరోజుల్లో అతడామెకు అయిదుసార్లు కలుసుకున్నాడు. కలుసుకున్నది అయిదుసార్లేఅయినా వనజాక్షి కోసం అతడు  నెలలో మొప్పెరోజులూ ఎదురుచూశాడు. అతడి మనసు వనజాక్షి ఆలోచనలతో  నిండిపోయింది.
    ఆరవసారి అతడు వనజాక్షి నీ కలుసుకున్నప్పడామె అతడితో-" నేను నీకు నన్నునేనుగా అర్పించుకున్నాను. అందుకుకారణం తెలుసా?" అంది.
    చంచల్రావు తల అడ్డంగా వూపాడు.
    "ఆడది మగాడి జీవితానికి వరం ఆ విషయం నీకు తెలియాలని!" అంది వనజాక్షి.
    "థాంక్స్-నువ్వుచెప్పింది నిజం!" అన్నాడు  చంచల్రావు.
    "ఒక్కనెలలో నువ్వీ నిజం ఒప్పకున్నావు. పెళ్ళే అయిదేళ్ళయినా మా ఆయన ఈనిజం గ్రహించడంలేదు..."
    చంచల్రావు నిట్టూర్చి- "అతడు మూర్ఖుడు "అన్నాడు.
    "నువ్వలాగని వూరుకుంటే నాకేంలాభం? అతడి  మూర్ఖత్వంవల్ల నేను నష్టపోతున్నాను...." అంది వనజాక్షి.
    "ఇందులో నేనేం చేయగలను?"
    "డబ్బులో , బలంలో స్త్రి మనసునర్ధంచేసుకొనడంలో నువ్వు నా భర్తకంటే అధికుడివి- అతడికి నువ్వే బుద్దిచెప్పాలి....."
    "ఎలా?"
    "ఆయన తాగివచ్చి నన్ను తంతాడు నేను కేకలు పెడతాను. మీ యింట్లోంచి నువ్వురా. ఆవేశపడు ఆయన్ను  నాలుగుథాన్ని వెళ్ళు అమానుషంగా ప్రవర్తిస్తే మళ్ళి తంతానని బెదిరించు...."అంది వనజాక్షి.
    చంచల్రావు వ్యాపారస్దుడి కొడుకు. బియ్యేపాసయ్యాడు ఉద్యోగం చేయదు. వ్యాపారంపనులుకూడాచూడడు. ఇంకా కుర్రాడుకదా కొన్నాళ్ళూరి కామిగా తిరగనివ్వమని అతడిగురించి తండ్రికి తల్లి సిపారసు చేసింది అందుకని అతడు రికామీగా తిరుగుతున్నాడు.
    వనజాక్షి  భర్త సామాన్యపు గుమస్తా- అతడిని చంచల్రావేదైనా చెస్తే- చంచల్రావుకు పెద్ద ఇబ్బంది లేదు కానీ-
    "ఎందుకు?" అన్నాడు చంచల్రావు.
    "నా కోసం!" అంది వనజాక్షి.
    "అంటే?"
    "నా భర్తకు బుద్దిచేబుతావన్న ఆశతోనే నేను నిన్ను ఆహ్వానించాను. నేను నికిచ్చినదానికి ప్రతిఫలంగా నాకి నరకంనుంచి విముక్తి చూపిస్తావని నమ్ముతున్నాను...." అంది వనజాక్షి.
    "అదంత సులభమా?"
    "సులభమే! నా భర్త పిరికివాడు ఈ ప్రపంచంలో అందరికిఆయన భయపడతాడు భార్యనుకాబట్టి నేనంటే లోకువ కానీ- ఆడవాల్లన్నా ఆయనకు భయమె ఒక్కసారి నువ్వు బెదిరించావంటే ఈ జన్మలో మళ్ళి నా జోలికిరాడు....."
    "అయనచేసే ఉద్యోగానికి తాగడానికి డబ్బెక్కడిది?" అన్నాడు చంచల్రావు.
    "లంచాలుచ్చుకుంటాడు ఒకోసారి పార్టిలు తాగిస్తారు. ఆ తాగుడు మైకంలో ఆయనకు వళ్ళు తెలియదు....."
    "తాగినప్పుడు బాగానే ఉంటాడా?"
    "ఉండడు అస్తమానం తిడుతూంటాడు...."
    "నువ్వూరుకుంటావా?"
    "ఊరుకోకపోతే చెయ్యిచేసుకుంటాడు....."
    చంచల్రావుకి ఆమె అంటే జాలివేసి-" నువ్వు ఎదురు తిరగాలి అప్పడే ఏదైనా ప్రయోజనముంటుంది-" అన్నాడు.
    "ఎదురుతిరగడానికి బలంకావాలి అందుకే ఒక్కసారి మా వ్యవహారంలో కలగజేసుకొమంటున్నాను-"
    "అంటే?"
    "నామీద జాలిపడే మగాళ్ళున్నట్లు ఆయనకుతెలియాలి. అప్పడయన భయపడతాడు-"
    "ఏమని?"
    "నెను లేచిపోతానని....." అని నవ్వింది  వనజాక్షి ఆమె నవ్వులో వుత్సాహంలేదు అసలు జివమేలేదు.
    "నీ ఉద్దేశ్యం నాకర్ధమయింది కానీ మనిష్యుల్ని కొట్టడం నావల్లకాదు" అన్నాడు చంచల్రావు.
    "నాకోసం...." అంది వనజాక్షి.
    "నీక్కావాలంటే డబ్బిస్తాను...." అన్నాడు చంచల్ర్రావు.
    "డబ్బెందుకు!"
    "ఏ రౌడిలకయినా యిచ్చి నీ మొగుణ్ణి కొట్టించు...."

 Previous Page Next Page