Previous Page Next Page 
హనీమూన్ పేజి 3


    "మా ప్రేమాద్ డియర్! మన సంగతంతా ఆమెకు తెలుసులే__ఏం ఫర్వాలేదు!__"

    నాకేం మాట్లాడాలో తెలీడంలేదు. అయోమయంగా  సారధి వేపు చూశాను.

    "ఏమిటి కన్ ప్యూజన్?" అడిగాడు వాడు నా అవస్థ కనిపెట్టి

    "మరేంలేదు__ఎఅవరో పిల్ల  ఫోన్లోకొచ్చి "హల్లో డియర్ " అంటోంది___"

    "అదా-" తేలిగ్గా అన్నాడువాడు. "ఇది ర్తేల్వేలో  కర్టేని విక్ లే! ఈ వారమంతా వాళ్ళు ప్రయాణికులతో చాలా మర్యాదగా  ప్రవర్తిస్తారు. ప్రేమగా మాట్లాడతారు. అంచేత  అది సహజమే! ఇలా ఎంక్వయిరికి ఫోన్ చేసే వారందరిని 'డియర్ ' అనాలని వాళ్ళకి  ర్తేల్వేబోర్డ్  నుంచి ఇన్  స్తక్షన్స్  వచ్చి ఉంటేయ్."

    ఆ మాట నిజమేనేమో ననిపించింది నాకు.

    "మీ కర్టేసికి  చాలా ధాంక్స్ !" అన్నాను ఆ అమ్మాయితో.

    "అలా టైమ్ వేస్త చేయకు డియర్ ! త్వరగా  రా  ఇక్కడకు, సినిమా టైమయిపోతోంది."

    నేను మళ్ళి కంగారుగా సారధివేపు చూశాను.

    "ఇదేమిట్రా? ర్తేల్వేవాళ్ళు కర్టేసి విక్  లో ప్రయాణికులను సినిమా లకు కూడా తిసుకేల్తారా?"

    వాడు ఓ క్షణం ఆలోచించాడు.

    "ఇంతకు ముందుయితే ఆ పద్ధతి  లేదుగాని ఇప్పుడు ప్తేవేట్  బస్ ల వాళ్లతో పోటి  పెరిగిపోతోందికదా! అంచేత కొత్తగా ఈ సిస్టమ్ ప్రవేశపెట్టి ఉండవచ్చు!" అన్నాడు.

    పేపర్లో ఓ వార్తలో మునిగిపోయిన ప్లీడర్ గారు హఠాత్తుగా అరచారు.

    "అందాకా ఎందుకు ? తమిళనాడు సంగాతేమిటి? ఎమ్జి ఆర్  గవర్నమెంటే  రాష్టంలో బంద్ చేయించింది! ప్రభుత్వమే బంద్ లు చేసి ప్రజా జీవితాన్ని స్తంభింపజేసే  సంఘటన  ప్రపంచంలో  ఇంకెక్కడా జరగలే దింతవరకూ."

    నేను చప్పన మళ్ళి ఫోన్లో  మాట్లడేయసాగాను.

    "హలో-మీ ఆఫర్ కి చాలా ధాంక్స్  మేడమ్!" అన్నాడు పోల్తేట్ గా .

    "రాజ్! జోక్  చేయడం  చాలిక! వెంటనే వస్తున్నావా లేదా? అవతల సినిమాకి టైమయిపోతోంది."

    నాకు చిరాకు పుట్టుకొచ్చింది. ఎంత "కర్టేసివిక్ " అయినా ఇలా బాలవంతంగా, డబాయించి సినిమాకు రమ్మంటే ఎలా?

    "నేన్రాను "అన్నాను  కోపం అణచుకుంటూ.

    "ఎందుకని?" ఆశ్చర్యంగా  అడిగిందామె.

    "నాకిష్టంలేదు! ఇంక ఈ సినిమా గొడవ  ఆపేసి  నాక్కావలసిన ఇన్ ఫర్మేషన్  ఇవ్వండి."

    "అవును?"

    "ఏమిటది రాజ్ ?"

    "నా పేరు రాజ్ కాదు! ఇమకోసారి ఆ పేరుతో పిలిచారంటే బాగుండదు."

    "మీ పేరు రాజ్ కాదా?"

    "ఏమాత్రం కాదు."

    "మ్తేగాడ్."

    "నా పేరు అదికూడా కాదు. అసలు మీరు మాట్లాడేది ర్తేల్వే  ఎంక్వయిరిస్ నుంచేనా?" అనుమానంగా అడిగాను.

    "మ్తేగాద్ -ఇది  వర్కింగ్  ఉమెన్ హాస్టల్."

    "అయితే ఫోన్ పెట్టేయండి! రాంగ్ నంబర్."

    ఆమె  ఫోన్ డిస్కనెక్ట్  చేసేసింది. ఈసారి జాగ్రత్తగా ర్తేల్వే  ఎంక్వయిరీస్ కి రింగ్  అవలేదుగాని హఠాత్తుగా  ఎవరో ఇద్దరు మాట్లాడుకోవటం వినిపించసాగింది ఫోన్లో.

    "....చింతపండూ అంతే ధర పెరిగిపోయింది?"

    "పెరిగిపోయిందా?"

    "రెండు రెట్లు!"

    "నీ దగ్గర స్టాకేంతుంది?"

    "వుద్దరు."

    "వుద్దరా-తివురుండాలిగా."

    "తివురు లేదు, ఉద్దరే."

    "మిరపకాయలు."

    "భాగ్దరు."

    "భద్గారా- అబ్బబెల్లం?"

    "చబ్బారు."

    "అబ్బ?"

    నాకు విసుగేసు కొచ్చింది "హలో" అన్నాను కల్పించుకుంటూ.

    "ఎవరిది హలో  అంది?" అంది ఓ గొంతు

    "ఎవరో మాట్లాడినట్లుంది."

    "మధ్యలో ఇంకొకరు ఎలా మాట్లాడగలరు?"

    "ఏమోమరి? 'హలో' అని వినిపించింది."

    "హలో" అన్నాను నేను మళ్ళి.

    "అగో-చూశావా! మళ్ళి హలో అంటున్నా  డేవడో."

    "ఎవడాడు?"

    "ఏమో-దొంగనాయాలు! మధ్యలో వచ్చ్సిండే కాకుండా ప్తెగా  'హలో హలో' అంటున్నాడు."

    "ఇలాంటి వెధవలేక్కవాయి పోయారి మధ్య! మొన్న మా ఆవిడతో బ్లాక్ మని నూతిగట్టుకింద తవ్వి పెట్టమని రహస్యంగా చెప్తోన్నప్పుడు  కూడా 'హలో' అన్నాడేవాడో."

 Previous Page Next Page