పెరట్లో బాదం చెట్టుకింద చప్టామీద కూర్చుని అంట్లు తోముతున్న పనిపిల్లతో లోకాభిరామాయణం మాట్లాడుతూన్నాడు పరంధామయ్య.
"పొండి బాబుగారు -ఇల్లాంటి విషయాలన్నీ మీ కెందుకు?" ముసి ముసిగా నవ్వూతూ అంది గంగి.
"చెప్పవే ...నా దగ్గిర నీకు సిగ్గేమిటి?" బట్టతల సవరించుకొంటూ అడిగేడు.
బాల్చిలో నిళ్ళుతిసి మీద జల్లుతూ_ "ఎల్లహే__" అంటూ కడిగిన గిన్నెలు లోపల పెట్టటాన్కి లేచి "మొహం చూడండి మొహం_ యబ్తే ఏళ్ళూస్తున్నా ఇంకా చిన్నపిల్లాడిలా ఏటా పెశ్నలూ" అని దీర్ఘం తీస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
పరంధామయ్య అదేదో పెద్ద సరసంలా తనలో తను నవ్వుకొని లోపలికి వస్తూ-రిటైర్టు తాలూకాఫిను గుమాస్తా పరంధామయ్య అయిపోయి_ గామ్భ్ర్యాన్ని నింపుకొని "అమ్మాయ్- నేనలా బ్తేటికి వెళ్ళొస్తాను- తళుపెసుకో" అన్నాడు.
బ్రతికే అరవ్తే ఏళ్ళ జీవితంలోనూ సాధ్యమ్తెనన్నీ అనుభవాల్ని పిండుకోవాలని మనుష్యలు చేసుకొనే ఆత్మవంచన చాలా అందంగా వుంటుంది. తను గెల్చిన కాలేజి అమ్మాయిలూ, తలుపుచాటు స్త్రీలూ, పని మనుషూలు - అందరూ తన జీవనయాత్రలో మజిలిలని, తను బాటసారినని అనికొని గర్వపడే బాపతు మనిషి పరంధామయ్య.
"చీకటి పడుతుంటే ఎక్కడికి నాన్నా?" అడిగింది సిత.
"ఇంట్లో ఏవీంతోచటంలేదమ్మా, అలా బజారుదాకా వెళ్ళొస్తాను -" అన్నాడు. పనిపిల్లతో మాట్లాడేటప్పుడు వున్న లేకితనం ఇప్పుడు లేదు.
"మేం సినిమాకి వెళుతున్నాం నాన్నా!" అంది సిత. "ప్రొద్దున చెప్పెను జ్ఞాపకం వుందా?"
పరంధామయ్య తాలూపేడు.
5
"పేరు బావుంది" నవ్వూతూ అంది సుజాత "మరి పెళ్ళి చేసుకోవటానికి ఏమిటలస్యం?"
ప్రకాశం మాట్లాడలేదు సుజాత అతనివ్తేపు చూసింది. జవాబు చెప్పవలసిన బాధ్యత తనమీద ఉన్నట్టు గ్రహించి "ఏవి లేదు. మొన్ననేగా ఉద్యోగం దొరికింది" చెప్పాడు.
"కొంచెం నిలదొక్కుకోవాలన్న మాట" అంది నవ్వి.
నిజమే ననిపించింది ప్రకాశానికి తన మామయ్యా రిటైరయ్యే సమయానికి తనకి ఉద్యోగం రాకపోవటం. దొరికిన టెంపరరీ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతయో అని దినం దినం భయపడటం_ అంతా వరుసగా జ్ఞాపకం వచ్చాయి అతడికి.
"మీ ముగ్గురమే" చెప్పాడు .
"ఆ అనుభవం బావుంటుంది కదూ."
"ఏది?"
"పెళ్ళి కాకుండా ఒకే ఇంట్లో వుండటం ....చిలిపి చిలిపి సరసాలూ..." నవ్వింది.
ప్రకాశం మాట్లాడలేదు. సుజాత కొంచెం ఎక్కువ చనువు తిసుకుంటుందేమో అనిపించింది.
"మన వాళ్ళేవారయిన కనబడుతూ వుంటారా" ఆమె అడిగింది మళ్ళి.
ఊళ్ళో ఎవరూ కనబడరూ చాల మంది మన ఊళ్లోనే కనడుతూ వుంటారు.
"ఇంకా 'మన' ఏమిటి?" అంది.
ప్రకాశం నవ్వేడు-మొట్ట మొదటిసారిగా అతని ధ్రిల్ కొంచెం తగ్గింది. "ఇప్పటివరకూ అంతా నా గుంరిచే చెప్పాను.... మరి...." అర్దోక్తిలోనే ఆపుచేశాడు.
నవ్వింది. "ఏముంది... పరీక్షా రిజల్ట్సు కూడా రాకముందే పెళ్ళయిపోయింది. ఆయన దివూరే, నాలుగేళ్ళనుంచి ఈ వూళ్ళోనే వుంటున్నాను...."
"ఆయనేం పని చేస్తుంటారు?"
"బిజినెస్."
ప్రొద్దున్నుంచి సాయంత్రం వరకూ వర్తకులతోనే వ్యవహరించే ఉద్యోగం అతనిది. అందుకని వెంటనే అడిగేడు "పేరు_"
స్టీరింగ్ పక్కకి తిప్పి రిక్షాని ఓవర్ టెక్ చేస్తూ చెప్పైద్మి 'మాణిక్యాలరావు..."
పక్కలో బాంబు పడ్డాట్టు అదిరిపడ్డాడు ప్రకాశం.
నల్లగా, ఎత్తుగా, మొహం మీద వికృతంగా స్పోటకమచ్చలతో చేతులకు రవ్వల ఉంగారాల్తో... ఎప్పడూ వదులయిన గ్లాస్కో లాల్చీ చేసుకొని తన ఆఫీసుకొచ్చే బిజినెస్ మాగ్నెట్ మాణిక్యాలతావుని తన పక్కన కూర్చోన కూఒర్చొన్న ఈ లేత తమలపాకులాంటి అమ్మాయి భర్తగా ఊహించటానికి విఫలప్రయత్నం చేయసాగాడు.
6
"దిసీజ్ నాన్సెన్స్..." అన్నాడు విస్సుగ్గా మాణిక్యాలరావు.
కుమార్ మాట్లాడలేదు.
"మనం మొత్తం ఎంత ఎక్కువ కట్టవలసి వుంటుంది.