"పాట పాడడానికి సందు లేకుండా గొంతుదాక తినిపించారండి! ఇప్పుడు పాటే కాదు, మాటకూడా రాదు!" ఆయాసంతో అంది అఖిల.
"అయితే రేపు పాట పాడాకే ఇక్కడి నుండి పంపిస్తాను!"
]
ఆవిడ అన్నట్టుగానే ఉదయం, అఖిల పాడందే వదలలేదు!
"సరోజ దళనేత్రి హిమగిరి పుత్రి...." శంకరాభరణం రాగంలో శ్యామశాస్త్రి గారి కీర్తన పాడింది అఖిల.
"త్రిపుర పాడుతున్నట్టుగా, త్రిపురని చూస్తున్నాట్టుగా ఉంది?" యశోదమ్మ గాకస్మృతుల మధ్య కూరుకుపోయినట్టుగా బరువ్తెనస్వరంతో అంది.
"శ్రుతి లేకుండా పాడితే అంత బాగా రాదండి పాట!" తన పాట తృప్తి లేనట్టుగా అంది అఖిల.
"లక్ష్మి, సరస్వతి, పార్వతి- ఈ ముగ్గురి అంశాల్ని కలబోసుకు పుట్టినట్టుగా ఉండేది అత్త త్రిపుర! తనే గనుక కొంచెం మంచి నిర్ణయం తీసుకుని ఉంటే నేనూ మీ తాతగారూ వంటరి పక్షుల్లా అల్లాడి పోయే వాళ్ళం కాదు! విదేశాలు పట్టుకుపోకుండా త్రిపుర వాడిని బంధం వేసి ఆపేది!"
"మా అత్తయ్య మంచి నిర్ణయం తిసుకోలేధంటారా?" మేనత్తమీద నేరారోపణ జరగడం సహించలేక పోతున్నట్టుగా అడిగింది అఖిల.
"మంచి నిర్ణయంకాదని ఖచ్చితంగా చెబుతాను! మళ్ళి చేసుకొన్నది ఏ పేచి లేకుండా వాడితో కాపురం చేస్తూంది! త్రిపురే కొంచెం రాజీపడితే రెండు జీవితాలు చేరోదారిన నడిచేవికాదు! వాడికేమ్తెంది? మగవాడు! మళ్ళి పెళ్ళి చేసుకొని సుఖపడుతున్నాడు. అన్యాయమ్తె పోయింది తనే కదా?"
"కొంచెం రాజీపడడం అంటే తన ఆత్మ గౌరవాన్ని పణం పెట్టడమన్నమాట! సదాచారవంతుల ఇంటవిలక్షణంగా పెరిగిన ఒక ఆడపిల్ల ఒక త్రాగుబోతును, స్త్రి వ్యసన పరుడిని, తిరుగుబోతూనూ ఎలా సహిస్తుంది చెప్పండి! అదేం చిన్న విషయం కాదు! సంప్రదాయ కుటుంబంలో పిట్టి చాలా విప్లవకారమ్తెన నిర్ణయం తీసుకొని వంటరి జీవితాన్ని ద్తేర్యంగా వరించిన మా అత్తయ్య అంటే నాకు చెప్పలేనంత ఇష్టం, ఆరాధన! మగవాదేంత చెడ్డవాడ్తేనా, అతడి పాద పద్మలచెంతే తన చోటన్న తర తరాల స్త్రి బ్రాంతిని ధిక్కరించి, తన జీవితం తనదేనని చెప్పింది మా అత్తయ్య.
"కానీ, ఏం బావుకుందని నా ప్రశ్న!"
"తనకిష్టం లేకుండా తన జీవితాన్ని ఎవరి పాదాలవద్ద పరుచలెదన్న తృప్తి చాలు!" పదిలంగా ఉన్న తన ఆత్మ గౌరవం చాలు!"
అజిత్ ఇంత సేపటినుండి చేతులు కట్టుకొని గుమ్మంలో నిలబడి ఉన్నాడు. ఇక ఊరుకోలేక పోతున్నాట్టుగా అన్నాడు! "మా నాన్నగారిని చాలా నీచంగా చిత్రిస్తున్నావు అఖిలా! మీ అత్తయ్యకికూడా అంత నీచమైన అభిప్రాయం ఉందోలేదో ఆయన మీద! మా అమ్మగారూ కూడా మర్యాదాస్తుల ఇంటి నుండే వచ్చింది. విద్యావంతురాలు! న్తెతికవిలువలకు జీవితంలో ప్రాధాన్యత ఇచ్చేమనిషి! పాతికేళ్ళ వ్తె వాహిక జీవితంలో భర్త నిచుడుగా, హినుడుగా కనిపించిన క్షణం రాలేదనుకుంటాను ఆవిడకు! ఒక స్త్రీకి గౌరవనీయుడుగా కనిపించే మనిషే మరోస్త్రీకి హినుడిగా, నిచుడిగా కనిపించాడంటే ఆశ్చర్యంగా లేదూ?"
"ఆశ్చర్యం ఏముంది? అది స్త్రీల మధ్య ఉన్న వ్యత్యాసం! మా అత్తసనాతనా ఆచారవంతుల ఇంట పుట్టి పెరిగిన మనిషి, త్రాగడం, తినడం, పరస్త్రీలతో గడపడం నాగరికతగా భావించే సమాజంలో పెరిగింది మీ అమ్మగారు! మీ అమ్మగారి లాంటి వాళ్ళకే సరిపోయే మనిషి ఆయన! మా అత్త అలాంటి వాళ్ళ గాలి కూడా సహించలేదు!" అఖిల పెదవి విరుపులో తొంగి చూసిన వేటకారానికి అజిత్ ఒళ్ళంతా కారం రాచుకోన్నట్టుగా అయింది.
తాము సదాచారవంతులం అని ఈ అమ్మాయికి ఎంతగర్వం !
మనిషి విలువ ఆచారాల్లో, అనుష్ఠానాల్లో ఉంటుందా?
తరతరాలుగా వస్తూన్న మత విశ్వాసాలను గుడ్డిగా విశ్వసించ కుండా, కులాచారాలను గోర్రెలా అనుకరించకుండా నాన్నగారు తన స్వంత వ్యక్తిత్వంతో తన మనసుకు తోచిన సిద్దాంతాలను ఏర్పరచు కొన్నారు. తనకిష్టమైన పద్ధతిలో జీవితాన్ని సాగిస్తున్నారు! అది సదాచారవంతుల దృష్టిలో 'విశృంఖలత' కాబోలు!
"కులం, మతం, ఆచారం- అని తమ చుట్టూ గిరిగిచుకొనేవాళ్ళకి, బావిలోకప్పకి తేడా లేదంటాను! రండి ఇవతలికి నువ్వు, మీ అత్త! ఇవతలకూడా ప్రపంచముంది! ఇవతలకూడా మనుషులున్నారు! చూడధలుచుకుంటే చూడొచ్చు!" కొంచెం ఆవేశంతో అన్నాడు అజిత్.
"మీతోపాటు మేమూ భ్రష్టులమ్తెతే తప్ప, మీకు సంతోషం కలుగనట్టుంది! మేం మీలో కలుస్తామని ఎప్పాడూ భ్రమపడవద్దు!" అఖిల పెళుసుగా అని లేచింది. "మీ ఆతిథ్యానికి కృతజ్ఞతలు, మమ్మగారూ! ఇక వెడతాం!"
"అయితే ఫలహారం వద్దుగాని, భోజనమే చేసి వెళ్ళండమ్మా! మీరు ఏదో ఒకటి తినకుండా పరగడుపున మాత్రం వెళ్ళనివ్వను!"
ఈసారి అభ్యంతరం నీరజ నుండి వచ్చింది! ఆదివారం ఉతుక్కో వచ్చని వారం రోజుల నుండి వదిలేశాం! వెళ్ళి సర్దుకోవాలిప్పుడు!"
"ఎంతసేపు సర్దుకోంటారామ్మా? భోజనం చేసి వెళ్ళాక సర్దుకోవచ్చు మీరు మంచి పిల్లలు ఈ ముసలిదాని కోరిక కాదనకండి"
నీరజ అఖిల ముఖంలోకి చూసింది. అఖిల అయిష్టంగా ముఖం త్రిప్పకోంది.
"మీరు బాధపడతారని, లేకపోతే చాలా పనుంది. మామ్మగారు!"
మీరు ఇంకేం మాట్లాడొద్దు! మీ భోజనం ఇక్కడే! మీకు స్నానాల ఏర్పాటు చూస్తాను" యశోదమ్మ ఉత్సాహంగా వెళ్ళింది.
"నాయనమ్మకి హఠాత్తుగా ఇరవయ్యేళ్ళ వయసు తగ్గిపోయినట్టుగా ఉంది" అనుకొన్నాడు అజిత్.
తరువాత అజిత్ తనగదిలోకి వచ్చాడు.