Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 37

    అరగంట తరువాత ఆయసపడుతూనే  హడావిడిగా వచ్చింది యశోదమ్మ.  "ఆడపిల్లల్ని ఊరికే ఎలా  పంపిచాను? నువ్వు కాస్త బజారుకు వెళ్ళాలిరా.  రెండు జాకెట్ గుడ్డలు, పూలూ,  పళ్లు  తీసుకురా?"

    "ఇప్పడవన్ని  ఎందుకు నాయనమ్మ?   ఆ నీరజ  బలవంతానికి వచ్చింది నీ మేనకోడలి మేనకోడలు!  వచ్చినప్పటి నుండి చూస్తున్నాగా?  ఏదో పరమశత్రువు  ఇంట  పాదం మెపినట్టుగా చిటపటలాడిపోతోంది.  ఆ అమ్మాయిలో  చదువుకొన్న సంస్కారం  ఎక్కడా  కనిపించడం లేదు నాకు!"

    ఏదో చిన్నపిల్ల.  పోనీలేరా.  ఆ పిల్ల ఎలాఉంటే మనకేంగాని ఆడ పిల్లల్ని  ఊరికే పంపించడానికి  నాకు మనసు కుదరడం లేదు.  నువ్వు తిసుకురానంటే కొంతడబ్బు  చేతిలో పెట్టి జాకెట్ గుడ్డలు కొనుక్కోమని చెబుతాను.

    అజిత్  మారుమాట లేకుండా  పర్సు జేబులో పెట్టుకొని బయల్దేరాడు.

    ప్రక్కింటి  ముత్తయిదువను పిలిచి,  కుంకుమతోపాటు జాకెట్ గుడ్డలు ఇప్పిస్తుంటే  అజిత్  తీసుకువచ్చినంత  సులభంగా తీసుకోలేదు ఆ పిల్లలు.

    "సందర్భం  లేకుండా ఈ జాకెట్ గుడ్డలేందుకు మామ్మగారు? వద్దు.  వర్షంలో  నిలబడ్డ మమ్మల్ని  మీ మనుమడు దేవుడిలా  రక్షించి తీసుకు వచ్చాడు చాలు.  దానికే  మేం ఎంతో  కృతజ్ఞూలమ్తె  ఉంటాము.  అనుకోకుండా వచ్చి మిమ్మల్ని శ్రమపెట్టిచ దానికే మేం ఎంతో ఇదౌతున్నాం!  మళ్లి మాకు ఈ బరువు  పెట్టొద్దు!"  మృదువుగా అభ్యంతర  పెట్టింది నీరజ.

    "శ్రమపెట్టాం.  శ్రమపెట్టాం అని నాలుగు సార్లు  అంటావేమిటి అమ్మాయ్?  మీరు  నా ఇంటికి  రావడం  లక్ష్మి,   సరస్వతులు వచ్చినంత సంతోషంగా వుంది!  అఖిలను చూస్తుంటే  మా త్రిపురని  చూసినట్టుగా  వుంది.  రక్త సంబంధాన్ని  చూసి  ఎన్నేళ్ళయిందో"  డగ్గుత్తికతో అంది.

    జాకెట్ గుడ్డలు పట్టుకొన్న  ముత్తయిదువ!  "పెద్దమనిషి!  ఆమె మనసు ఎందుకు కష్ట పెడతారు?  లక్షణంగా  కుంకుమ పెట్టి ఇచ్చేది ఎద్తేనా కాదనకూడదు.  తీసుకోండి పిల్లలూ"  అంది.

    "మాకు చాలా పెద్ద బరువు పెడుతున్నారు!"   తీసుకోక తప్పధన్నట్టుగా  అఖిల వంక చూసి తను చేతులు చాచింది.

    "బరువనుకొంటే  మరోసారి  మా ఇంటికి వచ్చిభోంచేసి ఆ బరువు దింపుకువెళ్ళండి"  యశోదమ్మ సంతృప్తిగా  అంది.  "బాబూ!  కారులో వాళ్ళని ఇంటిదగ్గర దింపిరా!"  అని మనుమడికి పురమాయించింది.

    "మళ్ళి ఈ మర్యాద కూడానా?  మేం బస్సులో  వెళ్ళిపోగలం"

    "ఫర్వాలేదమ్మా!  కారుందిగా  దింపి వస్తాడు!"

    "ఇది తప్పదన్నమాట!   అయితే,  త్వరగా  బయల్దేరండి,  అజిత్ బాబూ!"

    "నాదేం ఆలస్యం లేదు.  పైకి వెళ్ళి  కిస్ తిసుకొని   వచ్చేయడమే!"

    ఇరవై  నిమిషాలు తరువాత,

    నీరజ చూపించిన ఇంటిముందు కారాపాడు అజిత్,  అఖిల,  నీరజ దిగగానే "నేనిక వస్తాను!" అన్నాడు అజిత్.

    "ఇంటిదాకా  వచ్చి ఇంట్లోకి రాకుండా వేడతారా!"

    "మరోసారి వస్తాలేండి!"

    "మరోసారి ఎందుకు వస్తారు?"

    నిజమే!  మళ్ళి ఎందుకు వస్తాను?"  తనకితను చెప్పకోంటున్నట్టుగా  అని దిగాడు.

    నిరజకు పిన్ని వరుస్తేన ఆవిడ బయటికి వచ్చిందప్పడే!  ఈ పిల్లలు  నిన్నంతా ఇంటికి రాకుండా వెళ్ళి ఇప్పుడు ఎవరో అపరిచితుడ్తెన  యువకుడితో  కారు దిగుతూంటే,  నోరు వెళ్ళ బెట్టి ఆశ్చర్యంగా,  అనుమానంగా చూసిందావిడ.

    ఆవిడ చూపులు ముళ్ళలా గ్రుచ్చుతూంటే,  ముఖానికి నవ్వు పులుముకొని  చెప్పింది నీరజ.  "ఈ యన  మన  అఖిలకి కావలసినవాడు,  పిన్ని! నిన్న బస్సులు స్ట్రయిక్ కదా? నిన్న కాలేజి వదిలాక  ఇంటికి  వద్దామంటే  ఆటోగాని,  రిక్షాగాని  దొరకలేదు! వర్షం మొదల్తెంది.  దిక్కుతోచక చెట్టుక్రింద  నిలబడ్డాం!  ఈయన  దేవుడిలా వచ్చారు!  రాత్రి వాళ్ళింటికి తీసికెళ్ళిరు. వాళ్ళ నాయనమ్మగారు  మమ్మల్ని  ఎంత  బాగా చూసిందని!"

    "అఖిలకి కావలసినవాడా?  ఎలా కావలసినవాడు?"  ఆవిడ ఇంకా అనుమానంగా  చూడడం  మానలేదు.

    "తరువాత చెబుతాను, పిన్ని!"

    అఖిల అప్పటికె  తమ గది తలుపులు తిసి లోపలికి వెళ్ళింది.

    కుర్చిలో,  మంచం మీదా అడ్డదిడ్డంగా వేసిన చీరలు గబగబా తీస్తూ అంది అఖిల.  "ఇంటికి  అతిధిని  పిలిముందు ఇల్లుఎలా  వుందో"  చూచుకొనక్కరలేదూ?  ఆయన్ని  ఈ చీరలమీదకూర్చోబెట్టేలా ఉన్నావు"

    "రండి,  అజిత్ బాబూ!"   బయట సందేహంగా ఆగిపోయిన  అజిత్ పిలిచింది నీరజ.  "ఎక్కడ తల  వంచక పోయినా ఇక్కడ  తలవంచి తీరాల్సిందే!  తలోంచుకురండి"

    నీరజ మాట పూర్తి  కాక  ముందే.  పై గడప అజిత్ నుదుటికి ఠపిమని   కొట్టుకుంది.  "అబ్బా"   అని తలపట్టుకొన్నాడు.  అప్పుడు గాని అర్ధంకాలేదు నీరజ మాటలు!

    "అయ్యో!  చెప్పినా దెబ్బ తగిలించుకొన్నారే!  మిరాపోడుగు  మనుషులు! గుమ్మామా పొట్టిది!   అందుకే  చెప్పాను 'తలోంచుకోండి' అని!"

    "దెబ్బ తగిలాకగాని అర్ధంకాలేదు  మీ మాటలు! గుమ్మం నెత్తికి తగులుతుందని సూటిగా  చెబితే తెలిసిందే!"
    "మీతో వ్యవహారం సూటిగా నడవాలన్నమాట!  మీ ముఖం  చూస్తేనే  తెలుస్తుందిలెండి  చాలా  అమాయకులని!   కూర్చోండి?"  కుర్చీ అతడికోసం జరిపింది.

    కుర్చీ జరువుతూంటే  కాలుసరిగా  లేకపోవడం  గమనించాడు అజిత్.   "కుర్చీ కాళ్ళలో ఒకదానికి  ఆరోగ్యం సరిగా లేనట్టుంది!  ఇప్పడే సత్కారం  లభించింది!  కుర్చీలో  వద్దులెండి! మనం మీద  కూర్చుంటాను!" అని మంచంమీద  కూర్చున్నాడు.

    గది కాస్త పెద్దదే!  ఆవతల వంటకి కాబోలు,  మధ్య గోడ ఒకటి కట్టారు అడ్డం.

 Previous Page Next Page