Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 35

    "మీ అఖిలని చూస్తే నాకు భయం వేస్తుంది."

    "అదేం  పెద్ధపులా భయపడ్డానికి?"

    "తనకి నేనంటే ఎందుకు కోపం?  మా ఇంటికి రావడానికి ఎందుకిష్టం లేదా మెకు?"

    అతడి మాటల వల్ల అతడి మనసుకు తగిలిన గాయం స్పష్టంగా కనిపించినట్టుగా  అయింది నిరజకు,  "మీరంటే ఎందుకు కోపం?  కోపం మీమీద కాదని నా అభిప్రాయం!  పాతికేళ్ళుగా  ఈ ఇంటికి  పెద్దవాళ్ళ అనుమతి  లేకుండా  వాళ్ళకి తెలియకుండా రావడం- తనకి బాగా అనిపించలేదేమో?  ముఖ్యంగా  మీ నాన్నగారి వల్ల   తన  మేనత్తకి  జరిగిన అన్యాయనికి  మీ పట్ల కొంచెం నిరసనలాంటి  భావం వుంటే ఉండవచ్చు."

    "అన్యోన్యంగా  ఉందే రెండు ఇళ్ళ మధ్య ముఖ్యంగా దగ్గరి బంధువుల  మాధ్య  ఏ కారణం చేతో   సంబంధాలు తెగిపోతే,  పిల్లలు సరిచేయడానికి ప్రయత్నించాలిగాని  పెద్ద వాళ్ళ సంతాన్నే వారసత్వంగా స్వీకరించ కూడదనుకుంటాను."

    "అన్యాయం జరిగినవాళ్ళు ఈ మాట అంటే బాగుంటుంది."

    "ఎవరూ ఎవరికీ అన్యాయం  చేయలేదు.  ఎవరిదారివాళ్ళు  నడిచారు అంతే! పోతే నాన్నమళ్ళి  పెళ్ళిచేసుకొని  తన జీవితం శూన్యంకావడం నుంచి తప్పించుకొన్నారు!  పిన్ని కూడా ఆ పని చేస్తే ఆనిడకూ  అన్యాయం జరిగినట్టు కనిపించేది కాదనుకుంటాను."

    "వాళ్ళ గురించి  ఇప్పుడు  మనం చర్చించడం అనవసరమ్తెన  పని అనుకొంటాను.  ఈ పెట్టెలో ఏముంది?"

    "గిటార్"

    "వాయించడం వచ్చా?"

    "వచ్చు!"

    "ఒకసారి నాయించరూ?"

    "ఇప్పడేందుకో   ఉత్నాహంగా లేదు!  మరోసారి వచ్చినప్పుడు వాయించి మీకోరిక తీరుస్తాను."

    "మేం ఇక్కడికిరావడం ఇదే మొదటిసారి,  ఆఖరిసారి అనుకొంటున్నాను!  ఇప్పడంటే వర్షం వచ్చి,  వాహనం ఏది దొరకక, సమయానికి మీరు వచ్చి పిలవడంవల్ల వచ్చాంగాని,  మళ్ళి ఎందుకువస్తాం?"

    "నిరజగారూ!  మీక్కూడ  మేమంటే అయిష్టమేనా?"  అజిత్ దెబ్బ తిన్నాట్టుగా  అడిగాడు.

    "అయిష్టం కాదండి! మళ్ళి  వచ్చే అవసరమేమిటని."

    "అవసరం పడితే తప్ప రాకోడాద?"

    "మీరలా బాధపడితే ఓసారి తప్పకుండా వచ్చి వెడతానుగాని ఇప్పుడు పాడండి!  ఇప్పుడు  పాత వినిపిస్తేనే  మరోసారి వస్తాను"

    అజిత్  పెట్టెలోంచి గిటార్ తీశాడు.

    "ఉండండి!  అఖిలని తీసుకువస్తాను"   నీరజ గబగబ క్రిందికి పరిగెత్తింది. 

    ఊరికే పిలిస్తే రాకపోయేదేమోగాని  అఖిలకి సహజంగా సంగీత  మంటే  ఉండే ఆసక్తివల్ల నీరజతో  పైకి వచ్చింది.
    అజిత్ తన బెడ్ మీద  బాసింపట్టు వేసుకు కూర్చొని  గిటార్  మిటాడు.

    తీగలు మీటుతూ ఏదో ఇంగ్లీష్ పాట పాడాడు.

    "మనపాటలేమి  రావా?  అంటే  సరిగమలు?   కీర్తనలు?"

    కర్ణాటక సంగీతం వేర్చుకోవడం మొదలు పెట్టి నెలరోజుల్తెంది. వీణ ప్రాక్టిస్,  గాత్ర  సాధన చేస్తున్నాను.  గిటార్ మీద మన కీర్తనలు పలికించడం కొంచెం కష్టమే"

    "గిటార్ పాశ్చాత్య  వాయిద్యం కదూ?  మనకు సరిగమలతో ప్రారంభమౌతుంది?  సంగీతం,  గిటార్ మీద ఏం మొదలు పెడతారు?"

    "ఎ.  బి.  సి.  డి.   లతో"

    "మీ చేతిలో ఉన్నదీ ఏమిటి?"

    "స్ట్రయికర్.  మిటడానికి  గోరు లేనప్పుడు ఇది వాడతాం."

    "ఇంకో పాట పాడండి."

    అజిత్ వాచీ చూసుకొన్నాడు.  ఎనిమిదిన్నర  అవుతోంది,  భోజనం సంగతి మరిచిపోయినట్టుగా ఉన్నారు."

    "వెధవ భోజనం రోజూ ఉండేదే! పాడండి!"

    "పాటంటే ఇంత ఇష్టం.  మీకు ఏమ్తేనా పాడడం వచ్చా?"

    "అందరూ పల్లకి ఎక్కితే  మోసేదేవరన్నట్టు  అందరూ పాడితే వినేదెవరు?  పాడటం, ఆడటం, గీయటం, రాయటం- అందరికి కావాలన్నా రాదూ.  అవి కొందరికే అబ్బుతాయి కాబట్టే వాటికంత అపురూపత!  కొందరికే పరిమితం కాబట్టే అవి భగవంతుడి వరంగా భావించబడతాయి."

    "ఇష్టం ఉండి సాధన చేస్తే  రానిది అంటూ ఉండదని నా అభిప్రాయం!  ఏ విద్య  అయినా,  ఏ కళ అయినా"

    యశోదమ్మ క్రింది నుండి  కేకవేసింది.   "ఎనిమిదిన్నర  అయింది!  భోజనానికి క్రిందికి రాండర్రా!  ఆ  పాటలేవో క్రిందకివచ్చి  పాడితే నేనూ విననా?"

    అందరూ క్రిందకి వచ్చారు.

    అతిధులతో పాటు అజిత్ కూడా క్రిందే పిటల మీద కూర్చున్నాడు.

    మొదటి వడ్డన వంటతడు   చేశాడు.  మారు వడ్డింపు యశోదమ్మ  చేసింది,  ఆవిడ కొసరి కొసరి తినిపించడంతో  అఖిలకూ,  నిరజకూ భుక్తాయాసం వచ్చింది.

    తనగదిలోనే వాళ్ళకి పక్కల ఏర్పాటు చేసింది యశోదమ్మ.

    "నీకూ సంగీతం వచ్చునని  చెప్పాడు అజిత్,  ఒక పాట పాడమ్మ త్రిపుర పాటని, త్రిపురని గుర్తుచేసుకొని రోజుండదు నాకు!  ఇరవ్తే  అయిదు సంవత్సరాల్తెనా,  ఇరవ్తే  అయిదు రోజుల్తెనట్లు ఉంటుంది: త్రిపుర నాకు దూరమ్తే?  మల్లిక్ విషయంలో త్రిపుర కొంచెం సహనం చూపి ఉంటే మా జీవితాలలో ఇంత  వంటరితనం చేటుచేసుకు  ఉండేది   కాదనుకొంటాను,  మల్లిక్ మాకు  కూకుండా,  అలా  దూరదేశాలు పట్టుకుపోకుండా  త్రిపుర వాడికి  కళ్లెం వేసేదనుకొంటాను.  గత  జలసేతుబంధనం.  ఇప్పుడు  అనుకొని ఏం లాభం కానీ,  ఒక పాట పాడమ్మా." 

 Previous Page Next Page