Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 36

 

    ఆమె భుజాల చుట్టూ చేయి వేసి ఆమెను తన మీదకు లాక్కున్నాడు.
    ఆమె పెదాలు మళ్ళీ తన మెడను తాకుతున్నాయ్.
    ఎండి. శివరావ్ మొఖంలో అనుమాన మేఘాలు తాత్కాలికంగా పక్కకు జరుగుతున్నాయ్.
    "ఏదొకటి మాట్లాడండి నేచురల్ గా కనిపిస్తే బావుంటుంది -- ప్లీజ్"
    సురేష్ ఆమె వేపు తిరిగాడు.
    "మీ కళ్ళు యెంత అందంగా ఉన్నాయ్?"
    రాధికకు కోపం ముంచుకొచ్చింది గానీ తామాయించుకుని నవ్వింది.
    "మీ పళ్ళు ఎంత అందంగా ఉన్నాయ్?"
    "లేడీ ఎంప్లాయ్స్ కి ఇన్ కామ్ టాక్స్ మినహాయింపు ఉంటుందన్నారు ఆ విషయం మీకేమైనా తెలుసా?" ఏదొకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతోంది.
    "మీ నడుము సైజేంత? ట్వంటీ సిక్సేనా?"
    ఆమె అతి కష్టం మీద కోపం అణచేసుకుంది.
    "అలాంటి మాటలు మాట్లాడకండి" సౌమ్యంగానే అంది.
    "ఇంకేం మాట్లాడాలో నాకు తెలీటం లేదు. వద్దంటే సైలెంటుగా వుంటాను" ఆమె చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
    ఆమె కంగారుపడి తన చేతిని లాగేసుకుంది.
    "సరే! మీ ఇష్టమోచ్చిందే మాట్లాడండి"
    "మీ పెదాలు వైన్ నింపిన దొండపళ్ళలాగున్నాయి"
    రాధికకు నవ్వొచ్చింది.
    "ఛీ! పాడు!"
    "మీ చెక్కిళ్ళను చూస్తుంటే పెదాలతో రోడ్ రోలర్ లాగా నడపాలని వుంది"
    ఆమె విరగాబడి నవ్వుతోంటే పైట తొలగిపోయింది.
    "మీ పైట చెంగు చూస్తుంటే ...."
    ఆమె చప్పున అతని నోటికి చేయి అడ్డు పెట్టేసింది.
    "నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. " అంది అతని ధోరణిని మళ్ళించడానికి. "మీకూ ఇష్టమేనా?"
    "నాకు మ్యూజిక్కంటే అసలు పడదు."
    "నిజమయిన మనుషులంటే మ్యూజిక్ లవర్సేనని మా మ్యూజిక్ టీచర్ చెప్తుండేది"
    "ట్రూ మ్యూజిక్ లవ్వర్సంటే డెఫినిషన్ తెలుసా మీకు?"
    "తెలీదు -- ఏమిటి?"
    "అందమయిన అమ్మాయి నగ్నంగా బాత్ రూమ్ లో స్నానం చేస్తూ పాడుతుంటే కీహోల్ దగ్గర చెవిపెట్టి వినేవాడు.
    ఆమె మొఖంలో రంగు మారిపోయింది.
    "నాకు తెలుసు -- మీరు ఇంతకంటే ఏదగరని!"
    ఎండి. మొఖంలో సంతృప్తి కనబడుతోంది.
    "ఇప్పుడు 'రాముడు -- భీముడు ' సినిమాలో పాట! 'ఇదే -ఇదే' వింత నాకు తెలియకున్నది ' ఈ పాటకు నృత్యకారులు మిస్టర్ సురేష్ మిసెస్ రాధిక ---' ఎనౌన్స్ మెంట్ వినిపించింది.
    అంతా తప్పట్లు --
    సురేష్ తో పాటు లేచి నిలబడిందామె.
    "మీతో డాన్స్ చేయాలంటే ఇంకో పది ఇవ్వాల్సుంటుంది' కుర్చీల మధ్య నుంచీ డాన్స్ చేస్తే చోటకు నడుస్తూ అన్నాడతను.
    రాధికకు వళ్ళు మండిపోతోంది.
    "ప్రతిదానికి డబ్బు లడగడానికి మీకు కొంచెమన్నా సిగ్గుండక్కర్లలేదు?"
    "మనకి బొత్తిగా మొఖవాటం లేదు మేడమ్. మొఖవాటానికి పోయే కదా ఎమ్ ఎన్.కె సంధ్యాకుమారి ప్రేగ్నేంటయింది?"
    "సరే -- ఇస్తాను పదండి !"
    "మొత్తం ఇరవై బాకీ ఇప్పటివరకూ.'
    "హ!"
    ఇద్దరూ డాన్స్ ప్రారంభించారు.
    రాధికకు చేతకావటం లేదు. అతనిని తనకు తగలకుండా దూరంగా నేట్టటానికి ప్రయత్నించి తనే తూలి పక్కకు పడిపోయింది. సురేష్ చటుక్కున ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుని తనకేసి అదుముకున్నాడు.
    రాధిక శరీరమంతా అతని కౌగిట్లో భగ్గుమన్నట్లనిపించసాగింది. కావాలనే తనను కౌగిట్లో నలిపివేస్తున్న ఫీలింగ్ . ఆ ఫీలింగ్ తనకు కోపం బదులు ఓ వింత అనుభూతిని కలిగిస్తోందేమిటి? ఏమైపోతోంది తనకు . ఇదే ఇంకో చోటయితే చెంప పగలగోట్టేది అతనిని.
    కానీ ఇప్పుడు నిస్సహాయ స్థితిలో వుంది.
    అతని చేయి నడుము మీద నుంచి కిందకు జారుతోంది ఇనుప హస్తంలా!
    ఆ స్పర్శకు వళ్ళు జలదరిస్తోంది. మరింత గట్టిగా తనను హత్తుకుంటే బాగుండునన్న కోరిక -- ఛీ! ఏమిటది? తనేనా ఇలా ఆలోచిస్తుంది? అదీ ఇలాంటి ముక్కు మొఖం తెలీని చిల్లర గాడితో - అతనే కులమో ఏమిటో తనలాగా ఉన్నత కులానికి చెందిన వాడయి ఉండడు! ఉంటె ఇలాంటి చిల్లర వేషాలేయాడు.
    ఎండి. శివరావ్ ఆనందంగా చూస్తున్నాడు.
    పాట ఆగిపోయింది. అతను ఆమెను కౌగిలి నుంచి వదిలేశాడు.
    "హమ్మయ్య' తేలిగ్గా ఊపిరిపీల్చుకుందామే.
    అంతా తప్పట్లు ----
    ఇద్దరూ తమ సీట్లలో కూర్చున్నారు.
    మరికాసేపట్లో ఆ డాన్స్ కార్యక్రమం ముగిసింది. త=ఎవరి గదికి వాళ్ళు బయల్దేరారు. గార్డెన్ మధ్యలో హిమరేఖ వచ్చి కలుసుకుంది వాళ్ళను.
    "హలో ఐస్ లాండ్! మీవారేరీ?" అడిగాడు సురేష్.
    "అక్కడే వున్నారు. కాసేపయ్యాక వస్తారట--"
    "అన్నట్లు మీరిద్దరూ డాన్స్ చేయలేదేమిటి?" ఆమె నడిగింది రాధిక.
    "నాకు తలనొప్పిగా వుంది! అందుకని డాన్స్ చేయలేనని రిక్వస్ట్ చేశాను.
    సురేష్ అనుమానంగా ఆమె వేపు చూశాడు.
    వచ్చేప్పుడు బస్ లో కూడా ఆమె భర్త పక్కన కూర్చోలేదు. మరో ఫ్రెండ్ పక్కన కూర్చుంది.
    ఏదో ప్రాబ్లం వుండి వుంటుంది.
    ఒకవేళ తనూ రాధిక లాంటి జంట కాదు కదా వాళ్ళు కూడా?
    హిమరేఖ వేపు పరీక్షగా చూశాడు.
    అనుమానం లేదు . ఆమె వివాహితురాలే ! పెళ్ళయిన అమ్మాయికీ, అవని అమ్మాయికి తేడాను చాలా తేలిగ్గా కనిపెట్టగలడు--
    అతను తన వంకే పరీక్షగా చూడటం గమనించి పైట సర్దుకుంది హిమరేఖ.
    ఆ పక్క గదే తమది --
    ఎండి రూమ్ తమ పక్కదేనా? అవతలి వేపు గదిలోకి హిమరేఖ వెళ్తోంది.
    అంటే హిమరేఖ మీద తన మీద కూడా ఎండి కి అనుమానంగా వుందా? అందుకే ఇద్దరికీ మధ్య రూమ్ తీసుకున్నాడా?"
    "కంగ్రాచ్యులేషన్స్ రాధికా! మీ కపుల్ చేసిన డాన్స్ నేను నిజంగా ఎంజాయ్ చేశాను -" గది గడపలో కి వచ్చి చెప్పాడు.
    "థాంక్యూ సర్ -"
    "మిస్టర్ సురేష్ "

 Previous Page Next Page