Previous Page Next Page 
మోడల్ పేజి 35


   
    Things are Rapidly Changing అనే అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి......"

    తను పూనా  ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చదివిన థీరియాటికల్ నాలెడ్జి మనోహర్ ముందు ఎందుకూ పనికిరాదనిపించింది గిరీష్ కి.

    అంతలో ఎయిర్ పోర్టులో హడావుడి మొదలైంది. మధు పరుగెత్తుకుంటూ వచ్చి 'ప్లయిట్ టైమైంది. సార్' అన్నాడు.

    మనోహర్ లేచాడు.

    "గిరీష్ పనామా బ్లేడ్ తో గడ్డంచేసుకుంటే ఆడపిల్లలు వెంటపడతారు అని ఇండియాటిక్ గా తీయకు.....ఎలిగెంట్ గా వుండాలి......మైండిట్" అంటూ కదిలాడు.

    సెక్యూరిటీ చెక్ లోకి నడుస్తున్న మనోహర్ వేపు కృతజ్ఞతగా చూస్తుండిపోయాడు గిరీష్.

    తరంగిణితో తిరిగి రావాలని కోరుకున్నాడు మధు.

    మరో పది నిముషాల్లోనే మనోహర్ ఎక్కినా ప్లయిట్ పైకిలేచింది.

    విక్రమ్ రహస్యాన్ని అప్పటికే కాని పెట్టగలిగిన చందూ హడావుడిగా పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే కనిపెట్టగలిగిన చందూ హడావుడిగా పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే సమయం మించిపోయింది.

    బాధగా, విచారంగా  తలకొట్టుకున్నాడు చందూ.....వెళ్తున్న ప్లయిట్ ని చూసి నిస్పృహగా. ఒక పదినిముషాలు మనోహర్ ఆగినా, పదినిముషాలు ముందు చందూకి రహస్యం తెలిసిపోయినా ప్రదీప్ గేమ్ మనోహర్ కి తెల్సేదే!


   
                                                                   *    *    *

    కలకత్తాలో ప్లయిట్ దిగగానే మనోహర్ సరాసరి ఒబరాయ్ హొటల్ కి వెళ్ళాడు. తరంగిణి దొరకబోతోందన్న ఎగ్జయిట్ మెంట్ క్షణ క్షణానికి ఉధృతమైపోతోంది.

    హడావుడిగా టాక్సీదిగి హొటల్ వేపు నడిచాడు. గేటు దగ్గర వున్న పోలీసుల వడివడిగా వస్తున్న మనోహర్ ని నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. అక్కడ పోలీసులు ఎందుకున్నారో తనను ఎందుకాపేశారో హొటల్ నిర్మానుష్యంగా ఎందుకు వుందో ఓ క్షణం అర్థంకాలేదు మనోహర్ కి.

    "వాట్ హేపెన్డ్.......?" సౌమ్యంగానే అడిగాడు లోపల పిచ్చికోపం ఉన్నా.

    "గంట క్రితమే ఈ హొటల్ లో ఒక హత్య జరిగింది. ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి  చంపారు. దానిమీద  లోపల లాడ్జెర్స్ ని ఇంటరాగేట్ చేస్తున్నారు. అందువలన లోపల నుంచి బయటకు, బయటనుంచి లోపలి ఎవరిని వెళ్ళనివ్వటంలేదు" అన్నాడు.

    తెలియని కసి, కోపం, ఉక్రోషం మనోహర్ ని తీవ్రమైన డిప్రెషన్ కి గురిచేసాయి. నిస్సహాయంగా రోడ్ మీదకు నడిచాడు. ఎం చేయాలో అర్ధం కాలేదు హతురాలు ఎవరో తెలియదు. తరంగిణా......!? సెకన్లో వెయ్యోవంతు మనోహర్ ఆలోచనలు స్తంభించిపోయాయి. అంతలోనే తేరుకొని చురుకుగా ఆలోచించాడు.

    అయిర్ పోర్టులో దిగగానే హొటల్ కి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వలేదు. బహుశా ఇందుకే అయుండొచ్చు.

    అసలు ఈ హొటల్లోనే తరంగిణి వుందో లేదో తెలియదు. పోలీసులు ఎప్పటికి లోపలి అనుమతిస్తారో తెలియదు.

    అప్పుడు రాత్రి పదకొండు కావస్తోంది చేయగలిగింది లేక ఒబరాయ్ కి ఎదురుగా వున్న చిన్న హొటల్ లో రూమ్ తీసుకున్నాడు.

    తన గదిలో కూర్చుని కిటికీలోంచి చూస్తే ఒబరాయ్ స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రంతా ఒక్క క్షణమైనా కునుకులేకుండా అటే చూస్తూ కూర్చున్నాడు. పోలీసులు ఎప్పుడెళ్ళిపోతే అప్పుడు  వెళ్ళిపోవాలని చూస్తున్నాడు మనోహర్.

    మనోహర్ బాగా నీరసించి పోయాడు. సరైనా టైమ్ కి తిండిలేదు. పైగా టెన్షన్ ఒక్కరోజు గడిచిపోతున్న కొద్దీ మనోహర్ లో ఆందోళన ఎక్కువవుతోంది. అసలు తరంగిణి తనకు దొరుకుతుందా? దొరికినా వర్క్ చేయటానికి ఒప్పుకుంటుందా? అసలామె ఇండియా ఎందుకొచ్చినట్లు ఇండియాలో బంధువులెవరూ లేనట్లు హొటల్ లో ఎందుకు దిగినట్లు?


                               *    *    *


    మధుకి చాలా చికాగ్గా వుంది. ప్రక్కనే చందూ ఉన్నాడు. చందూ కనుక్కున్న రహస్యాన్ని తమ బాస్ కి చేరవేయలేకపోయామనే బాధ ఇద్దరిలోనూ గూడుకట్టుకుంది. ఫోన్ లో తెలియపర్చాలన్నా కలకత్తా వెళుతున్నట్లు తెలుసుగాని కలకత్తాలో ఎక్కుడుంటాడో తెలియదు. ఎప్పుడొస్తాడో తెలియదు ఎలా......? ఎలా.....? ఇప్పుడిక చేయగలిగిందొక్కటే.....విక్రమ్ చర్యల్ని పూర్తిగా కనిపెట్టి వాడివలన ప్రమాదం మరీ ఎక్కువయితే మట్టు పెట్టడమే మధు రక్తం సలసలా కాగిపోతోంది. పాప పుణ్యాల గురించి ఆలోచించే స్థితి ఎప్పుడో దాటిపోయింది.

    చందూ దృష్టంతా విక్రమ్ గోడౌన్ మీదుంది. దాన్నెలాగైనా సాక్ష్యంతోసహా  పోలీసులకి పట్టించాలి. ఎలా? ఎలా?

    ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే బాస్ తనకు ఒక ఫైల్ ఇచ్చి దాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోమన్నాడు. ఆ ఫైల్ లో ఏముందో తెలియదు. హఠాత్తుగా అది గుర్తుకు రావటంతో మధు లేచి  బీరువాలోంచి ఆ పైల్ ని తీశాడు.

    నీలం రంగు ఫైలది. తీసుకొచ్చి కుర్చీలో కూర్చొని ఫైల్ ఓపెన్ చేశాడు.

    సరిగ్గా అదే సమయంలో ఫోన్ వచ్చింది. "హల్లో......సముద్రా యాడ్ ఫిల్మ్స్" అన్నాడు మధు. "నేను జార్జ్ ని మాట్లాడుతున్నాను. మనోహర్ లేదా చాలా అర్జంట్ . ఎలాగైనా మనోహర్ తో మాట్లాడాలి" జార్జ్ కంఠంలో తొంగిచూసిన ఆతృత మధు పసిగట్టగలిగాడు.

    "లేరు సార్.....కలకత్తా  వెళ్ళారు. కలకత్తాలో  ఎక్కడుంటారో తెలియదు....."

    జార్జ్ కి ఢిల్లీ లో తరంగిణి అనుకొని పొరపాటుపడ్డా దేవి అన్నమాటలు గుర్తుకొచ్చాయి. ఏస్ ప్లనేడ్.....ఓబరాయ్ హొటల్......కాని ఆ విషయాన్ని మధుకి చెప్పాల్సిన అవసరం కనపడకపోవటంతో ఫోన్ పెట్టేశాడు.

    మనోహర్ ఎక్కడున్నాడనే విషయం మధుకి చాలా దగ్గరగావచ్చి తప్పిపోయింది. ఒకరి అవసరం ఒకరికి తెలియదు. అంతలోనే మరో ఫోన్ వచ్చింది. అది రాంభూపాల్ నుంచి.

    "నేను మూడు లోకేషన్స్ సెలక్టు చేశాను. మోస్ట్ ఎక్జోటిక్ లోకేషన్స్......"

    "ఎక్కడెక్కడా?" ఆతృతగా అడిగాడు మధు. ఆ ఫోన్ మనోహర్  పర్సనల్. పైగా డైరెక్టు ఫోన్. అందుకే ఫోన్ లో మాట్లాడగల్గుతున్నాడు మధు. పై పెచ్చు అప్పుడు ఆఫీసులో ఎవరూ లేరు. టెలిఫోన్ ఆపరేటర్ అంతకంటే లేదు.

    "ఒకటి ఏలూరుకి పదిమైళ్ళ దూరంలో వున్న గాంధీవనం. పెదపాడు అనే వూరుని అనుకొని వుంది. మరొకటి విశాఖపట్నం దగ్గరలో భీమిలి. ఇంకొకటి బందరుకి పదిమైళ్ళ దూరాన వుంది!!"

    "వెరీగుడ్.....వెంటనే ఆ లోకేషన్స్ లో షూటింగ్ కోసం పర్మిషన్ తీసుకో. నీవు  సిటీకి రావద్దు. అప్పటివరకు ఒక పనిచెయ్యి. విజయవాడ బందర్ రోడ్ లో వున్న కాంథారి హొటల్ లో వుండు. బయట తిరగకు కిరణ్ ని నీ కాంటాక్టులో పెట్టుకో. బైదిబై కిరణ్ వివరాలేమన్నా తెలిసాయా?"

    "ఆరుగొలనులో డిస్కవరీ చేసిన యువతి తల్లిదండ్రుళ నుంచి పర్మిషన్ తీసుకున్నాడట. విజయవాడ మేరిస్టెల్లా కాలేజీలో మరో స్టన్నింగ్ బ్యూటీని డిస్కవర్ చేశాడు, ఆ వివరాలు ఇంకా తెలియదు____అంటే  పర్మిషన్ తీసుకొందీ లేందీ. ఆ అమ్మాయిది మొగల్రాజపురం. అలాగే నందిగామ కె.వి.ఆర్. కాలేజీలో కూడా ఒక యువతిని చూశాడు. అలాగే కంచిక చర్లకి దగ్గర్లో వీరులపాడు అనే వూరులో ఒక అమ్మాయిని చూశాడట. మొత్తం నలుగుర్ని డిస్కవరీ  చేశాడు. అందరిలోకి ఆరుగొలను అమ్మాయికి మాత్రం ఫెంటాస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి ఆమె ఎత్తు ఎంతో తెలుసా? 5 9  పేరు తరంగిణి."

    ఉలిక్కిపడ్డాడు మధు ఆ మాటలు విని.

    తరంగిణి......పైగా 5.9 మరి కలకత్తాలో వున్న తరంగిణి???!! ఒకరా లేక ఇద్దరా!!?

    "ఒక  పని చెయ్యండి. త్వరత్వరగా ఆ నలుగురి తల్లిదండ్రులనుంచి పర్మిషన్ తీసుకోండి. వార్ని వారి పేరెంట్స్ తో సహా తీసుకువచ్చి కాంథారిలో  వుంచండి. ఇప్పుడైనా నీ బలహీనతను కంట్రోల్ చేసుకో ఆ నలుగురికి మంచి ట్రైనింగ్ ఇవ్వండి. వీళ్ళు మెయిన్ మోడల్స్ కాదు గనుక పెద్ద ట్రైనింగ్ అవసరంలేదు. కెమేరా ఫోబియా గోపోడితేచాలు వాళ్ళు షూటింగ్ లో ఇబ్బందిపెడితే బాస్ కి  కోపం వస్తుంది. ఇక నువ్వు ఫోన్ చేయకు. నేను చేస్తాను, బాస్  డేట్ ఫిక్స్ చేయగానే మీరు ఏ రోజుకు ఎక్కడుండాలో తెలియపరుస్తాను.......ఓకే" ఫోన్ పెట్టేశాసు మధు.

    లోకేషన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. బ్యాగ్రవుండ్ మోడల్స్ దొరికారు. ఇక దొరకాల్సింది తరంగిణి. మరి ఈ తరంగిణి ఎవరు?

    చందూ కనిపెట్టిన విషయాల్సి____ప్యారిస్ తరంగిణి____ఆరుగొలను తరంగిణి____ఈ మూడిటిని కలిపి ఆలోచిస్తే ఏదో లింకు దొరుకుతుందనిపించింది. కాని ఎంతకీ తట్టలేదు. తల విదిలింది ఫైల్ ఓపెన్ చేశాడు.


                                 *    *    *


    చిక్కడపల్లి మీరా సిల్క్ సెంటర్ దగ్గర ఎదురుచూస్తూన్న కమలిని దగ్గరకు  భూటాని వచ్చాడు. 5,00,000 ఇచ్చాడు. అవి తీసుకున్న  కమలిని సరాసరి లాయర్ సీతారామయ్య ఇంటికి వెళ్ళింది.

    ఇద్దరూ దాదాపు నాలుగుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించుకుంటూ వుండిపోయారు. అప్పటికే తన కారుని, అమ్మినతనికి హేండ్ పర్  చేసింది.

    సరిగ్గా అదే సమయంలో కైలాష్ దొంగ తాళంచెవులతో కమలిని ఇంటిలోకి ప్రవేశించి కమలిని రాకకోసం ఎదురుచూస్తూ లేడికోసం మాటువేసిన పులిలా ఆవురావురుమంటున్నాడు.

    అప్పుడప్పుడు అతని చేతిలోని పొడవైన బాకువైపు చూసుకుంటున్నాడు. అప్పుడతనిలో పైశాచిక ఆనందం విలయతాండవం చేస్తోంది.

    కమలిని చాలా ఆనందంగా వుంది. తన జీవితాశయం నెరవేరబోతోంది. తన జన్మకి సార్ధకత రాబోతోంది. ఆమె జీవితంలో రెండేరెండు సార్లు నిజమైన ఆనందాన్ని నిజాయితీగా ఫీల్ కాగలిగింది......ఒకటి మనోహర్ తన కంటినీరు తుడిచినప్పుడు.....రెండూ ఎవరూ చేయలేని ఒక మహత్కార్యాన్ని పూర్తిచేసిన ఈ క్షణం, చావు తనకోసం కాచుక్కూచుంటుందని తెలుసు దానినుంచి దూరంగా పోవాలని లేదు ఆమెకు.

    లాయర్ ఇంట్లోకి వెళ్ళాడు పనిమీద.

    కమలిని కాగితం, కాలం తీసింది. వణికే చేతులతో రాయటం ప్రారంభించింది.



                                                                 *    *    *   


    ఫైల్ తొలి పేజీలో భారతదేశం యాడ్ ఫోటోగ్రాపర్స్ భవిష్యత్ అని వుంది. పేజీని తిప్పాడు. అందులో ఇలా రాసుంది. మధు చదవటం ప్రారంభించాడు.

    ఇప్పుడు ఇండియన్ యాడ్ బడ్జెట్ 400 కోట్లు అది రాబోయే 5 ఏండ్ల లో 800 కోట్లకు చేరుకుంటుంది. అందులో 20శాతం అంటే 160 కోట్లు యాడ్ ఫోటోగ్రఫీకి కేటాయిస్తారు. అందులో యాడ్ ఫిల్మ్స్ 60 శాతం కేటాయిస్తే 96 కోట్లు ఇండియాలో వున్న ఫేమస్ యాడ్ ఫోటో గ్రాఫర్స్ సుమారు 20 మంది. ఒక్కొక్కరికి. 4.8కోట్లు బిజినెస్, నాలుగు కోట్లు ఖర్చులకి పోయినా ఒక్కొక్కరికి దాదాపు 80 లక్షల మిగులుతాయి. [కేవలం అంచనా].

    పబ్లిసిటీని రాజకీయ పార్టీలకు కూడా బలమైన ఆయుధంగా దేశంలో తొలిసారి రాజీవ్ గాంధి గుర్తించారు.

    రెడిప్యూజన్ ఎడ్వర్టెయిజింగ్ ఏజన్సీ ఎ.ఐ.సి.సి. జనరల్ సెక్రటరీ చందూలాల్ చంద్రార్కర్ పేరుమీద కేంపైన్ నిర్వహించింది. అది అమోఘ విజయం సాధించింది. పై 800 కోట్లకు రాజకీయ వార్టీల బిజినెస్ కొంత ఏ విధంగా చూసుకున్నా యాడ్ ఫోటో గ్రాఫర్స్ భవిష్యత్తు ఆశాజనకంగా, ప్రాస్ ఫరస్  గా వుంది.

    ఇప్పటికి ఐ.ఇ.యన్. యస్. (ఇండియన్ ఈస్టరన్ న్యూస్ పేపర్స్ సొసైటీ) లో రిజిష్టరయిన యాడ్ ఏజన్సీస్ 400. అందులో పెద్ద ఏజన్సీస్ హిందూస్తాన్ థాంప్సన్. లింటాస్, క్లారియాన్. ఓ.బి. యమ్ ఈ నాల్గింటిలో దేనిలోనైనా చేరాలి. క్లెయింట్ తో డైరెక్టు కాంటాక్టు పెట్టుకోవాలంటే పబ్లిసిటీకి విపరీతంగా ఖర్చుపెట్టే రిలయన్స్ టెక్స్ టైల్స్ హిందూస్థాన్ లివర్, పెయికో, కాల్గేట్____పామోలివ్, ఐ.టి.సి. కంపెనీలతో సత్ సంబంధాలు పెట్టుకోవాలి.  
   

 Previous Page Next Page