"అఖిలా! నీ కాళ్ళు పట్టుకుంటానే! ఈ వర్షం గజగజ వణికికిస్తూంది. పైగారా త్త్రే పోతూంది. కాలేజి వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ పరిస్ధితిలో మనల్ని ఏ అల్లరి వెధవల్తేనా చూశారనుకో! రేపు ఉదయానికి మన శవాలు హుసేన్ సాగర్ లో తేలాల్సిందే!" చిన్న గొంతుకతో ప్రాధేయపడింది నీరజ.
"ఎక్కు! నీకోసం వస్తున్నానుగాని లేకపోతే చస్తే ఎక్కెదాన్ని కాదు"
కొంచెం కదిలి ముందుకు వెళ్ళిన కారు దగ్గరికి పరిగెత్తింది. నీరజ ఆగండి అజిత్ బాబూ! మేం వస్తున్నాం మా రాక్షసి కరుణించింది!"
కారాపి డోర్ తెరిచాడు అజిత్.
ముందు నీరజ, తరువాత అఖిల ఎక్కారు.
నీరజ డోర్ వేసింది. కారు కదిలింది.
నీరజ తమ ఇంట్రి అడ్రస్ చెప్పింది.
"నాకిక్కడ రోడ్లు, విధులూ క్రొత్త! ఈ వర్షంలో సురక్షితంగా మీ ఇంటికి చేర్చలేనేమో! మీరు పర్మిషన్ ఇస్తే మా ఇంటికి తీసుకు వెడతాను! ఇంట్లో మా నాయనమ్మ, వంటవాడు తప్ప ఇంకెవరూ లేరు ఉదయమే మీ ఇంటి దగ్గర వదిలేస్తాను"
"వద్దు వద్దు! మన ఇంటికే తీసికెళ్ళమను నీరూ!"
"ఇక్కడ రోడ్లు కొత్త అంటున్నారు కదా? పాపం! ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏం ధర్మం?"
"ఈ రాత్రి మీరు మా ఇంట్లో ఉండిపోవడం వల్ల మీకు ఏ ఆపదా రానివ్వనని హామీ ఇస్తున్నాను" అఖిల నిష్కారణంగా చేస్తున్న ఆవమానానికి ఎర్రబారిన ముఖంతో, గంబిరంగా అన్నాడు అజిత్.
ఇక ఎవరేం మాట్లాడలేదు.
వర్షం మూలంగా అయిదున్నరకే చీకటి పడిపోయినట్టుగా అయింది. కారు ఇంటి ముఅమ్ధు౮ ఆగేసరికి ఇంట్లో దీపాలు వెలుగుతూ కనిపించాయి.
వాళ్ళని వరండాలో నిలబెట్టి అజిత్ లోపలికి వెళ్ళాడు. "నాయనమ్మా ఓ నాయనమ్మా!"
"ఏమిటి? అంటూ యశోదమ్మ గదిలోంచి బయటికి వచ్చింది."
"మనుమడి వెంట ఆవిడ బయటికి వచ్చింది.
తడిసిన చీరల్లో పుస్తకాలు పట్టుకుని ముడుచుకొన్న మొగ్గల్లో నిలబడ్డ అమ్మాయిల్ని ఆవిడ అయోమయంగా చూసింది. "ఎవర్రా?" పోల్చుకోవటానికి ప్రయత్నించి విఫలమ్తెనట్టుగా అంది.
"ఆ అమ్మాయిని చూడు! నీ కేవర్తేనా జ్ఞాపకం వస్తారేమో!"
చెవులకి జూకాలు, ముక్కుకి పుడకా, వ్ నున్నగా దువ్విన తల, ఆ కనుబొమలు, ముక్కు, ముఖ్యంగా ఒంతిరంగు తన కోడలు త్రిపురను పోలినట్టుగా కనిపిస్తూంటే ఆవిడలో ఆనందం ఉవ్వెత్తుగా లేచినట్టుగా అయింది. మళ్ళి అంతలో అవునో కాదో అన్న సందేహం!
"ఎవరూ జ్ఞాపకం రావడం లేదా?"
"త్రిపురా?"
"పాతికేళ్ళ తరువాత కూడా నీ కోడలు ఇరవయ్యేళ్ళ పిల్లలా ఎలా ఉంటుందనుకుంటున్నావు నాయనమ్మ? ఈ అమ్మాయు త్రిపుర పిన్ని మేనకోడలు. పేరు అఖిలాండేశ్వరి. ఇక్కడే వుమెన్స్ కాలేజిలో చదువు తూందని చెప్పానే! ఆమె! ఇహ ఈ అమ్మాయి"
"నీ పరిచయాలు బంగారంగానూ! తడిబట్టల్లో ఆ పిల్లల్ని ఎంత సేపని నిలబెడతావురా?.....లోపలికి రండమ్మ! ముందు బట్టలు మార్చుకోండి." ఎన్నోనాళ్ళకి పుట్టింటి బంధువును అది, తన మేనకోడలి మేనకోడల్ని చూసిన ఆనందం ఆవిడ ముఖంలో వెలుగుతూంటే వాళ్ళని పిలుచుకొని లోపలికి వెళ్ళింది. బీరువాలోంచి జారి అంచు చీరలు తిసిచ్చి త్వర త్వరగా వాళ్ళచేత బట్టలు మార్పించిది!
"తల తుడవండి, పిల్లలూ! జలుబు పట్టుకోగలధు!" అని తువాలిచ్చి, వాళ్ళు తుడుచుకునే లోగా వేడివేడిగా కాఫి తీసుకు వచ్చింది.
"నేను త్రాగనండి !" అఖిల అంది.
"టి తిసుకోంటావా?"
"ఉహు కాఫి, టి లు ముట్టని పిల్లలున్నారా?" యశోదమ్మ విడ్డూరంగా అంది.
"ఈ కాలంలోనూ కాఫి, టి ళు ముట్టని పిల్లలున్నారా?" యశోదమ్మ విడ్డూరంగా అంది.
"ఉంది, మా అఖిలాండేశ్వరి. ఇంకా ఈ కాలం పిల్లలకుండాల్సిన చాలా అలవాట్లు ఆమెకు లేవు."
ఆచారాలు అందరూ నమ్మకంతోటే చేస్తున్నారా? మీరు చేశారని నేనూ, నేను చేశానని మరొకడు చేయడం తప్పితే! మీ ముసలి వాళ్లకు కూడా లేని పట్టింపు మా అఖిలకు" అంది నీరజ.
"పెద్దవాళ్ళు ఏ దారిన నడుస్తున్నారో మనమూ ఆ దారిన నడవాలని నా ఉద్దేశ్యం!" అఖిల తనని సమర్దించుకోంటూ అంది.
"మంచిదే!" అంతకంటే ఏమనలేనట్టుగా అంది యశోదమ్మ.
ఆ రాత్రి ఆతిథ్యభారం నాయనమ్మకే వదిలి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు అజిత్.
బయటవర్షం పూర్తిగా వెలిసింది.
మబ్బులు ఎక్కడి వక్కడ మాయమ్తే వినీలాకాశంలో తారల తళ తళల మధ్య త్రయోదశి చంద్రుడు అందంగా వెలుగుతున్నాడు.
కానీ, అజిత్ ముఖం మాత్రం మబ్బులు ముసినట్టుగా ఉంది. అఖిల ప్రవర్తనకు అతడి మనసు గాయపడింది. తమింటికి రావడానికి ఎందుకలా అభ్యంతర పెట్టింది. తనంటే వ్యక్తిగతమ్తెన ద్వేషం ఏర్పడిందా? లేకపోతే, తన మేనత్తకి జరిగిన అన్యాయానికి కినుకా?
ఏనాడో ఏదో జరిగి పెద్దవాళ్ళు ముఖాలు చూచుకోకపోతే పిల్లలు కూడా దాన్ని వారసత్వంగా స్వీకరించాలా?
అఖిల ప్రవర్తన ఇలా వికటంగా లేకపోతే ఆమె తమింటికి వచ్చిన ఈ రోజును ఎంత ఆనందంగా మలుచుకొనే వాడు?
"మమ్మల్ని మామ్మగారికి అప్పగించి మీరు మీ గదిలోదూరికూర్చున్నారా? ఈ అతిధి మర్యాదను మీరు అమెరికాలో నేర్చుకోన్నారా?" నీరజ అరమరికలు లేని దానిలా గదిలోకి వచ్చి చనువుగా నిందవేసింది.