ఆ వారం పదిరోజుల్లో మూడుసార్లు ఆమె దర్శనంతోటే సరి పెట్టుకొన్నా ఆ రోజు మాత్రం ఆమెతో తప్పకుండా మాట్లాడాలని బయల్దేరాడు.
16
మధ్యహ్నం వరకూ ఎండ బాగానే కాసినా తరువాత సూర్యుడు మబ్బుల చాటుకు తప్పకొన్నాడు. గంట గడవకముందే ఆకాశం నిండా నల్లటి మబ్బులు అలుముకుపోయాయి. తపతప మని వర్షం ఏ నిమిషంలో న్తెనా ప్రారంభంయ్యేట్టుగా ఉంది.
కాలేజి గేటుకి అవతల ఒక చెట్టు క్రింద నిలబడి ఉన్నారు అఖిల నీరజ.
చాలా సేపటి నుండి ఒక విషయం తీవ్రంగా చర్చిస్తున్నాట్టుగా సీరియస్ గా ఉన్నాయి వాళ్ళ ముఖాలు.
"అఖిలా! నీతో నాకు చాలా తల నొప్పిగా ఉంది. ఏదో ఒకటి డిస్తేడ్ చెయ్యి. ఇవాళ మన ఖర్మకితోడు వర్షం కూడా వచ్చేట్టుంది."
"నడిచి వెడదాం."
"మనిల్లు కాలేజి ప్రక్క నుందనుకొన్నావా? మతిలేని మాటలు మాట్లాడొద్దు! రిక్షాలో ఎక్కడానికి భయమ్తేతే ఆటోలో వెడదాం! చప్పన ఇంట్లో వెళ్ళిపడోచ్చు."
"ఆటోవాళ్ళని, టాక్సివాళ్ళని అస్సలు నమ్మకూడదు. వాళ్ళంటేనే నాకు చచ్చేంత భయం. ఎంత దూరమ్తెనా నడుస్తాను గాని, నేను ఆటో ఎక్కాను, బాబూ."
"ఎంత పిరికి ధాన్ని స్నేహితురాల్ని చేసుకొన్నాను" తల బాదు కొంది నీరజ. "నేను మాత్రం పది అడుగుల కూడా నడవను."
"రిక్షాని పిలుపు పోదాం. నీ మొహం చూసి రిక్షా ఎక్కుతానంటున్నాను గాని, లేకపోతే చస్తే ఎక్కేదాన్ని కాదు."
"బ్రతికించావ్, తల్లి! ఏయ్ రిక్షా!"
"ఏడికి ఎల్లాలమ్మా?"
నీరజ చెప్పింది.
"పది రూపలివ్వాలి"
పదా?! నోరు తెరిచింది నీరజ. రూపాయికి వచ్చే రిక్షా పదిరూపయలా?"
"బస్సులు ఇవాళ స్త్రయిక్ కదమ్మా? ఇవాళ మాకు పుల్ గిరాకి" అన్నట్టుగానే ఆ రిక్షా కోసం చాలా మంది చూస్తున్నారు.
"రెండు తూపాయాలిస్తాను వస్తావా?"
"రానమ్మా! వాడు మరోమాట లేకుండా కదిలాడు. మరో ఇద్దరు స్టూడెంట్సు ముందుకు వచ్చి రిక్షా బేరం కుదుర్చుకొని ఎక్కి వెళ్ళి పోయారు.
వచ్చిన నాలుగ్తెదు రిక్షాలు, ఆటోలు క్షణం వచ్చి మాయమ్తెపోతున్నాయి. స్టూడెంట్సునీ, లెక్చరర్స్ నీ ఎక్కించుకొని.
"తల్లీ! అఖిలాండేశ్వరి! నీ మాటనే చేల్లెట్లుంది! ఇవాళ మనకు వాహనయోగం లేనట్టుంది!
అయిదారు నిమిషాలు గడిచాయి.
ఒకటి రెండు చినుకులు తప తప మన్నాయి!
"ఇహ ఇప్పుడు ఏ వాహనం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే, ఎక్కనని మొరాయించా వంటే నేనొక్కదాన్నే ఎక్కి నిన్ను వదిలిపోతాను!"
సమీపంలో ఉన్న షెడ్డు దగ్గరికి పరిగెత్తే సరికే సగం తడిసి పోయారు.
"బస్సులు బంద్! రిక్షాలు, ఆటోలు కొండెక్కి కూర్చున్నాయి! వర్షం మనల్ని చుట్టూ ముట్టేస్తూంది! ఇప్పడేమిటి దారి, రామా!" నీరజ తలపట్టుకోంది నిస్సహాయింగా.
"ప్రక్కన ఆగిన కారులోంచి అజిత్ తల బయటికి పెట్టి, వస్తారా! లిప్ట్ ఇస్తాను!" అన్నాడు.
పుస్తకాలు, తల తడిసిపోకుండా కొంగు సర్దుకుంటున్న నీరజ, "ఎలా కనిపిస్తున్నాంరా..." అని! చప్పన నాలిక కరుచుకొంది. తల బయటికి పెట్టిన శాల్తీ రోడ్ స్తేడ్ రోమియో కాదు! పరిచితుడ్తేన యువకుడేనని గుర్తించేసరికి, ముంచుకు వచ్చిన కొండంత ఆపద తేలిపోయినట్టుగా ముఖం తేటపడింది. "సారి! మిరనుకోలేదు!"
"క్షమాపణలు తరుతవా! ముందు కారెక్కండి! తడిసిపోతున్నారు!" అజిత్ కారు డోర్ తెరిచాడు.
రాయిలాగా నిలబడిన అఖిల, "నువ్వెళ్ళు నేను రాను! అంది."
కారెక్కబోతున్న నీరజ ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది. "నువ్వురావా? ఈ వర్షంలో చస్తావా? కోపంగా అడిగింది."
"రాను!"
"ఎందుకు?"
"నా ఇష్టం! నేను రాను!" మరోవైపు చూడసాగింది అఖిల.
నిన్న విడిచిపెట్టి నేనొక్కదాన్ని ఎలా వెళ్ళను? నీతోపాటు ఉండిపోయి, ఈ వర్షంలో ఎలా చావను?"
"నువ్వేం చావక్కరలేదు, వెళ్ళు!"
"తిక్కగా వాగకు! తంతాను! నిరజకు చెప్పలేనంత కోపం వచ్చినా, అఖిలను వదిలిపెట్టిపోలేక వెనక్కి వచ్చి నిలబడింది.
కారు కొంచెం వెనక్కి పోనిచ్చి అఖిల దగ్గరగా వచ్చాడు అజిత్. "మీరు నా కారు ఎందుకు ఎక్కనంటున్నారు?"
"అపరిచుతులనుండి సహాయం అందుకోవడం నాకిష్టముండదు!"
"అపరిచితుడినా? ఒకరోజు మీ ఇంటికి అతిధిగా వచ్చాను. ఒక రోజు మీ ఇంట్లో ఉన్నాను!"
"అది పరిచయం కాదు నా దృష్టిలో!"
"మీ త్రిపుర త్తకి అన్యాయం చేసిన వాడి కొడుకునని మీకు కోపంగా ఉన్నట్టుంది! అవునా?"
"అంత తరచి అడగడం దేనికి? నా కిష్టం లేదంతే!"
"మీరు వెళ్ళండి! అజిత్ బాబూ! ఇవాళ మా మొహంలో ఏం రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది" అంది నీరజ. అఖిలని మింగేసేలా చూస్తూ.
అజిత్ ఏదో అనబోయి మానేసి కారు స్టార్టు చేశాడు.