"అందరూ మీ నాన్నలాగే ఉండరు. చేసుకోన్నదాన్ని చెట్లు పట్టించిన మనిషి. గొప్పవాడెప్పటికి కాదు! చదువు ప్రక్క మనిషిని ప్రేమించడం నేర్పాలిగాని, గడ్డిపోచల్లా హీనంగా చూడడం నేర్పేది కాకుడాదు" అఖిల మంటగా అంది.
"మీ మేనత్త్ వ్తెపు వకాల్తా పుచ్చుకోన్నారన్నమాట! ఆవిడ మీకు మేనత్త అయితే నాకు పెద్దమ్మ! అమ్మ తరువాత అమ్మ! నేనూ ఆవిడ వ్తెపే ప్రత్యర్ధి ఎవరు మీకు? ఎవరితో వాదిస్తారు మీరు? కొంటెగా నవ్వాడు అజిత్.
"మీరూ మేమూ ఎప్పటికి ఒక్కటికాము"
"ఎందుకు కాకూడదు?"
"ఎందుకు కావాలి?"
"మా ఇష్టం!"
"ఏమిటి మీ ఇష్టం? అంతా మీ ఇష్టమేనని మా త్రిపురత్త జీవితం నాశనం చేశారు చాలదా?"
"ఎవరూ ఆమె జీవితం నాశనం చేయలేదని, ఆమె తన ఇష్ట ప్రకారమే ఈ ఒంటరి జీవితం ఎంచుకోందని మా నాయనమ్మ చెప్పింది! మీ త్రిపురత్త కూడా నేరం పూర్తిగా మా నాన్న మీద త్రోయలేదు."
"విడిపోయి ఎవరి మానానవాళ్ళు హాయిగా ఉన్నారు! మధ్యలో మీరు పోట్లాడుకోవడం అర్ధంలేనిపని !" అన్నాడు సర్ది చెబుతున్నాట్లుగా ప్రభాకరం. ఆ టాఫిక్ అంతటితో కట్ చేస్తూ, "రంగనాయకుల దేవాలయం చూశారా?" అనడిగాడు అజిత్ ను.
"వీలవలేదు! ఉదయం చూశాకే బస్సెక్కుతాను!"
కాస్సేపటి తరువాత అజిత్ వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూంటే, "ఇవాళ మీరు మా గెస్ట్ ఇవాళ మీ భోజనం, పడక ఇక్కడే! ఉదయం స్నానం చేశాక దేవాలయానికి ఇక్కడి నుండే వెడదాం! వెంట ఉండి మీ కంతా చూపిస్తాను నేను!" అన్నాడు.
ఈ రాత్రికి ఇక్కడ గెస్ట్ గా ఉండడానికి....అజిత్ కు ఆక్షేపణమీ లేదు!
15
ఒక అద్బుతమైన అనుభవంతో కలిగే ఉత్సాహం, ఆనందం ముఖంలో చిందులేస్తూంటే ఇంట్లో అడుగు పెట్టాడు అజిత్.
"ఏరా? వెళ్ళొచ్చావా? అందరూ బాగున్నారా?" ఆత్రుత పట్టలేనత్తుగా అడిగింది యశోదమ్మ.
"బాగున్నారు, నాయనమ్మా! నీ కోడలు త్రిపురసుందరి, కాదు త్రిలోకసుందరి, మీ అన్న ఈశ్వరుడుగారు అందరూ బాగున్నారు."
"నా గురించీ ఏం అడగలేదు కదూ?"
"అడిగేరోజు తప్పకుండా వస్తుందని మాత్రం నాకు ఆశ ఏర్పడింది! ఆ ఇంటికి ఈ ఇంటికి మళ్ళి దారి తప్పకుండా ఏర్పడుతుంది. నాయనమ్మ?"
"ఏమేం జరిగిందో చెప్పరా! మర్యాద చేశారా?"
"ఆ చేశారు! నాకొక్కడికే బయటగాదిలో భోజనం వడ్డించి!"
"మరి అక్కడేందుకు భోం చేశావ్? కరణం బాబాయ్ ఇంటికి వెళ్ళ మన్నాను కదా?"
"అతిధి ఆతిధ్యం అంటూ పట్టుకొన్నాడు మీ అన్న" అక్కడి సంగతులన్నీ పూస గ్రుచ్చినట్టు చెప్పాడు.
"అయితే వాళ్ళేం మారలెదన్నమాట! ప్రపంచమంతా మారినా వాళ్ళు మాత్రం తమ చుట్టూ గిరిగిసుకోంటారు! ఆ ఇంటికి ఈ ఇంటికి మళ్ళి దారి ఏర్పడుతుందన్నావు. ఇంకేం ఏర్పడుతుంది?" యశోదమ్మ నిస్పృహతో అంది.
"ఏర్పడుతుంది. తప్పకుండా నేను సాధిస్తాను.... పద, నాయనమ్మా. ఆకలి మండిపోతూంది. ఇవాళ నీ చేతుల్తో వడ్డించు"
"స్నానం చేయవా?"
"తరువాత చేస్తాను. ముందు ఆకలి" చిన్నపిల్లాదిలా చొక్కాలేపి పొట్ట చూపాడు.
"మీ ఫారిన్ వాళ్ళు ఆచారాలు పాటించకపోయినా ఆరోగ్య సూత్రలయినా పాటించరా?"
"మీ అని చేర్చకు, నాయనమ్మ. నావాళ్ళు మీరే. నాకేం ఫారిన్ వాళ్ళ మీద వ్యామోహం, ఆరాధనా లేవు. నేను భారతీయుడిని భారతీయుడి గానే జీవించాలని కోరుకుంటాను."
"అయితే రెండు చెంబులుమీద గుమ్మరించుకురా. స్నానం అయిందనిపించాకే నేను వడ్డిస్తాను."
"ఓ.కె. నాయనమ్మ. నేను నీకు బుద్ధిమంతుడి న్తెన మనుమడిని. నువ్వు చెప్పిమాట నేను జవదాటను" అజిత్ నవ్వుతూ బాత్ రూం కేసి పరిగెత్తాడు. టవల్ పుచ్చుకొని.
ఓ గంట తర్వాత,
నాయనమ్మ పెట్టిన భోజనం తృప్తిగా తిని, మేడమిదికి వచ్చి, విశ్రాంతిగా పక్క మీద వాలాడు అజిత్.
దూలంమీద సందుల్లో గూళ్ళు పెట్టుకొన్న పిచ్చుకలు, కిటికీ రెక్కల మీద కూర్చొని రెక్కలు పొడుచుకుంటున్నాయి. వాటి శబ్దాలు అలౌకికమైన ఆనందాన్ని కలుగజేస్తున్నాయి.
అఖిల రూపం తలుచుకుంటే ఆ శబ్దాలంత హాయి కలుగుతోంది. ఒక మెరుపులా మెరుస్తోంది. అఖిల రూపం అతడి హృదయంలో.
ఒక రోజు రాత్రి పక్కమీద విశ్రాంతిగా పడుకోన్నాప్పడు మన స్సంతా అఖిల రూపమే నిండిపోగా, రేపు ఎలాగ్తెనా అఖిలని చూడాలి" అనుకొన్నాడు.
మరురోజు పనులన్నీ మధ్యాహ్నం వరకూ ముగించుకొని, ఉమెన్స్ కాలేజి దగ్గరికి వచ్చాడు మేనమామ కారులో. గేటుకి కొంచెం దూరంలో కారపుకొని గేటు వ్తెపు చూడసాగాడు. గంట నిరీక్షణ తరువాత నీరజతో పాటు వస్తున్న అఖిల కనిపించింది. పలకరించాలని మనసు ఎంత ఉబలాటపడినా, పనిగట్టుకు చూడడానికి వచ్చాడని తెలిస్తే అఖిలకి దురభి ప్రాయం ఏర్పడుతుందేమోనని భయపడ్డాడు. ఆ రోజూ దర్శనంతోటే సరిపెట్టుకొని కారుని వెనక్కి మళ్ళించాడు.