Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 33

 

    థాంక్యూ వహీద్! నీ లెసన్ నెంబర్ -టూ అద్భుతంగా పని చేస్తోంది.
    ఆమె కళ్ళల్లో అంతలోనే నీళ్ళు.
    సుడులు తిరుగుతూ -- కిందకు జారిపోతూ ......
    సైక్లోన్ లో ఊగే వృక్షంలో ఆమె మనసు ఊగిపోతోన్నట్లు శరీరం లోని ప్రకంపనాలు చెపుతున్నాయి.
    ఎడారిలో ఒయాసిస్ ని వెతుకుతున్నట్లు ఆమె పెదాలు తన పెదాల్ని చేరుకుంటున్నాయి.
    వహీద్ గాడి లెసన్ నెంబర్ త్రీ --
    పెదాలు కలిసినప్పుడు చెప్పాల్సిన జానపదం "ఐ లవ్ యూ మిస్ డాష్  డాష్ డాష్"
    "కుముదిని !"
    నిద్రలో నుంచి మేల్కొన్నల్టు కళ్ళు తెరచింది.
    "ఐ లవ్ యూ...."
    నమ్మలేనట్లు చూసింది కళ్ళల్లో మెరుపు .....పెదాల మీద లాస్యం .
    "ఐ టూ లవ్ యూ...."
    ఇలాంటి ఇంగ్లీష్ మీడియం పనిమనుషులను తనింతకు ముందేక్కడా చూళ్ళేదు.
    కౌగిలి మత్తుగానే వుంది గానీ లోలోపల భయం! ఎక్కువ చొరవ చేస్తే నిజంగానే ఇరుక్కుపోతాడేమో!
    కౌగిలి నుంచి కుముదిని దూరంగా జరిగింది .
    "నీ మనసెందుకు బావుందలేదో చెప్పలేవా!"
    పిట్టగోడకు జేరగిలబడింది.
    చెప్పడానికి సంకోచంగా వున్నట్లుంది. మొదలు పెట్టటానికి ఒకటి రెండు సార్లు ప్రయత్నించి విఫలమయింది.
    "నేను చాలా దురదృష్టవంతురాలిని!" కొద్ది సేపటి తర్వాత ప్రారంభిన్చింది .
    "అది నీ అభిప్రాయం ......."
    "కాదు! ఫాక్ట్స్ అంచేత మేరీ పుండరీకాక్షయ్య మీద ఆధారపడక తప్పలేదు ......"
    "ఇప్పుడొచ్చిన సమస్యేముందని?"
    "ఆమె ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఇంతకాలం ఎలాగోలా సహించాను. కానీ ఇంక తట్టుకోడం నావల్ల కాదు ......."
    "ఏం జరిగిందసలు?"
    "ఆమెకు తాగుడు బాగా అలవాటు. రోజూ ఏ అర్దరాత్రికో పుల్ గా తాగిన స్థితిలో ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్తుంటారామే ఫ్రెండ్స్ !"
    "ఆ విషయం ఈ ప్లాట్స్ లో అందరికీ తెలుసు ."
    "ఆ తరువాత ఆమెకు కనీసం ఓ గంట వరకూ నిద్ర పట్టదు."
    "అంటే మీరు జోకొట్టాలా?"
    "అవును --- నా బాడీతో !"
    అప్పుడర్ధమయింది .
    'కానీ అది జరుగుతోంది మీ ఇష్టంతో కాదా?"
    "నాకసహ్యం! ఏ రోజూ కారోజూ ఆ మర్నాడు ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలని అనుకోవటం , ఉదయం లేచాక ఇంకో మంచి జాబ్ దొరికే వరకూ ఎడ్జస్ట్ వాలని సమాధానపడటం -- అలా జరిగిపోతుంది --- వున్న పరిస్థితి ఇంకో రకంగా మారింది. ఒక ఐ.ఏ.ఎస్ ని అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చింది. ఇద్దరూ పుల్ గా తాగి వున్నారు. లోపలి కొస్తూనే ఒకరి కొకరు ముద్దు పెట్టుకుంటూ సోఫా మీదే పడిపోయారు. నేను సిగ్గుతో బిక్క చచ్చిపోయాను. లోపలి గదిలోకి పరుగెత్తి తలుపేసుకున్నాను. ఆ గొడవ ఆ ఒక్క రోజుతోనే పోతుందనుకున్నాను గానీ, ఆ మర్నాడు ఆ ఐ.ఏ.యస్ గాడు ఇంకో మినిస్టర్ని తీసుకొచ్చి ఆమెకు అప్పజెప్పాడు. ఇంక ఆ ఇంట్లో ఉండటం శ్రేయస్కరం కాదని నా కర్ధమై ఇవాళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పాను. నా బట్టలన్నీ కూడా సర్దుకున్నాను. కానీ ఆమె నన్ను బెదిరించింది. ఉద్యోగం మానేస్తే నా మీద పోలీస్ కంప్లయింట్ ఇస్తానంది. నేను వాళ్ళింట్లో డబ్బు తీసుకుని పారిపోయినట్లు అబద్దం చెప్తానంది. నాకు భయం వేసింది. నన్నోదిలేయమని బ్రతిమాలాను, కానీ ఆమె వప్పుకోవటం లేదు. ఇంకొద్ది రోజులు ఉండాల్సిందేనని పట్టు పడుతోంది.
    "ఎందుకు ఉండమంటోంది ?"
    "అదే నాకు అర్ధం కావటం లేదు. నా దగ్గర ఉంటె నువ్వు బోలెడు డబ్బు సంపాదించుకోవచ్చు అంటోంది. అంటే నన్ను కూడా ఆ ఐ.ఎ.యస్ లకూ, మినిస్టర్లకు అప్ప జెప్తుందేమోనని భయం."
    "అయితే త్వరలో ఆమె మినిస్ట్రీ లో చేరటం ఖాయమన్నమాట!"
    "నాకూ అదే అనుమానంగా వుంది -- ఇప్పుడిందులో నుంచి ఎలా బయటపడాలో అర్ధం కావటం లేదు."
    "అర్ధం కావటానికే ముంది? రిజైన్ చేసి మీ ఇంటి కెళ్ళి పో --- లేదా ఇంకో ఇల్లు చూసుకో ."
    ఆమె  ఆ మాటలు వినేసరికి మౌనంగా ఉండిపోయింది.
    "ఏం? నీకూ మేరీ పుండరీకాక్షయ్యను వదలడం ఇష్టం లేదా?"
    "అదేం కాదు. నాకు వెళ్ళిపోవడానికి ఇల్లు లేదు. నా కెవ్వరూ లేరు!"
    సురేష్ ఆశ్చర్యపోయాడు.
    "ఎవ్వరూ లేరా?"
    ఆమె తల ఊపింది.
    "తమాషాగా ఉందే! నీకూ చదువూ సంధ్యలూ చెప్పించి పెద్దదాన్ని చేసి ఓ ఇంట్లో నౌఖరుగా పెట్టి మీ వాళ్ళు హటాత్తుగా మాయమైపోయారా ఏమిటి?"
    "అది నా దురదృష్టం! అంతే!"
    సురేష్ చక చక ఆలోచించాడు.
    ఇదే అవకాశం - తను మేరీ పుండరీ కాక్షయ్యను బ్లాక్ మెయిల్ చేసి ఉద్యోగం సంపాదించుకోడానికి !
    "అల్రైట్! రెండు మూడు రోజులు ఓపిక పట్టు . నేనేదైనా ప్లాన్ ఆలోచిస్తాను సరేనా?"
    ఆమె కళ్ళల్లో అంతవరకూ కనిపించిన దైన్యం తొలగిపోయింది.
    "తప్పకుండా హెల్ప్ చేస్తారా నాకు?"
    "నీ పదాల మీద వట్టు" ఆమెను ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
    "థాంక్యూ" దూరం జరుగుతూ అంది.
    ఆమె వెళ్ళిపోయినా , 701 ప్లాట్ లో చాలాసేపు కుమిదిని గురించే ఆలోచనలు!
    'అయ్ లవ్ యూ" అంటూ కౌగలించుకున్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసిన మెరుపూ కొంచెం కలవరం కలిగిస్తోంది.
    తను నిజంగానే ప్రేమిస్తున్నాడనుకుంటుందేమో!
    అనుకున్నా నష్టమేముంది?
    "ప్రేమ" వరకూ ఫర్లేదు గానీ 'పెళ్లి' అంటేనే కష్టం! పని మనుషులను పెళ్ళి చేసుకునేంత ఉదార స్వభావం తనకు లేదు.
    తన పెళ్ళి శిరీష తో జరగాలి. అంతటి అందాల దేవతను సొంతం చేసుకుంటే ఆ తరువాత తను నిద్రలేమి జబ్బుతో ఎగిరిపోవాల్సి వస్తుంది. అయినా గానీ శిరీషే తనక్కావాలి.
    మర్నాడు టాంక్ బండ్ చేరుకునే సరికి రాధిక అప్పటికే తన కోసం ఎదురుచూస్తోంది.
    "యూ ఆర్ లేట్ బై ట్వంటీ ఫైవ్ మినిట్స్ "
    "బెటర్ లేట్ దెన్ నెవర్ అనేది నా పాలసీ!"
    "చాలా గొప్ప పాలసీ! పదండి! ఆఫీస్ కెళధాం!"
    ఇద్దరూ ఆటోలో ఆఫీస్ కి బయల్దేరారు.
    ఆఫీస్ దగ్గర స్టాఫంతా గుమిగూడి మాట్లాడుకుంటున్నారు.
    రాధికను చూడగానే చాలా మంది ఆమె చుట్టూ మూగారు.
    "ఇతనేనా మీ హజ్ బెండ్/ ఇప్పుడర్ధమైంది -- ఇంతకాలం ఆఫీస్ కి రానీకుండా ఎందుకు దాచి పెట్టావో -- చాలా స్మార్ట్ గా ఉన్నారు కదూ?" నవ్వుతూ అంది రజని.

 Previous Page Next Page