నలుగురు కాలేజీ అమ్మాయిలు ప్రారంభిస్తున్నారు.
నలుగురు మనసులు, ఆ సమయంలో ఉద్విగ్నంగా ఉన్నాయి.
ఉత్తేజంగా వున్నాయి.
వాళ్ళ కనుపాపలు, రేపటి ప్రణాళికను రూపుదిద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. అప్పుడు సరిగ్గా అర్దరాత్రి పన్నెండు గంటలైంది. జీరో అవర్. కౌంట్ డౌన్ ప్రారంభం.
* * * * *
అప్పుడు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలైంది.
ఆ ఆడపిల్లలు పడుకున్న ఆ కాటేజీకి ఆనుకొని వున్న కాటేజ్ లోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు!
హలుపులకు తాళంవేసి, మెట్లుదిగి, అక్కడ ఒక వారగా పార్క్ చేసిన ఈరో హోండా స్టార్టు చేసి, దేవస్థానం ఆఫీసువరకు వచ్చి కాటేజ్ తాళాలు ఇచ్చేసి-
తిరుపతికి బయలుదేరాడు.
షూట్ రోడ్డు నిశ్శబ్దంగా వుంది. ఆ సమయంలో హీరోహోండా నూటపది కిలోమీటర్ల వేగంతో క్రిందకు వెళ్ళిపోతోంది.
ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత తిరుపతి బస్టాండ్ దగ్గర కొచ్చాడతను.
అక్కడ తన వాహనాన్ని ఆపి, సిగరెట్లు కొనుక్కొని మళ్ళీ బండి స్టార్టు చేసాడు.
హీరో హోండా రేణిగుంట రోడ్డువైపు వెళ్తోంది.
అయిదు నిమిషాలు...
పది నిమిషాలు...
పదిహేను నిమిషాలు...
రేణిగుంత అక్కడికి ఇంకో రెండు కిలోమీటర్లు మాత్రమే వుంది.
అక్కడ-
రోడ్డుకి కుదివేపున ఒక రెండంతస్తుల భవనం విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది.
విశాలమైన గేటు, ఆ గేటుకి కుడిప్రక్కన పెద్ద బోర్డు, ఆ బోర్డు మీద-
ఆంద్రవార్త దినపత్రిక
అని పేరు రాసుంది.
హీరోహోండా నేరుగావెళ్లి గేటు దాటాక, పార్కింగ్ ప్లేస్ దగ్గర ఆగింది.
ఆ వ్యక్తి వాహనాన్ని అక్కడ పార్క్జ్ చేసి, గబగబా ఆఫీసువేపు నడిచాడు.
రిసెప్షను దాటి, మెట్లెక్కి ఫస్టుఫ్లోర్ లో కెళ్ళాడు.
సిటీ ఎడిషన్ ఇవ్వడానికి టైమ్ దగ్గర పడుతుండడంతో సిబ్బంది అంతా బిజీబిజీగా వున్నారు. నేరుగా రెసిడెంట్ ఎడిటర్ రూంలోకి నడిచాడు ఆ వ్యక్తి.
ఆ రెసిడెంట్ ఎడిటర్ కి కొత్త కొత్త వార్తలన్నా, కొత్త కొత్త జోకులన్నా చాలా ఇష్టం.
తన దగ్గరకొచ్చిన ఎవర్నయినా కొత్త వార్తేమిటోయ్ కొత్త జోకొకటి చెప్పవోయ్ అని అడుగుతుంటాడు. ఆయన అలవాటుకి అయన సిబ్బంది బాగా బలైపోయి, ఆయన బైటకి వస్తాడంటే చాలు సీట్లు వదిలేసి పరుగెడతారు.
కొంతమంది ఆయన్ని మంచి చేసుకోవాలని చూసే ట్రైనీ సబ్ ఎడిటర్ తమ డస్క్ లనిండా జోకుల పుస్తకాలు, వింత వార్తల పుస్తకాలు తెచ్చి పెట్టుకుని ఆయన దగ్గరకెళ్ళే ముందు వాటినొకసారి తిరగేసి వెళ్తూంటారు.
"కొత్త వార్త ఏదో ఫోన్ చేసి చెప్పావ్ గదా, నాకేం అర్ధం కాలేడు. అదెలాగూ చెప్తావనుకో ముందొక కొత్త జోక్ ఒకటి చెప్పవోయ్ పర్నేష్" రెసిడెంట్ ఎడిటర్ ఎలాగూ అడుగుతాడని తెల్సి ఒక జోకుతోనే వచ్చాడు పర్నేష్.
"ఇంటింటికి వెళ్లి వస్తువుల్ని అమ్మే ఓ సేల్స్ మాన్ తన చేతిలో సూట్ కేసుతో ఓ అపార్ట్ మెంట్ కెళ్ళి తలుపు తట్టాడు. వాసుదేవరావు అనే వ్యక్తి తలుపు తీసి ఆశ్చర్యంగా ఎవరన్నట్టు చూసి జ్ఞాపకమున్నానా రాజేశ్వరరావు గారూ, మనమొకసారి కలిసాం పదేళ్ళక్రితం నారాయణబాబు ఇంట్లో జరిగిన పార్టీలో" అంటూ ఆహ్వానించాడు.
"ఎనీహౌ మళ్ళీ మనమొకసారి కలిసాం. నాకు చాలా ఆనందంగా వుంది వస్తాను" అన్తూవెంతనే వెనక్కి తిరిగాడు సేల్స్ మాన్.
"ఎందుకు వెంటనే వెళ్ళిపోతున్నారు..." అడిగాడు వాసుదేవరావు.
"నేను అమ్మకానికి తెచ్చిన వస్తువు మీకక్కర్లేదు. అందుకు" అని అన్నాడా సేల్స్ మెన్.
"ఏమిటా వస్తువు"
"జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ఎలా పుస్తకాల్ని అమ్మే సేల్స్ మాన్ ని నేను."
ఆ జోక్కి రెసిడెంట్ ఎడిటర్ కులాసాగా నవ్వాడు. నవ్వి-
"ఇప్పుడు చెప్పు, ఆ కొత్త వార్తేమిటో ఏదో నలుగురమ్మాయిలకధన్నావ్ కదా."
"ఉత్తి కధకాదు సార్ ఒక ప్రయోగం వాళ్ళు మాక్లాస్ మేట్సే సర్." అని చంద్రగిరి కోటలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు.
"యువ రక్తమయ్యా... యువరక్తం ప్రవహించే మీలాంటి స్టూడెంట్స్ అందరూ ఇలాగే ప్రపంచాన్ని మార్చేస్తాం మనుషుల్ని మార్చేస్తాం అనుకోవడం సహజం. కానీ, ప్రాక్టికల్ గా వాళ్ళు చెయ్యలేరయ్యా ఎ ప్రయోగం నలుగురు అబ్బాయిల్ని ఎంచుకుని, వాళ్ళని సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతామని శపధం చేసారా నిన్నో, మోనో అనుకున్నారన్నావ్. ఇవాల్టికి ఆ సంగతి మర్చిపోయి వుంటార్లే వోయ్. ఇదా నువ్వు తెస్తానన్న అద్బుతమైన వార్త ఇది వార్త కాదోయ్ జోకు... ఇది సిసలైన జోకు." నవవాడు రెసిడెంట్ ఎడిటర్.
"కాదు సర్. పార్టు టైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నా, ఎప్పుడైనా కన్ ఫర్మ్ చేసుకోకుండా వార్త నిచ్చానా వార్త కానిదాన్ని వార్తగా ఇచ్చానా... ఇది అద్భుతమైన వార్త సర్ ఏడాదిపాటు మన పాఠకుల్ని సస్పెన్స్ లో ఉంచే 'సీరియల్ న్యూస్' సర్. తెలుగు పత్రికా ప్రపంచంలో సెన్సేషన్ న్యూస్ అవుతుంది సర్."
"ఇలా ప్రయోగాలు చేసారు. శపధాలు చేస్తున్నారని రాస్తే సెన్షేషన్ న్యూస్ ఎలా అవుతుందయయా సీరియల్ న్యూస్, సెన్సేషన్ న్యూస్ సరే... అసలు న్యూసేదిందులో." చికాగ్గా అన్నాడు రెసిడెంట్ ఎడిటర్.
"ఫస్టు పార్టు మీకు చెప్పాను సర్. సెకెండ్ పార్టు చెప్పలేదు అందులోనే వుంది సార్. అస్సలు న్యూస్.... నా జర్నలిస్టు బుద్ది ఆ నలుగుర్నీ వదిలిపెట్టలేదు సర్. అందుకే వాళ్ళని మూడు రోజులుగా ప్రతి క్షణం వెంబడించాను.
తిరుపతి కొండమీద వాళ్ళు మోడ్రన్ స్వయంవరం పెట్టారు. వాళ్ళను కున్నట్టుగానే నలుగురు మగవాళ్ళని పట్టారు. రేపట్నుంచీ ఆ కుర్రవాళ్ళని ఒక ఏడాదిలోపుగా సమాజనికి పనికివచ్చే, సమాజం గుర్తించే అద్భుతమైన వ్యక్తులుగా చేయడానికి అంకురార్పణ చేసారు. రెండ్రోజులు వాళ్ళ నలుగుర్నీ రహస్యంగా వెంబడించిన నేను వాళ్ళకాటేజ్ పకక్నే కాటేజ్ తీసుకుని ప్రతి క్షణం జరిగిన ఇన్సిడెంట్స్ నీ రికార్డు చేశాను. వాళ్ళు ఆ కాటేజ్ లో మాట్లాడుకున్న ప్రతిమాటా నా టేప్ రికార్డర్ లో రికార్డర్ లో రికార్డయి వుంది. కావలిస్తే వినండి సర్" జేబులోంచి మినీ టేప్ రికార్డయి వుంది. కావలిస్తే వినండి సర్" జేబులోంచి మినీ టేప్ రికార్డర్ తీసి ఆన్ చేశాడు పర్నేష్. తాము పడుకునే ముందు తన ఫ్రెండ్స్ తో ముగ్ధ మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాయి.
"మరోసారి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఏకైక విషయం.... మన ప్రయోగంలో ఎన్ని కష్టాలైనా భరించండి. మన అల్టిమేట్ గోల్.... మన ప్రయోగాన్ని సక్సెస్ చెయ్యడం" ముగ్ధ మాటల్ని ఆసక్తిగా వింటున్నాడు రెసిడెంట్ ఎడిటర్.