Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 31

 

    ఆమె తన బ్యాగ్ తెరచి అందులో నుంచి నాలుగు వందలు తీసి అతని మీదకు విసిరేసింది.
    "ఇంకో ఇరవై సంగతేమిటి?"
    "ఇంకా ఇరవై ఏమిటి?"
    "ఏయ్ ఏయ్ -- ఈ నకరాలు మన దగ్గర పనిచేయావ్. నాకు పిల్లలు పుట్టారని మీ బాస్ దగ్గర అబద్దం చెప్పినందుకు పది- మనం అయిదేళ్ళు విడిపోమని బాండ్ రాసిచ్చినందుకు ఇంకో పది "
    "అంటే ఫోర్ ట్వంటీ!అంతేకదా! నాకు ముందే తెలుసా సంగతి "
    ఇంకో ఇరవై నోటు అతని మీదకు విసిరింది కసిగా.
    ఆతను ఆ నోట్లు తీసి ముద్దు పెట్టుకున్నాడు.
    "ఆహా! బిజినెస్ ఈజ్ లుకింగ్ అప్"
    ఆమె కోపంగా లేచి నిలబడి వెళ్ళిపోవడానికి ఉద్యుక్తురాలయింది.
    "ఎల్లుండి సంగతేం చేస్తారు మరి?"
    "మై బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్టు మేడమ్! మీ కంజూసీ కబూతర్ పాత్రను వదిలేసి నా ఖర్చులన్నీ పోను ఓ వంద కొడతానంటే వస్తా! లేపోతే గుడ్ బై"
    ఆమెకు విపరీతమైన కోపం, దుఖం వచ్చినయ్.
    "సరే! తీసుకోండి! ఓ ఆడపిల్ల కష్టార్జితం కాజేయడానికి మీకు సిగ్గులేనప్పుడు ఇంక చేసేదేముంది? ఎల్లుండి ఉదయం ఏడు గంటల కల్లా టాంక్ బండ్ కొచ్చేయండి! ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి మా ఆఫీస్ కి వెళదాం"
    "ఓ - యస్!"
    "ఓ జత బట్టలు తెచ్చుకోటం మర్చిపోకండి "
    "మీ ఆఫీస్ వాళ్ళివ్వరా?"
    ఆమె మండిపడుతూ చూసింది. "మా ఆఫీస్ మీ అత్తారిల్లు అనుకున్నారా?"
    "అందరినీ నాగార్జున సాగర్ తీసుకెళుతున్నారంటే అత్తగారిల్లు కాకుండా ఎలా వుంటుంది ?"
    అతను నవ్వుతుంటే ఆమె చరచరా వెళ్ళిపోయింది అక్కడి నుంచి.
    సురేష్ ఇంటికి బయలుదేరాడు. శ్రీహరి , పింకీ -- ఇద్దరూ బయటే నిలబడి వున్నారు -- బహుశా తనకోసమే ఎదురు చూస్తుండి వుంటారు.
    "కమాన్ కమాన్! నీకోసమే చూస్తున్నానోయ్"
    సురేష్ గుండె ఝల్లుమంది.
    కొంపదీసి కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ వాళ్ళు స్టూడెంట్స్ ని మోసం చేసి పారిపోయిన సంగతి వీడికి తెలీలేదు కదా?
    "గుడీవినింగ్ సర్"
    "గుడీవినింగ్ - గుడీవినింగ్ లోపల కూర్చుందాం రా"
    సోఫాలో కూర్చోగానే మొదటి బాణం వదిలాడు.
    "మా మిసెస్ న్యూస్ పేపర్లో చూసిందట. ఏదో కంప్యూటర్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర డబ్బు కాజేసి పారిపోయిందని? అది మా పింకీ చేరిన ఇన్ స్టిట్యూట్ కాదు గదా?"
    సురేష్ కర్చీఫ్ తో చెమటలు తుడుచుకుంటూ పింకీ వేపు చూశాడు.
    తనవేపు టీజింగ్ గా చూస్తోంది.
    "అబ్బే కాదండీ! అది వేరు , మనది వేరు. మన ఇన్ స్టిట్యూట్ యెప్పటికి అలా చేయదు. కావాలంటే పింకీ నడగండి నిన్న సాయంత్రం కూడా కంప్యూటర్ క్లాస్ కెళ్ళి వచ్చింది --- కదు పింకీ?" బ్రతిమాల్తునట్లు చూస్తూ అడిగాడు!
    "యస్ డాడీ! నిన్న కంప్యూటర్ క్లాస్ ల కెళ్ళాను" నవ్వుతూ అంది.
    హమ్మయ్య! బ్రతికిపోయాడు టెంపరరీగా.
    ఎలాగయినా ఇది దినదినగండం? నూరేళ్ళయిషే! ఇక నుంచి పింకియే తనను బ్లాక్ మెయిల్ చేస్తుందేమో ---
    'ఓ! అయితే ఒకే! ప్లీజ్ కారీ అన్ -పింకీ ట్యూషన్ బాగా సాగుతోందా?"
    "చాలా బాగా సాగుతోంది సార్."
    "స్టాండర్డ్ లో ఏమయినా ఇంప్రూవ్ మెంట్ వుందా?"
    'చాలా ఇంప్రూవ్ మెంట్ వుంది ! మొన్న సండేనాడయితే కేపాసిటికీ మించి చాలా హార్డ్ గా పనిచేసింది "
    "నాకు తెలుసోయ్! దాని అయ్ క్యూ చాలా ఎక్కువ"
    :"ఏదో రోజు గిన్నిస్ బుక్ లో కేక్కుతుందండి!"
    శ్రీహరి మొఖంలో విపరీతమయిన అనందం కనిపించింది.
    "దట్స్ గుడ్." అతను లోపలి కెళ్ళిపోయాడు.
    పింకీ బాగ్ లో నుంచి స్కూలు బుక్స్ బయటకు తీసింది.
    "ఏ సబ్జెక్టు చెప్పను?"
    "గైనకాలజీ-"
    అదిరిపడ్డాడు.
    "మీ మమ్మీని పిలవనా?"
    "మమ్మీ కసలు రాదు --- అయినా మమ్మీని పిలిస్తే లేచిపోయిన కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ మనం డబ్బు కట్టిందే అని డాడీకి చెప్పేస్తుంది ."
    గతుక్కుమన్నాడు.
    "అంటే ---- అదే ఇదని నీకు తెలుసా?'
    "ఇంగ్లీషు పేపర్లో కామసూత్ర  ఈ ఎడ్వర్టయిజ్ మెంట్ చూస్తుంటే ఆ పక్కనే న్యూస్ అయిటమ్ లో వుంది ! డాడీ చూడకుండా ఆ పేపర్ కట్ చేసిపారేశాను."
    "ఒండర్ పుల్! నీ హెల్ప్ కి చాలా థాంక్స్!"
    "నేనెవరికీ హెల్ప్ ఊరికే చేయను "
    "అంటే?"
    "నువ్ నాకో హెల్ప్ చేయాలి?"
    "ఓ యస్! తప్పకుండా చేస్తాను ! ఏమిటది ?"
    "మా ఫ్రెండ్ సుష్మా లేదూ? దానికి ప్రేగ్నన్సీ వచ్చింది. అది పోగొట్టాలంటే ఏం చేయాలి ?"
    సురేష్ ఉక్కిరి బిక్కిరయ్యాడు.
    "ఏ ....ఏ .....ఏమిటి? మీ ఫ్రెండ్ కి ప్రెగ్నెన్సీ వచ్చిందా?"
    "అవును ! ఏం / రాకూడదా?"
    "మీ మీ మీ ఫ్రెండ్ కా?"
    "అవును"
    "ఏ క్లాస్ చదువుతోంది ?"
    "సెవెన్త్ క్లాస్"
    "ఏయ్ -- నీకేం పిచ్చెక్కిందా? సెవెన్త్ క్లాస్ చదివే పిల్లకు ప్రెగ్నెన్సీయా? అసలు 'ప్రెగ్నెన్సీ' అనే పదానికి అర్ధం తెలుసా?"
    "తెలుసు!"
    "ఏమిటి?"
    "వొమన్ లోని 'ఫర్టేయిల్ ఎగ్' ని మేల్ లోని....."
    "స్టాపిట్!" గాబరాగా అరచాడు.
    ఆమె ఆశ్చర్యంగా చూసింది.
    "ఎందుకలా అరచావ్?"
    "పిచ్చెక్కి అరచాన్లె ! ఇంక నువెం చెప్పనక్కరలేదు- నాకంటే మీకే బాగా తెలుసు! ఇంతకూ అదెలా వచ్చింది?"
    "ఎలా వస్తుందేమిటి? పార్టీలో - దాన్ని పోగొట్టటానికి మేము ట్రై చేశాం గానీ పోవటం లేదు."
    "ఏం చేశారు మీరు?"
    "వానిషింగ్ క్రీం రాశాం పదిరోజుల పాటు! అయినా పోలేదు -" షాక్ మీద షాక్ తగులుతోంది.
    "వానిషింగ్ క్రీమ్ రాశారా?"
    "అవును!"
    "అదెందుకు రాయటం ?"
    "వానిషింగ్ క్రీమ్ అంటే వానిష్ చేసే క్రీమే కదా మరి -"
    సురేష్ రెండు చేతుల్తో తల పట్టుక్కుర్చున్నాడు.
    "మీదెం జనరేషనో నాకర్ధం కావటం లేదు.
    "స్టార్ టి.వి జనరేషన్ --- " నవ్వాపుకుంటూ అంది.
    "ఆ విషయం మీ సుష్మ ఇంట్లో వాళ్ళకు తెలుసా?"

 Previous Page Next Page