Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 30

 

    అతని చేతికి కాష్ ఇచ్చేసిందామే.
    ఆ నోట్లను ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడతను.
    "ఒక రిక్వస్ట్ ." దీనంగా చూశాడు.
    "ఏమిటి?"
    "నా జీవితంలో ఇంత డబ్బు నాకెప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేదు. అందుకని నాకెంత ఆనందంగా ఉందొ చెప్పలేను. నా ఆనందాన్ని మీకు తెలియజేయటానికని మీ మెడ కింద ఒక్కసారి ముద్దు పెట్టుకోవచ్చా?"
    ఆమె విపరీతంగా సిగ్గుపడి పోయింది.
    "ఒకే! త్వరగా కానీండి. రోడ్ ఖాళీ ఉంది మళ్ళీ ఎవరోకరోస్తారు"
    సురేష్ చప్పున ఆమె మెడ కింద ముద్దు పెట్టుకున్నాడు.
    హటాత్తుగా ఆమె వెక్కి వెక్కి ఎడ్చేయటం గమనించే సరికి అదిరిపోయి దూరంగా జరిగాడు.
    "ఏమిటలా ఏడుస్తున్నారు ?'
    "నా శీలం సర్వనాశనమై పోయిందివాళ ------"
    "భలేగున్నారే మీరు! మనం వట్టి ముద్దేగా, పెట్టుకుంది ."
    "మిగతాది కూడా రేపో మాపో చేస్తాం కదా"
    "నో నో నో -- అలాంటిదేం లేదు లెండి. ఇక్కడితో పుల్ స్టాప్ !"
    సురేష్ బస్ దిగి నాలుగడుగులు వేసేసరికి జగదాంబ పిలవటం వినిపించింది.
    "ఏయ్ సురేష్ ఇదిగో "
    "ఏమిటి?"
    "ఏం సంగతి ఇయాల్రేపు అంజాన్ కొడుతున్నావ్?" పైట సరిజేసుకుంటూ అడిగింది.
    "లేకపోతే ఎంతకాలం ఇలా? ఎదురుచూసి ఎదురుచూసి మనిద్దరం చచ్చేట్లున్నాం గానీ నీ మూడో మొగుడు తాగి తాగి తెగ బలసిపోతున్నాడు."
    "ఇగో - ఇంకోసారలా మాట్లాడినా వంటే మంచిగుండదు ."
    "అవునులే వట్టిగా మాట్లాడితే ఏం మంచిగుంటది. యాక్షన్ గావాలె "
    "ఇదిగో -- ఆ పోరి ఎవళ్ళో వచ్చి ఈ లెటర్ నీకిమ్మన్నది! ' అంటూ జాకెట్ లో నుంచి ఓ లెటర్ తీసిచ్చింది .
    "ఏం లేటరది? లవ్ లెటరా?"
    "లవ్ లెటర్ గాడు ఏం కాదు నిన్ను సాయంత్రం అర్జంటుగా టాంక్ బండ్ లో అన్నమయ్య విగ్రహం దగ్గర కలుసుకోమంది."
    "నువ్వెందుకు చదివినా?
    నేనెప్పుడు చదివినా?
    చదవకపోతే ఏమి రాసిందో ఎలా తెలిసింది .
    ఆమె పోరాపాటు తెలుసుకుని చప్పున నాలిక్కోరుకుంది.
    "అధట్లుండనీ గానీ ఆ విగ్రహం తాన కాల్సుకునేం జేస్తరు?"
    "భజన చేస్తాం"
    "దూ అన్నీ దిల్లగీనే నీకు."
    సురేష్ టైం అడిగి తెలుసుకున్నాడు. దూరంగా నిలబడ్డ వ్యక్తీని.
    మధ్యాహ్నం మూడవుతోంది.
    టాంక్ బండ్ చేరుకొని అన్నమయ్య విగ్రహం పక్కన నిలబడదు. పక్కనే చిలక జోస్యం వాడు చిలకను కాలికి కట్టేసుకుని గాడ నిద్రపోతున్నాడు.
    వచ్చే పొయ్యే జిల్లాల టూరిస్ట్ లు విగ్రహాలన్నీ చూసుకుంటూ పేర్లు తెలీక తెల్లబోతూ ముందుకి వెళ్ళిపోతున్నారు.
    "ఏయ్ అబ్బాయ్- చిలకజోస్యం చెపుతావా? ఓ పల్లెటూరి టూరిస్ట్ అడిగింది.
    సురేష్ ఉలిక్కిపడ్డాడు.
    చిలుక పక్కనే నిలబడే సరికి తనే చిలుక జోస్యం వాడనుకుంది.
    "చెప్తా?"
    "అయితే మా జోసప్ గురించి చెప్పు! అయన పోయి సంవత్సరం అయింది."
    సురేష్ చిలకను ముందుకు లాగాడు. అది ఓ పుస్తకం  లాగింది. పుస్తకం తెరచి నోటి కొచ్చింది చెప్పేశాడు.
    "జోసేప్పా! బ్రహ్మాడంగా వున్నాడు"
    ఆమె గొంతు తగ్గించి రహస్యంగా అడిగింది.
    "నేను , ఇంకోడు ఎవరితోనైనా తప్పు చేస్తే తను గ్రెన్ లో ఒక చుట్టూ తిరుగుతానని పోయేముందు చెప్పాడు! తిరిగాడా మరి?"
    "ఓ! అర్దమయింది! నువ్ చెప్పేది ఈ బొంగరం జోసేఫా / బొంగరం తిరిగినట్లు తిరుగుతున్నాడు పాపం!"
    ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.
    "నేననుకుంటూనే ఉన్నా! నన్ను క్షమించమని చెప్పు జోసఫ్ కి"
    "తిరగటం అపాక చెప్దాం లే!"
    ఆమె ఓ రూపాయి బిళ్ళ చిలకిచ్చి వెళ్ళిపోయింది.
    "వచ్చారా?' అంటూ సమీపించింది రాధిక.
    "ఏమిటంత అర్జంటుగా రమ్మని రాశారు ?'
    "ఎల్లుండి మా కంపెనీ పదేళ్ళయిన సందర్భంగా మా బాస్ నాగార్జున సాగర్ లో మొత్తం మా స్టాఫ్ అందరికీ పెద్ద ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేశాడు "
    "చేస్తే డిన్నర్ కి వెళ్ళండి! నాకెందుకు చెపుతున్నారు ?"
    "ఎందుకంటె ఆ డిన్నర్ కి మా ఆఫీస్ స్టాపంతా వాళ్ళ భార్యలు లేక భర్తలతో విధిగా హాజరవ్వాలని చెప్పాడు. మాకోసం నల్లూరి సుదీర్ కుమార్ మ్యూజిక్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశాడు."
    "అయితే?"
    "ఇప్పుడు నాతొ మీరు రాకపోతే ఆయనకు అనుమానమోస్తుంది. ఆరోజు మనం ఇంటర్వ్యూ లో ప్రవర్తించిన తీరే ఆయనకు కొంచెం అనుమానం కలిగించింది. ఇప్పుడు మనం ఆ అనుమానాన్ని దూరం చేయటానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు."
    "ముందు నా టెన్ పర్సెంట్ జీతం ఏదీ?"
    "నేనేం పారిపోన్లె! ఇవాళేగా జీతం తీసుకుంది --- ఎగ్గోట్టెసినట్లే మట్లాడుతూన్నారేమిటి ?"
    కోపంగా అంది.
    'సరే! నేను మీ కంపెనీ పిక్నిక్ కి వస్తాను గానీ అందుకు మీరో వందరూపాయలు ఫీజు ఇవ్వాల్సుంటుంది."
    ఆమె అదిరిపడింది.
    "ఏమిటి? ఖర్చులన్నీ వేరేవాళ్ళు పెట్టుకుని పిక్నిక్ తీసుకెళ్ళినా మీకు ఫీజువ్వాలా?"
    "అవన్నీ కడుపునిండిన మీలాంటి వాళ్ళకి! నాకు పిక్నిక్కేమిటి -- దరిద్రంతో చస్తుంటే ?'
    "మిస్టర్ సురేష్! దిసీజ్ టూ మచ్! మీకు నెలకు నాలుగొందలు ఇస్తోంది చాలక ఇంకా అడుగుతున్నారా? మానాభిమానాలున్న వాళ్ళెవరూ ఇలా పీడించరు.
    "మాటలు తిన్నగా రానీండి! నాలుగొందలూ మీరేం దానం చేయటం లేదు నన్ను ఉపయోగించుకుని ఉద్యోగం సంపాదించుకున్నందుకు ఇస్తున్నారు. మీకు పేరుకి మొగుడిగా ఉండటం కాకుండా ఇంకా ఏమైనా ఎక్సట్రా పనులు చేయాల్సి వస్తే ప్రతి ఎక్స్ స్ట్రా వర్క్ కి నిర్ధాక్షిణ్యంగా చార్జ్ చేస్తాను. అందుకిష్టమైతేనే ఏక్ స్ట్రా పనులు చెప్పండి. లేకపోతే ఊరుకొండి! అంతేగానీ సొంత పెళ్ళాం లాగా సాధించారంటే మాత్రం మర్యాదగా వుండదు ఆ" అనేసి లోలోపల గొణుక్కుంటున్నట్లు 'కంజ్యూస్ కబూతర్ " అన్నాడు వెక్కిరింపుగా.
    "కంజూస్ కబూతర్ నేను కాదు -- మీరు "
    "నేనెప్పుడూ కంజూసీ పనులు చేయను! వన్ బై టూ కంజూసీ కబూతర్"
    ఆమెకు కోపంతో , రోషంతో కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినాయ్.
    "నా ఇష్టం! నేను కంజూసీయే! అడగడానికి మీరెవరు?"
    "మీ టెంపరరీ మొగుడిని. ముందు నా జీతం నాకు పడేయండి! నేను వెళ్ళాలి "

 Previous Page Next Page