"ఇక్కడి కొచ్చేసరికి తొమ్మిటి దాటింది. కారు పెట్రోలు బంక్ దగ్గర ఆగింది. పెట్రోలు కొట్టించాక వీరభద్రుడు డబ్బా పట్టుకొని నీళ్ళ దగ్గర దిగాడు. బంక్ నుంచి అప్పుడు బయలుదేరుతున్న ఖాళీ లారీలోకి ఎక్కి నక్కి కూర్చున్నాను. లారీ ఓక హొటల్ దగ్గిరకొచ్చి ఆగింది. లారీదిగి ఆటో ఎక్కి బస్ స్టాండుకు బయలుదేరుతుండగా, రాంబాబు కారు లారీ ఉన్న చోటికి రావడం కన్పించింది. బహుశవాళ్ళు నాకోసం, ఊరంతా, గాలిస్తూ ఉండాలి. నా అదృష్టం బాగుంది. సమయానికి మీరు పోన్లో దొరికారు" మాధవి నిట్టూర్చింది.
"ఓ.కె. జరిగిపోయిన దాన్నిగురించి నువ్వు భయపడాల్సింది గానీ బాధపడాల్సిందిగానీ ఇప్పుడేమీలేదు.నీకు తెలిసినంతవరకు నిర్భయంగా చెప్పు. మాధవిని ప్రోత్సహించాడు ఉదయ్ చంద్ర.
"మూడు నెలల క్రితం ఓ రోజున శివరామయ్య కలకత్తావచ్చాడు. ఈ రోజు ఈ పథకానికి అంకురార్పణ మొదట్లో రాంబాబూ దగ్గర కలకత్తావచ్చాడు. ఆరోజే ఈ పతాకానికి అంకురార్పణ మొదట్లో రాంబాబూ శవరామయ్య నన్ను పూర్తిగా నమ్మారు. వీరభద్రుడు రాంబాబు దగ్గర కలకత్తాలోనే వుంటూండేవాడు. రాంబాబు చెప్పే పనులన్నీ చేస్తూ అతడికి నమ్మిన బంటులా వుండేవాడు ఇరవైఏళ్ళ క్రితం శివరామయ్యకు ఈ తోటస్వాధీనం అయిందట,"
"ఎలా?"
"శివరామయ్య తండ్రి దగ్గిర డబ్బుతీసుకొని ఈ తోటకు సంబంధించైనా వారసుడివాడో తాకట్టు పెట్టాడట. ఆ వారసుడి మరణానతరం ఈ తోట శివరామయ్య పరం అయింది."
"అంటే, ఆ తోట, ఆ బంగళా శివరామయ్య పూర్వీకులదికాదన్న మాట!"
"కాదు, ఆ తోటలోనే పుట్టిపెరిగిన అడివయ్య అరవైఏళ్ళగా ఆ తోటలోనే కాపురం వుంటున్నాడు. భార్య చనిపోయాక వంటరిగా ఆ తోటపని చూసుకుంటున్నాడు. తోటలో ఒకచోట లక్షలు విలువ చేసే నగలు నిక్షిప్తం చెయ్యబడి వున్నాయని అడివయ్య శివరామయ్యకు చెప్పాడు. మొదట్లో శివరామయ్య నమ్మలేదు వాళ్ళ వంశ చరిత్ర తెలుసుకొన్న శివరామయ్యకు అడివయ్య మాటమీద నమ్మకం ఏర్పడింది. అప్పట్నుంచి అనేకరకాలుగా ఆ గుప్త ధనాన్ని వెలికి తోయ్యడానికి ప్రయత్నించాడు. కాని ఫలితం చిక్కలేదు. అయినా ఆశ చావలేదు. అందుకే ఆ తోటనూ బంగళానూ అమ్మకుండా వుంచాడు. తోట మొత్తం కౌలుకిచ్చి చేయించడంకూడా ఇష్టంలేదు. తోటలోకి ఇతరులకు ప్రవేశం లేకుండా జాగ్రత్తపడ్డాడు." అని ఆగింది మాధవి.
"అందుకే ఆ చుట్టుపట్ల వ్యవసాయం అభివృద్ధిచెంది రైతువత్తిడి పెరగడం, బయటివాళ్ళు వ్యాపారరీత్యా వచ్చిపోవడం ఇష్టంలేని శివరామయ్య ఆ తోటనూ, ఆ బంగళానూ శిధిళావస్థలోనేవుంచాడు.
"అది ఒకరకంగా రాంబాబు ఆడిన నాటకానికి బాగా ఉపయోగపడింది. డాక్టర్ గారూ! మీరేచూశారు. అనుభవించారు ఆ బంగళా, ఆ తోట మొత్తం అవుడోర్ సెట్ ళా ఉపయోగపడింది. ఆ వాతావరణం అంతా వాడాడించిన భీభత్సనాటకానికి మంచి బ్యాక్ డ్రాప్ గా ఉపయోగపడింది."
"నాకూ ఈ తోటకూ సంబంధం వున్నట్టు ఎలా తెలుసుకున్నాడు శివరామయ్య?"
"అడివయ్య చెప్పిన కొన్ని ఆధారాలను పట్టుకొని సమాచారం సేకరించే ప్రయత్నంలో పడ్డారు. కొన్ని సంవత్సరాలగా మీ వంశానికి సంబంధించిన విషయాలను సేకరించారు. ఆ తోటా, ఆ బంగళా , ఆ దరిదాపుల్లో వున్న అరవై డెబ్బయ్ ఊళ్ళూ చంద్రశేఖర వీరప్రసాదు అనే జమీందారు అధీనంలో వుండేవి. ఆయనగారిని సంతానం లేనందువల్ల సూర్యచంద్ర వరప్రసాద్ గారిని దత్తతకు తీసుకున్నారు. కాని ఆ జమీందారుకు ఓక తమ్ముడు వున్నాడు. అతడికి తన కొడుకుని దత్తతకు ఇవ్వాలని వుండేది. అతడి ప్రయత్నం నెరవేరలేదు."
"కారణం?"
"జమీందారుకు తన తమ్ముడిమీదగానీ, అతడి కొడుకుమీదగానీ సదభిప్రాయం లేదట. పైగా రాణిగారు సూర్యచంద్రప్రసాద్ నే దత్తతకు తీసుకోవాలని పట్టుపట్టింది. ఆమె పట్టుదలే నెగ్గింది. జమీందారుగారు బ్రతికున్నంత వరకూ వాళ్ళేమీ చెయ్యలేకపోయారు. పెద్ద జమీందారుగారి మరణానంతరం సూర్యచంద్ర ప్రసాదుగారే వ్యవహారాలు చూసుకోసాగారు. శరభయ్య అనేవాడ్ని తన దివాన్ గా నియమించారు" ఓ క్షణం ఆగి మళ్ళీ చెప్పసాగింది.
అసలు ఆ ఎస్టేట్ దివాస్ పెద్ద జమీందారుగారు చనిపోవడానికి ఆరు నెలల ముందే హత్య చేయబడినారట. దివాన్ శరభయ్య జమీందారు దాయాదులతో చేతులు కలిపాడు. చంద్రకిరణ్ పుట్టిన ఎడాదికే జమీందారుగారు పక్షవాతానికి గురి అయినారు అప్పట్నుంచి శరభయ్య ఆడిందే ఆటగా పాడిందే పాటగా జమీందారి వ్యవహారాలలో పెత్తనం చెలాయించాడు. సూర్యచంద్రప్రసాదు పక్షవాత రోగంనుంచి కోలుకోసాగారు. ఆయన కోలుకుంటారని శరభయ్య కలలోకూడా అనుకోలేదు. దాంతో శరభయ్య దాయాదులతో చేతులు కలిపి కుట్రపన్నాడు.
"ఆగిపోయావేం? ప్రొసీడ్."
"బంగళానంత భూతగృహం మార్చివేశాడు శరభయ్య మెట్ల మీద నుంచి త్రోసివేసి రాణిగారిని హత్యచేశారు. ఆ తర్వాత శరభయ్య దాయాదులతో కలిసి ఒకప్లానువేసి ఓక ఒడంబడికకు వచ్చాడు...."
"ఏమిటా ఒడంబడిక?"
"జమీందారుగారిని చంపాలి. అతడి వారసుడైన చంద్రకిరణ్ ను కూడా మాయం చెయ్యాలి. జమీందారీకి సంబంధించిన నగలూ నట్రా తన వాటాగానూ, తోటా,బంగళా జమీందారు దాయాదుల వాటాగానూ పంచుకోవాలనే ఒడంబడిక తీసుకొన్నారు. జమీందారుని హత్యచేసేందుకూ, అతడి కుమారుడు చంద్రకిరణ్ ను కిడ్నాప్ చేసేందుకూ పథకం సిద్దం అయింది, వారి పథకాన్ని జమీందారుగారు పసిగట్టారు. వెంటనే నగలు ఆ తోటలో పాతిపెట్టారు. ఐదేళ్ళ కొడుకుని తీసుకొని పారిపోయారు! జమీందారుగార్ని శరభయ్య, అతడి మనుషులూ పట్టుకొనే ప్రయత్నంలో తరుముకొచ్చారు చెరువు కట్టన గుడిసె లోవున్న వెంకయ్యకు తన బిడ్డను అప్పగించి ఆ పసివాడ్ని అనసూయయమ్మగారి దగ్గరకు క్షేమంగా చేర్చమని కోరారా జమీందారు సూర్యచంద్ర ప్రసాదుగారు.
"అనసూయమ్మ గారెవరూ?" విచ్చిపోతున్న కారుమేఘాలు, మళ్ళీ ఒక్క సారిగా కమ్ముకున్నట్లూ, కారుచీకట్లు తనను చుట్టేస్తున్నట్లూ అన్పించింది ఉదయ్ చంద్రకు.
"అనసూయమ్మగారు ఎవరోకాదు మీ అమ్మగారే...." ఆగింది.
"మాధవీ! పర్వాలేదు చెప్పు. అనసూయమ్మగారు నా కన్నతల్లి కాదని నాకు తెలుసు. అనసూయమ్మ జమీందారు సూర్యచంద్రప్రసాద్ కు ఏమౌతుందని నేను అడుగుతున్నాను.
"జమీందారుగారి స్నేహితురాలు."
"అంటే?"
"చట్టరీత్యా వివాహం కాకపోయినా, జమీందారుగారు ఆమెను భార్యగానే చూసుకోనేవారట. ఆమె అంటే ఆయనకు ఎంతో గౌరవమట వెంకయ్య పిల్లవాడ్ని తీసుకొని. అనసూయమ్మ దగ్గర కెళ్ళిన కొద్దిసేపటికే, శరభయ్య మనుషురొచ్చి జమీందారుగారిని చుట్టేశారట. వెంకయ్య చంద్రకిరణ్ ను సురక్షితంగా అనసూయమ్మగారి దగ్గిరకు చేర్చాడు. ఆ తర్వాత శరభయ్య మనుషులు వెంకయ్యకోసం, చంద్రకిరణ్ కోసం గాలింపు ప్రారంభించారు.
"ఆరు నెలల తర్వాత వెంకయ్యను వేరే ఊళ్ళో అతడి మేనత్త ఇంట్లో పట్టుకొన్నారు. వాళ్ళుపెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక వెంకయ్య ఆ రహస్యం బయటపెట్టేశాడు. కానీ అప్పటికే చంద్రకిరణ్ ఏడువేల మైళ్ళ దూరంలో శరభయ్యకూ, దాయాదులకూ అందనంత దూరంలోవున్నాడు అనసూయమ్మ తనకున్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసింది. అమెరికాలోవున్న ఓక బంధువు సహాయంతో చంద్రకిరణ్ ను తీసుకొని స్యూయర్క్ వెళ్ళి పోయిందని తెలిసింది.
తీగలాగితే డొంకంతా కదిలినట్టు, వెంకయ్య హత్యకేసులో పాలీసులు శరభయ్య మనుషుల్లో ఒకడ్ని చేశారు. అతడే మొత్తం కథ బయటపెట్టాడు. జమీందారుని, వెంకయ్యనూ హత్యచేసినందుకు శరభయ్యకూ, కొందరు జమీందారుగారి దాయాదులకూ యావజ్జీవ ఖైదుపడింది కొద్దికాలానికే శరభయ్య జైల్లో చనిపోయాడు పెద్ద జమీందారు వీరవర ప్రసాదుగారి మిగిలిన దాయాదులు, తోట, బంగళా కుదువపెట్టి డబ్బు తీసుకొన్నారు. తండ్రి మరణానంతరం శివరామయ్యకు ఆ తోటమీద హక్కు సంక్రమించింది.
"తర్వాత?"
"అడివయ్యద్వారా జమీందారుగారికి సంబంధించిన నగలు ఆ తోటలో నిక్షిప్తం చెయ్యబడి వున్నాయని తెలుసుకోన్నాడని చెప్పానను కొంటా?"
"అవును."
"దానిని కనిపెట్టడానికి శివరామయ్యవల్ల కాలేదు. తమ్ముడికొడుకు మెజిషియన్ అయిన రాంబాబుని ఆశ్రయించాడు. రాంబాబు ఆదేశాల ప్రకారం గతచరిత్రంతా తెలుసుకోవడం జరిగింది. రాంబాబు అఖండుడు. మద్రాసులో అనసూయమ్మగారి బంధువులున్నట్టు తెలుసుకొన్నాడు. వారి ద్వారా అనసూయమ్మగారి గురించిన సమాచారం సేకరించి అమెరికా వెళ్ళాడు."
"రాంబాబు అమెరికా వెళ్ళాడా?"
"అవును అప్పటికే అనసూయమ్మగారు తన కొడుకుతో ఇండియాకు తిరిగి వెళ్ళారని తెలుసుకొన్నాడు. ఆమె కొడుకు సైకియాట్రిస్టు అనికూడా తెలుసుకొన్నాడు. అలా ఇరవైరెండేళ్ళ చరిత్ర వివరాలను ఓక పథకం ప్రకారం తెలుసుకొన్నాడు. ఆ సైకియాట్రిస్టు పేరుకూడా తెలుసుకొన్నాడు. అతడ్ని ట్రాప్ చేసే పథకం వేశాడు. అందులో నేనొక పాత్రను. నా పాత్రపేరు 'మానసి' నా పాత్రను నేను విజయవంతంగా నిర్వహిస్తే లక్షరూపాయలూ, శివరామయ్య తియ్యబోయే సినిమాలో హీరోయిన్ వేషమూ ఇస్తామని ఆశ చూపించారు. మూడు నెలల క్రితం రాంబాబుతో కలిసి తోటలోవున్న బంగళాకు వచ్చాను. రాంబాబు ఇచ్చిన సూచనల మేరకు నా శక్తికొలది అమోఘంగా నటించానో లేదో డాక్టర్ గారూ, మీకే తెలుసు. బాగా నటించానుగదూ."
డాక్టర్ జయంత్ వచ్చే నవ్వును ఆపుకోలేక పక్కున నవ్వేశాడు.
"అయితే! మాధవీ పీకలమీద కొచ్చినా నీకింకా సినిమా పిచ్చి వదల్లేదుకదూ?" అన్నాడు జయంత్.
"షి ఈజ్ ఎ బారన్ ఆర్టిస్టు జయంత్! ఏం చేస్తాం ఆవిడ దుర దృష్టం ఇది."
"నో!నో! డాక్టర్! ఇది నా అదృష్టంగానే భావిస్తున్నాను. మీరు ఆదుకోకపోతే నేను ఈ పాటికి ఏమైపోయి వుండేదాన్నో?" ఊహిస్తేనే గుండెలు చిక్కపడుతున్నాయి."
"ఇదీ ఆ రాంబాబు రాసిచ్చిన డైలాగేనా?" జయంత్ కంఠం కంచు గంటలా ,మోగింది.
అది వింటూనే డాక్టర్ ఉదయ్ నిశ్చేష్టుడైపోయాడు.
మాధవి రెండుచేతులూ ముఖానికి అడ్డం పెట్టుకుని భోరున ఏడ్చేసింది.
"ప్లీజ్ నన్ను నమ్మండి. ఇది నాటకంకాదు.డాక్టర్ మీరు నమ్మకపోతే మీ చేతులతోనే నా పీక నోక్కేయండి. ఆ దుర్మార్గులకు మాత్రం నన్ను అప్పగించకండి. మీకు పుణ్యముంటుంది డాక్టర్" వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నది.
"మాధవీ టేకిట్ ఈజీ! డాక్టర్ జయంత్ తమాషాకు అన్నాడు. ఊరుకో ఏడవకు." ఉదయ్ మాధవిని ఓదారుస్తూ అన్నాడు.
"కమాన్ గెటప్. బాగా అలసిపోయి వున్నావు. హాట్ వాటర్ బాత్ తీసుకొని భోజనం చెయ్యి. ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకో. నిద్రపట్టకపోతే డాక్టర్ జయంత్ నిద్రమాత్రలిస్తాడు." ఉదయ్ మాధవి తల నిమురుతూ బుజ్జగించాడు.
మాధవి చిన్నపిల్లలా కళ్ళుతుడుచుకొని ఉదయ్ ను రెండుచేతులతో గట్టిగా పట్టుకుంది!
అదిచూసి ముసిముసిగా నవ్వుకొన్నాడు జయంత్.
"జయంత్ మాధవిని ఇక్కడ వుంచడం క్షేమంకాదు. ఆ దుర్మార్గులు ప్రశాంత నర్సింగ్ హొమ్, క్రాంతీ నర్సింగ్ హొమ్ లమీద ఒక కన్ను వేసి వుంచుతారు. మాధవిని మీ ఇంటికి తీసుకెళ్ళు. డియస్పీ విల్సన్ రావుకు ఫోన్ చేసి ఇద్దరు కానిస్టేబుల్స్ ను పంపించమని చెప్పు. ఇంటికి కాపలాగా. ఈ రాత్రికి మాధవిని కాపాడుకుంటే చాలు. రేపు ఉదయం పోలీసురిపోర్టు ఇవ్వవచ్చు. పోలీసులు రంగంలో దిగారని తెలిస్తే వాళ్ళు రాత్రికిరాత్రే పరారయిపోతారు. వాళ్ళు ఈ రాత్రంతా మాధవికోసం ఈ ఊళ్ళో వెదుకుతూనే వుంటారు. మాధవి రక్షణ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. ఊఁ మీరు బయలుదేరండి" ఉదయ్ లేచి తలుపు తెరిచాడు.