Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 29

 

    అయిస్ క్రీమ్ తిని బయటికొచ్చారు . సురేఖ డ్రస్ చాలా రివీలింగ్ వుంది! టేబుల్ చాటున తెలీలేదు.
    "ఒకే మాయజీ! ఎప్పుడయినా ఆ కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ వాడు దొరికితే నాకు ఇన్ ఫర్మేషన్ ఇవ్వండి !"
    "షూర్! మీ అడ్రస్ ఏమిటి?"
    "కేరాఫ్ జగదాంబ , ద్రౌపతీ బూక్ స్టాల్ , అమీర్ పేట బస్ స్టాప్ పక్కన -'
    "ద్రోపదీ బుక్ స్టాలా? తమాషాగా వుందే?"
    "జగదాంబకు చాలా నేచరాల్ గా సూటవుతుంది లెండి! నేను వెయిటింగ్ లిస్ట్ నెంబర్ పైవ్---"
    మాయ సురేఖ కూడా విడిపోయారు.
    "సీయూ ఎగైన్ ---"
    తను రోడ్ మీద కొద్ది దూరం నడిచేసరికి వెనుకనుంచీ కారు వచ్చి ఆగింది.
    సురేఖ తొంగి చూసింది డ్రైవింగ్ వీల్ దగ్గర్నుంచి.
    "హలో! మళ్ళీ మీరేనా ఇండియన్ జీ?"
    ఆమె సిగ్గుపడింది.
    "కారేక్కండి ! డ్రాప్ చేస్తాను"
    "ప్రామిస్ !"
    "ప్రామిస్ "
    సురేష్ ఆమె పక్కనే కూర్చున్నాడు. కారు బయల్దేరింది.
    "నాకింకా నమ్మకం కలగటం లేదు. అసలే సిగ్గుపడే టైప్ అన్నారు. ఇలా రోడ్డు మీద వెళ్ళే వాడిని కారులో ఎక్కించుకుని --"
    "మీతో కొంచెం మాట్లాడాలి !"
    "నా కర్ధమయింది లెండి! మేము కాలేజీలో చదివే రోజుల్లో చెప్పుకునే వాళ్ళం! మెడికల్ కాలేజీ హాస్టల్ గార్ల్స్ రోజుకో అందమయిన కుర్రాడిని కారులో ఎత్తుకుపోయి హాస్టల్లో పడేసి అందరూ రేప్ చేసే వారని! ఇప్పుడు జరుగబోయేదదే కదూ? అనందంగా అడిగాడు .
    'అది మీ బాయ్ స్టూడెంట్స్ ఫాంటసి!"
    నిరాశ పడిపోయాడు . "అంతేనా?"
    "అంతే!'
    కాదు ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ మీద ఓ చెట్టు కింద ఆగిపోయింది.
    "ఇక్కడాపారేమిటి ?"
    "మీతో మాట్లాడాలని చెప్పాను కదా!"
    "నిజంగానా?"
    "యస్!"
    "మరి ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు మాట్లాడలేదేం?"
    "ఈ విషయం మాయకు తెలియటం ఇష్టం లేదు."
    "ఓ! టాప్ సీక్రెట్ !"
    "యూ కెన్ సే సో--"
    "అయితే చేప్పండి!"
    "మీరూ, మాయా మాట్లాడుతున్నప్పుడు మీరు ఫినాన్షియల్ ప్రాబ్లం లో వున్నారని అనిపించింది నాకు. అందుకని కొంచెం డబ్బు ఇస్తే మీరు నాకో హెల్ప్ చేయగలరేమో అడగాలనుకున్నాను.'
    "డబ్బు ఇస్తే కొంచెం హేల్పా? మొత్తం చేస్తాను మిస్. ఏం కావాలో చెప్పండి ."
    ఆమె ముఖంలో సంతోషం కనిపించింది.
    "ఇందాక మాయ చెప్పింది కదా! నేను చిన్నప్పటి నుంచీ చాలా 'షయ్' టైప్!! ఎవరితోనూ 'మిక్స్ ' అయ్యేదాన్ని కాదు. ముఖ్యంగా బాయ్స్ కి ఆమడ దూరంలో వుండేదాన్ని!"
    "ఆ విషయం తెలుస్తూనే వుందిలెండి! లేకపోతే మీకున్న ఈ పాటికి నలుగురు పిల్లలుండేవాళ్ళు."
    ఆమె మళ్ళీ సిగ్గుపడింది.
    "నేను మెడిసిన్ లో చేరాక నాకు ప్రాబ్లం వచ్చింది. అక్కడ బాయ్స్, గాళ్స్ అంతా చాలా క్లోజ్ గా చాలా సోషల్ గా కలసి మెలసి వుంటారు. అది నేసేసిటీ కూడా! కానీ నేను నా క్లోజ్ డోర్ 'మెంటాలిటీ వల్ల బాయ్స్ తో మిక్స్ అవలేక పోయాను. ఎవరయినా చనువు తీసుకుని పలుకరించినా జస్ట్ సమాధానం చెప్పి నా దారిన నేను వెళ్ళి పోయేదానిని! కొంతకాలం ప్రాబ్లమ్స్ ఏమీ లేవు గానీ ఫైనలియర్ లో కొచ్చే సరికి అందరూ నన్ను చూసి నవ్వుకోవటం హేళన చేయటం మొదలు పెట్టారు. నాకు నిక్ నేమ్స్ కూడా పెట్టారు ."
    "ఆ నిక్ నేమ్స్ ఏమిటో నేను చెప్పగలను ."
    ఆమె ఆశ్చర్యపోయింది.
    "చెప్పండి చూద్దాం!"
    "రిఫిజిరేటర్, నార్త్ ఫొల్! అయిస్ బాక్స్ -- ఐస్ క్రీమ్."
    "మైగాడ్! మీకెలా తెలుసు?"
    "ఎవరయినా ఆ పేర్లే పెడతారు ."
    సురేఖ మళ్ళీ సిగ్గుపడిపోయింది. "నిజంగా ఫేడప్ అయిపోయాను -- చివరకు నేనో డెసిషన్ తీసుకున్నాను--"
    "ఏమిటది ?"
    "వాళ్ళందరికి ఒక షాక్ ఇవ్వాలని! వచ్చేవారం మా వాళ్ళ గెట్ టూ గెదర్ వుంది దానికి మిమ్మల్ని తీసుకెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ గా ఇంట్రడ్యూస్ చేస్తాను. మనిద్దరం చాలా కాలం నుంచీ ఎఫయిర్ నడుపుతున్నంత క్లోజ్ గా , చనువుగా అందరి ఎదురుగ్గా నటించాలి! దాంతో ఇంకోసారి ఎవరూ నన్నానిక్ నేమ్ తో పిలవరు--"
    "ఓ! స్వీట్ రివెంజ్!"
    "యూ కెన్ సే సో."
    "అంతేనా/ లేక సినిమాల్లో లాగా మీరూ, మీ లవర్ పోట్లాడుకుని అతనికి జెలసి కలిగించటం కోసం నన్ను ప్లాయ్ గా వాడుకుంటున్నారా?"
    "మళ్ళీ ఫాంటసీ లో కెళుతున్నారు "
    "అల్ రైట్ ! ఇందులో నాకేం అభ్యంతరం కన్పించటం లేదు. ఇంక ఎకనామిక్స్ సంగతి మాట్లాడండి ?"
    "ముందే చెప్పాను మీకు డబ్బిస్తానని."
    "ఎంత?"
    "నేను రిచ్ గాళ్ నే గాని స్టీల్ మా పేరెంట్స్ మీద డిపెండ్ అయున్నాను. గనుక రీజనబుల్ గా తీసుకోండి! అది మీకే వదిలేస్తున్నాను."
    'పది వేల రూపాయలిస్తారా?"
    ఆమె కళ్ళు పెద్దవి చేసింది . "మైగాడ్!"
    సురేష్ చప్పున రాజీ కొచ్చేశాడు. "ఓకే. ఓకే భయపడకండి. 'టెన్ దౌజేండ్ చాలా ఎక్కువనుకుంటే జస్ట్ ఓ వెయ్యి రూపాయలు కొట్టండి చాలు !"
    "థాంక్స్ ! నేను రెండు వేల వరకూ పే చేయగలను ."
    సురేష్ గుండె వేగంగా కొట్టుకుంది.
    "టూ దౌజెండ్ ఇస్తారా! అబ్బ! వ్యాపారం చాలా లాభసాటిగా ఉంది వాళ?"
    "అయితే వప్పుకుంటున్నారా?"
    "విత్ ప్లెజర్!"
    ఆమె కంగారు పడింది.
    "నోనో - సారీ ఇలా ముక్కు మొహం తెలీని వ్యక్తితో ప్లేజర్స్ కిష్టం ఉండదు "
    "కమ్యూనికేషన్ గాప్! నా ఉద్దేశం అది కాదు. విత్ ప్లెజరంటే వితవుట్ ప్లేజర్స్ అన్నమాట"
    ఆమె బాగ్ లో నుంచి వెయ్యి రూపాయలు లెక్కపెట్టి అతనికిచ్చింది.
    "ఇది అడ్వాన్స్! మిగతాది ఆ గెట్ టు గెదర్ అయిపోయాక!"
    "థాంక్యూ! అయితే నేనెప్పుడు ఎక్కడ మిమ్మల్ని కలుసుకోవాలి"
    "మా కాలేజ్ లోనే వచ్చే ఆదివారం వుంది ఫంక్షన్. ఈవెనింగ్ సిక్స్ టూ నైట్ ఏ లెవెన్."

 Previous Page Next Page