Previous Page Next Page 
హనీమూన్ పేజి 2



    "రండి రండి రండి రండి రండి" అన్నాడు సంబరంగా, మా గుండెలు గుబెల్ మన్నాయిగాని ప్తెకిమాత్రం చిరునవ్వు నవ్వూతూ 'నమస్తే' అన్నాము.

    "నమస్తే నమస్తే నమస్తే -కూర్చోండికూర్చోండి,కూర్చోండి" అన్నాడాయన. ఆయన కేదురుగ్గా ఉన్న బలి పిఠాలమీద కూర్చున్నాము.

    "నేను చెప్తూనే ఉన్నానుకదా! ఎవర్తెనా  వినిపించుకున్నారా? ఒక్క డయినా నా ఉత్తరాలు కేర్ చేశాడ? రాజీవ్ గాందికి స్వయంగా  రాశాను. ఆ బ్రిటీష  తొత్తుకొడుకులను నమ్మవద్దని- వాళ్ళతో దౌత్య సంబంధాలు తెగ తెంపులు చేసుకోవాలనినూ! విన్నారా? ఒక్కడయినా- విదేండుకిలా ఉత్తరాలు రాస్తున్నాడని ఎంక్వయిరీ  చేశారా!లేదు! నిమ్మకు నిరెత్తినట్లు కూర్చున్నారు! ఇప్పడేమ్తెంది? ఆ బ్రిటీష  దొంగ వెధవలే - జగ్ జిత్ సింగ్ చౌహాన్ నీ బాహాటంగా రెచ్చగోడుతున్నారు! ఖలిస్తాన్  నీ సమర్ధిస్తున్నారు. టెర్రరిజాన్ని పోషిస్తున్నారు. 'హిందూ'లో ఏమీ రాశాడో చూశారా?"

    "చూశామండి-ఇప్పడే  చదివి వస్తున్నాం" అన్నాడు సారధి చప్పన అబద్దమాడేస్తూ-

    "అయితే ఎక్స్ ప్రెస్ చదివి వుండరు! ఎడిటోరియల్ లో ఏమీరాశాడు?- నేను రాజీవ్ గాందికి రాసిన  వుత్తరంలో మెటరే వాడూ రాశాడు! అంటే అర్ధం ఏమిటి?"

    "గొప్పవా ల్లంతా  ఒకే విధంగా ఆలోచిస్తారాణి అర్ధం సార్-" అన్నాను నేను ఉత్సాహంగా.

    "ఎగ్జక్ట్ లి! అయినాగాని జరుగుతుందేమిటి? నాలాంటి వాళ్ళ పుత్తరాలు చింపి అవతల పారేస్తారు. అదే ఇండియన్  ఎక్స్ ప్రెస్ వాడు రాస్తే  జాహ్రత్తగా చదువుతారు. రియాక్టు అవుతారు. యేదోకటి చేస్తారు- వాటిజ్ డిస్ నాన్సెస్ ?"

    "యస్సార్ - హారిబుల్ స్టేట్ ఆఫ్ ఎప్తేర్స్ " అన్నాడుసారధి  అదే కొట్టాడాయన "చూడండి- అందులో ఏమీ రాశారో-"

    "మీ  పోను...." అన్నాడు సారధి ఈనాడు అందుకుంటూ.

    "డోంట్ బాదర్  ఎబౌట్  మ్తె ఫోన్ -అదేప్పడూ మోగుతూనే  ఉంటుంది-వాటేబోఎట్ శ్రీ లంకా? అదో  పెద్ద తలనొప్పి వ్యవహారంగా తాయారవుతుందని, మన ప్రభుత్వం రాంగ్ స్తెప్ వేస్తోందని  నేనప్పడే నాయుడుగారికి చెప్పాను చెప్పానో లేదో  మీరే అడగండి- ఆయనింట్లోనే  ఉంతారిప్పడు"

    "అబ్బే- అదివరకే  అడిగాను సార్- మీరు చెప్పారని  ఆయన అప్పడే చెప్పారు-"

    "సార్-మీ ఫోన్ ఓసారి -" అన్నాన్నేను పట్టు విడవని విక్రమార్కుడిలా.

    అప్పుడు స్పృహలో కోచ్చాడాయన.

    "ఏమిటి నా ఫోన్?"

    "ఓసారి ఫోన్ చేయాలండి అర్జంటుగా"

    "అలాగా! మరి వచ్చి ఇంతసేపయినా  ఆ విష్యం చెప్పరేం? చేసుకొండి-చేసుకోండి-అస్సాంలో ఈరోజున పరిస్ధితి యేమిటో తెలుసా?"

    "తెలుపండి" అన్నాడు సారధి కంగారుగా లేకపోతే ఇప్పుడు  మళ్ళి ఆ విష్యం ఎక్కడ మొదలు పెడతాడోనని.

    "తెలుసా?" ఆశ్చర్యంగా అడిగాడు.

    "తెలునండి!"

    "ఎలా తెలుసు? ఇవాళే టైమ్ ఆఫ్  ఇండియాలో ఆర్టికల్ వచ్చింది?"

    సాదికేం చెప్పాలో తేలిక  నావేపు చూశాడు.

    "మీరే చెప్పారండి ఆ మధ్య!"

    "నేనా? నేనూ ఇవళేగా ఆ ఆర్టికల్ చదివింది?" ఆశ్చర్యంగా అన్నాడు.

    "ఏమోనండి! అయినా మీరు ఆర్టికల్ చదవాల్సిన  పనేముందండి? పదిరోజుల తరువాత  పేపర్ వాళ్ళు రాయబోయేది మిరివాలే చప్పగలరు."

    ఆ మాటతో ఆయన మొఖం గర్వంగాతో వెలిగిపోయింది.

    "ఆఫ్ కోర్స్ , ఆఫ్ కోర్స్-"

    నేనిలోగా ర్తేల్వే ఎంక్వయిరీస్ కి  అమ్మాయి గొంతు. (అందంగోంతుదని గమనించ ప్రార్ధన)

    "హలో__" నేనూ అన్నాను. ర్తేల్వే ఎంక్వయిరీస్ లో  ఎప్పడూ  ఒ కర్ణకఠోరామయిన మొగగొంతు  తెలుగులాంటి భాష మాట్లాడుతూం డేది. ఈ సారి ఆడగొంతు వినిపించేసరికి ఆశ్చర్యంగా వేసింది.

    ".....స....సంగతేమిటంటే...." అని తడబడుతూ చెప్పబోయే సరికి ఆ గొంతు ఠక్కున' అడ్డుపడిపోయింది.

    "ఓ! సంగిత కావాలా? ఒక్క నిమిషం ఉండండి! ఆమె కూడా మీ ఫోన్ కోసమే ఎదురు చూస్తోంది-ఏయ్ సంగీతా -నీ డార్లింగ్  ఫోన్ లో ఉన్నాడు " అంటూ  అరిచించా పిల్ల.

    "నేను గాబరాపడి  "హలో....హలో....మేడమ్...." అంటూ కొద్దిక్షణాలు అరిచాను గాని లాభం లేకపోయింది. ఈలోగా ఆ సంగిత అనే పిల్ల కాస్తా ఫోన్ లో కొచ్చేసింది.

    హలో డియర్! ఏమిటింత  ఆలస్యం? ఇప్పడా నేన్నీకు గుర్తు కొచ్చింది?"... అందామె నీఘ్టారంగా.

    "చూడండి మేడమ్! నేను మిరనుకుంటున్న వ్యక్తినీ కాదు__ఇంతకుముందు ఫోన్ తీసుకున్న అమ్మాయి....."

 Previous Page Next Page