Previous Page Next Page 
ఋషి పేజి 2


    "ఔను"

    "నాల్గు సంవత్సరాల్తేంది."

    "ఔను" తను ముక్తసరిగా మాట్లాడుతున్నాడనే భావం అతనికి అప్పుడు కలిగింది.

    "ఇక్కడే ఉద్యోగం చేస్తున్నావా?"

    ఏ ఆఫీసులో చేస్తున్నది  చెప్పేడు.

    ఆమె ఆశ్చర్యంగా  "నాలుగు సంవత్సరాలనుంచి  ఇక్కడే వుంటూనావా?" అంది.

    "లేదు. మొన్న వరకూ చాలా ఉద్యోగాలు చేసెను, ఈ ఉద్యోగం దొరికి నేలే అయింది. ఈ వూరు  పోస్టింగ్ ఇచ్చేరు."

    నవ్వి "కాపురం పెట్టేవా?" అంది.

    ప్రకాశం  కొంచెం సిగ్గుపడి "పెళ్ళి  కాలేదింకా " చెప్పాడు.

    "రూమ్ లో వుంతున్నావా?"

    "లేదు" అన్నాడు.

    "మరి..." అంది అర్ధంకానట్టు.

    "మావయ్య వాళ్ళూ నా దగ్గరే వుంటున్నారు" అని, అఆమే మారేవి ఆడగాకుండానే తనే చెప్పేడు- "చిన్నప్పడే అమ్మా, నాన్నా పోయేరు. మావయ్యా నన్ను పెంచాడు. మొన్న మొన్ననే  ఆయనా రిట్టేరయ్యారు. ఆయనకీ. కొడుకులు లేరు. భార్యపోయి చాలకాలమయింది...."

    "ఆయనకో కూతురుంది కదూ?" అంది సుజాత అర్ధమయినట్టు నవ్వి.

    ప్రకాశం అదిరిపడి "ఔను" అన్నాడు.

    "పేరు?" నవ్వుతూ నే అడిగింది.

    కొంచెం ఇబ్బందిగా "సీతామహాలక్ష్మి" చెప్పాడు.

    గుమ్మంలో నిలబడి రోడ్డుమీద  వచ్చేపోయే జనాన్ని చూస్తూంది సిత. పనంతా  పూర్తిచేసి మొహం  కడుక్కొని పౌడరు వేసుకుని నిట్ గా తయారయింది. ప్రకాశం కోసం  కాదు, రిలాక్సేషన్  కోసం. వచ్చేపోయే జనాన్ని  చూడటంలో వుండే రిలాక్సేషన్!

    తెల్ల చీరమీద ఎర్రజాకెట్ మ్యాచ్ అవలేదు. కొంచెం పొట్టి అవటం వలన రెండు జడలు ఆమెకి అంతగా నప్పలేదు.ఇటువంటి చిన్న విషయాలు ఆమె గుర్తించదు. ఎప్పుడో  సంవత్సరానికి ఒకసారి  ప్రకాశం కళ్ళు-'అదే తనకి ఇష్టం' అన్న భావాన్ని చదవగలిగే శక్తి ఆమెకి లేదు. ఒకవేళ ప్రకాశానికి ఇష్టమని తెలిసినా ఆమె వేసుకోదు. కారణం చాలా సింపుల్ రెండు జడలు వేసుకోవటం తన కిష్టం. ఇంకోకరి కోసమని  అది మానేస్తే అది తన  వ్యక్తిత్వానికి భంగం! యిల్డు అయిపోవటం! 'ఇంకొకరి కోసమని నేనెందుకు నా యిష్టాన్ని త్యాగం చెయ్యాలి' అన్నా ఆలోచన పంధా ఆమెది.... సగటు తెలుగు ఆడబడుచూ.

    అంతలో రోడ్డుమీద వస్తున్న నేరోపాంటు కుర్రాడు తననే చూస్తున్నాడని గ్రహించి కళ్ళు చిట్లిస్తూ గుమ్మంచాటుకి త్ప్పకోంది. ఆ తరువాత  చాలా క్యాజువల్ గా తలుపు చాటునుంచి అతనింకా ఇటు వ్తెపే చూస్తున్నాడా లేదా అని గమనించింది. అతన్ని చూసి లోపలికి వేల్లిపోవాలనే ఆ అమ్మాయి సంస్కృతినీ....పరిపక్వంలేని ఆలోచనల 'ఇస్టింక్ట్' డామినేట్  చేసి, అతను మళ్ళి  తనవ్తెపే చూస్తున్నాడా  లేదా అని గమనించాలని పూరిగోలిపితే - అది ఆమె ఎదిగి ఎదగని వయస్సు తప్పు!!

    అతను దాటి వెళ్ళిపోయిన తరువాత బ్తేటికివచ్చి నిలబడింది. ఎదురుగా స్కూటర్ మీద ఏదో జంట వస్తూంది. వెనుక కూర్చున్న ఆమె అతని చుట్టూ చెయ్యివేసి- యేదో  చెబుతూ వుంటే, అతను నవ్వు తున్నాడు.... ఆ స్కూటర్ మలుపు తిరిగే వరకూ అటే చూస్తూ నిలబడింది. స్కూటర్ మీద తను - ముందో  రాజకుమారుడు -ప్రకాశం కాదు.

    "ఇంకా మీ బావ రాలేదా?" అన్న మాటలతో ఈ లోకంలోకి  వచ్చింది. పక్కన సుబ్బులు పక్కింటి మేష్టారి అమ్మాయి.

    "రాలేదు"

    "వానగుంటలు ఆడుకుందామా?"

    "పద" అంటూ లోపలికి హుషారుగా దారితీసింది సిత.

    "సారి" ఇంగ్లీషులో మాట్లాడింది సుబ్బులు. "మీ బావకోసం చూస్తున్నావేమో__"

    "ఛి__నాకంత ఇదేం పట్టలేదు."

    "బాబాయ్ ఉన్నాడా?"

    "లోపల  పెరట్లో ఉన్నాడు" అంది సిత చింతపిక్కలు ఎరుతూ.

    "మనకి సినిమాకి టైమ్ అయిపోతుందేమో?"

    "ఫర్లేదు ఆరున్నరకి కదా__"

    "ఇంటికెళ్ళి చూసేను. నా దగ్గర రూపాయి ముప్పావలాయే వుంది" అంది సుబ్బులు.

    "ఫర్లేదులే. నా దగ్గర ఇంకో రూపాయుంది."

    "నువ్వు అదృష్టవంతురాలివే, హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు ఇంటి ఖర్చు చూసుకొనేది నువ్వేకదా,"

    "అబ్బో! అంత అదృష్టం కూడానా" అంది సిత__ "బావ జీతంతో నేఅలంతా గడిపితే వెళ్ళొస్తాను" అంది.

    సిత లోపలికి తొంగి చూసింది.

 Previous Page Next Page