Previous Page Next Page 
అతని భార్య ప్రియుడు పేజి 3

   
    కానీ బాధనిపించదు.

    ఎంత బరువైనా...... బాధ కలిగించినా..... ఆ సమయం మధురంగా వుంటుంది.

    కానీ......

    జి.కె!?

    పెళ్ళయి ఇన్నాళ్ళయింది. ఒక్కరోజూ..... తనని..... పూర్తిగా ఆక్రమించలేదు.

    నిసిమ రేకుల్లాంటి పెదవులు.... అధరామృతపు ఊటతో తడి అవుతున్నాయి. చిగురుటాకుల్లాంటి అరచేతులతో అతని చెంపలని సవరదీసింది.

    ఆమెను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు జి.కె.

    ఎదురుగా..... పక్కనే వున్న మధుభాండం తన సొంతం. ఒక్కసారిగా తాగేయ్యాలన్నంత ఊపు, ఆరాటం.....

    కానీ.... ఆ మధుభాండంలోంచి ఒక్క చుక్కని కూడా తాగలేని అసహాయత.

    నాగమణి కోరికతో చచ్చిపోతోంది.

    అది తెలుస్తూనే ఉంది.

    వయస్సులో ఎంతో తేడా వున్నా తనని ఎందుకు పెళ్ళాడింది? పేదరికమేనా!

    లేక...... జీవితంలో దెబ్బతిందా?

    ఆమెని ముట్టుకుంటే చాలు..... కోరికతో వేడెక్కిపోతుంది. అలాంటి మనిషి...... ఎవరి చేతిలోనూ అనుభవం పొందలేదంటే నమ్మేదెలా?

    నాగమణి మంచిది కాదేమో?

    అనుమానం.....

    అతను తన భర్త కాబట్టి, తనని అర్పించుకోవటంలో తప్పేమీ లేదు కాబట్టి సహకరించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని మరో కోణంలో చూస్తున్నాడు జి.కె.

    ఆడది బెడ్ రూంలో రెచ్చిపోతే కొందరు మగవాళ్ళకి అనుమానం కలుగుతుంది. అందుకే మనస్సులో కోరిక ఎంత చెలరేగుతున్నా భర్త దగ్గర అదుపులోనే వుంటారు. అతన్నే కార్యక్రమాన్ని నడపనిస్తారు.

    నాగమణిలాంటి అందాలరాశిని ఎవ్వరూ పొందకుండా వుంటారా?

    ఆమె కాలేజీలో చదువుకొంది. కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. స్టూడెంట్స్ కి దొరక్కపోయినా లెక్చరర్స్ గేలానికి తగులుకొని వుండొచ్చు. అందమైన అమ్మాయిల్ని ఆఫీసర్స్ ఏదో సాకుతో లొంగదీసుకొంటారు. పేదతనం..... ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి లొంగిపోయి వుంటుంది.

    ఆ ఆలోచన జి.కె. ని పూర్తిగా చల్లబరిచేసింది. పళ్ళు కొరికాడు. ఆమె చేతుల్ని విడిపించుకుని లేచి కూర్చున్నాడు.

    ఆమె లేచి సగం మూసిన కళ్లతోనే..... ఆహ్వానించింది.

    బలవంతంగా ఆమెని విడిపించుకొని టీపాయ్ మీద సిగరెట్ పెట్టె అందుకుని సిగరెట్ వెలిగించాడు.

    ఆమె వెల్లకిలా పడుకుని ఆయన్నే చూస్తోంది.

    రెండు దమ్ములు పీల్చి ఆమెకేసి చూస్తూ ఊహించని రీతిలో సిగరెట్ ని ఆమె బొడ్డులో దూర్చాడు.

    ఆమె బాధతో దిక్కులు పెక్కటిల్లేలా అరిచింది.

    ఆమె నోరు మూసేశాడు.

    ఒక చేతిని బొడ్డుమీద వేసి నొక్కుకుంటూ రెండోచేత్తో ఆయన చేతిని గట్టిగా పట్టుకొని కాళ్ళతో పరుపుపైన కొట్టుకుంటోంది. భయంతో కళ్లు మిటకరించి, రెప్ప కూడా వేయకుండా అతన్నే చూస్తోంది.

    జి.కె. వికృతంగా నవ్వాడు.

    ఆమె కాళ్ళపైన తన కాళ్లు వేసి అదిమిపట్టి రెండు చేతులను నొక్కి పట్టుకొని పెదవుల మధ్య సిగరెట్ ని వంగి ఆమె ముఖంపైకి తీసుకెళ్తున్నాడు.

    ఆమె కళ్ళనుండి కన్నీరు........

    భయంతో ఆమె చేస్తున్న ఆర్తనాదం..... ఆలకించే వాళ్ళెవరూ లేరు.

    పనివాళ్ళున్నా...... వాళ్లెవరూ లోపలికి రారు.

    ఆమె కన్నీరు అతనికి పన్నీటి జల్లులా.....

    ఆమె ఆర్తనాదం అతనికి షెలోనాయిలా.....

    ఆమె కళ్ళలో భయం..... అతనికి థ్రిల్....

    ఆమె వణికిపోతోంది

    రక్షించుకోవాలనే ఆరాటం.....
 

 Previous Page Next Page