Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 3


                                          2


    సూర్యచంద్రరావు తనగదిలో కిటికీ దగ్గర నిలబడి ప్రక్క స్థలంలో కోలాహలంగా పిల్లర్స్ మిద స్లాబ్ వేస్తోంటే ఆసక్తిగా తిలకిస్తున్నాడు.


    అతనో, భావుకుడు, రచయిత, పాతికేళ్లుంటాయి. అతని తండ్రి ఆర్థికంగా బలపడివున్న వాణ్యజ్యవేత్త.  ఒక్కడే కొడుకు. కొడుకుని విదేశాలకు పంపించిపై చదువులు  చదివించాలని ఎంతో ప్రయత్నించాడు. సూర్యచంద్ర ఇష్టపడలేదు.బిజినెస్  లో తనతోపాటు పెట్టుకుందామనీ, తనని మించిన వాడుగా చేద్దామని ఎంతో ఆశపడ్డాడు. సూర్యచంద్రసుముఖత వ్యక్తం చెయ్యలేదు. గ్రాడ్యుయేట్ చేసి, అంతటితో ఊరు కున్నాడు.


    అతను తండ్రితో ఎప్పుడో గాని ముఖాముఖి మాట్లాడడు. సాధ్యమైనంతవరకూ తండ్రికి కనిపించకుండా తన గది లోనే కూచుని పుస్తకాలు చదువుతూ కాలం గడిపేస్తూ ఉంటాడు. తండ్రి  ప్రకాష్ చరిత్ర తనంతట తానొచ్చిపదిప్రస్నలడిగితే  ఒక్కదానికి మాత్రం జవాబు చెప్పి ఊరుకుంటాడు.    


    అతనికి తండ్రిపట్ల అవిధేయత ఏమి లేదు.


    మొదట్నుంచీ అతని సున్నితమైన స్వభావం .అంతేగాక ఎవరితోనూ కలవలెనిమనస్తత్వం. ప్రకాష్ చంద్ర మొదట్నుంచీ చాలా ఎరిస్ట్రోక్రేట్ సొసైటీలో తిరుగుతూ విలాసవంతమైన జీవితం గడిపేవాడు బయటవూళ్ళ కెడితే ప్లయిట్స్ ,ఊళ్ళో ఉంటే ఎప్పుడూ కార్డ్స్ ఆడటం.... రేసులకోసం మద్రాస్, బెంగుళూరు, ఊటీ తరుచు వెళ్ళివస్తూ వుండటం.... సోషల్ లైఫ్ పేరుతో పెద్దపెద్ద కుటుంబాలకు చెందిన స్త్ర్రీలతో శృతిమించి  తిరుగుతూ  వుండటం....


    తల్లి ప్రవర్తన కూడా అతనికి నచ్చేది కాదు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూన్నప్పుడు చాలా కృత్రిమంగా నటిస్తూన్నట్లుంవుండేది. ఒకరి రహస్యాలు ఒకరికి  తెలిసీ కావాలని గుట్టు కాపాడుతూన్నట్లు వుండేది.

    
    అతని స్నేహితుల్తో కూడా అందుకే ఫ్రీగా మసలుకోలేకపోయాడు.   పదహారేళ్లు దాటినప్పట్నుంచీ ప్రతివాడికీ అమ్మాయిలస రంధి, సెక్సు యావ, ప్రతివాడూ తనో  హీరోనని అనుకొంటూ అమ్మాయిల గురించీ, సెక్స్ గురించీ మాట్లాడుతూ వుండటం, వీలయితే ఆడపిల్లలల మిదకి ఎగబడటానికి ప్రయత్నిస్తూ వుండటం, సిగిరెట్లు కాల్చటం, విస్కీ బ్రాందీలు తాగటం.... అతను వాళ్ళకి దూరంగా  జరిగిపోయేవాడు.


    అలాగే అమ్మాయిలు. మనసులో ఊహించుకున్నప్పుడు,  వాళ్ళంటే ఏమిటో తెలీనప్పుడు... చాలా గౌరవంగా , మురిపెంగా వుండేది. కాని కొంచెం దగ్గరగా జరిగాక  వాళ్ళ మాటలూ , చేష్ఠలూ , ప్రవర్తనా,భంగిమలూ, భావాలూ చాలా  ఎబ్బెట్టుగా వుండేది.


    అయినదానికీ కానిదానికీ అదేదో జోక్ అయినట్లు విరగబడి నవ్వటం, కళ్ళు త్రిప్పుకుంటూ మూతి విరిచి మాట్లాడుతూ వుండటం, అవసరమున్నా లేకపోయినా నీరసంగా మొహంపెట్టి మాట్లాడుతూవుండటం, అవతలవాళ్లు అడిగిన దానికి ఏదో ఆలోచనలో వున్నట్లు కొంతసేపు గడిచాక గాని జవాబు చెప్పకుండా వుండటం...యిహ సరే.... బాయ్ ఫ్రెండ్స్....


    హేమమాధురి అతనికి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి వుండేది . పది  హేను పదహారేళ్ళకు మించి వుండేవి కావు. కొంచెం బొద్దుగా, ఏపుగా వుండి వయసుకిమించి కనబడుతూ చలాకీగా మట్లాడుతూ వుండేది.    


     ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేరు-  అతను తప్ప.


    అతను యిరకాటంలో పడినట్లయి " మమ్మిఇంట్లోలేదు" అన్నాడు.

    
    "మరీ మంచిది" అన్నదామె.


    " మంచిదా?"


    "అవును. నీతో వొంటరిగా మాట్లాడే అవకాశంకోసం చూస్తున్నాను."


    " మంచిదా?"


    " ఒంటరిగానా?"


    " అవును నీతో చాలా మాట్లాడాలి."


    అతని కాళ్ళలోంచి వొణుకు బయల్దేరింది.


    " ఏమిటది?" అన్నాడు.


    " మన గురించి."


    " చెప్పు"


    " నన్ను గురించి నీ ఉద్దేశమేమిటి?"


    "తెలీదు."


    " తెలీదా" ఇన్నాళ్ళబట్టీ స్నేహంగా వుండి తెలీదా?"


    " ఎప్పుడూ ఆలోచింలేదు."


    " పోనీ యిప్పుడు ఆలోచించుకుని చెప్పు" అంది కోపం   తెచ్చుకోకుండా.


    ఆమెవంక పరీక్షగా చూశాడు. చుటీదార్ పైజమా వేసుకొనివుంది. నల్లగా ,అల్లరిగా మెరిసే పెద్ద పెద్ద కళ్ళు, పొంకంగా ,పొందికగా ఉన్న శరీరం... వయసుతో  రాజీపడని బిగువైన గుండెలు.

    
    తల ప్రక్కకి త్రిప్పుకున్నాడు.    


    " ఏమిటి?"


    "బాగానే వున్నావు."

 Previous Page Next Page