Read more!
 Previous Page Next Page 
మహాప్రవాహం పేజి 2


    భుజం మిద చెయ్యి కుదిపింది. శరీరం తడిసి ముద్దయినట్లు చల్లగా మంచులా తగుల్తోంది.


    ఆమెకు భయమేసింది. " ఏమండీ, ఏమండీ" అంటోంది ఏడుస్తూ.


    కొంచెం సేపటికి " ఊ " అన్నాడు. శబ్దం ఎక్కడినుంచో వచ్చినట్లనిపించింది.

        
    "ఏం  జరిగింది? నాకు చెప్పండి... నాకు భయంగా ఉన్న.... దండీ."


    ఒక్కసారిదీనంగా ఆమెవైపు చూశాడు. ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. పెదవులు దాటి మటా బయటకు రాలేదు. ఒకటి రెండు క్షణాలలా గడిచాయి. తర్వాత మొహం ప్రక్కకు వ్రేలాడేశాడు.


    ఆ తర్వాత.... కొంచెం  సేపటికి అతన్లోంచి  ప్రాణం ఎగిరిపోయింది.


    శకుంతల కర్దమైంది.  నిస్సహాయస్థితిలో అతని ప్రక్కన వ్రాలిపోయి, వెక్కి వెక్కి ఏడ్చింది.


                         *    *    *    *        

        
    ఎదురుగా ఓ లారీ మిద మిదకువస్తూ రోడ్డుమీద  నుంచి ప్రక్కకి దిగినట్లు కనిపిస్తే డ్రైవరుకు  బ్రేకువేయకతప్పింది కాదు. లారీ బాగా స్లో అయింది.


    శకుంతల అంత షాక్ లో ఉండికూడా  యి అవకాశాన్ని బాగా వినియోగించుకుంది. చప్పున ముందుకు  జరిగి చేతికందిన  యినపవస్తువుతో డ్రైవరు సీటు వెనకభాగంలో గట్టిగా బాదింది.

    
    డ్రైవరుకు, క్లీనర్ కు చప్పుడు  వినిపించింది.


    " గురో! లారీలో ఉన్నవాళ్ళు ఎందుకో పిలుస్తున్నట్లుగా ఉన్నారు"  అన్నాడు క్లీనరు.


    "ఏమన్నా కావాలేమో. ఒకసారెళ్ళి చూసిరా" అని డ్రైవరు లారీ ఓ ప్రక్కగా  ఆపుజేశాడు.


    క్లీనరు  బయటకు దిగి, వెనక వైపునుంచి పైకి ఎక్కి చూశాడు. జరిగిందంతా అర్థమయింది.


    శకుంతల గుండెలు బ్రద్దలయేలా ఏడుస్తోంది.


    " ఊరుకో,ఊరుకో" అని మళ్ళీ క్రిందకు దిగివచ్చి జరిగిందంతా డ్రైవరకు చెప్పాడు.


    "నాయాల! గుండె జబ్బున్నవాడు కామాలు పుటుక్కున చచ్చి వూరుకున్నాడు."


    "అరె!" అన్నాడు డ్రైవరు. "ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు ఆలోచిస్తూ.


    "తొరగా కాకినాడ తీసుకెళ్ళిపోదాం. పైన ఒక్కతే హడిలిచస్తోన్నట్లుగా వుంది. నేను పైకెళ్ళి  సాయముంటాను. అన్నాడు క్లీనరు.


    "సరే" అన్నాడు డ్రైవరు.


    క్లీనరు పైకి ఎక్కాక  లారీ మళ్ళీ కదిలింది.


    క్లీనరు తనతో బాటు బాటిల్ కూడా తెచ్చుకున్నాడు. భర్త ప్రక్కన వాలిపోయిన ఏడుస్తోన్న ఆ అమ్మాయిని చూస్తూ గబగబ బాటిల్ పూర్తిచేస్తున్నాడు.


    శకుంతల చాలా అందంగా ఉంటుంది. పాతికేళ్ళ వయస్సులో- ఇద్దరు పిల్లలు పట్టినా ఆమెలో యౌవన బింకం తగ్గలేదు. ఏడుస్తోన్నప్పుడు- సగం తెలిసీ తెలీని స్థితిలో ఉన్నప్పుడు పమిట జారిపోయి వుంది. జాకెట్ హూక్స్ కూడా ఒకటి  రెండు వూడి వక్షోజ సౌందర్యం వెన్నెల కాంతిలో తళుక్కుమంటోంది.


    ప్రపంచంలో అన్నిటికన్నా బలమైనది సెక్సు బలహీనత అది మనిషి యుక్తా యుక్తా జ్ఞానం కోల్పోయేటట్లు చేస్తోంది.

    
    క్లీనరుకు సహజ స్వభావంవల్ల కొంతా, మందు ప్రభావంవల్ల కొంతా వొళ్లు వేడెక్కుతూ అక్కడి వాతారవణం మరిచిపోయిన- శకుంతల యవ్వనమొకటే దృగ్గోచరమౌతోంది.


    దగ్గరగా  జరిగి   " ఊరుకో, ఊరుకో" అంటూ భుజం మిద చెయ్యి వేశాడు.


    శకుంతల  షాక్ లో వుండి ఆసంగతి పట్టించుకోలేదు.


    అతని చెయ్యి భుజంమిద నుంచి ఆమె మెత్తని గుండెల మిదకి ప్రాకింది.


    ఆమెకి కొంచెం తెలిసినట్లయి " ఏమిటి?" అన్నట్లు చూస్తూ అతని చెయ్యితో. సెయ్యబోయింది.


    అతని చెయ్యి కదల్లేదు. సరికదా వికృత మైన కోరికతో ఊగిపోతూ  అతని మొత్తం శరీరం ఆమెమిదకు వొరిగింది.


    ఆమెకు సగం తెలుస్తోంది. సగం. తెలీటం లేదు .ఉంచటానిక్కూడా వీల్లేని విషమ పరిస్థితి.


    ప్రక్కనే కొన్ని నిమిషాల క్రితం విగత జీవుడయినభర్త, ఆ ప్రక్కనే జరిగిందంతా  పట్టించుకోకుండా వళ్లు తెలీకుండా నిద్రపోతోన్నపిల్లలు...


    ఏమిటది? అతని శరీరం తనని ఆక్రమించటానికి  ఆరాటపడూతూ, ఊపిరాడనివ్వటంలేదు.


     క్రూరంగా.....


    చేతుల్తో అతన్ని నెట్టివెయ్యటానికి ప్రయత్నించింది. ' దుర్మార్గూడా' అంది. తిట్టింది. ప్రాధేయపడింది, ఏడ్చింది, పెనుగులాడింది. చివరకు నిస్సహాయంగా లొంగిపోయింది.


    ప్రపంచ చరిత్రలో  పరమ ఆసహ్యంగా రేప్ చెయ్యబడిన సంఘటనల్లో ఒకదాన్ని పొందుపరుచుకుంటూ లారీ వేగంగా ముందుకు సాగిపోతోంది.   

 Previous Page Next Page