"హవా అంటే?"
ఆ మాత్రం తెలీదా? "హావా. హవా అన్న హిందీ సాంగ్ వినలేదా?"
సురేష్ గుండె ఝల్లు మంది.
"అంటే......"
"చాలామంది ఈ సంగత్తేల్సుకుని పోలీస్ స్టేషన్ కేళ్తున్నారు---- ప్లీజ్ గెట్ లాస్ట్ ....' ఇరిటేట్ అయిపోతూ అంది.
సురేష్ కి చుక్కలు కనబడుతున్నాయి కళ్ళముందు .
ఇప్పుడు ఆ పింకీ ఫాదర్ శ్రీహరి తన కాలర్ పట్టుకుంటాడు ........ నా పదివేలూ నాకిమ్మని !
బయటకు ఆ యువతితో పాటు నడిచి , హటాత్తుగా ఆగిపోయాడు.
"ఎక్స్ క్యూజ్ మీ మిస్ -- అవుటాఫ్ క్యూరీయాసిటీ అడుగుతున్నాను. మీ ఇన్ స్టిట్యూట్ దేనికి సంబంధించిందసలు? క్లయింట్స్ ని రూమ్ లో కి తీసుకెళ్ళి బట్టలు విప్పించేయటం చాలా వింతగా వుంది ..... మీది వరల్డ్ ఒల్దేస్ట్ ప్రొఫెషన్ కాదు కదా?"
"డోంటాక్ రాట్! మాది ఇంటర్నేషనల్ బయోలాజికల్ ఇన్ స్టిట్యూట్ అండ్ స్పెర్మ బాంక్ ! హెడ్డాఫీస్ చికాగో!"
"స్పెర్మ బాంక్ అంటే ...."
"అంటే లేదు గింటే లేదు ! ఇంగ్లీష్ అర్ధం కాకపోతే ప్లీజ్ గెట్ లాస్ట్ !"
'అర్ధమైంది మేడమ్! కానీ ........"
ఆమె తన కార్డ్ తీసిచ్చింది .
'అపాయింట్ మెంట్ తీసుకుని రండి! బయట 'డానర్స్' వెయిట్ చేస్తున్నారు -------"
"డానర్స్ అంటే ........"
ఆమె లేచి సురేష్ చేయి పట్టుకుని తలుపు వరకూ తీసుకెళ్ళి తలుపు తెరచింది.
"మీరు చాలా హెయిర్ అండ్ హెల్దీగా ఉన్నారు. మా స్పేర్మ్ బాంక్ డానార్స్ గా మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. అయ్ మీన్ కాష్! ఫోన్ లో అపాయింట్ మెంట్ తీసుకుని రండి" బయటకు నెట్టేస్తూ చిరునవ్వుతో చెప్పింది.
సురేష్ రోడ్ మీద కొచ్చినా ఆమె చెప్పిన మాటలు గురించే ఆలోచిస్తుండిపోయాడు.
"అయ్ మీన్ కాష్" అన్నమాట రీసౌండ్ ఇస్తోంది.
ఇరానీ హోటల్లో 'టీ' తాగి బయటకొస్తుంటే మాయ మరో అమ్మాయితో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కేల్తూ కనిపించింది.
పరుగుతో ట్రాఫిక్ అడ్డంగా పరుగెత్తి రోడ్ క్రాస్ చేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లోకి జొరబడ్డాడు.
అప్పుడే మాయా, ఆమె ఫ్రెండ్ ఓ కాబిన్ లో కూర్చున్నారు.
చటుక్కున వెనుక నుంచి వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు.
ఆమె ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది.
"కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ పేరుతొ స్టూడెంట్స్ ని మోసం చేసి డబ్బులు కొట్టేసి పారిపోటారా? కసిగా అన్నాడు.
ఆమె చిరాగ్గా చూసింది.
"అదా! ముందు చేయి వదలండి ."
"వదలను!"
"వదలకపోతే పోలీస్ ని పిలుస్తాను--"
"నాక్కావలసింది కూడా అదే! పోలీసులకు మిమ్మల్ని పట్టివ్వాలి"
"ముందు చేయి వదలండి! అంతా మనవంకే చూస్తున్నారు ....... నేన్నక్కడికి పారిపోబోవటం లేదు"
"నమ్మకమేమిటి?"
"కావాలంటే ఎదురుగ్గా కుర్చీలో కూర్చుని నేను పారిపోతుండగా మీ కాలితో నా కాలు నొక్కిపట్టండి!"
"అలా అయితే ఎవరూ చూడరు .'
కాళ్ళ బేరం అంటే ఇదేనా?
"అయుంటుంది ...."
ఎదురుగ్గా కూర్చుని టేబుల్ కింద నుంచి ఆమె కాలిని తన రెండు కాళ్ళతో చుట్టేశాడు.
ఆమె ముఖం సిగ్గుతో ఎరుపెక్కింది.
'ఛీ అదేమిటలా!" కాలు వదిలించుకుంటూ అంది.
"ముందు నా పదివేలు సంగతి తేల్చండి ."
"నన్నడుగుతారేమిటి? ఇన్ స్టిట్యూట్ నా సొంతమా? మీలాగా నేనేనూ అందులో ఉద్యోగంలో చేరాను --- వాళ్ళు పారిపోవడంతో నాకు ఏ సంబంధమూ లేదు. నాక్కూడా జీతం ఇవ్వకుండా పారిపోయారు ."
"అంతా అబద్దం! మీరూ వాళ్ళూ కలసే నాటకమాడుతున్నారు --" మళ్ళీ ఆమె కాలు చుట్టేశాడు.
"అంత ఖర్మ నాకేం పట్టలేదు. అలా డబ్బు కొట్టేస్తే ఇంత ఫ్రీగా ఇంత చీప్ గా రోడ్ల మీద తిరగాల్సిన అవసరం నాకు లేదు. మిగతా అందరి మోసగాళ్ళలాగానే విమానాల్లో తిరిగి ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఉండేదాన్ని. పోలీస్ అధికారుల జీప్ లోనూ, మినిష్టర్ల ఏ.సి కార్ల లోనూ లిప్తులు తీసుకునే దాన్ని! సోషల్ వర్కార్ గా పేరు తెచ్చుకునే దానిని! విదేశాల నుంచి పర్యటనలకు ఆహ్వానాలు సంపాదించేదానిని. రవీంద్రభారతిలో రోజుకో సన్మానం చేయించుకునేదానిని ..........' రోషంగా అందామె.
సురేష్ కి ఆమె మాటల్లోని నిజం భోధపడింది.
"ఇప్పటికైనా నా నా మీద నమ్మకం కలిగిందా?"
తల ఊపాడు.
"అయితే ఇంక నా కాలు వదలండి!"
అతను కాళ్ళు దూరం చేయగానే ఆమె తన కాలు లాగేసుకుంది.
"నాకూ అనుమానం కలగలేదు. చాలా కంప్యూటర్స్ ఇన్ స్టిట్యూట్ లో పనిచేశాను. వాళ్ళు చాలా రకాలుగా స్టూడెంట్స్ ని మోసం చేయటం చూశాను గానీ ఈ రకంగా ముంచేసిన ట్రిక్ చూడటం ఇదే ఫస్ట్ ....' చెప్తోందామే.
"మరిప్పుడు ఈ పింకీ పదివేలు పోయినట్లేనా?"
"నా జీతంతో పాటు, మీ ఉద్యోగంతో పాటు ------"
సురేష్ నవ్వేశాడు.
"ఇండియన్స్ చాలా స్మార్ట్."
"అన్నట్లు మీట్ దిస్ ఇండియన్ సురేఖ మెడిసిన్ స్టూడెంట్ " తన ఫ్రెండ్ ని పరిచయం చేసిందామె.
"హాయ్" అంది సురేఖ.
"హాయ్! నా పేరు సురేష్! డిచ్ అయిన వాళ్ళల్లో నెంబర్ టూని నెంబర్ వన్ మాయ."
సురేఖ నవ్వింది సిగ్గుపడుతూ.
"కొంచెం ఎక్కువ సిగ్గుపడే టైప్! మీరే ఇనీషియేటివ్ తీసుకుంటే గాని మాట్లాడదు" చెప్పింది మాయ.
"మెడికల్ స్టూడెంట్స్ లో సిగ్గుపడేవాళ్ళుంటారా?"
"ఎగ్జాంపుల్ యిదే?"
"వెరీస్ట్రెంజ్! పెళ్ళయితే ఎలా మరి?"
సురేఖ నవ్వేసింది. సిగ్గుపడుతూనే !'
"డోంట్ సే సచ్ థాంగ్స్!"
డోలప్స్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది సురేఖ!"
"మైగాడ్ ! ఇంత కాస్ట్ లీ ఐస్ క్రీమా?"
"డోంట్ వర్రీ! సురేఖ చాలా రిచ్."
"అలాగా! మరి ముందే చెప్పరేం? మీ దగ్గరేమయినా వేకెన్సీ వుంటే చూడండి మిస్! అయ్ వాంట్ వర్క్ -"
సురేఖ నవ్వింది.
"నేను నర్సింగ్ హోమ్ పెట్టాక కనిపించండి ."
"మేల్ నర్స్ పోస్టిస్తారా?"
"మేబి ....."