"భర్త అన్న బంధంనుండే బయటపడ్డ దాన్ని! నాకంటూ ఒక సంసారం కూడా లేదు! నేనెప్పుడో సన్యాసినిని అయ్యాను! నేను ప్రస్తుతం సంసారులమధ్య ఉన్నదీ, ఆ సంసారుల శ్రమను కొద్దిగా తగ్గిద్దామని మాత్రమే! ఏమి లేని నాకు ఈ కొడుకు మాత్రం ఎందుకు, తాతగారూ? నాకెవరూ అక్కరలేదు!" త్రిపుర ఉదాశీనంగా అంది.
"ఈ అబ్బాయి మీదకూడా నీకు కోపమే?" అని, మళ్ళి నిష్కపటమ్తెన నవ్వు నవ్వారు తాతగారు. తట్టలో వున్న మొక్కల్ని కల్వంలో వేసి నూరబోతూ ఒక మొక్కని ఎత్తిపట్టుకున్నారు "చూడు ఈ చిన్న మొక్కని! ఇది నేలమీద చిన్న చిన్న ఆకులతో తీగల్లా ప్రాకుతుంది. ఎంత వేసవిలో అయినా ఈ చిన్న మొక్క తన ప్రాణం నిలుపుకొని, నవనవలాడుతుంది. ప్రాతః సూర్యకిరణాలకు పులకించి పోయినట్టుగా లేత నిలం రంగులో చిన్ని చిన్ని పువ్వులు పూస్తుంది. దిని పేరు 'విష్టు క్రాంతం' అంటారు. దిపూలు భగవదారాధనకు కూడా పనికి వస్తాయి. ముఖ్యంగా విష్టుమూర్తికి ప్రియం ఆట.
రేపటి సూర్యుడిని చూడకుండా ఈ మొక్కని నిర్దయగా పెరుక్కు వచ్చాం! కల్వంలో వేసి నజిగిజిగా దంచుతాం. మాత్రగా చేసుకొని కడుపులోకి తింటాం. లేకపోతే కషాయం కాచుకొని త్రాగుతాం. భాని సహజ స్వభావంగా మన శరీరానికి చలువ చేస్తుందేగాని, తనకి బ్రతుకు లేకుండా చేశామని మనకు విషతుల్యంగా తయరుకాదు.
"త్రిపురా! ఈ మొక్కలాగే నీ బ్రతుకు బలి అయిందే అనుకో, నువ్వు మాత్రం నీ సహజశాంత, సౌమ్యస్వబావాన్ని విడిచి పెట్టకు! ఎవరిమీదా ద్వేషం పెంచుకోకు చివరికి నీ భర్త మిద కూడా నీకు కోసం. ద్వేషం వద్దు!"
"నేను చాలా మామూలుమనిషినీ, తాతగారూ! అంత గొప్పగా ఆలోచించే స్ధితికి నేను చేరుకోలేదు!" త్రిపుర తలొంచుకొని మెల్లని స్వరంతో అంది.
"ఇంతకుముందేనా, అమ్మాసన్యాసినివన్నావు! సన్యాసం అంటే ఏమిటి? కోరికలను వదలి వేయడం ఒక్కటే సన్యాసం కాదు! వాటిని వదలి వేయడం కంటే ముందు మాధమత్సరాలను, రాగద్వేషాలను వదిలి వేయాలి! ఏది చెడు అని నీ జ్ఞానంచేబుతుందో దాన్ని వదిలి వేయాలి. అప్పుడు నువ్వు సన్యాసిని వయ్యేది! నీ శరీరం నిలువడానికి మాత్రమే కాస్తంత ఆహరం తీసుకోడం, ఒళ్ళు దాచుకోడానికి ఎబట్ట అయితే నేం? అన్నట్టు కట్టుకోవడం-ఇవి మాత్రం కాదు సన్యాసం అంటే.
"రాగద్వేషాలను జయించడం అంత సులభమా, తాతగారూ?"
"నీ ముందుండి ఒక పాము వేడుతుంధనుకో! "ఇది విషసర్పం వదలకూడదు! చంపేయాలి?" అని నీ మనసు హేచ్చరిస్తుందా లేదా?" ద్వేషం, కోపం, ఈర్ష, ఈ గుణాలు కూడా ఒక విషసర్పం లాంటివే! విష సర్పాన్ని మనం ఎలావధి లేసి ఊరు కోలేమో, మనలోని ఈ దుర్గుణాలని కూడా ఉపేక్ష చేసి ఊరుకోలేమో, మనలోని ఈ దుర్గుణాలనీ కూడా ఉపేక్ష చెసి ఊరుకోకూడదు! ఎంత ప్రయాస అయినా అంతం చేసి తీరాలి!"
ఆ ఇద్దరి సంభాషణ శ్రద్ధగా వింటున్నాడు అజిత్. తాతగారి మాటలకు ముగ్దుడ్తెనట్టుగా ఉంది అతడి ముఖం! ఎంత చక్కటి మాటలు! ఎంత చక్కటి ఉపమానాలతో బోధిస్తున్నాడు! ఈ రకమైన ఆధ్యాత్మిక సంభాషణ వినడం ఇదే ప్రధమం అజిత్ కు. ఆ మాటలు వింటూంటే మససులో ఏమిటో హాయి అనిపిస్తుంది. ఎద్తేనా మాలిన్యముంటే అది కడిగివేస్తున్నట్టుగా ఉంది!
"త్రిపురా! నా సంపదకి వారసురాలిని కావాలని ఆశపడుతున్న మనిషిని కాబట్టి నేను నీకి విధంగా చెబుతున్నాను. నా దగ్గరకి రావాలను కొంటున్నావు కాబట్టి తొలుత దారి అంతా సరిచేసుకో!"
"ప్రయత్నిస్తాను, తాతగారు! నా ప్రయత్నం సఫలం కావాలని నన్ను ఆశిర్వదించండి!" త్రిపుర ఆయన ముందు చేతులు జోడించింది.
"నికేకాధమ్మ! ఈ ప్రపంచంలో సన్మార్గంలో నడవాలనేవారందరికి నా ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయి!" అని, కల్వంలో మొక్కలు వేసి కొడుపుతో దంచసాగారు. దంచుతూనే, "మీ నాన్నగారు ఏం చేస్తుంటారు నాయనా అని అడిగారు అజిత్ ను.
"అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్లు. పాతికెళ్ళు గా స్యూయర్క్ లో ఉంటున్నారు. కానీ, ఇంకొక ఆరుమాసాలలో ఇండియా తిరిగివచ్చేసి ఇక్కడే ప్రాక్టిస్ పెట్టుకొంటారు! ముఖ్యంగా నాయనమ్మ దగ్గర ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నారు నాన్న".
"నువ్వేం పని చేస్తున్నావు?"
"ఇంజనీరింగ్ పాసయ్యాను. ఉద్యోగం చేయాలనిలేదు. కాంట్రాక్టరుగా స్దిరపదాలని అభిలాషగా ఉంది".
"తోబుట్టువులున్నారా?"
"నాకొక చెల్లెలు మాత్రం ఉంది! పేరు సుచరిత. డిగ్రి చేస్తోంది!.... నాకు మీ ఫోటో తీసుకోవాలని కోరికగా ఉంది. పర్మిషన్ ఇవ్వరా?" వినమ్రాతగా అడిగాడు అజిత్.
"నీ కాకోరిక ఎందుకు కలిగిందో ముందు చెప్పాలి నాకు! " చిరునవ్వుతో అడిగారు తాతగారు.
"ఏ కాంతమ్తెన ఈ స్ధలంలో మీ కుటీరం, కుటిరంలో నిరాడంబరమ్తెన మీ జీవితం ముఖ్యంగా మీ మాటలు, నాకేమిటో అధ్బుతంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి వాతావరణం చూడడం నా జీవితంలో ఇదే ప్రధమం".
"ఫోటో తీసుకో! నాకేమి అభ్యంతరం లేదు నాయనా! ఒక్క అయిదు నిమిషాలలో అయిపోవాలి! ఈ మందు నేను అరగంటలో తయారు చేయాలి! మందుకోసం మనిషి వస్తాడు! అని కల్వంమీద ఓ తెల్లటిగుడ్డ కప్పి లేచారు తాతగారు.
కుటీరం ముందు తాతగారిని నిలబెట్టి పువ్వుల మొక్కలు బాగా పదేట్టుగా చూచుకొని ఫోటో తీశాడు అజిత్.
తాతగారికి కొంచెం దూరంగా త్రిపుర నిలబడి ఉంది, నీరెండ ఆమె మీద ఏటవాలుగా పడుతూంది. నీ రేండలో బంగారు పోతపోసినట్టుగా ఆమె మెరిసిపోతుంది! అజిత్ కెమెరా మరోసారి క్లిక్ మనడం త్రిపురకి తెలియదు.
తాతగారు మందు సూరడానికి కుటీరం లోకి వెళ్ళిపోయారు.
చెట్లకు నీళ్ళు పోయటానికి లేటైపోయిందని గబగబ నూతి దగ్గరికి వెళ్ళింది త్రిపుర.