Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 27

 

    "ఎల్. టి.టి.ఇ లో చేరుస్తే బావుంటుందండీ" కసిగా అన్నాడు సురేష్.
    శ్రీహరి పగలబడి నవ్వాడు.
    "కరెక్టుగా చెప్పావోయ్! ఇండియన్ అర్మీనే మంచినీళ్ళు తాగించారు వాళ్ళు. వాళ్ళకు హెడ్ అయిపోతాడు వీడు "
    సాయంత్రం పింకీతో పాటు కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ చేరుకున్నాడు.
    పదివేల రూపాయల చెక్ ఇచ్చింది పింకి కౌన్సిలర్ కి.
    "ఏ కోర్స్?' అడిగింది కౌన్సిలర్.
    "మీ దగ్గర ఎంత లెంగ్ది కోర్స్ ఉంటె అందులో చేర్చండి "
    "ప్రస్తుతం ఒక సంవత్సరందే వుంది అదే ఇరవై వేలు అవుతుంది"
    "డబ్బు కేమీ ప్రాబ్లం లేదండీ! బ్లాక్ మనీ చాలా వుంది. అయిదేళ్ళ కోర్స్ లక్ష రూపాయల ఫీజు ఉన్నా ఫర్వాలేదు. అంతా  ప్రజల సొమ్ము.
    "మేడమ్ తో చెప్పండి! ఏదొక కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇలాంటి స్టూడెంట్ ఒక్కరున్న ఇన్ స్టిట్యూట్ మొత్తం రన్ అవుతుంది."
    చెక్ తీసుకుని రసీదు ఇచ్చిందామే.
    "నేనెప్పటి నుంచి రావాలి ఉద్యోగానికి ?"
    "ఫస్ట్ నుంచీ"
    "మరి ఈ స్టూడెంట్ ని చేర్చినందుకు నా కమీషన్ వెయ్యి రూపాయలు ఎప్పుడు ఇస్తారు? రహస్యంగా పింకీ వినకుండా అడిగాడు.
    "ఈ స్టూడెంట్ మిగతా పదివేలు కూడా కట్టాక."
    ముంచేసింది .
    తనకు అనుమానంగానే వుంది.
    ఇలాంటిదేదో 'కాచ్' ఉంటుందని.
    పింకీ పదివేలూ కట్టకపోతే తన కమిషన్ గోవిందా!
    "ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదూ?"
    "బిజినెస్ లో అన్నీ ముందే చెప్పరు. అనుభవం మీద తెలుస్తాయ్" టీజ్ చేస్తోంది.
    "మీకు అనుభవాలు చాలా ఎక్కువనుకుంటాను"
    "హృదయం వుండాలే గానీ వాటికి తక్కువేమీ వుండదు కదా"
    "చాలా మాటకారే! తనను ఎక్కడి కక్కడ దెబ్బ కొట్టేస్తోంది. కనుక ఓ చిన్న జర్క్ ఇస్తే గానీ సైలెన్సవదు.
    "మీ లైఫ్ లో మగాళ్ళేఎంతమందినో చూసి వుంటారు."
    ఆమె సీరియస్ గా చూసేసరికి కొంచెం జంకాల్సి వచ్చింది.
    "లైఫ్ లో మగాళ్ళేతమంది అన్నది కాదు ముఖ్యం! మగాళ్ళల్లో లైఫ్ ఎంత వుందీ అన్నది ముఖ్యం"
    మళ్ళీ తనకే చావు దెబ్బ.
    అంత తేలిగ్గా జర్క్ లు కేర్ చేసే కాటగిరీ కాదు.
    "ఫీ సెక్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
    "నో! ఎస్. వో -- నో !"    
    "'ఫ్రీ' సెక్స్ కి 'నో ' అంటున్నారు. పోనీ చార్జ్ ఎంతవుతుందో చెప్పండి !"
    అప్పుడు తింది దెబ్బ! మొఖం ఎర్రబడింది.
    కళ్ళు రెపరెప లాడినాయ్.
    చూపులు మరల్చుకుంది.
    "మీరు చాలా ''చాలూ' టైప్ లాగున్నారు."
    "మీ అనుభవం ముందు నాదేముంది ?"
    ఈసారి మాట ఆగిపోయింది.
    ఫస్ట్ తారీఖున జాబ్ లో చేరడానికి వెళ్లేసరికి ఆ సీట్లో మరొకామె కనిపించింది. చాలా ఎట్రాక్టివ్ గెటప్ లో చాలా అందంగా వుంది.
    "గుడ్ మాణింగ్ మేడమ్"
    "గుడ్ మాణింగ్! ఏం కావాలి ?"
    "ఇక్కడ ఇవాళ రిపోర్ట్ చేయమన్నారు ."
    "మీ పేరు ?"
    "సురేష్!"
    "పిల్ల లెంతమంది?"
    అదిరిపడ్డాడు.
    "పిల్లలా?"
    "యస్! అలా ఆశ్చర్యపోతారేమిటి?"
    "నా కింకా పెళ్ళి కాలేదుగా?"
    "కాకపోతే పిల్లలు పుట్టకూడదని రూలేక్కడయినా ఉందా?" చిరుకోపంతో అడిగింది.
    "లేదనుకోండి!"
    "త్వరగా చెప్పండి! పిల్లలు లేకపోతే లేరని ముందే చెప్పండి! తీరా అంతా అయ్య్యాక చెప్పారంటే మర్యాదగా వుండదు. మాకు హెవీ ఎక్స్ పెండిచర్ అవుతుంది."
    "పిల్లలు లేకపోతే పనికిరానా?"
    "ఒక్క ఇంచ్ కూడా పనికి రారు. అందుకే ఫర్ టైల్ మగాళ్ళు కావాలని స్పష్టంగా చెప్పాను."
    "కంప్యూటర్ కోచింగ్ కి  ఫర్టిలిటీకి ఏమిటి సంబంధం?"
    ఆమె అనుమానంగా చూసింది.
    "మీరేం మాట్లాడుతున్నారో నాకర్ధం కావటం లేదు. రూమ్ నెంబర్ టు వన్ టూ లో కెళ్ళి అన్ డ్రస్ చేసుకుని నిలబడండి ."
    సురేష్ కి మతిపోయినట్లయింది.
    "అన్ డ్రస్ అవటం ఎందుకు ?'
    "మా రూల్స్ అలా వున్నాయ్ ఇష్టమయితే చేయండి! లేకపోతే వెళ్ళిపొండి ."
    "కానీ ఇలా నగ్నంగా పాఠాలు చెప్పే పద్దతి నేనెక్కడా చూడలేదు."
    "చూడు మిస్టర్! ఇష్టమయితేనే ఆ రూమ్ లో వెళ్ళండి. లేకపోతే మీ దారిన మీరు వెళ్ళిపొండి! నో కంపల్షణ్ ' మరింత కోపం.
    గత్యంతరం లేక 212 లోకి నడిచాడతను.
    లోపల స్టూడెంట్స్ లేరు కంప్యూటర్స్ లేవు.
    ఆ యువతి ఇప్పుడు మరో డోర్ లోనుంచి గదిలో కొచ్చింది.
    "ఇంకా అలోచిస్తున్నారేమిటి? బట్టలు విప్పరేమి?"
    "స్టూడెంట్స్ ఎవరూ లేరుగా!"
    "స్టూడెంట్స్ ఏమిటి?"
    "నేను కోచింగ్ ఎవరికి ఇవ్వాలి మరి?"
    ఆమెకు చిరాకు పుట్టుకొచ్చింది .
    "ఏయ్ మిస్టర్! మీకు ముందే చెప్పాను. నా టైం వెస్ట్ చేయవద్దని ! కాసేపు కోచింగంటారు , కాసేపు స్టూడెంట్స్ అంటారు . ఏమిటీ మీనింగ్ లెస్ టాక్?"
    "మీనింగ్ లెస్ టాక్ మీది !"
    ఆమెకు మరింత కోపం వచ్చింది.
    "నాదా?"
    "అవునవును! లేకపోతే పిల్లలకు నగ్నంగా నిలబడి పాఠాలు చెప్పాలని ఏ డైరెక్టర్ అయినా చెప్తాడా? సారీ చెప్తుందా?"
    ఆమె తెల్లబోయింది .
    "పిల్లలకు పాఠాలేమిటి ?"
    "కంప్యూటర్ లెసన్స్ --"
    "కంప్యూటర్ లెసన్స్ మిటి? మీరు వచ్చింది దేనికసలు ?"
    "ఇన్ స్పెక్టర్ ఉద్యోగానికి-"
    "ఓ ! మైగాడ్! ఇంతకుముందు ఈ అడ్రస్ లో ఉన్న కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ కోసం వచ్చారా మీరు?"
    "ఇంతకుముందు అంటే ఇప్పుడు లేదా?"
    "రెండ్రోజుల క్రితమే మూసేశారు! మేము ఈ భవనంలో కొత్తగా దిగాము."
    'అలాగా! మరి ఆ ఇన్ స్టిట్యూట్ ఏ అడ్రస్ కి మారింది?"
    "కేరాఫ్ హవా!"

 Previous Page Next Page