"గట్టిపిండమే! ఒక పట్టుపడితే విడిచేఘటం కానట్టుంది!" అనుకొన్నాడు ముసలాయన.
"త్రిపురా, నాకు గ్లాసులో పాలు తీసుకురా, అమ్మా! ఇక్కడే కూర్చొని తీసుకొంటాను!" పొడుగాటి వెండిగ్లాసులో పాలు తీసుకు వచ్చింది త్రిపుర.
* * *
సాయంత్రం త్రిపురతో బయల్దేరాడు అజిత్ పొలంలో కుటీరం వేసుకు ఉంటున్న తాతగారి దగ్గరికి. మార్గమధ్యంలో త్రిపుర మాటలు వాళ్ళ తాతగారి సంగతులు కొన్ని తెలిశాయి.
తాతగారి జన్మనామం సత్యనారాయణ. అయితే సన్యాసం పుచుకొన్న తరువాత సత్యానందస్వామి అన్న పేరు స్వీకరించారు. దాదాపు పాతిక సంవత్సరాలు ఈల్లు వాకిలి దేశసంచారం చేశారు. తరువాత వచ్చి, తమ పొలంలో కుటీరం వేసుకు ఉంటున్నారు ఆయనే వంట చేసుకొంటానన్నాడు. ఇంటినుండి వచ్చే భోజనం తినడానికి ఒకపట్టాన ఒప్పకో లేదు.
"నాకు ఎవరిని శ్రమ పెట్టడం ఇష్టంలేదు! ఎవరి మిద నా భారం వేయడం ఇష్టం ఉండదు? స్వయంపాకం నాకు అలవాటే! నా మానాన నన్ను ఇలా వదిలేస్తే చాలు!" అని, సన్యాసి సన్యాసి మాటలు మాట్లాడాడు.
"మహానుభావుడివి! నీకు సేవచేయడం వల్ల మాకు కొంచెం పుణ్యం ధక్కుతుందేమోనని మా ఆశ! మాకు కొంచే పుణ్యం వచ్చేదారికి అడ్డుగా నిలవోద్దు తాతగారు!"
త్రిపుర యుక్తికి ఆయన లొంగక త్పపలేదు.
"నాకు భోజనం పంపడం వల్ల మీకు పుణ్యం గిట్టుబాటు అవుతుందనుకొంటే నేనెందుకు కాదనాలి? కానీ, చాలా సాదా భోజనం మాత్రమే పంపాలి! రోజూ ఒక్క కూర, పట్టెడన్నం, కాస్త మజ్జిగ- ఇదే నా భోజనం? ఎక్కువ పదార్ధాలు, పిండివంటలు పంపొద్దు!"
ఉదయం పదకొండు గంటల వరకూ ధ్యాన సమాధిలో ఉంటారు! తరువాత భోజనం చేసి కాసెపు విశ్రాంతి తీసుకొని, ఎవర్తెనా వస్తే తనకు తెలిసిన మూలికా వ్తెధ్యం చేస్తుంటాడు. మిగతా సమయాన్ని గ్రంధ పఠనంలో గడుపుతారు. సాయంత్రం ఆరు నుండి మళ్ళి ధ్యాన సమాధి మొదలవుతుంది!
ఇరవ్తె ఏళ్ళ పైగా ఆయన దినచర్య అలా సాగుతూనే ఉంది!
తాతగారి కుటీరం ఊరికి కిలోమీటరు దూరంలో ఉంది! తాటి కమ్మలతో కప్పబడిన చిన్న కుటీరం. కుటీరం కప్పనిండా ఏవో పువ్వులతిగలు పచ్చగా కప్పకుపోయాయి.కుటీరం చుట్టూ కంచేలాంటిది ఏర్పాటు చేసి, కొన్ని పల్ల మొక్కలు, పువ్వుల మొక్కలు పెంచారు. కుటీరం అలికి ముగ్గులు పెట్టి చక్కగా తిర్చిదిద్ధబడింధి.
ఈ కుటీరం ఒక రుషి ఆశ్రమంలా తీర్చిదిద్దింది త్రిపురే. ఈ తోట పెంపకమూ ఆవిడదే! ఆ సంగతి త్రిపుర మాటలవల్ల తెలిసింది అజిత్ కు.
ఈ తాతగారంటే ఆవిడకు ప్రత్యేకమైన శ్రద్ధ! తాతగారి ఆధ్యాత్మిక సంపాదకు వారసురాలినీ తానేనన్న నమ్మకం ఆవిడలో ఉంది!
"తాతగారూ, మీరు పెళ్ళి చేసుకోక వంటరివారు! నేను పెళ్ళయి వంటరిదాన్ని! నాలాంటి అభాగ్యురాలు నడవడానికి చక్కటి రాజమార్గం నా ముందు కనిపిస్తూంది! అది మీకోసం మీరు తయారు చేసుకొన్నా మార్గమే! కాస్త చెయ్యి ఆసరా ఇచ్చి నన్ను లాక్కున్నారంటే నేను మీతో వచ్చేస్తాను! కానీ, ఇప్పదేకాదు! వదినకు అందరూ చిన్నపిల్లలు! ఆవిడ ఒక్కతే ఆ సంసారాన్ని లాక్కురాలేదు! కాస్త పిల్లలు పెద్దయి పోతే ఆవిడకు వెసలుబాటు అవుతుంది! అప్పడే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను!" అని ఇదివరకే తాతగారి దగ్గర తన చోటుని రిజర్వు చేసి పెట్టుకుంది త్రిపుర.
తాతగారు చిరుచాప మిద కూర్చొని పుస్తక మేదో నిశ్శబ్దంగా చదువుకొంటున్నారు.
ఆయనకీ దాదాపు ఎనబ్తే సంవత్సరాలుంటాయి! పొడుగాటి ఆయన గడ్డం, జుట్టు వెండి తీగల్లా ఉన్నాయి! ముఖం చామనచాయగా ఉంది? సాదుపురుషుల కళ్ళలో కనిపించే కాంతి, ప్రశాంతి ఆయన కళ్ళలో నిండుగా తొణికిసలాడుతున్నాయి? ఆయన చూపులు శాంతి వర్షం కురిపిస్తునట్టుగా ఉన్నాయి! ఎదుటి మనిషి ఎంతటి దుష్టుడ్తెన అతడిని క్షణంలో సజ్జనుడిగా మార్చి వేసే మహత్యమేదో ఆయన కళ్ళలో ఉన్నట్టుగా ఉంది?
వీళ్ళు రావడం తాతగారు గమనించినా వెంటనే పలుకరించలేదు. అయిదు నిమిషాల తరువాత, చదువుతున్న అధ్యాయం ముగించి, పుస్తకం మూసి, ఒకసారి కళ్ళకి తాకించుకొని వ్యాసపిఠమిద ఉంచారు!
"ఆ ఇక చెప్పు, అమ్మ! ఎవరి అబ్బాయి?"
"యశోద మనుమడా? అంటే...."
"ఆవిడ కొడుకు కొడుకు, తాతగారు?"
"యశోదకి ఒక్కడే కొడుకు, తాతగారు?"
"ఒక్కడే!"
"అయితే నిదు నీ కొడుకన్న మాట! అవునా?" పసిపాప బోసి నవ్వులా నిష్కపటంగా నవ్వాడు.
త్రిపుర ముఖంలో ఆప్రనస్నత చోటుచేసుకొంది.
తాతగారు ఆమె ముఖంలోనీ భావాలు చురుకుగానే గమనించారు. ఆయనలేచి, కుటిరంలో ఓ మూలకి ఉన్న కల్వాన్ని తెచ్చి గుమ్మానికి ఎదురుగా పెట్టాడు. ఓ చిన్న వెదురుతట్టలో ఏవో మొక్కలు కూడా తెచ్చారు.
చిన్న తాతకు చాపవేసుకొని కాల్వముందు కూర్చున్నారు.
"తొమ్మిది నెలలు బరువుగామోసి, కనడానికి ప్రాణం పణంగా పెట్టి, అష్టకష్టాలు పడి పెంచి పెద్ద జేసి, తల్లి అనిపించుకోంటారు అందరు ఆడవాళ్ళు! నీకు ఆ శ్రమ ఆ బాధ తెలియకుండా ఏకంగా పాతికేళ్ళ అబ్బాయిని కొడుకుగా పొందావు! అదృష్ట మంటే నిదే, త్రిపురా?"