"టెర్రేస్ మీద కిన్కేవ్వరూ రారు మేడమ్."
"అంటే వస్తే వదలవన్నమాట!"
"ముక్కు మొఖం తెలీని వాళ్లతో అలా ఎలా ప్రవర్తిస్తాను మేడమ్?"
"ఎలాగేముంది ? ఇలాగే ! వెనుక నుంచి వాటేసుకుంటావ్! వాళ్ళు ఇదేంటని అడుగితే 'సారీ మేడమ్! మీరనుకోలేదు . శ్రీదేవిగారను కున్నాను అంటావ్' ఇదిగో ! రేపొద్దున్నకల్లా నువ్వీ ప్లాట్స్ నుంచి ఖాళీ చేయాలి! తెల్సిందా?"
సురేష్ చకచక ఆలోచించసాగాడు. ఎలాగోలా మాటల్లో బోల్తా కొట్టించాలి. లేకపోతే రోడ్డున పడాలి!
"సరే మేడమ్! మీకింత కోపం కలిగించినందుకు నాకు మాత్రం పనిష్మెంటు ఇవ్వాల్సిందే! రేపు తెల్లారుజామునే ఖాళీ చేస్తాను. కాని నేనెక్కడున్నా, ఏం చేస్తున్నా మోహనరావు రాజేశ్వరితో వేసే వేషాలన్నీ జాగ్రత్తగా కనిపెట్టి ప్రతిరోజూ మీకు రిపోర్ట్ చేస్తుంటాను నాకు నా సుఖలకంటే మీ సంసారం బాగోగులు ముఖ్యం' దిగులుగా అన్నాడతను.
"ఏమీ అక్కరలేదు! నీ దారిన నువ్ ఫో! అంతే చాలు -- "కోపంగా అని విస విసా మెట్లు దిగిందామే.
సురేష్ కి కొద్ది క్షణాలు మెదడు పని చేయలేదు.
ఒకటను కుంటే ఒకటయిపోయింది.
శ్రీదేవి మటందంటే ఇంక తిరుగుండదు. తను తెల్లావారు జామున ఖాళీ చేసేయక తప్పదు.
కానీ ఎక్కడకని వెళ్ళటం?
ఎవరాశ్రయమిస్తారు తనకి?
"తిక్క వదిలిందా?" ఉలిక్కి పడ్డాడా గొంతు విని.
కుముదిని!
టాంక్ వెనుక నుంచి ముందు కొచ్చింది నవ్వాపుకుంటూ--
"నువ్వెప్పుడొచ్చావ్?"
"సారీ మేడమ్! కుమిదిని అనుకున్నానని శ్రీదేవిగారితో చెపుతున్నప్పుడు.
"ఇదంతా నీ వల్లే జరిగింది" నిష్టూరంగా అన్నాడు.
"శ్రీదేవి కాబట్టి బతికిపోయావు గానీ అదే నన్ను కౌగాలించుకున్నట్లయితే చెంప పగిలిపోయేది."
సురేష్ కి కోపం ఆగలేదు. అప్ట్రాల్ ఓ పనిమనిషి తనను పట్టుకుని అంత మాట అంటుందా?
రెంటికి చెడ్డ రేవడి లాగా అయింది.
జరిగిందేదో జరిగింది . తనేలాగూ ఖాళీ చేయడం ఖాయం . కానీ వెళ్ళే లోగా దీనికి గట్టిగా బుద్ది చెప్పాల్సిందే.
వహీద్ మళ్ళీ గుర్తుకొచ్చాడు.
"నీకెందుగ్గురూ- లాగించేయ్! నేనున్నాగా" అంటున్నాడు.
ఇంక ముందూ వెనుకా ఆలోచించకుండా ఒక్క ఉదుటున ఆమె వేపు జరిగి అమాంతం ఆమెను కౌగలించుకుని పెదాల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
కుముదిని నిశ్చేష్టురాలయింది. కొద్ది క్షణాలు ఏం జరుగుతోందో తెలీక అతని పురుషత్వం మత్తుగా స్పర్శిస్తోంటే అతని చేతుల్లో ఇమిడిపోయింది గానీ -- ఆ తర్వాత తేరుకుని లాగి అతని చెంప మీద కొట్టింది.
సురేష్ షాక్ కొట్టినట్లు వదిలేశాడామేని.
"ముందే చెప్పానా --- మన దగ్గర నీ ఆటలు సాగవని!" కసిగా అందామె.
"మరి వహీద్ గాడలా చెప్పాడెమిటి? హటాత్తుగా కౌగలించుకుంటే అమ్మాయిలు లొంగిపోతారని?"
"వాడికి నాలాంటిది తగిలి ఉండదు."
"కరెక్ట్ -- అదే కరెక్ట్ అయుండాలి! ఈసారి వాడు కనపడితే వాడి సంగతి చెప్తాను ."
కుమిదిని నవ్వేసింది.
"ఒకో అమ్మాయి ఒకో విధంగా దగ్గరవుతుంది! ఆమాత్రం తెలీని వాడివి ఇలాంటి ఎడ్వంచర్స్ చేయకూడదు.
సురేష్ తల కొట్టుకున్నాడు.
"ఆడేడేడే ! ఈ సంగతి ముందే తెలుసుంటే ....."
"నే వెళ్తున్నా" కుమిదిని మెట్లు దిగుతోంటే వెనుకే పరుగెత్తాడు.
"కుముదినీ - వన్ మినిట్ --- ప్లీజ్"
నాలుగో మెట్టు మీద ఆగి వెనక్కు తిరిగి చూసింది.
"ఏమిటి?"
"నీలాంటి అమ్మాయిని దగ్గర చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆహా నువ్వని కాదు --- నీలాంటి అమ్మాయి సంగతి "
"నాలాంటి అమ్మాయి దగ్గరవాలంటే ----- ఇదిగో ఇలా చేయాలి " అమాంతం అతని చేతులు పట్టుకుని కిందకు వంచి పెదాల మీద కలబడి ముద్దు పెట్టుకుని, ఒక్క క్షణంలో చక చక మెట్లు దిగి వెళ్ళిపోయింది .
* * *
"గుడ్ మాణింగ్ సర్"
"గుడ్ మాణింగ్ సురేష్! కమిన్! ఇందాక పింకీ చెప్పింది ? పింకీ బాగా ఇంటెలిజెంట్ అనీ, అందుకని కంప్యూటర్స్ లో చేరటం మంచిదని సలహా ఇచ్చావంట కదా" అడిగాడు స్టీమ్ ఇంజెన్. పింకీ తన ప్రామిస్ నిలుపుకుందన్నమాట!
"అవున్సార్! నాకు తెలిసిన ఇన్ స్టిట్యూట్ ఒకటుంది. అక్కడ చేరితే బావుటుంది."
"కానీ పింకి స్కూల్ అవర్స్ కి క్లాష్ రాదుకదా?
"రాదు సార్! సాయంత్రం స్కూలు నుంచి వచ్చాక కాసేపు రెస్ట్ తీసుకుని ఓ గంట అక్కడి కెళ్ళవచ్చు."
"ఓ.కె! ఎప్పుడు చేరుస్తానంటావ్?"
"ఇవాళే మంచిరోజండి!"
"అల్ రైట్ ! అలాగే కానీ"
పింకీ కర్టెన్ వెనుక నుంచి నవ్వుతూ చూస్తోంది.
"ఓకే పింకీ! సాయంత్రం అయిదింటికల్లా రడీగా ఉండు! వెళదాం!"
"ఒరే బాస్టర్డ్! నువ్వెందుకొచ్చావ్ రా ఇక్కడికి?" ఓ పొడగాటి స్కేలు పట్టుకొచ్చాడు సిద్దార్ద.
స్కేలు దెబ్బను అతి లాఘవంగా తప్పించుకున్నాడు సురేష్.
"సిద్దార్ధ! వాటీజ్ దిస్ బేటీ! గుడ్ బాయ్స్ ఒంట్ బిహేవ్ లైక్ దట్! అంకుల్ అని పిలువు అతనిని!"
"బాస్టర్డ్-----"
శ్రీవారి నవ్వి వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.
"అలా అనకూడదు బేటీ! తప్పు"
"నిన్ను తంతా!" కాలితో పొట్టలో ఒక్కపోటు పొడుస్తూ అన్నాడు.
"ఇదిగో ఇలా చేస్తే అంకుల్ నిన్ను 'బాడ్ బాయ్' అంటాడు కదు సురేష్?"
"అవునండీ."
వాడు తుపుక్కున సురేష్ మీద ఉమ్ము వేశాడు "నన్ను బాడ్ బోయ్ అంటావ్ రా బాడుకవ్"
సురేష్ ఉమ్మి నుంచి మళ్ళీ అద్భుతంగా తప్పించుకున్నాడు. కాలేజ్ లో ఆడిన క్రికెట్ ఉపయోగపడింది.
"చాలా నాటీగా తయారవుతున్నాడు! కమలా! కొంచెం కేర్ తీసుకోవాలోయ్ వీడి గురించి!"
"మమ్మీని కూడా తంతా" అంటూ శ్రీవారి జుట్టు పట్టుకున్నాడు.
"వీడిని కోరుకొండ సైనిక స్కూల్లో చేరుస్తే మంచి ఫ్యూచరుంటుందని మా ఫ్రెండ్ ఒకతను అంటున్నాడోయ్. నీ అభిప్రాయం ఏమిటి?"