Previous Page Next Page 
హనీమూన్ పేజి 26


    ఇంతకూ బండి ఏ ప్లాట్  ఫారం మీద కోస్తున్నట్లు? అడిగాడు తాతయ్య.

    "అదే తెలిదు తాతయ్య! మనకే కాదు....ఇక్కడేవరికూడా తెలిసినట్లులేదు."

    "అయితే  ఇబ్బందేముంది? స్టేషన్ మాస్టర్ చేతిలో రెండ్రూ పాయల పెట్టి  అయిదో నెంబర్ మీదకే తీసుకోమని చెప్పండి- లేకపోతే ఈ సామానంతా వేసుకుని ఇంకో  ప్లాట్  ఫారం మీద  కెళ్ళాలంటే ప్రాణం మీద కొస్తుంది."

    మాకు నవ్వాగలేదు.

    "నవ్వుతారేమిట్రా! బ్రిటీష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇలాంటివి చాలా జరిగేవి."

    ఈలోగా  మా కూలి రానే వచ్చాడు.

    "బండి అయిదులోనే వస్తోంది సార్!" అన్నాడు విజయగర్వంతో.

    "నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాము.

    "గార్డుగారి కుక్క అయిదోనెంబరుమీదకే వచ్చేసింది కదా!" నాకదేమి అర్ధంకాలేదు. "కుక్కకి ర్తెలు రావటానికి సంబంధం ఏమిటి?" అడిగాను వాడినీ.

    "ఈ బండికి ఇక్కడినుంచి ఇంకో గార్డ్ మారాలి కద్సార్ ! ఆ గార్డుగా రెబండికి వెళ్ళినా  ఆయనతోపాటు అయన పెంచుకుంటున్న కుక్క స్టేషన్ వరకూ వచ్చి బండి  వెళ్ళిపోయాక తిరిగి వెళ్ళిపోతుంది." అన్నాడు వాడు వివరిస్తూ.

    "అయితే మన కింకేం భయంలేదన్నమాట!"

    "ఏమిలేదు సార్!"

    "మరకుక్క కెలా తెలుస్తుంది....ఏ ప్లాట్  ఫారం మీదకు బండి వచ్చేది?"

    "గార్డుగారు ఏ ప్లాట్ ఫారం మీద నిలబడి కుక్కకూడా ఆ ప్లాట్ ఫారం మీదే తిరుగుతూంటుంది కదండి...."

    మేము  గార్డుగారి కుక్కని మనసులోనే  అభినందించాము. ఆయన ఆ కుక్కని పెంచకపోయినట్లయితే మా గతి ఏమయేదో ననిపించింది.

    ఈలోగా బండి రానే  వచ్చింది. అంతవరకూ ఖాళిగా ఉన్న ప్లాట్ ఫారం ఒక్కసారిగా తెగ రాష్ గా మారిపోయింది. నింపాదిగా నిలబడ్డ వాళ్ళంతా శివాలేత్తినట్లు జనాన్ని తప్పించుకుంటూ పరుగేత్తసాగారు. ర్తెలువంక చూస్తూ ముందుకి నడిచి కనిసం అరడజమంది మా బెడ్డింగ్ మీద పడి లేచి వెళ్ళిపోయారు.

    సారధి పరుగుతో వెళ్ళిమా స్లీపర్ కోచ్ ఎక్కడుందో చూసి వచ్చాడు. కూలికి సామాను కొంత అప్పజెప్పి అందరంస్లీపర్ కోచ్ లోకి చేరుకున్నాం.

    కూలి సామానంతా సరిగ్గా ఉన్నదో లేదో చూడండి-" అన్నాడు తాతయ్య. అన్నాదే  తడవుగా నేను  సారధి  లెక్క కట్టటం ప్రారంభించాము. తీరా చూస్తే ఉండాల్సిన వాటి కంటే ఒకటి తక్కువ కనిపించింది. అయితే  అదేమిటో ఎంత ఆలోచించినా మాకు తెలిలేదు.

    "ఒకటి తక్కువున్నట్లుందే?" అన్నాడు సారధి.

    "అవును! ఎనిమిది సామానులు ఉండాలి అన్ని కలిపి. ఇప్పుడు ఏడే ఉన్నాయ్."

    "మన సామన్లో యేదో మిస్సయింది. అదేమిటో చూడండి!" అని చెప్పాం ఆడాళ్ళకు.

    వాళ్ళిద్దరూ సామానంతా చూశారుగాని  వాళ్ళకూ తెలిలేదు.

    "మా పినతల్లి కూతురు పెళ్ళిలో కూడా ఇంతే! తీరా మద్రాస్ లో దిగేసరికి రెండు సామాన్లు పోయే" అంది మా ఆవిడ.

    "అమ్మే! రెండు సామంలె !" ఆశ్చర్యపోయింది సారధి భార్య.

   
    "అవును! వెతకలేక చాచ్చామనుకో! ప్తెగా వాటిల్లో ఒకటి నగలున్న సూట్ కేస్!"

    ఇద్దరూ ఆ నగల గురించీ, ఆ సూట్ కేస్ గురించీ వర్ణించుకోవడంలో మునిగిపోయారు.

    సారధి ఇక లాభం మేము సామానుతో ప్లాట్ ఫారం మీద కూర్చున్న చోటుకెళ్ళి  వెతికి వచ్చాడు.

    ఆ వస్తువు ఎక్కడా కనిపించలేదంట!

    తాతయ్య మా ఇద్దరినీ పక్కకు పిలిచాడు.

    "ఒరేయ్ ! ఆ ల్తేసేస్న్ కూలి మొఖం ఈసారి చూడండి" అన్నాడు రహస్యంగా మేమిద్దరంల్తేసేన్స్ కూలి మొఖంవంక చూశాము. మా కేమి అర్ధంకాలేదు.

    "ఎలావుంది వాడి మొఖం?" అడిగాడు తాతయ్య.

    "మా వూలుగానే వుంది!" అన్నాను.

    "కొంచెం దొంగమోఖంలా కనిపించటంలేదూ?"

    ఈసారి మళ్ళి చూశాం వాడి ముఖం వేపు.

    "అవును! పక్కా దొంగ మొఖం !" అన్నాడు సారధి.

    "చూశారా మొఖాన్నిబట్టి కనిపెట్టిపారేస్తాను- మన పోయిన సామానేదో వాడే కొట్టేసి వుంటాడు."

    "కాని వాడితోపాటు మనంకూడా ఉన్నాం కదా! ఎలా కొట్టేస్తాడు." అమాయకంగా అడిగాను.

    తాతయ్య నవ్వాడు.

    "పిచ్చి సన్నాసి! అక్కడే వుంది వాళ్ళ టెక్నిక్ ! మనతోపాటు  సామాను తీసుకుని నడుస్తూనే ఉంటారు. ఈలోగా వాళ్ళ మనిషి ఇంకోడు ప్రయాణికుడిలా వాడి పక్కకోస్తాడు. మనం కళ్ళు మూసి తెరిచే లోపల వాడికి వో సామాను అందించేస్తారు. అంతే! వాడు  అది తీసుకుని వాడింటికెళ్ళిపోతాడు."

    తాతయ్య ఆర్గుమెంట్ మాకు నచ్చింది.

    మా గొడవంతా చూసి "ఏం  పోయిందిసార్ ? అనడిగాడు కూలి.

    "మా సామాన్లో ఒక్కటి తక్కువయింది!" అన్నాడు సారధి వాడివంక అనుమానంగా చూస్తూ.

 Previous Page Next Page