"ఏమిటి సార్ అది?"
వాడికేం చెప్పాలో మాకు అర్ధం కాలేదు.
"ఏదోకటి ! ఏదయితే నీ కెందుకు? అయినా నీకు తెలీకుండానే పోతుందేమిటి?" అన్నాడు తాతయ్య డ్తెరెక్టుగా
కూలి మొఖంలోకి కోపం వచ్చేసింది.
"ఏమిటిసార్! మీరు మాట్లాడేది? నాకు తెలుసంటారెమిటి?"
"అవును మరి! నువ్వేగా సామాను తెచ్చింది."
"తెస్తే?"
"నువ్వే దొంగలంతా ఇలాగే అంటారు."
"మర్యాదగా మాట్లాడండి సార్! ఆ దొంగ వ్యవహారాలు మా దగ్గరుండవ్!"
"దొంగలంతా ఇలాగే అంటారు."
"మీతో మాటలు నాకనవసరం! నా కూలి డబ్బు నాకు పడేయండి."
"ఏమయినాసరే-కూలిడబ్బివ్వకండి" అన్నాడు తాతయ్య.
"అసలేం పోయింది సార్ మీది?"
మళ్ళి మేమందరం మొఖాలు చూచుకున్నాం.
"ఏం పోయిందోకూడా మీకు తెలీదుగాని ల్తేసేన్స్ కూలికి దొంగ తనం అంటగడుతున్నారా? చాలా మర్యాదస్తులు సార్ మీరు."
ఈ లోగా స్లీపర్ కోచ్ లోని మరో అరడజను మంది మా చుట్టూ మూగారు.
వాళ్ళందరూ వింటే మా కేస్ బలహీన పదిపోతుందని, అర్ధమయిపోతుందని తెల్సిపోయింది నాకు.
ఎవరయినా 'ఏం పోయిందని' నీ ప్రశ్న వేశారో మా పరిస్ధితి దారునంగా ఉంటుంది.
వాడితో పేచి ఎందుకని ల్తేసేన్స్ కూలికి డబ్బు ఇచ్చేశాము.
"కూలి కదాని దొంగతనం అంటకట్టేయకూడదు సార్! దొంగతానా లన్ని ఈ రోజుల్లో సూటూబూటూ వేసుకున్నవాళ్ళే చేస్తున్నారు" అన్నాడతను.
"సరే జరిందేదో జరిగిపోయింది! బాబ్బాబు...కొట్టేస్తే కొట్టేశావ్ గాని- మా సామానులో ఏం కొట్టేశావో కొంచెం చెప్పు- లేపోతే ప్రయాణంలో నానా అవస్ధలూ పడాలి" అన్నాడు సారది వాడిని బ్రతిమాలుతూ.
"భాలేగున్నారు సార్ మీరు. మీ సామనేదో మీకే తెలిదు-నేను కొట్టేశానంటారేమిటి?"
మేము వాడోపవాదాల్లో ఉండగానే మా ఆవిడ కిటికీ దగ్గర్నుంచి అరచింది.
"ఇదిగో! ధర్మోస్ ప్లాస్క్ సెట వాటర్ బాటిల్ ఇక్కడే ఉన్న యండి! ప్తే బెర్తుమీద పెట్టారెవరో.
మేము ల్తేసేన్స్ కూలి మొఖం వేపు చూడలేక పోయాము.
"ఇప్పడే మంటారు సార్?" విజయగర్వంతో చూస్తూ అన్నాడు కూలి.
వాడు ఇంక మమ్మల్ని ఇష్టమొచ్చినట్లు దులిపెసేట్లు ఉన్నాడని గ్రహించి వాడి చేతిలో మరో రూపాయుంచాడు సారధి.
వాడు మారు మాట్లాడకుండాసెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు.
"అయితే అసలు సామాన్లు తోమ్మిదన్నమాట!" అన్నాడు సారధి.
"అవును!" అన్నాన్నేను.
"మరి ఇందాక ఎనిమిదే అన్నావ్?"
"వాళ్ళు వాటర్ బాటిల్ లెక్కలోకితీసుకొలెదు." అన్నాను ఆడాళ్ళను చూపూతూ.
"ఎందుకు తీసుకోలేదు?"
"ఏమో తెలిదు."
"పెద్ద తలనొప్పి ఆడాళ్ళతో"
"ఆ మాట నిజమే!"
"ఏదేమయినా నీ అర్గాన్తే జేషన్ సరిగ్గా లేదు" అన్నాడు వాడు ప్తేనల్ గా
నేనేమి మాట్లాడలేదు.
"ఇప్పటికి ఇంకేదో తక్కువగా ఉన్నట్లనిపిస్తోంది!" అన్నాడు కాసేపాగి.
నాకూ అలాగే అనిపించసాగింది.
మళ్ళి అన్ని ఓసారి లెక్కవేశాము. తాతయ్య చుట్టల పెట్టెతో సహా ఈసారి పది సామాన్లు కనిపించాయ్.
ఇంకాసేపు సామాను వ్యవహారం చూస్తే ఇద్దరికీ పిచ్చెక్కిపోతుందేమో అనిపించి ఆ ప్రయత్నం విరమించుకున్నం
మా బండి ఇంజన్ కూత వినిపించింది.
'డాడి- మమ్మి-టాటా-' అంటూ బయట ప్లాట్ ఫారంమీద నుంచి చిన్నిగాడి గొంతు వినిపించింది. ఆశ్చర్యంగా అటువేపు చూశాము వాడు ప్లాట్ ఫారంమీద నిలబడి కిటికీలో నుంచి మా వేపు చూస్తూ 'టాటా' చెబుతున్నాడు.
"అమ్మో! ర్తెలు బయల్దేరుతుంది-వాడిని త్వరగా తీసుకురండి" అంటూ అరచింది సారధి భార్య.
వెంటనే యుద్ధరం చెరోవేపునుంచి కారేజ్ దిగి పరుగెత్తి వాడిని పట్టుకుని లోపలకు ఈడ్చుకోచ్చం.
ఈలోగా బండి కూడా కదిలింది.
"ఎందుకురా-కింద నిలబడి టాటా చెపుతున్నావ్?" అడిగాను చిన్నిగడిని.
"డాడియే చెప్పారుగా -ఎవర్తెనా వెళ్తూంటే 'టాటా' చెప్పాలని?" అన్నాడు వాడు.
"నువ్వు ర్తేలేందుకుఎక్కలేదు?"
"ఎక్కుతే 'టాటా' ఎలా చెప్పాలి?"
ఎవ్వరం వాడినేమి అనలేకపోయాం. ఎందుకంటే సారదిగాడే కొద్ది రోజుల క్రితం వాడినిచావగొట్టి అందరికి'టాటా' చెప్పటం నేర్పించాడు.
ఒకే చోట అందరికి బెర్తులు దొరికాయ్. మా పక్కనే ఓ సర్దార్ జికి బెర్తు దొరికింది బెడ్డింగ్ విప్పి బెర్తులమీద పరచేశాము. అప్పటికింకా పూర్తిగా తెల్లవారలేదు. అంచేత కాసేపు నిద్రపోవచ్చ్కాని నా ప్లాన్.