Previous Page Next Page 
హనీమూన్ పేజి 25


    మా చుటూ చేరిన ల్తేసేన్స్ కూలీలు మమ్మల్ని చూసి జాలిపడ్డారు.

    "ఏ బండికి వెళ్ళాల్సి ఉంది?" అనడిగాడు ఒకతను

    చెప్పాను

    "అరె! అదింకా వెళ్ళలేద్సార్! అసలు ఇంతవరకూ  రానేలేదు" అన్నాడు వాడు.

    నేను ఆశ్చర్యపోయాను.

    "మరి ఆ ఎంక్వయిరీ క్లార్క్ వెళ్ళిపోయిందంటాడే"

    "వాళ్ళకేం తెలుసుసార్! ఇప్పడే ప్లాట్  ఫారం మీద నుంచి వచ్చ్కాన్నేను."

    నేను కోపంగా ఎంక్వయిరీ  క్లార్క్ దగ్గరకు నడిచాను.

    "ఏమండి మా బండి వెళ్ళిపోయిందాన్నారుగా -ఇంకా రానేలేదని ల్తేసేన్స్ కూలి చెప్తున్నాడు."

    "ల్తేసేన్స్ కూలి చెప్పాడా?"

    "అవును!"

    "అయితే అథినే కరెక్ట్."

    "మరి వెళ్ళిపోయిందని మీరెలా అన్నారు?"

    "మాకు  వచ్చిన ఇన్ఫర్మేషన్  బట్టి."

    "ఏమిటా ఇన్ ఫర్మేషన్ ?"

    "పావుగంట లేటని."

    "ఎవరిచ్చారది ?"

    "కంట్రోలర్ ."

    "అంటే ఇక్కడ ఎవరికీ బాధ్యత అనేది లేదా?"

    "ఇక్కడ కేవలం ర్తేళ్ళకు సంబంధించిన వివరాలే ఇస్తాం సార్!డేట్స్ గురించీ వివరాలు కావాలంటే స్టేషన్ మాస్టర్ నీ కలవాలి!"

    ఇంక అతనితో వాదించినంత మూర్ఖత్వం ఇంకోటి లేదని వెనక్కు తిరిగాడు అందరం గేటు దగ్గరకు నడిచాము.

    "మంచి రోజ్జూసి బయలుదేరాలంటే-గాడిదగుడ్డు అని కొట్టిపారేశారు చూశారా- ఇవాళ ప్రయాణం పెట్టుకోవటం మూలాన ఎంత గోడవో"

    గేటుదగ్గరున్న టికెట్  కలెక్టర్ నీ మా బండి  ఏ ప్లాట్ ఫారం మీద కోస్తుందో చెప్పమని అడిగాను.

    అతను కర్చీఫ్ తో మొఖం తుడుచుకుని కాసేపు స్టేషన్  ప్తే కప్పు రేసి చూశాడు.

    "సాధారణంగా  రోజూ అయితే  అయిదో  నంబరు ప్లాట్  ఫారం మీద కొస్తుంది. మరి ఇవాళేమో గంట  లేటున్నప్పడు మరి  మామూలుగా అయితే  ఆరోనంబరు ప్లాట్  ఫారం మీద కొస్తుంది. కాని ఆరో నేమబరు బోపోర్  టైమ్  కె  వచ్చేసింది. మరి కోరమందలేమో ఏడు మిదగ్గాని, ఆరుమీదగాని రావాలి. జి.టి నాలుగంటలున్నర లేతవటంవల్ల అదికూడా" అక్కడిదాకా మాట్లాడక అతను కొద్దిక్షణాగాగాడు. అసలు  తనేం  మాట్లాడు తున్నాడో, ఏ బండి గురించీ చెప్పాలనుకున్నాడో అతనికి గుర్తురాలేదు.

    "మీరు యే బండి గురించీ అడిగారు?" అనుమానంగా అడిగాడు.

    హఠాత్తుగా  అడిగేసరికి నాక్కూడా మేమెళ్ళేల్సిన బండి పేరేమిటో గుర్తురాలేదు. సారధినడిగాను.

    "కోరమండల్"అన్నాడు సారధి.

    "చట్ కాదు! జయంతి జనతా" అన్నాన్నేను.
   
    "కాదు! కె.కె. ఎక్స్ ప్రెస్" అన్నాడు సారధి.

    ఇక లాభం లేదని జేబులోంచి టికెట్స్ తీసు టి.సి.కి చూపించాం  అతను ఆ తికిత్స్ వంక అయిదు నిమిషాలపాటు చూశాడు.

    "ఎందుకయినా మంచిది! స్టేషన్ మాస్టర్ని ఆడగండో సారి!" అన్నాడు ఆఖరికి.

    సామానుతో కూలిని వెంబడేసుకుని అయిదో నెంబరు ప్లాట్ ఫారం మీదకు చేరుకున్నాం.

    ఓ చోట సామాను దించి- నేనూ సారధి తాతయ్య స్టేషన్ మాస్టర్ ఆఫిస్  చేరుకున్నాం.

    స్టేషన్ మాస్టారు కుర్చీలో కూర్చుని ఒకేసారి  మూడు ఫోన్లలో మాట్లాడుతున్నాడు. మరో నాలుగు ఫోన్ల ప్తేరింజన్లలా మోగుతున్నాయ్.

    "పూర్వం అష్టాపధానం చేసేవారంటే ఇలాగే మరి!" అన్నాడు  తాతయ్య అదో పెద్ద విచిత్రంలా చూస్తూ.

    స్టేషన్ మాస్టర్  మూడు ఫోన్లలో మాట్లాడడం ముగించి మరో మూడు ఫోన్లందుకున్నాడు. మేము అలాగే నుంచుంటే ఎన్ని రోజులయినా అతను ఫోన్లలోనే మాట్లాడేట్లు కనిపించాడు. అందుకని ముందు కెళ్ళి "ఎక్స్ క్యూజ్ మీ" అన్నాను.

    "యస్" అన్నాడతను ప్రశ్నార్ధకంగా.

    "డిల్లి ఎక్స్ ప్రెస్  ఏ ప్లాట్  ఫారం మీద కోస్తుందో...." నా మాట వినకుండానే మరో ఫోన్ అందుకున్నాడతను.

    "హలో శ్రీ కంఠయ్య! హలో-హలో-రెండో నెంబర్ నుంచి రెక్ లాగేసేయ్-రెండో నెంబర్ నుంచి రెక్ లాగేసేయ్- తీసెయ్" అరచి  ఫోన్ పెట్టేశాడతను.

    "ఎక్స్ క్యూజ్ మీ" అన్నాన్నేను మళ్ళి.

    "యస్."

    "డిల్లి ఎక్స్ ప్రెస్ ఆరోనంబర్ మీదకు...."

    "ఏమిటి? ఆరోనెంబర్ మీద కొచ్చిందా?" అంటూ ఫ్లాన్లక్కడ పడేసి  బులెట్ లా బయటకు  పరుగెత్తాడు.

    "మన బండి సంగతి  అడిగితే  అలా పరిగెడతాడేం?" ఆశ్చర్యంగా అన్నాడు సారధి.

    "ఆరోనెంబర్ మీద కొచ్చిందా" అని ఆడగాబోతే వచ్చిందనుకుని పరుగెత్తాడు అన్నాన్నేను.

    "ఇప్పుడు ఆరోనెంబర్లో బండి  కనబడకపోతే మనల్ని నానా తిట్లూ తిడతాడు-పద ఇక్కడ నుంచి  వెళ్ళిపోదాం?" అన్నాడు సారధి.

    వెనక్కు వెళ్ళి సామాను దగ్గరగా కూర్చున్నాము.  
 

 Previous Page Next Page