Previous Page Next Page 
పార్ట్ టైమ్ హాజ్ బెండ్ పేజి 25

 

    "పచార్లు చేస్తూనే 603 తో మాట్లాడుతున్నారన్నమాట"
    'అన్నమాటేమిటి? ఉన్నమాటే ....." కోపంగా కసిగా అంది.
    ఆమె అలంకరణ రోజు రోజూకీ మరింత రివీలింగ్ గా మరింత ఎట్రాక్టివ్ గా తయారవుతోంది. సురేష్ కి ఆమె వంక చూస్తుంటే గొంతు తడారిపోతోంది. చెమటలు పట్టేస్తున్నాయ్. కానీ అంతలోనే భయం!
    అలా గుచ్చి గుచ్చి చూస్తె పసికట్టేస్తుంది.
    "ఏమిటా చూపులు? మేనర్స్ లేదూ?" అనేస్తుంది.
    భర్తను ఆకట్టుకోడానికి ఎన్ని తిప్పలు? పరాయి స్త్రీ మీద మోజు పడకుండా అడ్డుకట్టలు వేయడానికి ఎన్ని జాగ్రత్తలు ?
    "ఆ రాజేశ్వరి సంగతేమయింది? ఇవాళ కూడా కాంటీనులో కలుసుకున్నారా?"
    "మళ్ళీ రాజకీయాలే మాట్లాడుతున్నారండీ!"
    "తప్పకుండా ఆ భాషలో ఏదో 'కోడ్' ఉంది వుంటుంది."
    "ఈ మధ్య న్యూస్ పేపర్ కూడా చదువుతున్నారండీ! నిజంగానే ఎలక్షన్స్ లో నిలబడతారేమో!"
    "నువ్ నాకు టోపి వేయడానికి ప్రయత్నించకు! నేనేం పిచ్చి దాన్ని కాదు"
    "అబ్బే ......అలా నేనెందుకు చేస్తానండీ?"
    టెర్రేస్ మీదకు చేరుకున్నాడు.
    సీక్రెట్ గా చేజ్ ముగించి బేకరీ నుంచి తెచ్చుకున్న బ్రెడ్ తినసాగాడు.
    కూజాలో మంచినీళ్ళు ఫుల్ గా పట్టి పెట్టినట్లుంది కుమిదిని.
    కుమిదినిని వల్లో వేసుకోవటం ఆలస్యం అయిపోతోంది.
    ఆ రోజు గొడవయిపోయే సరికి రాత్రిళ్ళు టెర్రేస్ మీదకు రావటం మానేసింది.
    నష్టం ఎవరికీ?
    తనకే!
    అప్పుడప్పుడు ఆమె తెచ్చిచ్చే భోజనం కాస్తా బంద్ అయిపొయింది.
    వాతావరణం చాలా వేడిగా వుంది.
    టాంక్ కింద పడుకోవటం కాబట్టి బ్రతికిపోయాడు గానీ లేకపోతే ఆ వేడి భరించటం కష్టం....
    నిద్రపట్టటం లేదు.
    కళ్ళు మూస్తే చాలు శీరిషే కనబడుతుంది.
    వాడెవడో ఆ దుబాయ్ గాడు సడెన్ గా తనకు విలన్ అయిపోయాడు.
    ప్రేమకూ డబ్బుకీ మధ్య జరిగే బై ఎలక్షన్ లో ఎప్పుడూ డబ్బే గెలుస్తుంది. ప్రేమకు డిపాజిట్ కూడా దక్కదు.
    అయినా వాటర్ టాంక్ ల కింద కాపురాలున్నోడుకి ప్రేమెంట్ అసలు ?
    చిన్నప్పటి నుంచీ తను కోరుకుందేమి దొరికింది గనుక?
    ఎలిమెంటరీ స్కూల్లో సువర్చల తనకు చాక్ లెట్లు కొనిచ్చే కెపాసిటీ లేదని తెలిసి ఆ రాజుగాడితో జతకట్ట్లేలేదూ?
    అందరూ ఫస్ట్ హాండ్ పుస్తకాలూ, పలకలు కొనుక్కోస్తే తను సెకండ్ హాండ్ పుస్తకాలతోనే డిగ్రి వరకూ రాలేదూ?
    అందరూ అడపదడపా కొత్త బట్టలు కుట్టించుకుంటుంటే తను ఒకే జతతో టెన్త్ వరకు గడిపేయలేదూ?
    అంచేత అన్ని విషయాల్లోనూ రాజీ పడ్డట్లే శిరీష విషయంలోనూ రాజీ పడాల్సిందే!
    అంతలోనే ఆశ----
    ఒకవేళ ఈ కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ ఉద్యోగం సంగతి చెపితే శిరీష వాళ్ళక్క శిరీషను తనకొచ్చి చేయడానికి వప్పుకుంటుందేమో!
    అంతలోనే నిరాశ .......
    జీతం మూడొందలంటే ఎవరయినా నవ్వుతారు.
    దానిని ఉద్యోగం అనరు! అడుక్కుతినటం అంటారు. నిద్రపడుతూ పడుతూ వుంది.
    గాజుల చప్పుడు వినిపించడంతో మత్తేగిరిపోయింది.
    వంపు సొంపుల ఆకారం గాజుల చప్పుడతో టెర్రేస్ మీద కొచ్చి అవతలి వేపు టాంక్ ల దగ్గరకు నడుస్తోంది.
    ఇంత రాత్రిలో వచ్చేది కుమిదినే!
    సడెన్ గా తన ఫ్రెండ్ వహీద్ గుర్తుకొచ్చేడు.
    "ఒక్కసారి వాటేసుకో బ్రదర్......కిక్కురు మనరు ......లేకపోతే నకరాలు చేస్తూనే వుంటారు" అనే సూత్రం ఉపదేశించిన దివ్య పురుషుడు.
    ఇంతకంటే మంచి అవకాశం దొరకదు.......
    ఒక్కసారి కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటే ఆ బెట్టంతా వదిలి పోతుంది.
    మేరీ పండరీకాక్షయ్యతో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తుంది.
    వెనుకే అడుగుల చప్పుడు కాకుండా నడిచాడు.  
    ఆమె పిట్టగోడను చేరుకుంటుండగా హటాత్తుగా వెనుక నుంచి చేతులతో ఆమెను చుట్టేశాడు.
    ఆమె అందుకోసమే ఎదుర్చుస్తున్నట్లు తన కౌగిట్లో ఇమిడిపోవటము .........తన వేపుకి తిరిగిపోయి తన పెదాలకు పెదాలందించటం--
    ఇన్ని రోజులూ ఆ బెట్టు సరంతా నటనేనన్న మాట!
    అప్పుడే అనుమానం వచ్చింది తనకు పనిమనిషి కింత బెట్టెమిటని.
    ఆమె స్పర్శ శరీరమంతా కాల్చేస్తోంటే.......పెదాల మీద ఆవిరి చెలరేగుతోంటే -- వినిపించిందామె గొంతు.
    "నాకు తెలుసు ........ఆ 603 కి మీకూ ఇలాంటి భాగోతం జరుగుతొందనే -- మీరు పచార్లు చేస్తోంటే మీకు తెలీకుండా టెర్రెస్ మీద కొచ్చాను. అంటే రోజూ దానితో ఇలాగే ప్రణయం జరుపుతున్నారన్న మాట ....."
    సురేష్ కి గుండెలవిసిపోయినాయ్ . ఆ గొంతు శ్రీదేవిది! ఆ శరీరం శ్రీదేవిది ! ఆ కౌగిలి శ్రీదేవిది!
    ఉలిక్కిపడి కౌగిలి వదిలి దూరంగా జరగబోయాడు గానీ శ్రీదేవి చేతులు మరింత బలంగా కసిగా అతని నడుముని చుట్టేసినాయ్.
    "ఏం? సొంత భార్య అనేసరికి చేతులు వదులయిపొయినాయా పెదాలు చేదయిపోయాయా? నా కంటే ఆ 603 కే వంపు సోంపు లేక్కువయ్యాయా?"
    సురేష్ కి కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయ్.
    "మేడమ్! నేనండీ! సురేష్ ని!' ఆమె నుంచి విడివడుతూ అన్నాడు.
    అతని గొంతు వినగానే చటుక్కున దూరంగా జరిగిందామే.
    కొద్ది క్షనాలా,మేకు నోట మాట రాలేదు.
    కోపం, సిగ్గూ , అవమానం దహించి వేసినాయ్.
    "నీకేమయినా బుద్దుందా? ఎందుకొచ్చావిక్కడికి నువ్వు?' పైట సరిజేసుకుంటూ మండిపడిపోతూ అడిగింది.
    "మీరు కుమిదిని అనుకుని....."
    'అంటే? కుమిదినికీ నీకూ ఎప్పటినుంచో భాగోతం నడుస్తోందన్నమాట!"
    'అబ్బే! అలాంటిదేమీ లేదండీ! కుమిదినిని భయపెడదామనీ వెనుక నుంచీ వచ్చి కళ్ళు మూయబోయాను"
    "సిగ్గులేకపోతే సరి! నీలాంటి బ్రహ్మచారిని అసలీ టెర్రస్ మీద ఉండనీయటం నాదీ తప్పు!"
    "అది కాదు మేడమ్"
    "నేను చప్పున తేడా తెలుసుకో బట్టి గానీ లేకపోతే ఇంకేమీ చేసేవాడినో"
    "నేనో పక్కన గింజుకుంటూనే వున్నాను మేడమ్-----"
    "నిన్ను ఇంక చస్తే నమ్మను! ఇవాళ నేనయ్యాను--- రేపు ఇంకోళ్ళవుతారు."      

 Previous Page Next Page