మరి కాసేపట్లో ప్తేల్స్ పక్కకు తోసేసి ఇద్దరం నిద్రలో మునిగి పోయాము.
తీరా అరగంటయినా నిద్రపోకముందే కెవ్వున కేక వినిపించిచటుక్కన లేచి కూర్చున్నాను.
సారధి నిద్రలోనే ఏమిటేమిటో అరుస్తున్నాడు. నాతో పాటు ఇంట్లోని వాళ్ళందరూ కూడా లేచి ఆ గదిలో కొచ్చి ల్తెట్ వేశారు.
వాడిని తట్టి నిద్రలేపాను.
కళ్ళు తెరచి మమ్మల్నందరినీ చూసి "ఏమిటి?" అనడిగాడు వాడు.
"ఎందుకలా అరిచారు?" అడిగింది వాళ్ళావిడ.
"నేనేప్పడరిచాను?"
"ఇప్పడే!"
"అరచేనా?"
"అవును!"
"ఏమని అరచాను?"
"నన్నోదిలేయండి నాయనోయ్ అనరాచావ్."
"అదా! అయితే ఆ పిదకలలోనే అరచి ఉంటాను!"
"ఏ పిడకల?"
"అదే! పోలీసులు నన్ను పొలిసుస్టేషన్ కి తీసుకెళ్ళి చావగోట్టటం."
"ఎందుకు? నువ్వేం చేశావని?"
"ఏమీ చేయలేదు."
"మరెందుకు తీసికెళ్ళినట్లు?"
"అదే తెలిదు. తీసుకెళ్ళి వరసగా అందూ నిలబడి బెల్టుతూనూ, లాఠితోనూ చావాకొడుతున్నారు. ఆ దెబ్బలు తాళలేక ఉంటాను."
'ఏడ్చినట్లుంది' అంటూ అందరూ వెళ్ళి మళ్ళి నిద్ర కుపక్రమించారు. ఆ తరువాత మళ్ళి నిద్ర పడుతోండగా పెద్ద చప్పుడు వినిపించి అడంరం లేచి కూర్చున్నాం.
తీరా చూస్తే వంటింట్లో దోంతరగా ఉన్న గిన్నె లన్నిటిని దోర్లించింది పిల్లి.
మళ్ళి నిద్రపోబోతుంటే చిన్నిగాడు హొరున ఏడుస్తూ వాడి పక్క మీద నుంచి లేచి కూర్చున్నాడు. 'ఎందుకెడుస్తున్నావ్' రా అవి ఎంత అడిగినా చెప్పడు చివరకు చాలా సేపు బ్రతిమాలాక అసలు విషయం చెప్పాడు.
తన రంగుల పెన్సిల్ శీనుగాడు లాక్కున్నాడట. తన పెన్సిల్ తనక్కావాలిట ఇప్పుడు.
"రేపోద్దున్నే లేచి వేల్లిని పెన్సిల్ తేచ్చుకుందాములే!" అంది వాళ్ళమ్మ
"ఊహు? నాకిప్పడే కావలి."
"ఇప్పడేలాగామ్మా! అంతా చీకటి! పొద్దున్నే వెళ్దాంలే..."
నాకే...నా కిప్పుడే కావాలి !" అంటూ మళ్ళి మారాం మొదలు పెట్టాడు.
"అన్ని తండ్రి కళలే...వెధవ బుద్దులు విడూనూ." సమతూ రెండు అంటించిందామే.
దాంతో ఇల్లెగిరిపోయేట్లు ఎదవసాఆడు వాడు ప్రక్కింటివాళ్ళూ నిద్రలేచి పరుగుతో వచ్చారు ఏం కొంప మునిగిందో కనుక్కోడానికి. ఆ గొడవంతా సర్డుమనిగేసరికి ఒంటిగంటయింది.
అందరం మళ్ళి నిద్రకు ప్రయత్నంచాం కలత నిద్ర పడుతూండగా పాలవాడు తలుపు కొట్టాడు.
అదిరిపోయి లేచి కూర్చున్నాం టైము అయిదాయి పోయింది. మమ్మల్నందరిని మూడింటికే లేపుతానన్నా తాతయ్య హాయిగా నిద్రపోతూ నాడు మంచం మీద.
త్వరత్వరగా తాతయ్యను లేపాము.
"నేను నిద్రపోలేదు లేరా! ఇంకా మూడవలేదు" అన్నాడు తాతయ్య.
"నిన్ను నమ్ముకుంటే కొంప మునిగిందే! టైము అయిదయింది" అంటూ ఆయనను బలవంతాగా లీకేల్లి బాత్ రూమ్ దగ్గర వదిలాము.
అందరం హడావిడిగా రాడిఅయి సామానుతో సహా సర్దుకుని రిక్షాలో కూర్చున్నాము తీరా రిక్షాలు కదలబోయే సమయంలో సారధి వాళ్ళావిడ కేవ్వుమంటూ అరచింది.
"ఏమయింది?" అన్నాను రిక్షాదిగి.
"చిన్నిగాడు కనబడటం లేదు."
సారధి పళ్ళు కొరుకుతూ తలుపు తాళం తిసి మళ్ళి ఇంట్లో కెళ్ళాడు ఇద్దరం కలసి ఇల్లంతా వేదికం సోపా వెనుక కింద పడుకుని గాడ నిద్రలో కనిపించాడు.
వాడి విపుమీద రెండు వాయించి బయటకు ఈడ్చుకొచ్చి రిక్షాలో పడేశాడు సారధి దాంతో వాడు పాశ్చాత్య సంగితం ప్రారంభించాడు. ఆ సంగీతానికి వీధిలోని రెండు వేపుల ఇళ్ళవాళ్ళూ తలుపులు తెరచుకుని ఇంటిల్లి పాడి బయటకొచ్చి మా వంక వింతగా చూడసాగారు. ఆ ప్రేక్షకసమూహం చూసేసరికి వాడికి దుఃఖం మరి కట్టలు తెగిపోయింది తన నెవరో చంపెయడానికి తిసుకేలుతున్నట్లూ, ఆ విషయం ముందే తెలిసి నట్లూ మరి ఏడుస్తున్నాడు వాడు. ఉండుండి వాడిని ఎడాపెడా వాయిస్తూనే ఉంది సారధి భార్య.
రిక్షాలు స్టేషన్లో ఆగానే నేను ఒక్క దూకు దూకి ఎంక్వయిరీ కౌంటర్ దగ్గరకు పరుగెత్తాను. మా బండి గురించీ చెప్పి 'ఎంత లేటు?' అనడిగాను.
"పావుగంట!" అన్నాడు వాడు.
"అంటే వెళ్ళిపోయిందా?"
"వెళ్ళిపోయే వుంటుంది."
నీరసంగా రిక్షాల దగ్గరకు తిరిగి వచ్చాను.
"ఏమయిందిట? బండి వెళ్ళిపోయిందా?" అనడిగాడు సారధి.
"వెళ్ళిపొయిందిట."