నోమోర్ జోక్స్! మూడు వందలు జీతం ప్లస్ కమిషన్ -- యిష్టమేనా?"
"కమిషన్ ఏమిటి?"
"మీరు మీ స్వంత కనెక్షన్స్ తో మా సంస్థ కంప్యూటర్ కోర్సుల్లో చేర్పించే ప్రతి విద్యార్ధికి రెండు వందలు కమీషన్ ఇస్తాము . అదే సంవత్సరం కోర్సుల్లో -- అంటే పి.జి డిప్లమా కోర్సుల్లో చేర్పిస్తే వెయ్యి రూపాయలు కమిషన్ "
"ఓ! జస్ట్ లైక్ బోఫర్స్ "
"యాజ్ యూ లైకిట్!"
సురేష్ చకచకా లెక్కలు వేసుకున్నాడు.
కనీసం నలుగురు స్టూడెంట్స్ ని చేర్పించినా నాలుగు వేలు --
ఫెంటాస్టిక్ --
పోనీ నలుగురు దొరక్కపోయినా ఇద్దరు.
రెండు వేలు చాలా పెద్ద మొత్తం.
"ఈ కోర్సుల్లో చేరడానికి క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా?"
"అప్పర్ కే.జి వాళ్ళు కూడా పి.జి డిప్లమా కోర్స్ లో చేరవచ్చు. కాపోతే ఫీజు ఇంకొంచెం ఎక్కువుంటుంది . ఇష్టమేనా?"
"అల్ రైట్ ! ఎగ్రీడ్"
"బయట మా కౌన్సిలర్ వుంది. ఆమెను కలుసుకోండి. లిటరేచర్ ఇస్తుంది."
కౌన్సిలర్ పొట్టిగా, గ్లామరస్ గా వుంది.
బాగా ముదురు కేసు లాగా కనబడుతోంది.
"హలో! కౌన్సిలర్ మీరేనా?"
"పేరు మాయ"
"హలో మాయాజీ! గ్లాడ్ టూ సీయూ"
"ఆ విషయం కనబడుతూనే వుంది" టీజింగ్ గా నవ్వుతూ అంది.
"ఎక్కడ కనబడుతోంది?" వళ్ళంతా చూసుకుంటూ అడిగాడు.
"నెవర్ మైండ్ - మేడమ్ ఏం చెప్పారు !"
"లిటరేచర్ ఇమ్మన్నారు."
'అయితే మీరు సెలక్టయ్యారన్న మాట! కంగ్రాచ్యులేషన్! ఇంత వరకూ ఆరువందల మందిని ఇంటర్యూ చేశారు గానీ ఇద్దరినే సెలక్ట్ చేశారు"
సురేష్ కి ఆశ్చర్యం కలిగింది. ఆమె మాటల మీద అనుమానం కూడా కలిగింది.
"నేను అందరిలాగా కాదులెండి! స్పెషల్ టాలెంట్స్ వున్న వాడిని "
"ఊహూ! అలాగా! అదేమిటో తెలుసుకోవచ్చా?"
"మీరు ఓ కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్ కి యజమానురాలయితే -- అప్పుడు ఇంటర్యూ లో చూపిస్తాను "
"అప్పటివరకూ అవి వుంటే --" పెదవి బిగించి నవ్వాపుకుంటూ అంది.
తనూహించింది కరెక్టే --- ముదురు కేసు.
లిటరేచర్ సొరుగులో నుంచి తీసి అతనికిచ్చింది .
"జోన్ టెన్ తో నుంచీ కోర్సెస్ స్టార్టవుతాయ్. ఈలోగానే మీరు మీ తరుపు స్టూడెంట్స్ ని చేర్చాల్సి వస్తుంది."
ప్లాట్స్ కి చేరుకునేసరికి పింకీ ఎడుర్చుస్తోంది తనకోసమే --- తలుపు కొంచెంగా తెరచి చూస్తూ డిమ్ లైటులో ---
"హాయ్!' చిరునవ్వుతో పలుకరించింది.
"హలో" వాళ్ళ ప్లాట్ కి నడవబోతుంటే అడ్డంగా నిలబడింది.
"నోనో -- లోపలకు రాకూడదు "
"ఎందుకని ?"
"మా ఫ్రెండ్స్ వచ్చారు -- పార్టీ జరుగుతోంది.
"మరి ట్యూషన్?"
"ట్రాష్! ఆ గొడవంతా రేపు టుడే ఈజ్ హాలిడే"
"ఓసారి ,మీ మమ్మీతో మాట్లాడతాను"
"ఇంట్లో ఎవ్వరూ లేరోయ్ -- ఉంటే పార్టీ ఎలా ఇస్తాడనుకున్నావ్ ?"
"ఎక్కడికి కెళ్ళారు?"
"క్లబ్ లో ఫంక్షన్ కి"
ఆమె తలమీద నుంచి మరో రెండు టీనేజ్ అమ్మాయి తలలు తొంగి చూశాయ్.
"క్లోజ్ ది డోర్ యార్" ఓ టీనేజ్ అరుస్తోంది.
లోపల్నుంఛీ ఏమ్. టి.వి గుండె లదిరే బీట్ తో వినబడుతోంది.
"ఎవరేవరున్నారు లోపల?"
"నేనూ, ,ఆ ఫ్రెండ్సూ"
"ఏం పార్టీ?"
"నీకెందుకోయ్ అవన్నీ? నువ్వు డ్రింక్స్ తాగవు, స్టార్ టి.వి చూడవు, గేమ్స్ అడవ్ -- నాకో హెల్ప్ చేస్తావా?"
"ఏమిటి?"
"ఈ పార్టీ సంగతి మా మామ్మీకి , డాడీకి చెప్పకూడదు"
"చేపితేనేం?"
"నేను బోయ్ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురావటం మమ్మీకి ఇష్టం వుండదు "
"మైగాడ్! లోపల బోయ్ ఫ్రెండ్స్ కూడా వున్నారా?"
"ష్! ఇద్దరేలే!అరవకు"
"వాళ్ళతో కలసి తాగుడు పార్టీఅంటే కొంపలు మునిగిపోవూ?"
"కండోమ్స్, పిల్స్ అన్నీ స్టాకున్నాయ్, అమ్మమ్మలాగా బిహేవ్ చేయకు ఒకే! ఇదేం తెలుగు సినిమా కాదు. ఊరికే ప్రెగ్నెన్సీలు తెచ్చుకుని భోరున ఏడవడానికి "
"ఓకే"
"నువ్విక్కడి ద్రుశ్యాలెం చూళ్ళేదు. మామూలుగానే సాయంత్రం వచ్చి నాకు ట్యూషన్ చెప్పి వెళ్లిపోయావ్! ఎలా వుంది స్టోరీ?"
'చాలా బాగుంది . కాపోతే ఫినిషింగ్ సరిగా లేదు"
"ఫినిషింగేమిటో చెప్పు ?"
"నేను కళ్ళు మూసుకున్నందుకు నువ్వు నాకో సహాయం చెయ్యాలి "
"ఏమిటది?"
"మీ డాడీని మమ్మీని వప్పించి నువ్ కంప్యూటర్ ఇన్ స్టిట్యూట్లో పి.జి. డిప్లమా లో చేరాలి "
"ఎందుకు?"
"అది నీకనవసరం. నీ సంగతులేమీ చూడకుండా 'ఐస్ క్లోజింగ్ అలవెన్స్ ' అన్నమాట ! ఓకె?"
"ఓకే! నాదెం పోయింది. జాయినవుతాను గానీ క్లాసులకు మాత్రం రాను. ఐ హేట్ కంప్యూటర్స్ "
"ఓకె! రాకపోయినా ఫర్వాలేదు. నేను మానేజ్ చేస్తాను "
ఆమె చేయి బయటకు చాచింది.
"థాంక్స్ ఫర్ కోపరేషన్"
చేయి కలిపాడు.
అమ్మయ్య! ఒక గిరాకీ దొరికింది.
అంటే వెయ్యి రూపాయలు కమీషన్ ......
డబ్బు సంపాదించటం ఇంత తేలికా?
అందుకే అంతా బిజినెస్ బిజినెస్ అంటారు.
శ్రీదేవి తల్లోని మల్లెపూలు ఆ ఫ్లోర్ లోని గాలి నంతటినీ మత్తుతో నింపేస్తున్నాయ్.
మెట్లెక్కుతొంటే శోభనం గదిలో కెళుతున్న ఫీలింగ్-
తలుపు బార్లా తెరచి సోఫాలో కూర్చుని కేబుల్ టి.వి చూస్తోంది.
"ఇలారా! నీ కోసమే చూస్తున్నా...... " ఎంత తప్పించుకుందామనుకున్నా కుదరలేదు.
"ఏమిటండీ?"
"రాత్రేం చేశారో చూశావా?" లేడీ డిటెక్టివ్ లా అడిగింది.
"ఏం చేశారండీ?"
"నువ్ చెప్పిందంతా నిజమే .......భోజనం చేసి కారిడార్ లో పచార్లు చేస్తున్నారు -- సరే పచార్లే కదాని నేను వంటింట్లో సర్దుకుని బయటికొచ్చే సరికి 601 డోర్ తెరచి ఉంది. అంటే దానర్ధం ఏమిటి?"