Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 25

    "ఏం  పడిపోను!"   అని గుమ్మందాటాడు  పిల్లవాడు.  వాడి  నడుముకి  ఒక తెల్లటి ఉత్తరీయం చుట్టి ఉంది!  చెంబు అజిత్  చేతికి  అందిస్తూంటే  ఉత్తరీయం కాస్తా ఊడిపోయింది! ఆ పిల్లవాడు బోలెడంత సిగ్గుపడి పోయి  ఉత్తరీయం పట్టుకు పారిపోయాడు. ఘల్లుఘల్లు  మన్న  శబ్దంతో  సమీపించి గ్లాసు అజిత్ చేతికి అందించింది ఆ ఆమ్మాయి!  చేయి చురుక్కు మని గ్లాసు క్రింద పెట్టె శాడు అజిత్.

    "తాతగారు స్నానం చేస్తున్నారు.  పది నిమిషాల్లో వస్తారు!  కూర్చో మని చెప్పారు!"

    ఇవే  మాటలు వీణమిటితె ఇంతకంటే మధురంగా వుండవు!

    ఎంత  చక్కటి కంఠస్వరూపం!

    ప్రబంధాలలో,  నవలలలో ఎందరెందరో కవితా వేశంతో చేసిన సౌందర్య వర్ణనలేవి ఈమె  అందం వర్ణించడానికి సరిపోదేమో అన్నంత అందంగా ఉంది. గంధపు  చెక్కతో విగ్రహాన్ని మలిచి ప్రాణం  పోసి నట్టుగా ఉంది! కొలకళ్ళు! సంపెంగ లాంటి ముక్కు,  పగడాల్లా  పెదవులు  చెవులకి జూకాలు, ముక్కుకి  పుడక,  మెడలో ముత్యలధండ!  చేతుల నిండుగా  గాజులు  బిగుతుగా  అల్లుకొన్న  పొడుగాటి జడకు జడగంటలు కాళ్ళకి పాంజిబులు!

    సాంప్రదాయం  రూపు ఎత్తినట్టుగా ఉంది!

    ఒకనాడు అమ్మమ్మ  తెలుగింటి  ఆడపడుచు ఎలావుండాలని వర్ణించింధో అలా  ఉంది!

    ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతే  మళ్ళి కనిపించదేమోనని,   ఆమెను కాస్సేపు ఆపాలను కొన్నాడు.  అజిత్ .  "పెద్దమ్మ గారు ఏం చేస్తున్నారు?"

    "త్రిపుర  అత్తయ్యనా?  స్నానానికి వెళ్ళింది!  మా అమ్మగారు బయటున్నారు!  అందుకని వంట ఇవాళ అత్తయ్య  చేస్తుందన్నమాట!"  అని,  వెళ్ళబోయింది.

      "మీరు తాతగారుకి ఏమౌతారు?"

    "మనుమరాలిని!"

    "మీ పేరేమిటి?"

    "అఖిల!  ఆకలాండేశ్వరి !"

    "ఆకలి అంటే  అర్ధం ఏమిటి?"

    "ఆకలి అని అర్ధం!"  ముసి ముసిగా  నవ్వుతూ,  అతడు నికల అంటే అర్ధం ఏమిటి అని అడగకముందే చప్పన వెళ్ళిపోయింది ఇంట్లోకి
    కోటి కోటి  సౌందర్యాలు ఒక్కచోటు కుప్పగా చూసినట్టుగా మనసు అనిర్వచనీయమైన  అనుభూతితో నిండిపోగా, ఇందాకా ఎంతో  అందంగా  కనిపించిన మధ్యాహ్న మల్లెలు, మందారం,  పువ్వుల్ని ముక్కుతో పొడుస్తూ పువ్వు  పువ్వుకి రివ్వురివ్వున  ఎగురుతూన్న చిన్న పిట్ట,  అన్ని తమ  సౌందర్యాన్ని కోల్పోయి వెలవెల బోయినట్టుగా అయ్యాయి. ఆకలని చూశాక!

    విశ్వేశ్వరయ్య వచ్చేసరికి ఇంకా పిట్ట ఆ చెట్ల మధ్య  ఎగురుతున్నా అజిత్ కి పోటో తీసుకోవాలన్న ఆసక్తి  ఎప్పుడో మాయమ్తే పోయింది!

    గ్లాసులో టి అలాగే ఉండడం చూసి,  "అరె! టి త్రాగాలేదే?" అనడిగాడు  విశ్వేశ్వరయ్య.

    "గ్లాసు బాగా వేడిగా ఉంది!"

    "ఇంత సేపటికి  టినే  చల్లారిపోయి ఉంటుంది.  ఇంకా గ్లాసు వేడిగా ఉంటుందా తీసుకోండి! పూర్తి గా  చల్లారి పోయాక ఏం బాగుంటుంది?......."  కప్పు సాసరులో త్రాగడం  అలవాటేమో! మా ఇంట్లో అవి ఉండవు.

    అజిత్ గ్లాసు చేతిలోకి  తీసుకున్నాడు.

    విశ్వేశ్వరయ్య మళ్ళి లోపలికి  వెళ్ళాడు.

    కొద్దిసేపటి తరువాత పరమేశం గారు,  ఆయన  వెనుక మడి చీరలో ఉన్న త్రిపుర వచ్చారు. ఏం మాట్లాడాలో తోచానట్టుగా  మౌనంగా గుమ్మం పట్టుకు నిలబడిపోయిందామే,

    అజిత్  విప్పారిత నేత్రాలతో ఆవిడను చూడసాగాడు.

    సంసార  మాదుర్యమంటే ఏమిటో తెలియకుండా భర్త నుండి దూరంమ్తె,   ఇన్నేళ్ళ ఏకాంత జీవితంలో  ఆవిడ ఎంతో కృంగి కృశించి పోయి ఉంటుందనుకొన్నాడు.  ఆ కాలంలో జుట్టు నెరిసిపోయి  దవడలు పిక్కుపోయి, కళ్ళ క్రింద నలుపు వలయాలు ఏర్పడి,  మనిషి ఎంతో దుఃఖ  భారంతో కనిపిస్తుందనుకొన్నాడు.  అతడు ఊహించుకొన్న మూర్తికి  పూర్తిగా  భిన్నంగా ఉంది త్రిపుర!

    ఆవిడ వయసు నలబ్తేకి  దగ్గరగా ఉంటుంది!  కానీ,  అంత వయసు కనిపించదు.  ముప్థ్పెరెండు,   ముప్త్పెఅయిదేళ్ళకి  మించి  కనిపించదు!  అఖిలకి,  ఆవిడకి  చాలా దగ్గరిపోలికలున్నాయి.  పచ్చ  మొగలి  రేకురంగులో  ఆవిడ  ముఖం  నిండుగా  విప్పారిన  అరవిందంలా ఉంది!  తల  నిండా స్నానం చేసిందేమో  తడి జుట్టుని  మధ్యకు  ముడివేసింది.  ముడి  వేసిన  ఆ జుట్టే ఎంతో  పొడుగ్గా ఉంది.  ముడి విప్పేస్తే వెంట్రుకల కొసలు  పాదాలను తాకుతాయేమో!

     త్రిపుర గొంతు సవరించుకొని,  "మీ నాయనమ్మ బాగుందా?"  అని అడిగింది,

    "ఆ బాగుంది."

    "ముసలాయన ఎలా పోయాడు?"

    "చనిపోవడానికి ఓ రెణ్నెల్ల ముందు  పక్షవాతం వచ్చిందట!  మందులకు  కాస్త  కోలుకొన్నట్టుగా  కోలుకొని  ఒకరోజు పోయారు!"

     వాళ్ళ  గురించి ఇక  అడగాల్సిన  ప్రశ్నలేం లేనట్టుగా,  నీకు నన్ను  చూడాలని ఎందుకు అనిపించింది?"  అనడిగింది  త్రిపుర.

    "నేను ఇండియా  ఎప్పుడు  వచ్చినా ఇలా వచ్చి అలా  వెళ్ళిపోయే  వాడిని!  ఈ ఇరవయ్యేళ్ళలో  అంతా ఎ రెండు మూడుసార్లో వచ్చాను! ఈ సారి  మాత్రం  ఇక్కడ కొంతకాలం  ఉండాలన్న నిర్ణయంతో  వచ్చాను! పరాయిదేశంలో  పెరగడంవల్ల  నాకు ఇక్కడ కల్చర్,  ఇక్కడి మనుషులు చాలా దూరమ్తెపోయిరు.  సరిగా  మాతృభాష కూడా మాట్లాడలేని స్ధితికి లోనయ్యాను! మీరింత  చక్కగా, సృష్టంగా తెలుగు మాట్లాడుతూంటే మీ  ముందు వచ్చీరాని  తెలుగు  మాట్లాడడానికి నేనెంతసిగ్గుపడుతున్నానో!  అని  కొంచెం సిగ్గుగా నవ్వి,  మళ్ళి,  "నేనిప్పుడు నాయనమ్మ దగ్గరే ఉంటున్నాను.  ఒకరోజు మీ పెళ్ళి ఫోటోలు  ఆల్బంలో చూడడం జరిగింది...." అని,  ఆనాటి సంఘటన గురించి చెప్పి,  పెద్దమ్మ గురించి నాయనమ్మను  అడిగి తెలుసుకోవడం, ఆమెను ఒకసారి చూడాలనిపించడం,  అందుకు నాయనమ్మ పర్మిషన్ తీసుకోవడం మొదల్తెన సంగతులు చెప్పాడు.

 Previous Page Next Page