Previous Page Next Page 
పెళ్ళి మంటలు పేజి 24

    "ఆయమ్మ కొడుకు మళ్ళి  పెళ్ళిచేసుకోన్నడంటగా?  పిల్లలా?"

    "ఇద్దరు! ఒక  ఆడపిల్ల!  ఒక  మగపిల్ల వాడు"

    "భగవంతుడు మంచి  చెడ్డ సూస్తడంటరు, ఎడస్తున్నాడు?  మా త్రిపురమ్మ గారికి  ఇంత  అన్యాయం చేసి ఆ అయ్యా పెళ్ళాం  పిల్లలతో కులుకుతనే ఉండడు!"  అది చెప్పలేనంత మంటతో అని.  "యశోదమ్మ గారు కలిస్తే గౌరీ  అడిగిందని చెప్పండి"  అని,  అది ఏదో పనిమీద  వేడుతున్నట్టుగా త్వరత్వరగా వెళ్ళిపోయింది.

    స్తంభాలమీద  ఆర్చిలుగా  కట్టబడిన పెద్ద వరండా,  ఇల్లు చాలా  పెద్దదే!  అంతా రాతి కట్టడం!

    వరండా మెట్లని సమిపిస్తూంటే అజిత్ గుండెలు చిత్రంగా కొట్టు కొన్నాయి.

    చిరిచాపమిద   కదురు త్రిప్పుతూ,  ముగ్గురు పిల్లలకి ఏవో  శ్లోకాలు చెబుతున్నాడు.  ఎభ్తే లోపు వయసున్న ఒకాయన. ఆయనే  నాయనమ్మ మేనల్లుడు విశ్వేశ్వరయ్య కావాలి! నుదుట  పెట్టుకొన్న  ఎర్రటి  కుంకుమ చేమటకి  తడిసి మరింత ఎర్రన్తే,   ఆయన పచ్చటి ముఖానికి మరింత శోభనిస్తూంది! గుండు! గుండుకు వెనుక ముడివేసిన  పిలక!  చె౩వులకి  తెల్లటి రాళ్ళున్న  పోగులు.  ఎదమీద  ఆచ్చాద నేది  లేదు.  తెల్లటి పంచమాత్రం గోచిపోసి కట్టుకొన్నాడు.  ఆయన ఏదో శ్లోకాన్ని శ్రుతిబద్ధంగా,   సుస్పష్టంమ్తెన  స్వరంతో చదువుతున్నాడు.

    అజిత్ సమీపించి "నమస్కారమండి"  అన్నాడు,  వినమ్రతతో చేతులు జోడించి.

    ఆయన  తలెత్తి చూసి "నమాస్కారం! ఎవరు కావాలి?"  అనడిగాడు.

    "నా పేరు  అజిత్ కుమార్.   పెద్ధమ్మని, మిమ్మల్ని ఒకసారి చూసి వెడదామని వచ్చాను!"

    "ఇంతకూ,  మీరు ..." ఈ ముఖాన్ని ఎక్కడో  చూసినట్టుగా   అని పిస్త్తూంది. ఎక్కడ?

    "యశోదమ్మ గారి  మను మదిని!  తాతగారు పోయారుకదా?  ఆయన  పోయినప్పుడు వచ్చాం!  నాన్నగారు,  అమ్మగారు చెల్లెలి తో  స్టేట్స్ కి   తిరిగి వెళ్ళారు గాని నేను నాయనమ్మకి  తోడుగా ఇక్కడే ఉండిపోయాను! ఆల్బం చూస్తూంటే నాన్నగారి పెళ్ళి  ఫోటోలు కనిపించాయి!  ఒకసారి పెద్దమ్మని  చూడాలనిపించింది.   నాయనమ్మ పర్మిషన్ తీసుకొనివచ్చాను!"      ఇంటిమీద  పిడుగుపడి  సర్వనాశనం  జరినగిన సంఘటనతో సమానం,  త్రిపురసుందరి  కాపురం చెడిపోయిన  ఆనాటి  సంఘటన!  త్రిపుర ఆనాడూ కూడా నిశ్చాంతగా, ద్తేర్యంగా ఉందికాని, అమ్మనాన్న  తోబుట్టువులు ఆమె  జీవితం  అల్లా కావడం చూసి విలవిల్లాడిపోయారు! మల్లిక్  మళ్ళి పెళ్ళి  చేసు కొన్నాడని  తెలిసినరోజు భగభగ లాడిపోయారు! ఆమ్మ ఆ దిగులుతోనే స్వర్గానికి వెళ్ళిపోయింది.

    ఆనాడు అంత  బాధకు కారకుడ్తేన  ఆ వ్యక్తి కుమారుడు  ఇవాళ తామని,   త్రిపురని  చూసిపోదామని వచ్చాడట!   ఈ ఇంట్లో మనిషులు పైకి  కనిపించకుండా  ఎలా తగలబడి పోయారో చూసి పోదామని వచ్చాడు!

    విశ్వేశ్వరయ్య ముఖంలో నీరసంతో కూడిన  ఒక భావం కదిలి వెంటనే మాయమ్తె పోయింది. వచ్చింది ఎవర్తెనా,   ఎందుక్తేనా  వచ్చింది  మాత్రం అతిధి! మర్యాద చేయడం తమ ధర్మం!

    విశ్వేశ్వరయ్య లేచి వెళ్ళి తండ్రితో చెప్పాడు.

    పరమేశ్వశాస్త్రి  గారి  ముఖంలో విషాద చాయలు అలుము కొన్నాయి!

    అజిత్ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోజేశాడు  విశ్వేశ్వరయ్య.  తరువాత  యధాస్ధానం లో   కూర్చొని  పాఠం పూర్తి చేయసాగాడు.  "ఈ  ఒక్క శ్లోకం  వ్రాసుకోండి ఈ పూటకు!....విద్యా వివాదాయ ధనం  మదాయ!  శక్తి పరేషాంఖలు  పిడనాయ!  ఖలస్య సాధో విపరితమే తత్! జ్ఞానయ దానాయచ రక్షణాయ!"

    శ్లోకం వ్రాసుకొని పిల్లలు పుస్తకాలు సర్దుకోసాగారు.

    శ్లోకాన్ని  ఆసక్తి విన్న  తరువాత  అజిత్,  " ఏమిటి దానికి అర్ధం?"  అనడిగాడు అత్యంత కుతూహలంతో.

    "దుష్టుల  విద్య  ఇతరులతో వివాదం పెట్టుకోడానికి,  ధనం పొగరు  ఎక్కించడానికి,  బలం పరులను బాదించడానికి  పనికివస్తాయి!  కానీ,  సజ్జనుడి  విద్యజ్ఞానం  కలిగించడానికి ,  ధనం  దానం చేయడానికి, బలం దుర్బాలులను  రక్షించడానికి ఉపయోగిస్తుంది! విద్య సంపద, బలం-  అవి స్వయంగా  ఎంత గోప్పవ్తేనా దుష్టుడివి  ఆశ్రయించినప్పుడు అవి కూడా దుష్ట  స్వభావానికి లోనవుతాయి!  శిష్టులను ఆశ్రయించినపుడు సాధుస్వభావాన్ని పొందుతాయి!"

    "ఓకే వస్తువు పరస్పర  విరుద్ధమ్తెన  రెండు  స్వభావాలకి  ఎలా  లోనవుతుందో  చక్కగా చెప్పరు!"  అజిత్ ముగ్దుడ్తెనట్టుగా  అన్నాడు.
    అజిత్ యనగా మాట్లాడడం ఒక స్టయిల్ అనుకున్న విశ్వేశ్వరయ్య తరువాత  గ్రహించాడు.   స్టయిల్ కాదు మాటతిరే  అంత అని!" కూర్చోండి!  వస్తాను!"  అని లోపలికి వెళ్ళి పోయాడు.   పరమేశ్వరయ్య కూడా లేచి లోపలికి  వెళ్ళి పోయాడు. వరండాలో  అజిత్  ఒక్కడే మిగిలి పోయాడు!   పరిశిలగా  గది గోడలనూ,  వాకిట్లో చెట్లనూ చూడగాసాడు.

    మధ్యాహ్నం  మల్లెలు  పసుపులో,  గులాబీలో, తెలుపులో రంగు రంగులుగా చక్కగా విరబూసి ఉన్నాయి! ఆ ప్రక్కనే పంచముఖి మందారం ఎర్రగా  ముద్దులు   ముద్దలుగా విరగబూసింది!  నందివర్ధనం  తెల్లటి  పువ్వుల్ని గుత్తులుగుత్తులుగా పూసింది.  ఆ ప్రక్కనే  జాజి,   అడవి మల్లే  పందిళ్ళు.  వాటికి అయిదారు గజాల  దూరంలో  చేధబావి  దగ్గర మక్యను కట్టిన ఎర్ర గన్నేరు  చెట్టు,  గులాబిల్లా గుత్తులు గుత్తులుగా పూశాయి! క్రోత్తరకం  చిన్న పిట్ట ఒకటి  తన  పొడుగాటి ముక్కుతో  పువ్వుల  మధ్య పొడుస్తూ ఎగురుతుంది పువ్వూ పువ్వుకి.  ఆ దృశ్యం ఫోటో తియడానికి ఎంతో బాగున్నది! ఇంటి వాళ్ళ  పర్మిషన్ తీసుకోకుండా ఫోటో తీయడం బాగుండదేమో అనుకొన్నాడు.  విశ్వేశ్వరయ్య త్వరగా బయటికి వస్తాడేమో,   పిట్ట  ఎగిరిపోకముందే  ఫోటోకి  అడగాలను కోంటూండగా  గజ్జల సవ్వడి వినిపించింది.  ఆసక్తిగా గుమ్మం వ్తెపు  తల త్రిప్పాడు. అయిదా  రెళ్ళున్న  ఒక బ్బాయి  మంచి నిళ్ళ చెంబు,  గ్లాసు రెండు చేతుల్తో పట్టుకొని,  క్రింద ఒలికిపోతామేమోనని భయపడుతున్నట్టుగా  జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆ అబ్బాయి వెనుక  పందొమ్మిది ఇరవ్తే ఏళ్ళ వయసున్న ఒక అమ్మాయి వేండిగ్లాసులో ఏదో తేస్తూంది!  "గుమ్మం మెల్లగా దాటు!  పడి పోతావ్!"  అని  పిల్ల వాడిని హెచ్చరించింది.

 Previous Page Next Page