"కాని మీకూ తెల్లారుజామున లేవటం అలవాటు లేదుకదా!" అడిగాను నేను అనుమానంగా.
"దీనికి పెద్ద అలవాటేం ఆఖ్ఖర్లేదు!పొద్దున్న ఫలానా టైమ్ కి లేవాలి అనుకుంటే చాలు! ఖచ్చితంగా అన్ని గంటలకేమెలకువ వచ్చేస్తుంది!" అన్నారాయన నవ్వుతూ.
మాకు ఆశ్చర్యం కలిగింది.
"అలా అనుకున్నత మాత్రాన ఎలా మెలకువ వస్తుంది?" అడిగాను మళ్ళి.
"దాన్నే 'సెల్ప్ హిప్నాసిస్' అంటారు.మన మ్తేండ్ నీ మనం హిప్నాసిస్ చేస్తామన్నమాట.
"తెల్లారు జామున నాలుగ్గంటలకు నిద్ర లేవబోతున్నాను.
తెల్లారు జామున నాలుగ్గంటలకు నిద్ర లేవబోతున్నాను.
తెల్లారు జామున నాలుగ్గంటలకు నిద్ర లేవబోతున్నాను.
అని మూడుసార్లునుకుని పడుకుంటే చాలు. తేలారు జామున నాలుగ్గంటలకు ఎవరో తట్టి లేపినట్లుగా మెలకువ వచ్చేస్తుంది" అన్నారాయన.
అదేదో ప్రయోగం చేద్దామని నలుగురం కలసి మమ్మల్ని మేము సెల్ప్ హిప్నాసిస్ చేసేసుకుని పడుకున్నాం! కాని ఆశ్చర్యంగా ఏమిటంటే నిజంగానే ఎవరో తట్టి లేపినట్లు మెలకువ వచ్చింది నాకు! సరిగ్గా అప్పడే మిగతా ముగ్గురికి కూడా మెలుకువ వచ్చేసింది కాబోలు లేచి కూర్చున్నారు.
"అబ్బ! హిప్నసిస్ భాలేదని చేసిందిరా! నిజంగానే ఎవరో తట్టి లేపుతున్న ఫీలింగ్ కలిగింది." అన్నాన్నేను.
"నాకూ అంతే" అన్నారు మా రూమ్ మేట్స్ అందరూ ముక్త కంఠంతో.
"హిప్నాటిజంలో ఇంత గొప్ప పవరుందని ఎవరికీ తెలిదు" అన్నాన్నేను.
"అవును రేపట్నుంచి మనం దిన్ని గురించీ ప్రచారం ప్రారంభంచాలి" అన్నారు వాళ్లు.
వాళ్ళు లేచి గది తలుపులు తెరచి చూసి కెవ్వుమని అరచారు.
బయట దృశ్యం చూసి నాక్కూడా మతిపోయినట్లయింది. బయట పిల్లలందరూ అప్పటికే స్కూల్స్ కెళ్ళిపోతున్నారు. ఎండ చాలా తీక్షణంగా తయారయిందప్పటికే!
అందరం అలారం గడియారం పరిక్షించాం. అది తెల్లారు జామున నాలుగ్గంటలకే ఆగిపోయింది సరిగ్గా.
"ఈ పాటికి వాళ్ళంతా నాగార్జున సాగర్ చేరుకొని ఉంటారు!" అన్నాడు ఒకతను విచారంగా.
నాకు మా యింటి ఓనర్ మీద కోపం ముంచుకొచ్చింది.
మమ్మల్నందరిని నాలుగ్గంటలకల్లా నిద్రలేపే భాద్యత తనదని చెప్పాడు. అందరం ఆయన దగ్గర కెళ్ళం కోపంగా.
ఆయన మమ్మల్ని చూస్తూనే ఆశ్చర్యపోయాడు.
"ఎక్స్ కర్షన్ కెళ్ళలేదేం, ప్రోగ్రాం కాన్సిలాయి పోయిందా?" అనడిగాడు.
"బాగుంది! మీకే మెలకువ రానప్పుడు మమ్మల్ని నాలుగ్గంటలకు లేపుతామని ఎందుకు చెప్పారు?" అడిగాడు సారధి కోపంగా.
ఆయన ఘోల్లున నవ్వాడు.
"మీ అసాధ్యం కూలిపోను! మీ నలుగురిని రెండుసార్లు నిద్రలేపానయ్య బాబూ! మొదటిసారేమో "ఏరే! నిద్రలేచాం లెండి!" అనేసి మళ్ళిపడుకున్నారు. నాలుగున్నరకి అనుమానం వచ్చి మళ్ళివచ్చి చూస్తే పడుకుని నిద్రపోతున్నారు. అప్పుడు అందరి మొఖాన్ని కొంచెం వీళ్ళు చిలికాను. దాంతో లేచి కూర్చున్నారు పక్కలమిడ "మేము ఇంక నిద్ర లేచినట్లే లెండి! మీరు వెళ్లిపోండి" అని నలుగురూ చెప్పారు. ఇంత బాగా మాట్లాడుతూన్నారు, ఇంక మళ్ళి నిద్రేలా పోతర్లె అని నేను వెళ్ళి నా పన్లో ఉండి పోయాను" అన్నాడాయన.
మేమంతా ఒకరి మేఖాలోకరు చూసుకున్నాం! ఆయన మాటలు ఎవరికీ నమ్మబుద్ది కావటంలేదు.
"మీలో ఎవరో అప్పటికప్పడే ఓ పాటకూడా పాడారు. అదేదో సినిమాలో పాట."
"ఏం పాట అది?" అడిగాను అనుమానంగా
"ఉందిలే మంచికాలం ముందు-ముందునా-"
అందరం మోహన్రా వ్ వేపు కోపంగా చూశాం ! వాడోక్కడే ఆ పాట పాడుతుంటాడేప్పడూ.
"నేను పాడానా?" ఆశ్చర్యంగా అడిగాడు వాడు.
"అవును! లేపోతే నాకేం తెలుసు?" అన్నారు వెంకట్రామయ్య.
"ఇప్పుడేం చేద్దాం?" అడిగాడు సారధి.
"ఓసారి కాలేజి కెళ్ళి చూసిపద్దం! మనలాగా ఇంకేవారయినా మిగిలిపోయారేమో."
అందరం కాలేజికి చెరుకునే సరికి మొత్తం మా క్లాస్ వాళ్ళందరూ అక్కడే గుమిగూడి కనిపించారు. బస్ కూడా ఇంకా అక్కడే ఉంది.
"ఏమిటి, ఏం జరిగింది?" ఆశ్చర్యంగా వాళ్ళనడిగాము.
"ఏముంది? మనల్నందరినీ అయిదు గంటకల్లా ఇక్కడుండలని చెప్పిన లెక్చరర్ గారికి ఇంతకుముందే నిద్ర మెలకువ వచ్చిందట! ఇంకో అరగంటలో వచ్చేస్థానన్నారు."
అలా ముగిసిందారోజు.
నేను పక్కమీదనుంచి లేచి కూర్చుని టైమ్ చూశాను. పదకోండవు తోంది. సారదికూడా నిద్ర పట్టక అటూ ఇటూ పొరలుతూనే ఉన్నాడు.
"ఇవాళ ఎందుకని నిద్రపట్టి చావడంలేదు?" సారది నడిగాను.
"నిద్రతో అదే గొడవ! కావలనుకుంటే ఛస్తేరాదు. ఇవాళ నిద్ర పోకుండా చదువుకోవాలి" అని కూర్చుంటే తెగనిదరోచ్చేస్తుంది" ఇద్దరం ఆఫిస్ ప్తేల్స్ తీసుకొచ్చి కూర్చున్నాం! ఆఫీస్ లో ఎంచేతో అందరికి ప్తేల్స్ కాసేపు చూసేసరికి నిద్ర ముంచుకు రావడం గురించీ మాకు బాగా తెలుసు.
అది బాగానే పని చేసింది.