Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 24

 

    చంద్రసేన మహారాజు పరుగు పరుగున నరుగుదెంచి బాలుని భక్తీతాత్పర్యముల కచ్చెరువండెను. ఇంతలో శ్రీరామ భక్తాగ్రగణ్యుడైన హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమయ్యెను. "ఓ మానవులారా! ఈ సర్వ సృష్టికి ఏకైక శరణ్యము శంకరుఁడు ఆ మహాదేవుని అరాధింపుడు, తరింపుడు . మహర్షులు సహస్ర వర్షములు తపము కావించి పొందలేని ఫలము ఈ బాలుడు శివపూజా విశేషమున అల్పకాలములో అనాయాసముగ సాధించినాడు. వీని సందర్శము వలన మీ జన్మము ధన్యమైనది. ఈ గోపబాలుని యేనిమిదవ తరమున నందుఁ డను మహానుభావుడు జన్మించును. శ్రీమన్నారా యణుడు నందనందనుడై జన్మించి లోకోద్దరణ మొనర్పగలడు" అని చెప్పి హనుమంతు డదృధ్యమై పోయేను. శ్రీమహాకాళదేవుని సేవించి వేద ప్రియుడు , శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలగువారు పరమశివ సాన్నిధ్యము చేరుకొనిరి.

        శో|| ఆకాశే తారకం లింగం పాతాళే హటకేశవరమ్
        మర్త్యలోకే మహాకాళం లింగత్రయ నమోస్తు తే||
    అని పురాణములలో మహాకాళేశ్వరమహిమ యభివర్ణింపబడినది.

                                                ఓంకారే పరమేశ్వరమ్
    క్షేత్రమహిమ :

    మాలవప్రాంతములో నర్మదాతీరమున ఓంకార క్షేత్రమున్నది. ఇక్కడ నర్మదానది రెండు పాయలుగా ప్రవహించును. ఒక పాయ నర్మద. మఱొకటి కావేరిక. ఒకపాయ ఉత్తరముగాను మరొకపాయ దక్షిణముగాను ప్రవహించుచుండెను. రెండింటినడుమ ఒక పెద్ద కొండచుట్టు ఏర్పడినది. దీనిని "శివపురి" లేదా "మాంధాత పూరి" యని పిలుతురు .
    మాంధాత సుప్రసుద్దుడైన సూర్యవంశపురాజు, అయన మహాభక్తుఁడు, మహావీరుడు . మహాతపస్వి, పుణ్యమూర్తి యగు మాంధాత చక్రవర్తి ఈ పర్వత శిఖరముపై అనేక వత్సరములు ఘోరతపస్సు చేసి పరమేశ్వరుని ప్రాసంనుని కావించుకొని స్వామికి దేవాలయము నిర్మించెను. అందుచే దీనికి "మాంధాత పురి" యని ప్రఖ్యాతి వచ్చినది.
    మాంధాత పర్వతము మీద చాల దేవాలయములున్నవి. అవన్నియు ప్రణవాకారములో నుండును. ఓంకారేశ్వర దేవాలయము ప్రణవముమీద బాలచంద్రుని వలె ప్రకాశించు చుండెను. ఒంకారేశ్వరుని సన్నిధికి వెళ్ళు మార్గమున "విష్ణుపురి " 'బ్రహ్మ పురి ' యని మరిరెండు చిన్నచిన్న కొండ గుట్టలున్నవి. ఈ రెండింటికి మధ్యగా "కపిలధార" యను నది ప్రవహించి , నర్మదానదిలో సంగమించును. ఓంకారేశ్వర దర్శనమునకు నర్మదా నదిపై నౌకాయానము చేయవలెను. శివపురాణములో నీ క్షేత్ర మహిమ హృద్యముగా నభివర్ణింపబడియిన్నది.
    
    పురాణ కధ:

    ఒకప్పుడు నారదమునీంద్రుడు పరమేశ్వరాధనకై గోకర్ణ క్షేత్రమునకు వెళ్ళెను. కొంతకాలమునకు నారదమహర్షి తిరిగి వచ్చుచు వింధ్య పర్వత సమీపమునకు విచ్చేసెను. వింధ్యుడు సాదరముగా నెదురేగి నారదమహర్షికి స్వాగతము పలికి "నేను పర్వతరాజును! సర్వసంపన్నుడను . ఏ విషయములోను నాకు లోపము లేదు." అని సగర్వముగ నిలబడెను. అది కనిపెట్టి , నారదుడు అయన అహంకారమును అణచివేయ సంకల్పించెను. దేవర్షి వింధ్య గిరిని బుజ్జగించి జాలిగా నిట్టుర్పుపు విడిచెను. అది చూచి వింధ్యుడు "ఏమి నారదా! అనన్యమైన నా ఉన్నతిని చూచి మెచ్చుకొనుటకు బదులు పరిహాసముగా నిట్టురుపు విడుచుచున్నావు?" అని సాభిమానముగ ప్రశ్నించెను.
    నారదుడు నవ్వుచు "మరేమున్నది? నీ వేంతవాడవైనను ఆ మేరుపర్వతమునకు లోకువే కదా! అతని శిఖరాగ్రములు దేవలోకముదనుక వ్యాపించినవి. మరి నీవెక్కడ! మేరు వెక్కడ!" అని వెళ్ళిపోయెను. నారదుని మాటలు తలంచుకొని వింధ్యుడు చాల బాధపడెను. "సరే! నేను వెంటనే వెళ్ళి సకల జగాన్నాదుడైన యుమానాధుని గూర్చి కఠోర తపస్సు కావింతురు. ఆ మహాదేవుని ప్రసన్నుని చేసికొందును." అని నిశ్చయించు కొనెను. తత్ క్షణమే, ఓంకార క్షేత్రమున ఆరునెలలు అనన్య సామాన్యమగు తపస్సు నచారించెను. వింధ్యుని తపోదీక్షకు సంతసించి శంకరుడు ప్రత్యక్షమై "వత్సా! నీ భక్తికి మెచ్చితిని. వరము కోరుకొను "మనెను. వింధ్యుడు స్వామి పాదముల మీదపడి "దేవా! భక్తవత్సలా ! నా జన్మ ధన్యమైనది. నావాంచిత మీడేరునట్లు నన్నుగ్రహింపుము. నా బుద్ది నిత్యప్రసన్నమగునట్లు వరము ప్రసాదింపుము. నీవు నా శిరస్సు పై నిత్యము సన్నిధి చేసి యుందు " మని యాభ్యర్ధించెను.
    'అట్లే పర్వతరాజా!" అని పరమేశ్వరుడు పర్వతాదిపునకు వరమిచ్చెను. ఇంతలో దేవతలు మహర్షులు అచ్చటికి వచ్చి "చేతులు మోడ్చి " జగత్ర్పభూ! పార్వతీ విభూ! మా మొరలాలకించుము. నీవు జ్యోతిర్మయరూపముతో  ఇక్కడే స్థిరముగా నిలిచియుండుము." అని పరిపరి విధముల ప్రార్ధించిరి. భక్తుల అభ్యర్ధనము అంగీకరించి లోకకాల్యాణార్ధమై పరమశివుడు ప్రణవాకారములో "ఓంకారేశ్వరు'డని యు పార్ధివాకారములో 'పరమేశ్వరు' డనియు రెండు నామములు ధరించి యచ్చట నావిర్భవించెను.

                                  కేదారం హిమవత్ వృష్టే
    క్షేత్రమహిమ:
    
    కేదారనాధ జ్యోతిర్లింగము ద్వాదశ జ్యోతిర్లింగములలో నైదవది. దర్శన మాత్రముననే సమస్త దోషములు పోగొట్టు నీ మహాశివలింగము హిమాలయము నందలి కేదారశిఖరమున విరాజిల్లుచున్నది. కేదారశిఖరమునకు పశ్చిమ దిశ యందు 'మందాకినీ' యు, తూర్పు దిక్కున 'అలకనంద' యు ప్రవహించుచుండెను. మందాకినీ తీరమునందు కేదారనాధస్వామియు, అలకనందా తీరమున బదరీ నారయనస్వామీయు వెలసియున్నారు. అలకనందా మందాకినీ నదులు 'రుద్రప్రయాగ' లో కలిసికొని కొంతదూరము ప్రవహించి దేవ ప్రయాగదగ్గర "భాగీరధి" లో సంగమించుచున్నవి. అందుచే గంగా స్నానము చేయు భక్తులు కేదారనాధ బదిరీ నాధ చరన కమలోదకములలో మునుగుచున్నట్లే భావింతురు. స్కందపురాణమునందలి కేదార ఖండమున కేదారేశ్వర జ్యోతిర్లింగ మహిమాతిశయము మనోహరముగ వర్ణింపబడినది. ఏ యాత్రికుడైనను కేదారనాధుని సందర్శింపకయే బదరీయాత్ర చేసినచో వాని యాత్ర నిష్పలమని వాకొనబడినది :-

        శ్లో|| అకృత్యా దర్శనం వైశ్య! కేదార స్యాఘనశినః
        యో గచ్చేద్ బడరీం తస్య యాత్రా నిష్పలతాం వ్రజేత్||

    కేదారేశ్వర సహితముగా నరనారయాణులను సందర్శించిన వారికీ సమస్త పాపములు పరాభూతములై జీవన్ముక్తి ప్రాప్తించునని నొక్కి వక్కానింపబడినది.

        శ్లో|| దృష్ట్వా రూపం నరస్త్యేవ తధా నారాయణస్య చ
        కేదారేశ్వర నమ్నశ్చ ముక్తీభాగీ న సంశయంః||
        శ్లో|| కేదారేశస్య భక్తాయే మార్గస్థా స్తన్య వై మృతాః
        తేపి ముక్తా భవంత్యేవ నాత్ర కార్యా విచారణా|| స్కందపురాణము.
    
    కేదారయాత్రకై బయలుదేరిన ప్రాణి మధ్యేమార్గమున మరణించినను వానికి పుణ్యలోకములు కరతలామలకములని పురాణములుగ్గడించుచున్నవి. కేదారక్షేత్రము హరిద్వారమునకు 150 మైళ్ళ దూరమున హృషీకేశమునకు 132 ,మైళ్ళ దూరమున నున్నది.

    పురాణ కధ :

    నరనారాయణులు మహా తపస్సంపన్నులు. వారిరువురు శ్రీమన్నారాయణుని యవతారములు. ఆ మహర్షులు బదరికశ్రమమున పెక్కు సంవత్సరములు తపస్సు చేసిరి. జగత్కల్యాణము నఖిలషించి వారు కేదార శిఖరమున పరమశివు నారాధింపసాగిరి.
    నరనారాయణులు ప్రతిదినము ప్రభాతమున మందాకినీ తరంగములలో మజ్జనమాచరించి పరమేశ్వరుని పార్ధివలింగములను నిర్మించుకొని భక్తీ పురస్సరముగా పూజించుచుండిరి. మధురశీతలములైన మందాకినీ జలములతోడను, పరమపవిత్రములైన బిల్వపత్రములతోడను , ప్రపుల్లము లైన పద్మ ప్రసూనముల తోడను, వారు ప్రతి నిత్యము మృత్యుంజయ సత్యంత శ్రద్దాసక్తులతో నర్పించిరి.
    కొంతకాలము గడిచినది. పరమేశ్వరుడు నరనారాయణు లపై కరుణ కల్గినది. స్వామి సాక్షాత్కరించెను. నరనారాయణులు స్వామికి సాష్టాంగ దండ ప్రణామము లాచరించి పరిపరివిధముల ప్రస్తుతించిరి. పరమశివుడు ప్రసన్నుడై "వరము కోరుకొం"డనెను నరనారాయణులు చేతులు మోడ్చి "దయామయా! మృత్యుంజయా! జగత్కల్యాణము కొఱకు మేము నిన్నారధించితిమి. నీవు మమ్మనుగ్రహించితివి. ధన్యులమైతిమి. ఇక ముందు కూడ భక్త జనకల్పకామావై కొలిచిన వారి కోర్కె లీడేర్చుడు. నీ కేదారాశిఖరమునందే  కేదారేశ్వరనామముతో నుండుము. నీమూర్తిని దర్శించి, పూజించి, స్తుతించి భక్తులు తరింతురు. ఇదియే మా వాంచితమని ప్రార్ధించిరి. పరమేశ్వరుడు నరనారాయణుల ప్రార్ధన మన్నించి కేదారనాధ జ్యోతిర్లింగరూపమున నందు వెలుగొందుచుండెను.
    కేదారేశ్వరలింగమును కృతయుగమున నరనారాయణులును , త్రేతాయుగమున నుపమన్యుమహర్షియు, ద్వాపరమున పంచపాండవులను పూజించి ధన్యులైరి. కేదారనాధ దేవాలయమున పంచపాండవుల శిలా విగ్రహము లిప్పుడును దర్శనీయములు.
    
                                           డాకిన్యాం భీమ శంకరమ్
    క్షేత్రమహిమ:

    సహ్యపర్వత శిఖరములలో నొకదాని పేరు "డాకిని" ఆ శిఖరాగ్రమున పరమేశ్వరుడుభీమశంకర జ్యోతిర్లింగరూపముతో లోకానుగ్రహార్ధ మవతరింఛియున్నాడు. భీమానది  యిచ్చటనే జన్మించినది. ఉద్గమస్థానమున శివలింగము ప్రక్కల నుండి జలము కొంచెము కొంచెముగా ప్రవహించుచుండెను. సకల జన శుభంకరుడు భీమశంకరుడై శాకినీ డాకినీ రక్షస్సమూహములు పరివేష్టించి సేవించుచుండ నిచ్చట సన్నిధి చేసియున్నాడు.

 Previous Page Next Page